దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను, మోడీ, అమిత్ షా నిర్వీర్యం చేస్తున్నారని, దేశంలోని అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తుంటే, కేసీఆర్, జగన్ సినిమా చూసారు. 15వ ఆర్ధిక సంఘం కండీషన్స్ చూస్తే, దక్షిణాది రాష్ట్రాలను నాశనం చేసే కుట్ర చేస్తున్నారని, దక్షినాది రాష్ట్రాలు కలిసి పోరాటం చేస్తే, అప్పుడు కూడా కేసీఆర్, జగన్ సినిమా చూసారు. దేశంలో అన్ని వ్యవస్థలు, మోడీ, షా నాశనం చేస్తుంటే, అప్పుడు కూడా కేసీఆర్, జగన్ సినిమా చూసారు. దేశంలో అన్ని పార్టీలు ఏకం అయ్యి, మోడీ పై అవిశ్వాస తీర్మానం పెడితే, మొదటి సారి, అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా డ్రామా ఆడింది కేసీఆర్, రెండో సారి అక్కడ నుంచి పారిపోయింది జగన్. ఇలా మోడీ పేరు చెప్తే, తడుపుకునే కేసీఆర్, జగన్, ఇప్పుడు మోడీకి అనుకూలంగా ఫిడేల్ వాయిస్తూ, ఫిడేల్ ఫ్రంట్ అని ఒకటి మొదలు పెట్టారు. మొన్నటి దాకా హడావిడి చేసిన, ఎవరూ దేకలేదు.

kcr 06052019

ప్రతిపక్షల్లో చీలిక తేవటమే ఈ ఫిడేల్ ఫ్రంట్ ఉద్దేశం. అందుకే ఇప్పుడు ఎన్నికలు రిజల్ట్స్ 23 న వస్తాయి కాబట్టి. మోడీ, షా ను వ్యతిరేకించే 21 పార్టీలను ఏకం చేసిన చంద్రబాబు ప్రయత్నాలను విఫలం చేసి, ఆ పార్టీల్లో చీలిక తేవటానికి, కేసీఆర్ మళ్ళీ మొదలు పెట్టారు. అయితే, ఇక్కడ కేసీఆర్ చాలా తెలివిగా తన టూర్ ప్లాన్ చేసారు. అసలు ఈయన చేసేది తీర్ధయాత్రలు. ఎలాగూ ఆ రాష్ట్రాలకు గుడిలు, గోపురాలు చూడటానికి వెళ్తారు కాబట్టు, సియం హోదాలో, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులను కలిసి, ఫెడరల్ ఫ్రంట్ అనే నాటకం ఆడుతూ ప్రజలను గొర్రెలను చేసే ఎత్తుగడ. ఎవరన్నా ఈయన బుట్టలో పడితే అమిత్ షా ప్రశంసలు ఉంటాయి, లేకపోతే కేసీఆర్ కు పోయేది ఏమి ఉండదు.

kcr 06052019

అందుకే ఈ రోజు కేరళ పర్యటనకు వెళ్లిన తెలంగాణ కేసీఆర్‌ ఈ సాయంత్రం అనంతపద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లిన కేసీఆ, సంప్రదాయ వస్త్రధారణలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. తరువాత వెళ్లి కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. మరో రెండు రోజుల్లో తమిళనాడు వెళ్లనున్న కేసీఆర్ అక్కడ ముద్నుగా, రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను కేసీఆర్‌ సందర్శిస్తారు. తరువాత ఆ రాష్ట్రంలో వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతారు. ఇల్లా తీర్ధయాత్రలకు కుటుంబంతో కలిసి వెళ్తూ, అక్కడ రాజకీయ నాయకులని కలిసి, ఎదో ఫిడేల్ ఫ్రంట్ అంటూ ప్రజలను గొర్రెలను చేస్తున్న కేసీఆర్ కు నిజంగా హాట్స్ ఆఫ్.

యాభై శాతం వీవీ ప్యాట్లలోని స్లిప్పులు లెక్కించాలంటూ… టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న పోరాటంలో మరో ముందడుగు పడింది. గతంలో.. ఈ అంశంపై.. ఐదు వీవీ ప్యాట్లు లెక్కించాలంటూ.. ఇచ్చిన తీర్పును రివ్యూ చేయడానికి… సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు.. చంద్రబాబు నేతృత్వంలో ఇరవై ఒక్క పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. ఎన్నికల ప్రక్రియ చివరి దశకు వస్తున్నందున.. ఈ పిటిషన్‌ను త్వరితంగా విచారించాలని.. ఆయా పార్టీలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమస్థానం రేపు విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి హస్తినకు వెళ్లనున్నారు.

cbn 06052019

వీవీ ప్యాట్ల లెక్కింపు సంఖ్యను పెంచాలన్న పిటిషన్‌పై మంగళవారం కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో బాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబుతో సమా బీజేపీయేతర పక్షాల నేతలు ఈ విషయంపై కోర్టులో హాజరుకానున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ల లెక్కింపును పునః పరిశీలించాలని సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రివ్యూ పిటిషన్‌ను ఓపెన్ కోర్టులోనే వినాలని పిటిషనర్ల తరపున లాయర్ అభిషేక్ మనుసింఘ్వి చీఫ్ జస్టిస్‌ను కోరారు. ఈ అభ్యర్థనను సీజే అంగీకరించడంతో ఈ వ్యవహారంపై బాబు సోమవారం రాత్రి హస్తినకు వెళ్లనున్నారు. గతంలోనే, విపక్ష పార్టీలన్నీ సుప్రీంకోర్టుకు వెళ్లాయి. అయితే పేపర్ బ్యాలెట్ వాడాలని.. లేకపోతే వీవీ ప్యాట్ స్లిప్పులను యాభై శాతం లెక్కించాలని పిటిషన్‌లో కోరాయి.

cbn 06052019

అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం యాభై శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలంటే కనీసం వారం రోజులు పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో సుప్రీంకోర్టు .. అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్లు లెక్కించాలని తీర్పునిస్తూ పిటిషన్‌పై విచారణ ముగించింది. ఈ తీర్పు మేరకే ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈవీఎంలలో తీవ్రమైన గందరగోళం తలెత్తుతూండటంతో.. మొత్తానికే మోసం జరుగుతోందన్న ఆందోళనలో విపక్ష పార్టీలు ఉన్నాయి. అందుకే నమ్మకం కుదరలాంటే కచ్చితంగా యాభై శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందేనని రివ్యూ పిటిషన్ వేశారు. బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడే.. లెక్కింపునకు.. ఒక్క రోజు కన్నా ఎక్కువ పట్టేది కాదని.. ఇప్పుడు వీవీ ప్యాట్లు లెక్కించడానికి ఎందుకు.. అంత సమయం పడుతుందని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలను సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ తోసిపుచ్చింది. మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణల్లో నిజం లేదని జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. సీజేఐని ఇరికించేందుకే ఈ విధమైన ఆరోపణలు చేశారని తెలిపింది. ఈ అంశంపై గత కొన్నిరోజులుగా విచారణ జరిపిన కమిటీ మహిళా ఉద్యోగినిని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఆమె ఇచ్చిన సమాధానాలను, వార్తా పత్రికలకు ఇస్తున్న పలు ఇంటర్వ్యూలను పరిశీలించిన మీదట ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.

ranjan 06052019

జస్టిస్‌ గొగొయ్‌ దగ్గర పనిచేసిన మాజీ జూనియర్‌ అసిస్టెంట్‌ ఒకరు తనపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం దీనిపై విచారణకు జస్టిస్‌ గొగొయ్‌ నేతృత్వంలోనే ఓ ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై పలు అభ్యంతరాలు రావడంతో అంతర్గత దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలపై జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అధ్యక్షతన ఏర్పాటైన అంతర్గత విచారణ కమిటీలో ఇందు మల్హోత్ర,ఇందిరా బెనర్జీలు సభ్యులుగా ఉన్నాయి.గొగొయ్ పై వచ్చిన ఆరోపణలల్లో వాస్తవం లేదంటూ త్రిసభ్యధర్మాసనం కొట్టిపారేసింది.

వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి బాత్రూంలో హత్య కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు పులివెందుల కోర్టు రిమాండ్‌ పొడిగించింది. ఈ నెల 20వ తేదీ వరకు రిమాండు పొడిగిస్తూ సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ల రిమాండు గడువు ముగియడంతో పోలీసులు వారిని కడప కేంద్రకారాగారం నుంచి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో నిందితులకు మరో 14 రోజుల పాటు రిమాండు పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. తమను కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందుల సబ్ జైలుకు మార్చాలని కోరుతూ ముగ్గురు నిందితులు పులివెందుల కోర్టులో ఇవాళ పిటిషన్ వేశారు.

babai 06052019

అనారోగ్య కారణాలతో పాటు తమ తల్లిదండ్రులు, బంధువులను కలుసుకునేందుకు కడపలో ఇబ్బందిగా ఉందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. నిందితుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న పులివెందుల కోర్టు.. ఆ ముగ్గురినీ పులివెందుల సబ్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఆ ముగ్గురినీ పోలీసులు పులివెందుల సబ్ జైలుకు తరలించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే కారణంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారనేది మాత్రం ఇంకా తేలలేదు. ఈ కేసులో పోలీసు విచారణ కొనసాగుతోంది.

Advertisements

Latest Articles

Most Read