ప్రధాని మోదీ ఇలాఖా వారణాసిలో రాజకీయాలు రంజుగా మారాయి. ఆఖరి క్షణంలో సమాజ్‌వాదీ పార్టీ మోదీపై ఎన్నికల బరిలోకి దింపిన బీఎ్‌సఎఫ్‌ మాజీ జవాన్‌ తేజ్‌ బహదూర్‌ యాదవ్‌కు ఈసీ షాకిచ్చింది. ఎలక్షన్‌ కమిషన్‌ యాదవ్‌కు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. షాలినీ యాదవ్ స్థానంలో బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్‌కు టికెట్ ఇచ్చి.. ఆ వెంటనే బీఫారం అందజేశారు. వారణాసిలో నామినేషన్ల దాఖలు ఇవాళే చివరి రోజు కావడంతో.. హడావిడిగా తేజ్‌బహదూర్‌తో నామినేషన్ వేయించారు. అయితే నామినేషన్ పత్రాల్లో ఆయన సర్వీస్ నుంచి డిస్మిస్ అయినట్లు పేర్కొనలేదు. ఈ లోపాన్ని కనుగొన్న ఈసీ ఆయనకు నోటీసిచ్చి మే 1వ తేదీలోగా (బుధవారంలోగా) సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

game 27032019

సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు సరైన ఆహారం అందడం లేదని, నాణ్యమైన భోజనం దక్కడం లేదని తేజ్ బహదూర్ యాదవ్ ఆరోపించారు. దీంతో ఆయనను ఈ నేరానికి ఆర్మీ డిస్మిస్‌ చేసింది. తరువాత రాజకీయాల్లో చేరిన తేజ్‌ బహదూర్‌కు ఎస్పీ టికెట్‌ ఇచ్చింది. నామినేషన్‌ వేసిన సమయంలో ఆయన తాను సర్వీసు నుంచి తొలగించినట్లు అంగీకరించారు. కానీ తరువాత సమర్పించిన పత్రాల్లో ఆయన ఆ విషయాన్ని పేర్కొనలేదు. నిబంధనల ప్రకారం... అవినీతి , దేశద్రోహ ఆరోపణల మీద సర్వీసు నుంచి డిస్మిసైన వారు ఐదేళ్ల పాటు ప్రచారానికి అనర్హులు. భోజనం బాగులేదని అసత్య ఆరోపణలు చేసి సైన్యం పరువు దిగజార్చడానికి ఆయన ప్రయత్నించినట్లు కోర్టు మార్షల్‌లో ఆర్మీ నిర్ధారించి ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది.

game 27032019

ఆయన చేసిన ఆరోపణ దేశద్రోహం కిందకు వస్తుందన్నది ఈసీలో ఓ వర్గం అభిప్రాయం. అయితే నిజం చెప్పినందుకు తనను బలిపశువును చేశారని , దీనిపై తాను సుప్రీంకోర్టులో న్యాయం కోరతాననీ తేజ్‌ బహదూర్‌ చెబుతున్నారు. తేజ్‌ బహదూర్‌ ఇచ్చే సమాధానాన్ని బట్టి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది ఆధారపడి ఉంది. ఆయన ఇచ్చే సమాధానం బట్టే నామినేషన్‌ను ఆమోదించాలా లేక తిరస్కరించాలా అన్న విషయంపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది.

రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ల నియామకం ఫైలు గత పాతిక రోజులుగా గవర్నర్‌ నరసింహన్‌ వద్దే పెండింగ్‌లో ఉందని సమాచారం. ఇద్దరు కమిషనర్ల నియామకానికి సంబంధించిన ఫైలు మార్చి నుంచీ ప్రభుత్వానికి-గవర్నర్‌కు మధ్య తిరుగుతోంది. మార్చి 7న అంటే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందు ఆర్‌టీఐ కమిషనర్లుగా విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య కుమారుడు ఐలాపురం రాజా, విశాఖపట్నం జిల్లాకు చెందిన వీఆర్‌ఏల సంఘం మాజీ నేత ఈర్ల శ్రీరామమూర్తి పేర్లను సిఫారసు చేస్తూ ప్రభుత్వం గవర్నర్‌కు ఫైలు పంపించింది. కమిషనర్ల నియామకానికి ఏర్పాటుచేసిన కమిటీలో సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. జగన్‌ రాకపోవడంతో ఈ కమిటీ సమావేశం రెండుసార్లు వాయిదా పడింది.

cbi 01052019

మూడోసారి ఇద్దరు సభ్యులతోనే సమావేశం జరుగగా.. రాజా, శ్రీరామమూర్తి పేర్లను కమిటీ సిఫారసు చేసింది. 7న పంపిన ఈ ఫైలును 10వ తేదీవరకు గవర్నర్‌ అట్టే పెట్టుకున్నారు. 10న ఎన్నికల షెడ్యూల్‌ వెలువడింది. కోడ్‌ అమల్లోకి వచ్చింది. కోడ్‌ అమల్లో ఉన్నందున తర్వాత చూద్దామని గవర్నర్‌ 11వ తేదీన ఫైలును తిప్పిపంపారు. దీంతో ఈ అంశాన్ని కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు వ్యవహారాలు చూసే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీకి పంపించారు. అక్కడి నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ద్వివేది ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఎన్నికల సంఘం దీనికి ఆమోదం తెలుపుతూ మార్చి 29న సమాచారం అందించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏప్రిల్‌ తొలివారంలో మళ్లీ గవర్నర్‌ వద్దకు పంపించింది. ఇప్పటివరకు అక్కడినుంచి ఆమోదం రాలేదని సమాచారం.

cbi 01052019

రాష్ట్రంలో సమాచార హక్కు కమిషనర్లను నియమించాలంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. 3 నెలల్లోగా నియమాకాలు జరగాలని నిర్దేశించింది. రాష్ట్రంలో ఆర్‌టీఐ కమిషన్‌ ముందు దాదాపు 15వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సమాచార హక్కు చట్టం ప్రకారం కమిషనర్ల నియామకం అత్యవసరం.. భర్తీ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామక ప్రక్రియను చేపట్టింది. ఐలాపురం రాజా పేరుపై గవర్నర్‌ కొన్ని అభ్యంతరాలు అడిగారని, శ్రీరామమూర్తి పేరుకు ఆమోదం తెలిపారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అసలు ఆ ఫైలుపై గవర్నర్‌ ఏ నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచారని సమాచారం.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గ్లోబరీనా గురించి తెలియదంటూ ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇంటర్‌ బోర్డు నిర్వహణ పూర్తిగా లోపభూయిష్ఠంగా ఉందని మండిపడ్డారు. గ్లోబరీనా సంస్థకు టెండర్‌ ఇప్పించింది అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆరేనని ఆరోపించారు. ‘సెంటర్‌ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ను కాదని ఓ ప్రైవేట్‌ సంస్థకు ఇంటర్‌ ఫలితాల బాధ్యతలు ఎలా అప్పగించారు. గతంలో ఒక్కో బాధ్యతను ఒక్కో విభాగానికి అప్పగించే వారు. ఇప్పుడు మాత్రం హాల్‌ టికెట్లు, ముద్రణ, ఫలితాల ప్రకటన అన్నింటినీ గ్లోబరీనాకు అప్పగించారు. ఫలితాల ప్రకటన సీజీజీ నిర్వహించినన్ని రోజులూ ఎలాంటి సమస్యలు రాలేదు.’

game 27032019

‘2016లో ఎంసెట్‌ ప్రశ్నాపత్రం లీకేజీలో ఏం జరిగిందో వివరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ వ్యవహారంలో మూడేళ్లలో మీరెందుకు చర్యలు తీసుకోలేదు? ఆనాడు ఈ టెండర్‌ తీసుకున్నమ్యాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌ సంస్థపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎందుకు విజయారావును మీరు విచారించలేదు. విజయారావు అల్లుడు, కేటీఆర్‌ క్లాస్‌మెట్‌ అయిన ప్రద్యుమ్నను మీరు ఎన్నడూ ప్రశ్నించలేదు?. అక్కడ ఈ రకమైన తప్పిదాలకు పాల్పడి తప్పించుకున్నసంస్థ తిరిగి ఇంటర్‌ బోర్డు టెండర్లలో పాల్గొంది. టెండర్లలో పాల్గొన్నవి రెండే సంస్థలు.. ఒకటి మ్యాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌, రెండోది గ్లోబరీనా. రెండు లక్షలకు తక్కువగా టెండర్‌ వేసిందని గ్లోబరీనాకు ఇంటర్‌ టెండర్లు అప్పగించారని ప్రభుత్వం చెబుతోంది. గతంలోనే మ్యాగ్నటిక్‌ సంస్థను ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ బోర్డులు నిషేధించాయి. నిషేధించిన సంస్థ టెండర్‌ ఎక్కువగా ఉందని.. గ్లోబరీనా సంస్థ టెండర్‌ తక్కువగా ఉందని చెబుతున్నారంటే.. ఇందులో మోసం జరిగిందని తెలుస్తోంది.’

game 27032019

2016లో అన్నిటినీ కలిపి మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్‌కు కట్టబెట్టారన్నారు. ఆ సమయంలోనే ఎంసెట్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయన్నారు. దీనిపై సీబీసీఐడీకి కేసు అప్పగించినా.. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా నీరుగార్చారని విమర్శించారు. ప్రధాన నిందితులు ఇద్దరూ చనిపోయారని తెలిపారు. ఒకరుకస్టడీలో చనిపోగా మరొకరు ప్రమాదవశాత్తు చనిపోయారని ... ఆ రెండూ అనుమానాస్పద మరణాలే అన్నారు. దీనిపై ఎందుకు విచారణ జరగలేదని ప్రశ్నించారు. పరీక్షలు నిర్వహించిన మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్‌కు చెందిన విజయ రావు, ప్రద్యుమ్నలపై ఎందుకు దృష్టి పెట్టలేదన్నారు. ‘23 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన గ్లోబరీనా సంస్థ, మ్యాగ్నటిక్‌ సంస్థలు.. ఈ రెండూ కలిసి కాకినాడ జేఎన్‌టీయూను మోసం చేశాయి. వీరిద్దరూ వ్యాపార భాగస్వాములు. వీళ్లందరూ ఒక్కటే.. కంపెనీల పేరు మాత్రమే వేరు. ఇన్ని నియమనిబంధనలు ఉల్లంఘించి గ్లోబరీనా సంస్థకు టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు?’ అని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకో బడిన ప్రభుత్వం గడువు జూన్ 8 వరకు ఉన్నా, అప్పటి వరకు ప్రభుత్వం పని చెయ్యకూడదు అంటూ, ఎన్నికల నిబంధనల సాకుతో ఢిల్లీ డ్రామా ఆడుతుంటే, ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ, ముఖ్యమంత్రి, మంత్రులకు రోజుకి ఒక అవమానం కూడా జరుగుతుంది. ఢిల్లీ నుంచి ఎన్నుకోబండిన చీఫ్ సెక్రటరీ వచ్చి, ప్రజల చేత ఎన్నుకున్న ముఖ్యమంత్రికి ఏ అధికారులు లేవు అని చెప్పారంటే, అతని వెనుక ఎవరు ఈ మాటలు మాట్లాదిస్తున్నారో ఇట్టే అర్ధమవుతుంది. అయితే ఇప్పుడు ఏకంగా ఒక మంత్రికే తీవ్ర అవమానం జరిగిన తీరు చూస్తుంటే, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొందో అర్ధమవుతుంది. ఢిల్లీ వాళ్ళ ఎలా కక్ష తీర్చుకుంటున్నారో తెలుస్తుంది.

game 27032019

ఈ ఓజు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరువు, అకాల వర్షాలపై సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం పై వారం క్రితమే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనికోసం ఉదయం 11 గంటలకు అధికారులకు సమాచారమిచ్చారు. అయినా అధికారులు మాత్రం సమీక్షకు హాజరుకాలేదు. మంత్రి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 వరకు సచివాలయంలోనే వేచి చూసినా అధికారులు మాత్రం హాజరుకాలేదు. కాగా వారం రోజుల క్రితమే తన శాఖలో సమీక్షలు చేస్తానని.. అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానని ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో తాము సమీక్షకు హాజరుకాలేమని వారు పరోక్షంగా సమాచారం పంపించారని తెలుస్తోంది. దీని వెనుక కొత్త చీఫ్ సెక్రటరీ ఒత్తిడి ఉన్నట్టు సమాచారం.

game 27032019

కొద్దిరోజులుగా ఏపీ ప్రభుత్వం, ఉన్నతాధికారుల మధ్య ఎన్నికల కోడ్‌కు సంబంధించి వివాదం నడుస్తున్న నేపథ్యంలో... మంత్రి సోమిరెడ్డి సమీక్ష వివాదం దీనికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం సమీక్షలు నిర్వహించబోద్దని ఈసీ స్పష్టం చేయగా... వేరే రాష్ట్రాలు, కేంద్రంలో లేని నిబంధనలు ఇక్కడే ఎలా అమలు చేస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఓ అడుగు ముందుకేసిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... అధికారులు సమీక్షకు రాకపోతే తాను సుప్రీంకోర్టుకు వెళతానని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన నిర్వహించిన సమీక్షకు అధికారులు, ఉద్యోగులు రాకపోవడంతో... ముందుగా ప్రకటించనట్టుగానే ఆయన దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళతారా, లేకపోతే ఎలా ముందుకు వెళ్తారో చూడాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read