రాఫెల్ రివ్యూ పిటిషన్లపై వచ్చేనెల 4లోగా సమాధానం చెప్పాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాఫెల్ ఒప్పందంపై గతేడాది 14న సుప్రీం ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లకు సమాధానం చెప్పేందుకు నాలుగు వారాల గడువు కావాలంటూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోరారు. అయితే మే4 లోగానే సమాధానం చెప్పాలంటూ కేంద్రానికి ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల అయిపోయే దాక ఈ విషయం పై తప్పించుకునే ప్లాన్ వేసి, 4 వారాల టైం అడిగింది కేంద్రం. కాని సుప్రీం కోర్ట్ కుదరదు అని చెప్పింది. తదుపరి విచారణను మే 6కి వాయిదా వేసింది. కాగా రాఫెల్ తీర్పుపై రివ్యూ కోరేందుకు పిటిషనర్లు ఉపయోగించిన ‘చోరీ పత్రాలపై’ ప్రివిలేజ్ కోరుతూ కేంద్రం చేసిన అభ్యంతరాన్ని సుప్రీం ఇప్పటికే తిరస్కరించింది.

game 27032019

దీంతో చోరికి గురైన పత్రాలు పరిశీలనకు రావడంతో పాటు.. సుప్రీంకోర్టు వెలువరించిన డిసెంబర్ తీర్పును పునఃసమీక్షించేందుకు సాక్ష్యాధారాలుగా ఉపయోగపడనున్నాయి. రాఫెల్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై మంగళవారం(ఏప్రిల్-30,2019) జరగబోయే విచారణనను వాయిదా వేయాలని సోమవారం(ఏప్రిల్-29,2019) కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.కొత్త అఫడవిట్ ఫైల్ చేసేందుకు మరింత సమయం కావాలని,అందువల్ల విచారణ వాయిదా వేయాలని కేంద్రం సుప్రీంని కోరింది.చీఫ్ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేంద్రం ఈ విషయాన్ని ప్రస్తావించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్‌ జనరల్‌ కోర్టు ఎదుట హాజరయ్యారు. విచారణ వాయిదా వేయాలంటూ కేంద్రం విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.

game 27032019

అయితే వాయిదా కొరకు రివ్య్యూ పిటిషన్లు దాఖలు చేసిన వివిధ పార్టీల్లో ఉన్న పిటిషనర్లకు లేఖను అందజేయడానికి మాత్రం కేంద్రం తరపు న్యాయవాదికి సుప్రీం అనుమతిచ్చింది. రాఫెల్ డీల్ లో అవతవకలేమీ జరగలేదని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు బహిర్గతమయ్యాయి. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక వీటిని ప్రచురించింది. వాటి ఆధారంగా పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు.ఈ పత్రాల ప్రాతిపదికన సమీక్ష జరపాలని కోరారు. అయితే రక్షణశాఖ నుంచి ఆ పత్రాలను దొంగిలించి వాటి నకలును కోర్టుకు ఇచ్చారని, అక్రమ మార్గంలో తీసుకొచ్చిన పత్రాల ఆధారంగా తీర్పును సమీక్షించడం సరికాదని కేంద్రం వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేంద్రం అభ్యంతరాలను కొట్టివేసింది.

హూద్ హూద్ తుఫాను ప్రళయం చేసిన విధ్వంసానికి, కొన్ని వేల కోట్ల ఆస్థి నష్టం జరిగింది. అయితే కేంద్రం మాత్రం కేవలం వెయ్య కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించి, కేవలం 600 కోట్లు ఇచ్చింది. మొన్న వచ్చిన తిత్లీకి కూడా ఇదే తీరు. కరువు సంబధిత డబ్బులు కూడా అరకోరగా విడుదల చేస్తూ కేంద్రం వచ్చింది. అయితే, ఇదంతా చంద్రబాబు మీద కోపంతో, ఆయన్ను సాధించాటానికి అని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఎవరూ అడగకుండానే, 200 కోట్లు ముందస్తుగా ఇచ్చి, ఏపి అధికార వర్గాలని కేంద్రం ఆశ్చర్యపరిచింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను తీవ్ర రూపం దాల్చుతోంది. తుపాను కారణంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

game 27032019

తుపాను ప్రమాదం పొంచి ఉండటంతో బంగాళాఖాతం తీర ప్రాంతం కలిగిన నాలుగు రాష్ట్రాలకు ముందస్తు నిధులు విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలకు రూ. 1086కోట్ల నిధులను ఎన్డీఆర్‌ఎఫ్‌ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.200.25కోట్లు, ఒడిశాకు రూ.340.87కోట్లు, తమిళనాడుకు రూ. 309.37కోట్లు, పశ్చిమబెంగాల్‌కు రూ. 233.50కోట్లు కేటాయించారు. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 690 కి.మీ, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 760 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన ఉన్న తుపాను గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు కదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

game 27032019

మరో 12 గంటల్లో పెనుతుపానుగా, మరో 24 గంటల్లో అతితీవ్ర పెనుతుపానుగా మారే అవకాశాలున్నట్లు వారు తెలిపారు. 4వ తేదీన ఈ పెను తుపాను ఒడిశా తీరం దాటి పశ్చిమబెంగాల్‌ దిశగా పయనిస్తుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు. ఫొని ప్రభావంతో మంగళవారం ఏపీలో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుంది అని వీవీ ప్యాట్ స్లిప్ లను లెక్కించాలని పలు రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఐదు వీవీ ప్యాట్ మెషీన్ లలోని స్లిప్ లను లెక్కించి సరిచూడాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు అధికారులు . మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా, వీవీ ప్యాట్ స్లిప్పుల గణనకు సంబంధించి మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి.

vvpat 30042019

తొలుత లాటరీ ద్వారా లెక్కించి, సరిచూడాల్సిన ఐదు వీవీప్యాట్ యంత్రాలను తొలుత ఎంపిక చేస్తారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని ఈవీఎంలలోనూ పోలైన ఓట్లను లెక్కించిన తరువాత వీవీ ప్యాట్ లను తీసుకు వస్తారు. సదరు పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లతో రూపొందించిన ఫారమ్-17తో వీవీప్యాట్ స్లిప్ లను సరిపోలుస్తారు. తొలుత స్లిప్ లను ఏజంట్ల ముందు బయటకు తీసి, అభ్యర్థుల వారీగా వేరు చేసి, 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. 2 గంటలకు పైగా సమయం ఈ ప్రక్రియ పూర్తి కావడానికి పట్టవచ్చని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, కేవలం ఐదు యంత్రాల్లోని స్లిప్ లను మాత్రమే లెక్కబెట్టాల్సి వుండటంతో, ఐదు వీవీప్యాట్ లనూ ఒకేసారి తెరవనున్నారు.

vvpat 30042019

ఈవీఎంలను లెక్కించే టేబుల్ పైనే ట్రేలను ఏర్పాటు చేసి వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సి వుంటుంది. ఒక్కో లోక్ సభ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి కాబట్టి, మొత్తం 35 వీవీ ప్యాట్ మెషీన్లను లెక్కించాల్సివుంటుంది. రిటర్నింగ్ అధికారి నేతృత్వంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. కౌంటింగ్ లోపే లెక్కింపుపై సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. అంతా సవ్యంగా జరిగి... ఈవీఎంలలో ఓట్ల ప్రకారమే స్లిప్పులు కూడా ఉంటే... ఏ సమస్యా ఉండదు. ఏదే తేడా వస్తే మాత్రం రాజకీయ దుమారం రేగే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ వీవీప్యాట్ లెక్కింపు మొదటి సారి కావటంతో, తెలుగుదేశం పార్టీ కూడా అలెర్ట్ అయ్యింది. బీజేపీ, వైసీపీ కలిసి పన్నుతున్న కుట్రలో, ఓట్ల లెక్కింపులో కూడా జాగ్రత్తగా ఉండాలని, తమ ఏజెంట్లకు అన్ని విషయాలు చెప్పాలని, ఏ మాత్రం అలసత్వం వహించినా, తారుమారు చేసేస్తారని, ఇప్పటి నుంచే ఏజెంట్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు.

వైసిపి నేత‌..రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి మీద ఏపి ప్రణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు కుటుంబ‌రావు తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. కొద్ది రోజులుగా వీరిద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్దం సాగుతోంది. సాయిరెడ్డి ట్విట్ట‌ర్ ద్వారా సమాజం తల దించుకునే భాషలో విమ‌ర్శ‌లు చేస్తుంటే..కుటుంబ రావు మీడియా స‌మావేశాలు పెట్టి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇక‌, సాయిరెడ్డి పైన కుటుంబ‌రావు చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత వేడి పుట్టించాయి. వైసిపి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పైన కుటుంబ‌రావు తీవ్ర వ్యాఖ్య‌లు కొన‌సాగిస్తున్నారు. రాష్ట్ర ఆర్దిక ప‌రిస్థితి పైన విజ‌య సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల పైన కుటుంబ రావు స్పందించారు. సాయిరెడ్డి పిచ్చి కుక్క‌లా అరుస్తున్నారంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

somireddy 30404219

తనను స్టాక్ బ్రోకర్ అంటున్న విజయసాయిరెడ్డి.. ఆయన దొంగ ఆడిటర్ కాదా అని ప్ర‌శ్నించారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే ఆర్థిక అంశాలపై తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. బెయిల్‌పై వచ్చి బతుకుతున్న విజయసాయి రెడ్డి ఓ పిచ్చి కుక్క అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ పైనా ఆరోప‌ణ‌లు చేసారు. కేంద్రాన్ని నిధులు అడిగితే జైలు శిక్ష ప‌డుతుంద‌ని జ‌గ‌న్‌..సాయిరెడ్డికి భ‌యం ప‌ట్టుకుంద‌ని ఎద్దేవా చేసారు. ప్ర‌భుత్వం చేస్తున్న ఖ‌ర్చుల గురించి అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌ని.. వారు చేస్తున్న వ్యాఖ్య‌లు సిగ్గు చేట‌ని దుయ్య‌బ‌ట్టారు. బ్రోక‌ర్‌..దొంగ ఆడిట‌ర్ అంటూ.. ఏపిలో అర్దిక అంశాల పైన విజ‌య సాయిరెడ్డి కొద్ది రోజులుగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. దీనికి ప్ర‌తిగా కుటుంబ రావు స్పందిస్తున్నారు.

somireddy 30404219

ఆ స‌మ‌యంలో కుటుంబ రావు సాయిరెడ్డితో పాటుగా జ‌గ‌న్ పైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీరిద్ద‌రూ బెయిల్ ష‌ర‌తులు పాటిస్తున్నారా అంటూ ప్ర‌శ్నించారు. అదే విధంగా..ఇద్ద‌రి మ‌ధ్య ఆరోప‌ణ‌ల స్థాయి పెరిగి..కుటుంబ రావును విజ‌య‌సాయిరెడ్డి ఆయ‌న బ్రోక‌ర్ అని విమ‌ర్శించారు. ఆర్దిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడా లేక కుటుంబ రావా అనే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. త‌మ పైన ఆరోప‌ణ‌లు వ‌చ్చిన ప్ర‌తీ సంద‌ర్భం లోనూ కుటుంబ‌రావు వైసిపి ఎంపి సాయిరెడ్డి మీద విరుచుకుప‌డుతున్నారు. ఇక‌, ఈ రోజు ఆయ‌న పైన ప్ర‌యోగించిన తీవ్ర ప‌ద‌జాలంతో మ‌రింత వేడి పెరిగి..ఇది ఎక్క‌డి వ‌ర‌కు పోతుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read