నూటికి వెయ్యి శాతం మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో అన్నారు. ఇందులో రెండో ఆలోచనే లేదని చెప్పారు. మెజార్టీ ఎంతనేదే తేలాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో గురువారం సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అభ్యర్ధులు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రలు ఇందులో పాల్గొన్నారు. అయితే ఈ టెలి-కాన్ఫరెన్స్ లో మాట్లాడే మాటలు, మీడియాకు వచ్చేవి కావు. ఎవరో కార్యకర్త ఇవి రికార్డు చేసి మీడియాకు ఇచ్చారు. ఈ సంభాషణలో చంద్రబాబు చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో అన్ని నివేదికలూ పరిశీలించి చెబుతున్నానని, మళ్లీ ప్రభుత్వం మనదేనని పునరుద్ఘాటించారు. తెదేపాలో గెలుస్తారనుకున్న వారితో వైకాపా నేతలు కొందరు టచ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి కుట్రలను ఆధారాలతో సహ బయట పెట్టాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కౌంటింగ్‌కు ముందు, కౌంటింగ్‌ రోజు వ్యవహరించాల్సిన తీరుపై పలు సూచనలు చేశారు.

secretariat 02052019

‘‘ఎన్నికల్లో కీలక ఘట్టం కౌంటింగ్ ప్రక్రియకు చేరాం. కౌంటింగ్‌కు ముందస్తు ప్రిపరేషన్ అతి ముఖ్యాంశం. ప్రతి నియోజకవర్గానికి కౌంటింగ్‌కు ప్రత్యేక బృందాలు ఏర్పడాలి. అనుభవం ఉన్నవాళ్లనే ఎంపిక చేయాలి. ఒక అడ్వకేట్, ఒక ఐటీ నిపుణుడు బృందంలో ఉండేలా చూసుకోవాలి. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్‌పై వర్క్‌షాప్‌ పెట్టాలి. కౌంటింగ్ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలి. గత నాలుగు ఎన్నికల ఓటింగ్ సరళిని విశ్లేషించాలి. ఏ బూత్‌లో ఏ పార్టీకి ఎన్నిఓట్లు వస్తాయో చెప్పగలగాలి. ఫలితాలు వచ్చాక వాటిని బేరీజు వేయాలి. ఓడిపోతామన్న సీట్లలో కూడా మంచి ఆధిక్యత చూపాం. ఇది ఎలా సాధ్యం అయ్యిందనేది విశ్లేషించుకోవాలి. భవిష్యత్తు రాజకీయానికి వీటిని కేస్ స్టడీగా అధ్యయనం చేయాలి. కౌంటింగ్ ఏజెంట్లు మధ్యలోనే లేచి వచ్చేయ కూడదు. చివరిదాకా ఓపిగ్గా ఉండేవారినే ఏజెంట్లుగా పెట్టాలి. ప్రతి ఎన్నికలోనూ మనమే గెలవాలన్న స్ఫూర్తి అందరిలో రావాలి. ఏ స్థాయిలో ఎవరు బాగా పనిచేశారనే నివేదికలు పంపాలి. ప్రతి నియోజకవర్గంలో సమర్థ నాయకత్వం రూపొందాలి. అప్పుడే రాష్ట్ర స్థాయి నాయకత్వానికి అదనపు బలం. అన్నిస్థాయిల్లో పార్టీ నాయకత్వం పటిష్ఠంగా ఉండాలి’’ అని పార్టీ నేతలతో చంద్రబాబు అన్నారు.

secretariat 02052019

7 చోట్ల వైసీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేశారని తెలిపారు. రాళ్ల దాడులు, వాహనాల ధ్వంసం వైసీపీ నిర్వాకాలేనని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతలు విధ్వంసాలు చేసి టీడీపీ నేతలపై నెడుతున్నారని విమర్శించారు. టింగ్‌కు ముందు కూడా వైసీపీ విషప్రచారం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఓ వైపు వైసీపీ కుట్రలను ఎదుర్కొంటూనే.. మరోవైపు దేశంలోని పార్టీలను ఏకం చేస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. 50శాతం వీవీప్యాట్‌ లెక్కింపు కోసం న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. రానురాను ఎన్నికల సంఘం బలహీనపడుతోందన్నారు. బలహీనమైన ఈసీ ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్నారు. ఓటమి భయంతోనే మోదీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కుల, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. ప్రధాని హోదాను దిగజార్చేలా మోదీ వ్యాఖ్యలున్నాయని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు మాటలు, ఇక్కడ వినవచ్చు https://youtu.be/Vt4TjW1rPzg

ఫొని తుపానుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. తుపాను ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్లతో సీఎం అత్యవసర సమీక్ష జరిపారు. తుపాను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఒడిశాలోని పూరీని తాకవచ్చని ఆర్టీజీఎస్ అధికారులు ఇచ్చిన అంచనాలపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో చంద్రబాబు చర్చించారు. ఈ మేరకు ఫోన్‌లో మాట్లాడారు. ఒడిశా ప్రభుత్వానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నవీన్‌కు చంద్రబాబు తెలిపారు. ఇలాంటి కష్టకాలంలోనే ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గతంలో తుపాను విపత్తు సమయంలో రూ.30 కోట్ల విలువైన సామగ్రిని ఒడిశాకు పంపించిన విషయాన్ని అధికారులకు గుర్తుచేశారు.

cbnphone 02052019

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని 15 మండలాలు.. 200 గ్రామాలపై ఫణి తుపాను ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని సీఎంతో విపత్తుల ప్రత్యేకాధికారి వరప్రసాద్, ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు తెలిపారు. 120 క్యాంపులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమించారు. టెక్కలి, పలాస కేంద్రాలుగా సహాయక బృందాలు పనిచేస్తాయని స్పష్టంచేశారు. మండల కేంద్రాల్లో కాకుండా తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో సహాయ బృందాలు అందుబాటులో ఉండాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. అలాగే పాలు, తాగునీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్కూళ్లలో తుఫాన్ బాధితులకు ఆహారం, ఇతర వసతులు కల్పించాలన్నారు. విశాఖ కేంద్రంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసరాలు పంపాలని సూచించారు.

cbnphone 02052019

శ్రీకాకుళం జిల్లాలో సముద్రతీరం అల్లకల్లోలంగా ఉంది. ఈదురుగాలుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బారువా నుంచి ఎర్రముక్కం వరకు 30 కిలోమీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. ‘ఫణి’ తుఫాన్ ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్దానం మండలాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గురువారం ఉదయం వజ్రపుకొత్తూరు మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో పాటు కొంతమేర ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ సాయంత్రానికి గాలుల తీవ్రంత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో పలాస, సోంపేట, కవిటి, వజ్రపు కొత్తూరు మండలాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. వంశధార, నాగావళి నదుల ముంపు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. తుపాన్ ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 'ఒకాయన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారంట. ఎందుకు పెట్టారో నాకు తెలియదు. రోడ్డు మీద కాకపోతే, ఎన్నికల సంఘం కార్యాలయంలో పెట్టుకోమనండి. నాకేం సంబంధం. ఇదేమైనా కొత్త సినిమానా? తెలంగాణలో రిలీజ్ చేశారు కదా. ఇక్కడ నామీద ఏంటి? ఆవిడ (లక్ష్మీపార్వతి) ఇప్పుడు ఎక్కడుంది? ఎందుకు ఇలాంటి చిల్లర రాజకీయాలు అంటా. ఎవరికైనా ఒక హుందాతనం, డిగ్నిటీ ఉండాలి' అని వ్యాఖ్యానించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు.

game 27032019

తన పోరాటమంతా ప్రధాని మోదీపైనే అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చి ఉంటే... ఆయనను నిలదీయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఇక్కడ పెద్దపెద్ద మాటలు మాట్లాడేవారెవరైనా ఢిల్లీకి వెళ్లి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. గుజరాత్, తెలంగాణల కంటే ఏపీలోనే అభివృద్ధి ఎక్కువగా ఉందని అన్నారు. ఎన్నిక‌ల సంఘం నియ‌మించిన సీఎస్ అతిగా స్పందిస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బంగారం ర‌వాణా విష‌యంలో అతిగా స్పందించి విచార‌ణ‌కు ఆదేశించార‌ని..అందులో అస‌లు త‌ప్పు ఏం జ‌రిగింద‌ని ప్ర‌శ్నించారు.

game 27032019

అదే విధంగా ఫైబ‌ర్ గ్రిడ్ నష్టాల్లో ఉంటే మూసేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నార‌ని..అలాగైతే ప్ర‌భుత్వాన్ని మూసేస్తారా అని నిల‌దీసారు. త‌న టీంలో ఉన్న అధికారుల‌కు ర‌క్ష‌ణ‌గా తాము ఉంటామ‌ని చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల సంఘం అదేశాల‌ను అధికారులు పాటించ‌టంలో త‌ప్పు లేద‌ని..అయితే ఎన్నిక‌ల సంఘం సైతం ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డే విధంగా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాని మోదీ పైన చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. ఈ నెల 23న ఫలితం ఎలా ఉండబోతోందో ఇప్పుడే అర్థమైనట్లు ఉందని వ్యాఖ్యానించారు. అందుకే విపక్షాల ఉనికిని కూడా మోదీ సహించలేకపోతున్నార‌న్నారు. ప్రతిపక్షాలను చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేసారు. ప్రతిపక్షాలు కొత్త దుస్తులు కొనుక్కుంటున్నారని మాట్లాడుతున్నారని.. ఏదీ తోచక అలా మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు.

కొద్దిరోజులుగా బిజీ బిజీగా గడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సచివాలయానికి రానున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన అక్కడే ఉండనున్నారు. అయితే, సచివాలయంలో ఎలాంటి ఎలాంటి సమీక్షలు ఉండవని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. సీఎం సమీక్షలు చేయడంపై గతంలో ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమీక్షలు నిర్వహించకుండా ఆయన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఫణి తుఫాను హెచ్చరికల సందర్భంగా 4 జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ సడలించాలని నిన్న ఈసీకి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే.

cbn 02052019

ఇదిలాఉండగా, అతి భీకరంగా దూసుకొస్తున్న తుపాన్ ‘ఫణి’ సహాయక చర్యలు చేపట్టేందుకు ముందస్తు జాగ్రత్తగా ఒడిశాకు.. కేంద్ర ఎన్నికల సంఘం కోడ్ మినహాయింపు ఇచ్చింది. ఒడిశాలో నాలుగు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన చివరి విడత ఎన్నికలు ముగియడం.. అదే సమయంలో.. తుపాను ప్రభావం కనిపించడంతో ఈసీ.. కోడ్ ఎత్తివేత నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగానే తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై తుఫాను ప్రభావం ఉన్న నేపథ్యంలో ఆ నాలుగు జిల్లాలకు ఎన్నికల కోడ్‌ నుంచి వెసులుబాటు ఇవ్వాలని ఈసీని చంద్రబాబు కోరారు.

 

cbn 02052019

బుధవారం చంద్రబాబు ప్రజా వేదికలో మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం పని చేసేందుకు కూడా ముఖ్యమంత్రులు ఎన్నికల కమిషన్‌ను అడుక్కోవాలా అని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేశారు. తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో సమీక్షలకు అవకాశమివ్వాలని ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఢిల్లీకి వెళ్లి, ఈసీని కోరాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో అక్కడ కొన్ని జిల్లాలకు ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపు ఇచ్చారన్నారు. ఒడిసాకు ఇచ్చిన మినహాయింపు ఏపీకి ఎందుకు ఇవ్వరు? శాడిజమా? ప్రధాని చెబితే తప్ప ఇవ్వరా? అని ప్రశ్నించారు. ‘‘తుఫాను ముంపు మనకూ ముంచుకొస్తోంది. ఎన్నికల నియమావళి నుంచి ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేదు. తుఫానుపై సమీక్షకు కూడా ఈసీ అనుమతి తీసుకోవాల్సి రావడం పెత్తందారీ పోకడలకు నిదర్శనం. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదు’’ అని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read