చంద్రబాబు సియం అయిన వెంటనే ప్రారంభించిన ప్రతిష్టాత్మిక ప్రాజెక్ట్ ఫైబర్ నెట్. కేవలం 150 రూపాయలకే, ఫోన్, ఇంటర్నెట్, కేబుల్ అందించే ప్రాజెక్ట్ ఇది. రాష్ట్రంలో పేదలకు కూడా ఈ సేవలు అందిస్తే, పరిపాలన సేవలతో పాటు, విజ్ఞానం, వినోదం మరింత దగ్గర అవుతుందని చంద్రబాబు ఇది మొదలు పెట్టారు. ఇప్పటికే చాలా చోట్ల కనెక్షన్ లు ఇస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ఆపటానికి చెయ్యని ప్రయత్నం లేదు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆపేసే ప్రయత్నం జరుగుతుంది. ‘బ్యాంకుల నుంచి మూలధనం కింద రుణాలు తీసుకురావడం.. సిబ్బంది జీత భత్యాల కోసం ప్రభుత్వ నిధులపై ఆధారపడడం ఎల్లవేళలా కుదరదు. ఇదే విధంగా మున్ముందు మనుగడ సాగిద్దామంటే కుదరదు. ఇదే వైఖరిని కొనసాగిస్తే ఫైబర్‌నెట్‌ మూసివేత ఖాయం’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు.

lv 29042019

ఈ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్ఎఫ్‌ఎల్‌‌) సిబ్బందిలో ఆందోళన మొదలైంది. తమ సంస్థ మనుగడ ఎలా ఉంటుందోనన్న భయం ప్రారంభమైంది. అర్ధాంతరంగా సంస్థను మూసేస్తే తమ బతుకుక్ష రోడ్డున పడతాయన్న అలజడి రేగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ నెల 25వ తేదీ (గురువారం)నాడు ఆర్థిక శాఖ పద్దులపై సీఎస్‌ ఎల్వీ టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఫైబర్‌నెట్‌ సంస్థ అధికారులనూ ఇందులో చేర్చారు. రాష్ట్రంలో సమాచార, సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చే డిజిటల్‌ ఆంధ్ర ప్రదేశ్‌ను విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న పరిస్థితి. వాణిజ్య విధానంలో మెరుగైన ఫలితాలు సాధించేలా కార్యాచరణనూ సిద్ధం చేసుకుంది.

lv 29042019

ఇలాంటి సమయంలో సీఎస్‌ చేసిన వ్యాఖ్యలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ‘ఇకపై ఫైబర్‌నెట్‌ స్వీయ లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి నెలా రూ.60 కోట్ల మేర ఆదాయాన్ని సాధించాలి. ఎంత లేదన్నా ఏటా రూ.660 కోట్ల ఆదాయం రావాలి. చేసిన అప్పులకు వడ్డీలు, సిబ్బంది జీతభత్యాల చెల్లింపు ప్రభుత్వ నిధులతోనే చేస్తామంటే ఫైబర్‌నెట్‌ను వైండప్‌ చేసేయాల్సిందే’ అని టెలికాన్ఫరెన్స్‌లో సీఎస్‌ హెచ్చరించడంపై వాపోతున్నారు. ఏ సంస్థయినా నిలదొక్కుకోవాలంటే కొంత సమయం పడుతుందని.. ఇప్పుడిప్పుడే సంస్థ ఆర్థికంగా పట్టు సాధిస్తున్న సమయంలో సీఎస్‌ తీరు వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

రాష్ట్రంలో, దేశంలో ఎన్నో సమస్యలు.. నిన్న కాక మొన్న తెలంగాణాలో, 23 మంది విద్యార్ధుల ప్రాణాలు ఎగిరిపోయాయి, అదీ ప్రభుత్వ అసమర్ధత వల్ల.. ఇన్ని సమస్యల పై నోరు ఎత్తటానికి జగన్ మోహన్ రెడ్డి గారికి టైం లేదు. తాను ఉండే హైదరాబాద్ లో ఎంతో మంది తల్లులు, తండ్రులు, పిల్లల ఏడుపులు వింటూ ఆస్వాదిస్తూ, నోరు ఎత్తలేదు. సొంత బాబాయ్ ని ఎవరు చంపారో తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదు. పోలీసులను, ఏపి ప్రభుత్వాన్ని ఈ దిశగా ప్రశ్నించే డమ్ము లేదు. కాని A సర్టిఫికేట్ సినిమాలు తీసుకునే రాం గోపాల్ వర్మను విజయవాడ పోలీసులు, తిప్పి హైదరాబాద్ పంపిస్తే మాత్రం, జగన్ గారు తట్టుకోలేక పోతున్నారు. రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటని ట్విట్టర్‌లో జగన్ ప్రశ్నించారు.

jagan 290402019

‘‘విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఇదే వర్మ వారం క్రితం, కేసీఆర్ బయోపిక్ అంటూ హడావిడి చేసి, ఆంధ్రుడా నిన్ను తొక్కుతా, కొడతా అంటూ ఎదో మత్తులో ఒక పాట పాడితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలను, రాష్ట్రాన్ని దుర్మార్గంగా తిడుతుంటే, ఒక్క మాట కూడా మాట్లాడని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్, విజయవాడ పోలీసులు వర్మని అరెస్ట్ చేస్తే మాత్రం, పాపం తట్టుకోలేక పోతున్నారు.

jagan 290402019

వర్మ తీసిన తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు’ విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మే ఒకటిన సినిమా విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ వివరాలు చెప్పడానికి ఆదివారం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు వర్మ ట్విటర్‌లో పేర్కొన్నారు. నోవాటెల్‌ హోటల్‌లో ప్రెస్‌మీట్‌ ఉంటుందని ప్రకటించారు. తర్వాత దాన్ని హోటల్‌ ఐలాపురానికి మార్చారు. కొద్దిసేపటికే అజిత్‌సింగ్‌నగర్‌లోని పైపులరోడ్డు జంక్షన్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బహిరంగంగా విలేకరుల సమావేశం నిర్వహిస్తానని వర్మ తెలిపారు. చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డితో కలిసి రాంగోపాల్‌ వర్మ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అయినా కారులో పైపులరోడ్డుకు బయలుదేరారు. ఈ సమాచారాన్ని విమానాశ్రయ పోలీసులు సిటీ పోలీసులకు చేరవేశారు. దీంతో రామవరప్పాడు రింగ్‌రోడ్డు వద్ద పోలీసులు వర్మ కారును అడ్డుకున్నారు. కారులో నుంచి ఇద్దరినీ దింపేసి మరో కారులో తిరిగి విమానాశ్రయానికి పంపేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంగా ప్రస్తుతం తుఫాన్ గా మారి ఫణిగా నామకరణం చేసుకొని 45 కిమీ వేగంతో తీరంవైపు దూసుకొస్తోంది. తమిళనాడు, కోస్తాంధ్ర మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీలో అధికారులు అప్రమత్తమయ్యారు. దక్షణకోస్తా జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు తుపాను ముప్పు నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, సంబంధిత అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు.

cbn review 28042019

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ‘ఫణి’ శనివారం సాయంత్రానికి చెన్నైకి ఆగ్నేయంగా 1,200కి.మీ. దూరంలో, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1,390కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం నాటికి తీవ్ర తుఫానుగా, 29కల్లా అతి తీవ్ర తుఫానుగా బలపడనుంది. ఈ క్రమంలో రానున్న మూడు రోజులు శ్రీలంక తీరం వెంబడి వాయవ్య దిశగా పయనించి 30న సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం దిశగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 30నుంచి 31డిగ్రీలు వరకు ఉండటం తుఫాను బలపడేందుకు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అతి తీవ్ర తుఫానుగా బలపడే క్రమంలో దాని పయనం మందగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈనెల 30 సాయంత్రానికి ఫణి తుఫాను దిశ మార్చుకుని ఈశాన్యంగా పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది. తుఫాను దిశ మార్పు ఖాయమని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. సాధారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో బంగాళాఖాతంలో సంభవించే తుఫాన్లు దిశ మార్చుకుని బంగ్లాదేశ్‌, మయన్మార్‌ వైపు వెళుతుంటాయన్నారు. 2016లో ‘రోనూ’ తుఫాను తీరం వెంబడి పయనించి బంగ్లాదేశ్‌ వైపు వెళ్లిందని గుర్తుచేశారు.

cbn review 28042019

అతితీవ్ర తుఫాను తీరానికి దగ్గరగా వస్తే ఈనెల 30, మే 1వ తేదీల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాల్లో విస్తారంగా, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయి. ఒకవేళ తీరానికి దూరంగా తుఫాను దిశ మార్చుకుంటే మాత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాల్లో ఒక మోస్తరు వర్షాలే కురుస్తాయి. ఈనెల 29నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగసిపడతాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లినవారు వెంటనే తీరానికి రావాలని సూచించింది. కాగా, తుఫాన్‌ దిశ మార్చుకుని ఈశాన్యంగా పయనించే క్రమంలో భూమి నుంచి తుఫాను దిశగా గాలులు వీయనున్నాయి. దీంతో కోస్తాలో ఎండలు పెరిగి కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఇదిలాఉండగా, గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో శనివారం 2వ నంబరు ప్రమాద సూచికను జారీ చేసినట్లు పోర్ట్‌ కన్జర్వేటర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు.

‘‘సీఎం చంద్రబాబు పట్ల నాకు చాలా గౌరవం ఉంది. సీఎంకు పవర్స్‌ లేవని నేనెప్పుడూ కామెంట్‌ చేయలేదు. పిచ్చాపాటిగా నోరుజారి కూడా ఎవరితోనూ ఆ మాట అనలేదు’’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘ఈసీ నిర్దేశించిన ప్రవర్తనా నియమావళి ప్రకారమే అధికారులు, ప్రజాప్రతినిధులు నడుచుకోవాల్సి ఉంటుంది. మేం ఈ విషయమే ఎవరికైనా చెప్తుంటాం. అంతే, కానీ సీఎంకు అధికారాలు ఉన్నాయా? లేవా? అన్న అంశం ప్రస్తావనకు రాలేదు’’ అని ద్వివేది వివరించారు. అయితే, ఈ అంశాన్ని మేం విస్తృతంగా ప్రచారం చేసినట్లు ఈసీకి చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొనడం ఆశ్యర్యంగా ఉందన్నారు.

dwivedi 28042018

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ పూర్తయిన తరువాతే రీ పోలింగ్ నిర్వహిస్తామని ద్వివేదీ తెలిపారు. ప్రస్తుతం రెండు దశల్లో పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. మూడోదశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ఆరంభం కానుంది. తొమ్మిది రాష్ట్రాల్లో 71 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించబోతున్నారు. అనంతరం వచ్చేనెల 6, 12, 19వ తేదీల్లో మిగిలిన మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. వచ్చే నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ లోపు ఎప్పుడైనా రీపోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో అయిదు చోట్ల రీ పోలింగ్ చేపట్టనున్నట్లు ద్వివేదీ వెల్లడించారు. ఈసీ నిబంధనలను అనుసరిస్తాం కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రవర్తనా నియమావళి ప్రకారమే అధికారులు, ప్రజాప్రతినిధులు నడుచుకోవాల్సి ఉంటుందని ద్వివేదీ చెప్పారు.

dwivedi 28042018

ఎవరు తమను ప్రశ్నించినా, ఇదే సమాధానం ఇస్తామని అన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సమీక్షలు నిర్వహించుకునే అధికారం చంద్రబాబుకు ఉందా? లేదా? అనేది తమ పరిధిలో లేదని అన్నారు. అసలు ఈ విషయమే ప్రస్తావనకు రాలేదని అన్నారు. ఈ అంశాన్ని మేం విస్తృతంగా ప్రచారం చేసినట్లు కేద్ర చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొనడం ఆశ్యర్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని ఈసీకి నివేదిక పంపామని, కౌంటింగ్‌లోపు ఎప్పుడైనా రీపోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని ద్వివేదీ చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read