ఇటీవల కొందరు రాజకీయ నాయకులపై ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం దాడులు చట్టప్రకారమే జరిగాయని, రాజకీయ ప్రతీకారంతో ఎంతమాత్రం భాగం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కేవలం ప్రతిపక్షాల మీదే ఐటి దాడులు జరుగుతూ, వాళ్ళతో స్నేహంగా ఉన్న జగన్, కేసీఆర్, అన్నాడీయంకే లాంటి పార్టీల పై, ఐటి దాడులు జరగకపోతే, ప్రధాని మాత్రం, అన్నీ చట్ట ప్రకరామే జరుగుతున్నాయి, మాకు ఏమి సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు. అంతే కాదు, తనకు శపించే శక్తి ఉందని, తాను శపించినందునే ముంబై ఏటీఎస్ అధికారి హేమంత్ క‌ర్క‌రే మరణించారని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాలేగావ్ పేలుళ్ల నిందితురాలు సాధ్వీ ప్రాగ్యా సింగ్ ఠాకూర్ ను ప్రధాని నరేంద్ర మోదీ సమర్థించారు. ప్రాగ్యాకు పూర్తి మార్కులేసిన ఆయన, హిందూ నాగ‌రిక‌త‌పై ఉగ్ర‌వాదం మ‌చ్చ వేసే నేతలకు ఆమె స‌మాధానంగా నిలుస్తుంద‌న్న నమ్మకం ఉందని అన్నారు.

modi 20042019

గడచిన 5 వేల ఏళ్లుగా వసుధైన కుటుంబంలా ఉన్న హిందూ సంస్కృతిని కొందరు ఉగ్రవాదమని వ్యాఖ్యానిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు భారీ మూల్యం చెల్లించుకోవాలంటే ప్రాగ్యా సింగ్ వంటి వారుండాలని 'టైమ్స్ నౌ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. "ఒక మహిళా సాధ్విని అంత క్రూరంగా విమర్శించరాదు" అని ఆయన అన్నారు. సంఘౌతా కేసులో తీర్పును గుర్తు చేసుకుంటూ, నిందితులు ఏ సాక్ష్యమూ లేకుండా శిక్షించబడ్డారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 1984లో వేలాది మంది సిక్కులను హత్యలు చేయించిందని, ఆ పార్టీకి విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.

modi 20042019

సిక్కుల ఊచకోతకు కారణమైన కాంగ్రెస్ నేతలు ఎంపీలయ్యారని, క్యాబినెట్ మంత్రులుగానూ పనిచేశారని, ఆ పార్టీ ఆరోపణలున్న వ్యక్తిని మధ్యప్రదేశ్ లో సీఎంగా ఎంచుకుందని మోదీ నిప్పులు చెరిగారు. బెయిల్ పై బయటకు వచ్చిన సాధ్వి ప్రాగ్యకు టికెట్ ఎలా ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన ఆయన, అదే బెయిల్ పై బయట తిరుగుతూ రాయ్ బరేలీ, అమేథిల నుంచి పోటీ చేస్తున్న వారిని ఇవే ప్రశ్నలు ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. "అమేథి, రాయ్ బరేలీలో కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నవారు బెయిల్ పైనే బయట ఉన్నారు. దీనిపై చర్చ లేదు. అదే భోపాల్ లో మా అభ్యర్థి బెయిల్ పై ఉంటే విమర్శల తుఫాను సృష్టిస్తున్నారు. ఇదేం పద్ధతి?" అని ఆయన అన్నారు. అయితే ఇదే సందర్భంలో కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతూ, పిఎంఓ లోనే ఉంటున్న విజయసాయి రెడ్డి, జగన్ ను మనం గుర్తుంచుకోవాలి.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులోని 22 మంది న్యాయమూర్తులకు ఆమె ఫిర్యాదు చేశారు. ‘‘ఆయన నా నడుము పట్టుకుని కౌగిలించుకున్నారు. హత్తుకుంటూ శరీరమంతా తన చేతులతో తడిమారు. బయటికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. నిశ్చేష్టురాలైన నేను ఆయన నిర్బంధాన్ని వదిలించుకునేందుకు ఎంత గట్టిగా ప్రయత్నించినా ఆయన నన్ను వదల్లేదు. అంతటితో ఆగకుండా నన్ను ‘హత్తుకో’ అని అన్నారు...’’ అంటూ 35 ఏళ్ల సదరు ఉద్యోగిని తన లేఖలో పేర్కొన్నారు.

cji 20042019

సుప్రీం కోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు తనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తీవ్రంగా ఖండించారు. న్యాయవ్యవస్థ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందనీ... అయితే అది ఎప్పటికీ బలిపశువుగా మారబోదని ఘాటుగా స్పందించారు. మాజీ మహిళా ఉద్యోగి సుప్రీం న్యాయమూర్తులకు ఫిర్యాదు చెయ్యటంతో, దీనిపై సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఇవాళ అత్యవసర విచారణ చేపట్టింది. ముగ్గురు సభ్యులు గల ఈ బెంచ్‌లో జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నారు. విచారణ సందర్భంగా జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ... ‘‘ఇది నమ్మశక్యంగా లేదు. ఈ ఆరోపణలను ఖండించడానికి నన్ను నేను ఇంత తగ్గించుకోవాల్సి వస్తుందని ఊహించలేదు..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్నారు. ‘‘దీని వెనుక పెద్ద శక్తులే ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని స్తంభింపచేయాని వారు చూస్తున్నారు...’’ అని ఆయన పేర్కొన్నారు. తాను దీనిపై ఎలాంటి తీర్పులూ వెలువరించబోననీ.. సీనియర్ న్యాయమూర్తి అరుణ్ మిశ్రా తీర్పు చెబుతారని ఆయన పేర్కొన్నారు.

cji 20042019

వచ్చేవారం సుప్రీంకోర్టులో తాను పలు కీలక కేసులు విచారించబోతున్నాననీ... అందుకే తనపై ఈ రకమైన ఆరోపణలు చేయిస్తున్నారని జస్టిస్ గొగోయ్ అన్నారు. ‘‘నేను ఇదే స్థానంలో కూర్చుంటాను. నిర్భయంగా నా విధులు నిర్వహిస్తాను. విషయాలు చాలా దూరం వెళ్లాయి. అయినప్పటికీ న్యాయ వ్యవస్థ ఎన్నటికీ బలిపశువుగా మారబోదు..’’ అని ఆయన స్పష్టం చేశారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడంతో... ఏమీ దొరక్క, చివరికి ఇదొకటి పట్టుకుని వచ్చారన్నారు. ‘‘న్యాయమూర్తిగా 20 ఏళ్లు నిస్వార్థంగా పనిచేసిన నాకు బ్యాంకు ఖాతాలో రూ.6.80 లక్షలు ఉన్నాయి. దీనికంటే నా బంట్రోతు డబ్బులే ఎక్కువగా ఉంటాయి. 20 ఏళ్ల తర్వాత ఓ ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చే బహుమతి ఇదేనా?’’అని జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రశ్నించారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై ఆరోపణలు చేసిన మహిళకు క్రిమినల్ నేపథ్యం ఉందనీ, ఆమెపై రెండు పోలీసు కేసులు కూడా ఉన్నాయని సుప్రీం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా పేర్కొన్నారు. జస్టిస్ గొగోయ్‌ని బ్లాక్ మెయిల్ చేసేందుకే ఆమె ఈ ఆరోపణలు చేసినట్టు కనిపిస్తోందని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా అభిప్రాయపడ్డారు.

 

ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మనవరాలు వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, సినీ నటులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అలాగే.. ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇరువురూ ఒకేసారి ఎదురుపడడంతో చిరునవ్వులతో పలకరించుకున్నారు. వధూవరులను ఆశీర్వదించి, తిరుమల శ్రీవారి ప్రసాదాలను బహుమతిగా అందించిన చంద్రబాబు, వేదిక దిగగానే పవన్ కల్యాణ్ ఎదురు పడ్డారు. ఇరువురూ నమస్కార, ప్రతినమస్కారాలు చేసుకుంటూ మాట్లాడుకున్నారు. అయితే.. గత సంవత్సరంలో అమరావతిలో ఓ ఆలయ విగ్రహ ప్రతిష్టలో కలుసుకున్న వీరిద్దరూ మళ్లీ ఎదురెదురుగా తారసపడటం ఇదే తొలిసారి.

pk 20042019

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌, సీవీసీ కేవీ చౌదరి, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ దంపతులు, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ తదితర ప్రముఖులు విచ్చేశారు. ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు, తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, విజయ సాయిరెడ్డి, హరీశ్‌రావు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మంత్రి నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, కేశినేని నాని, ఎల్‌ రమణ, మహమూద్‌ అలీ, సుబ్బరామిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు, మండలి బుద్ధ ప్రసాద్‌, జయ ప్రకాశ్‌ నారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, జగదీశ్‌రెడ్డి, జి.వివేక్‌, కొండ్రు మురళి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పరిటాల సునీత, కొనకళ్ల నారాయణ తదితరులు తరలివచ్చారు.

 

pk 20042019

సినీ ప్రముఖులు.. చిరంజీవి దంపతులు, వెంకటేశ్‌, రాఘవేంద్రరావు, కృష్ణ, కృష్ణం రాజు దంపతులు, అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నరేశ్‌, దగ్గుబాటి సురేశ్‌, శ్యాంప్రసాద్‌ రెడ్డి, అక్కినేని అమల, రాజేంద్ర ప్రసాద్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, బ్రహ్మానందం, బోయపాటి శ్రీనివాస్‌, ఎం.ఎం. కీరవాణి, అచ్చిరెడ్డి, చలపతిరావు, ఆర్‌.నారాయణమూర్తి, శోభు యార్లగడ్డ, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సునీల్‌, శ్రీను వైట్ల, సుశాంత్‌, కోటి, కోట శ్రీనివాసరావు, వందేమాతరం శ్రీనివాస్‌, చంద్రబోస్‌ తదితరులు హాజరయ్యారు. పారిశ్రామిక వేత్తలు.. జూపల్లి రామేశ్వరరావు, గ్రంథి మల్లికార్జునరావు, గీతం విద్యా సంస్థల అధినేత శ్రీభరత్‌, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, పొట్లూరి వర ప్రసాద్‌‌, ప్రముఖ వైద్యులు పావులూరి కృష్ణ చౌదరి, ఆప్కాబ్‌ ఛైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు తదితరులు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు.

తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించటం ఎన్నో జన్మల పుణ్యఫలం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, వాత్సల్యం, ఇవన్నీ తన శక్తిని, ఉత్సాహాన్ని పదిరెట్లు చేసి తన కార్యసాధనకు మరింత ప్రేరేపించాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఈ ట్వీట్లు చేశారు. ధర్మ పోరాట దీక్ష ఆరంభించి నేటికి సంవత్సరం అయిందని, 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డానని చెప్పారు. అప్పుడప్పుడూ కొంత ఆలస్యం అయినా అంతిమంగా ధర్మానిదే విజయం అని అనుభవంలో నేర్చుకున్నానని పేర్కొన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు కూడా న్యాయం జరిగి మళ్లీ ధర్మం గెలుస్తుందని నమ్మకం తనకుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

cbn tweet 20042019

ఇవి చంద్రబాబు ట్వీట్లు.. "ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించటం. ఇన్ని సంవత్సరాలలో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, వాత్సల్యం, ఇవన్నీ నా శక్తిని, ఉత్సాహాన్ని పదిరెట్లు చేసి నన్ను కార్య సాధనకు మరింత ప్రేరేపించాయన్నది నిజం. ధర్మ పోరాట దీక్ష ఆరంభించి నేటికి సంవత్సరం అయింది. 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డాను. అప్పుడప్పుడూ కొంత ఆలస్యం అయినా అంతిమంగా ధర్మానిదే విజయం అని నా అనుభవంలో నేర్చుకున్నది. మన రాష్ట్రానికి మన ప్రజలకూ కూడా న్యాయం జరిగి మళ్లీ ధర్మం గెలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే ఈ యజ్ఞంలో భాగస్వాములే. రాష్ట్రం కోసం, దేశం కోసం , ప్రజాస్వామ్యం కోసం మనం ఎలుగెత్తిన గళం ఈ తరాల కోసమే కాకుండా భవిష్యత్తు తరాల కోసం కూడా. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశంగా చూడాలన్న నా లక్ష్య సాధనలో భాగస్వాములుగా నిలిచిన ప్రజలు, ఆధికారులు, ఉద్యోగులు, మేధావులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నా జన్మదినాన్ని గుర్తుంచుకొని అభినందనలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.' అంటూ వరుస ట్వీట్లు చేసారు.

cbn tweet 20042019

కాగ, ముఖ్యమంత్రి చంద్రబాబు 69వ జన్మదిన వేడుకలు ఉండవల్లిలోని ప్రజావేదికలో ఘనంగా జరిగాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వేదపండితులు చంద్రబాబుకు మంగళాశీర్వచనాలు పలికారు. గుంటూరు రాష్ట్ర తెదేపా కార్యాలయంలో మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెదేపా నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట పట్టణంలోని సీబీఎన్‌ ఆర్మీ, తెదేపా శ్రేణులు ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కేక్‌ కట్‌ చేసి శ్రేణులకు పంచారు.

Advertisements

Latest Articles

Most Read