రాజధాని అమరావతిలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణంలో మరో ముందడుగు పడింది. 50 అంతస్తులుగా నిర్మిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయ భవనానికి డయాగ్రిడ్‌ స్ట్రక్చర్‌ నిర్మాణంలో భాగంగా తొలి కాలమ్‌ను (మధ్యలో ఖాళీగా, చతురస్రాకారంలో రూపొందించిన పొడవైన ఇనుప స్తంభం) సోమవారం అమర్చారు. గుజరాత్‌లో సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్‌ విగ్రహానికి (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ) స్టీల్‌ ఫ్రేం వర్క్‌ పనులు చేసిన.... ఎవర్సెండాయ్‌ సంస్థ వీటిని సరఫరా చేస్తోంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలకు అమరావతిలో 5 టవర్లు నిర్మిస్తున్నారు. వీటిలో 3, 4, 5 టవర్లకు ఎవర్సెండాయ్‌, 1, 2 టవర్లకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సంస్థలు ఈ కాలమ్‌లను సరఫరా చేస్తున్నాయి.

secretariat 16042019 1

అమరావతిలోని హెచ్‌వోడీ అండ్‌ సెక్రటేరియల్‌ టవర్లలో 4 ఒక్కొక్కటి 40 అంతస్థులతోనూ, మిగిలిన ఒకటి 50 అంతస్థులతో (ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు కొలువు దీరే జీఏడీ టవర్‌) నిర్మితమవనున్న సంగతి తెలిసిందే. సాంప్రదాయక భవనాల్లోని పిల్లర్ల మాదిరి కాకుండా భారత్‌లోనే తొలిసారిగా డయాగ్రిడ్‌ విధానంలో నిర్మితమవుతున్న అత్యంత భారీ సౌధాలుగా ఇవి చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ ప్రక్రియను దిగ్విజయంగా ముగించిన సీఆర్డీయే ఇంజినీరింగ్‌ విభాగాధికారులు తదుపరి చర్యగా ఈ టవర్ల డయాగ్రిడ్‌ స్టీల్‌ కాలమ్స్‌ అమరిక పనులను చేపట్టారు. ఇందులో భాగంగా జీఏడీ (టవర్‌ నంబర్‌ 5) మరియు 3వ టవర్‌కు సంబంధించిన డయాగ్రిడ్‌ కాలమ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.

secretariat 16042019 1

స్ట్రక్చరల్‌ స్టీల్‌ ఫ్యాబ్రికేషన్‌లో ప్రపంచంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఎవర్‌సెండాయ్‌ సంస్థ ఈ పనులను చేపట్టింది. దుబాయ్‌కు చెందిన ఈ సంస్థకు బుర్జ్‌ ఖలీఫా, మలేసియాలోని పెట్రోనాస్‌ టవర్‌ 2, ఖతార్‌లోని ఖలీఫా ఒలింపిక్‌ స్టేడియం, సింగపూర్‌లోని రిపబ్లిక్‌ ప్లాజా, సౌదీలోని కింగ్‌డమ్‌ సెంటర్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణాలను చేపట్టిన అనుభవం ఉంది. సెక్రటేరియట్‌ టవర్లలో అమర్చిన డయాగ్రిడ్‌ కాలమ్స్‌ ఒక్కొక్క దాని బరువు 17.80 టన్నులు! ఈ350బీఆర్‌ గ్రేడ్‌ అనే అత్యంత నాణ్యమైన స్టీల్‌తో తమిళనాడులో వీటిని తయారు చేసి, అక్కడి నుంచి భారీ వాహనాల్లో అమరావతికి చేర్చారు. జీఏడీ టవర్‌లో ఇలాంటి భారీ కాలమ్స్‌ మొత్తం 512 అమర్చనున్నారు. కాగా.. మొత్తం 5 సెక్రటేరియట్‌ టవర్లలో మూడింటికి సంబంధించిన డయాగ్రిడ్‌ కాలమ్స్‌ అమరికను ఎవర్‌సెండాయ్‌ జరపనుండగా, మిగిలిన 2 టవర్లవి జేఎ్‌సడబ్ల్యూ సంస్థ చేపట్టనుంది.

‘ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లోనే డబ్బు తీసుకెళ్తుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి కనిపించదా? ప్రధానికి ఎన్నికల నియమావళి వర్తించదా? భాజపాకు ఎర్ర తివాచీ పరుస్తూ..విపక్ష పార్టీలపై ఈసీ ఒంటికాలి మీద ఎందుకు లేస్తోంది? అధికార పార్టీ ‘నమో టీవీ’ పేరుతో సొంత టీవీ ఛానల్‌ పెట్టుకుంటే ఏం చర్యలు తీసుకుంది. సాక్షి పత్రిక, ఛానల్‌పై మేం ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోగా.. వాటిలో ప్రచురించిన, ప్రసారమైన కథనాలు ఆధారంగా మాపై చర్యలు తీసుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని వ్యవస్థలతో ఎడాపెడా ఆడుకున్న ఈసీకి... కేంద్రంలోని ఐబీ, ఐటీ, ఈడీ వంటి సంస్థలు చేస్తున్న నిర్వాకాలు కనిపించలేదా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఈసీ వైఖరికి నిరసనగా ఎన్డీయేలో లేని పార్టీలతో కలసి జాతీయ స్థాయిలో ప్రజా ఉద్యమం చేపడతామని, ఉద్యమ కార్యాచరణ సిద్ధమవుతోందని వెల్లడించారు.

modi 166042019

సోమవారం ఉండవల్లిలోని ప్రజా వేదికలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలంటే ఎందుకు నిరాకరిస్తున్నారు? మీ సమస్యేంటి? ఈసీ ఎందుకు ఇన్ని అబద్ధాలు చెబుతోంది?వాళ్లు చేస్తోంది చాలా దుర్మార్గం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఈవీఎంలలో సమస్యలు ఏర్పడి పని చేయకపోవడానికి (మాల్‌ఫంక్షనింగ్‌) ఆస్కారం ఉందే తప్ప, ట్యాంపరింగ్‌కు అవకాశం లేదని సీఈసీ చెబుతున్నారు. అలాంటి సమస్యలకు అవకాశం ఉన్న ఈవీఎంలను ఎందుకు వినియోగించాలి’ అని ప్రశ్నించారు. ‘ఈవీఎంలను ఎలా హ్యాక్‌ చేయవచ్చో... ఒక విజిల్‌ బ్లోయర్‌గా హరిప్రసాద్‌ ప్రదర్శించి చూపిస్తే... ఆయనపై తప్పుడు కేసు పెట్టారు. చివరకు మా పోరాటం ఫలితంగానే వీవీప్యాట్‌లు వచ్చాయి. వాటిని తెచ్చే ముందు అప్పటి సీఈసీలు హరిప్రసాద్‌ను పిలిచి సలహాలు తీసుకున్నారు’ అని చంద్రబాబు వివరించారు.

modi 166042019

ఈ ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధిస్తుందని, 150కిపైగా సీట్లు గెలుచుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఈవీఎంలలో అవకతవకల గురించి నేను మాట్లాడుతుంటే..ఎన్నికల్లో తెదేపా ఓడిపోతుందన్న భయంతోనే ఇలా మాట్లాడుతున్నానని విపక్షాలు అంటున్నాయి. వాళ్ల మాటలు పట్టుకుని... మీరు ఓడిపోతారట కదా? అని మీడియా ప్రతినిధులు నన్ను అడుగుతున్నారు. నేను భయపడటమేంటి? పోలింగ్‌ రోజున ఎంత ఉద్ధృతంగా ఓటర్లు తరలి వచ్చారో చూశారు కదా? హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, పుణె తదితర ప్రాంతాల నుంచి ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో వచ్చి ఓట్లు వేశారు. చివరకు షిర్డీలోని ఒక అనాథాశ్రమంలో ఉంటున్న వృద్ధురాలు ప్రత్యేకంగా వచ్చి ఓటు వేశారు. చంద్రబాబుపై అభిమానంతో ఓటు వేయడానికి వచ్చానని చెప్పారు. ఈవీఎంలు మొరాయించి... మధ్యాహ్నం వరకు పోలింగ్‌ శాతం తగ్గితే, నేను ఒక్క పిలుపు ఇవ్వడంతో ఇళ్లకు వెళ్లిపోయిన వారు మళ్లీ వచ్చి ఓట్లు వేశారు. అర్ధరాత్రి వరకు వరుసలో నిలబడి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు’ అని చంద్రబాబు వివరించారు.

ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షించి లబ్ధి పొందాలనుకునే నాయకులను చూశాం. అలాగే అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి ఓట్లు రాబట్టాలని చూసే నేతలకైతే కొదవే లేదు. ఇలా ఓట్లను దండుకోవడమే పరమావధిగా భావించే నాయకులు అనేక రకాల మార్గాలను ఆశ్రయిస్తున్నారు. తాజాగా గుజరాత్‌లోని ఫతేపూర్‌కు చెందిన రమేశ్‌ కటారా అనే ఎమ్మెల్యే ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేశారు. భాజపాకు ఎవరు ఓటు వేశారో లేదో మోదీకి తెలిసిపోతుందంటూ వ్యాఖ్యానించారు. ఈసారి అన్ని పోలింగ్ బూత్‌లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నారని.. ఇక మీరు భాజపాకు ఓటు వేశారో లేదో మోదీ చూస్తారంటూ బెదిరించాడు. ఎక్కడైతే భాజపాకు తక్కువ ఓట్లు వచ్చాయో ఆ ప్రాంత అభివృద్ధికి తక్కువ నిధులు కేటాయిస్తారని చెప్పుకొచ్చారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ఒకటి స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

modi 16042019

దీనిపై స్పందించిన గుజరాత్‌ కాంగ్రెస్ శాఖ సదరు ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ విషయంపై ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించి తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. ఇటీవల మరో భాజపా నేత ప్రచారంలో మాట్లాడుతూ..భాజపాకు ఓటు వేయని పక్షంలో తీవ్ర చర్యలు ఉంటాయని ఓటర్లను బెదిరించారు. దీనిపై కాంగ్రెస్‌.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఈసీ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. అయినా నేతల్లో మార్పు రాకపోవడం విచారకరం.

modi 16042019

మరో పక్క మేనకాగాంధీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. ఫిలిభిత్‌లో ప్రతిసారి గెలుస్తున్నాను. ఏ గ్రామాన్ని ఎక్కువ అభివృద్ధి చేయాలి, ఏ గ్రామాన్ని తక్కువ అభివృద్ధి చేయాలనేదానికి కొలబద్ద ఏమిటి?. అందుకే ఓట్లు పడే గ్రామాలను ఏ,బీ,సీ,డీలుగా విభజించాం. 80శాతం ఓట్లు మాకు వేసిన గ్రామం ‘ఎ’ తరగతికి చెందుతుంది. 60శాతం వస్తే ‘బి’, 50శాతం వస్తే ‘సి’, అంతకంటే తక్కువ వస్తే ‘డి’. ముందుగా ‘ఎ’ తరగతి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తాం. తరువాత వరుసగా బి,సి,డి గ్రామాల్లో చేపడతాం. ఇందులో ఏ తరగతిలో ఉండాలనేది మీకే వదిలేస్తున్నాను అంటూ, బెదిరించే ప్రయత్నం చేసారు.

ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని తాను పోరాడుతుంటే భయపడుతున్నామంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ‘తప్పులు జరగకూడదు. మరో రాష్ట్రంలో ఇలా జరగకూడదనేదే మా ఆలోచన. దొంగదారులకు వీల్లేదు’ అని స్పష్టం చేశారు. సోమవారం తెదేపా కార్యకర్తలు, నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘వీవీపాట్‌లలో పడే పత్రాల్లో 50 శాతం లెక్కించడానికి ఎన్నికల సంఘానికి అభ్యంతరమేంటి?’ అని నిలదీశారు. ‘అన్ని పార్టీలు అంగీకరించినప్పుడు కాదనడానికి వారెవరు? ప్రజలు చెబుతున్నా కుదరదంటూ పెత్తనం చేస్తారా?’ అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో 115 నుంచి 130 శాసనసభ స్థానాల్లో విజయం సాధిస్తున్నాం. వెయ్యి శాతం గెలుపు మనదే’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

cbn poratam 16042019

ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశముందని, కొన్ని ఈవీఎంల పనితీరు సరిగా లేదని సీఈసీ చెబుతోందని, అలాంటప్పుడు వాటిని ఎలా వినియోగిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ధోరణితో ఈసీ వ్యవహరించిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు వద్దనుకున్న ఈవీఎంలు మనకు ఎందుకని అన్నారు. ఈసీకి ఎన్నికలు నిర్వహించడం మీద కన్నా.. రాజకీయాలు చేయడం.. నేతలు చెప్పినట్టు తలాడించడంపైన శ్రద్ధ ఎక్కువని విమర్శించారు. ఈవీఎంల విషయంలో.. దశాబ్దాలుగా ఏం చెబుతున్నానో ఇప్పుడూ అదే మాట్లాడుతున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.

cbn poratam 16042019

ఈవీఎంలపై తన పోరాటం ఈనాటిది కాదని, ఈసీని కూడా మోదీ పూర్తిగా భ్రష్టుపట్టించారని చంద్రబాబు ఆరో్పించారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీల మీదకు వాడుకునే.. ఒక ఆయుధంగా ఈసీని తయారు చేశారన్నారు. కనీసం 50 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించే వరకు తన పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 23 పార్టీలు కలిసి ఉమ్మడిగా కార్యాచరణ చేపడుతామని అన్నారు. యంత్రాంగాన్ని రాజ్యాంగ సంస్థలను కూడా.. మోదీ దుర్వినియోగం చేసి అడ్డగోలుగా గెలవాలనుకుంటున్నారని, మేము అలా జరగనివ్వమని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తమ పోరాటమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisements

Latest Articles

Most Read