ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కృష్ణా జిల్లా తిరువూరు, పామర్రు, పెడన, మచిలీపట్టణంలలో మాట్లాడిన చంద్రబాబు ఖమ్మం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు తాము అడ్డంకి కాదన్న కేసీఆర్.. ప్రాజెక్టు కారణంగా భద్రాచలం మునిగిపోతుందని అంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. భద్రాచలాన్ని, రాముడిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని అన్నారు. ఒకప్పుడు భద్రాచలం ఏపీలోనే ఉండేదని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. భద్రాచలాన్ని తమకిస్తే భద్రంగా చూసుకుంటామన్నారు. సాగర్, శ్రీశైలంలను నియంత్రణలో ఉంచుకున్న మీకు పోలవరంలో వాటా కావాలా? అని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పెత్తందారీ పాలన తమ వద్ద సాగదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కేసీఆర్, జగన్‌లు ముసుగు తీసేశారని అన్నారు. కేసీఆర్ వేసే బిస్కెట్లకు జగన్ తోక ఊపుతున్నారని అన్నారు. జగన్ తమ మిత్రుడే అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై చంద్రబాబు మాట్లాడుతూ.. పొగ పెట్టానని, కలుగులోంచి ఎలుక బయటకు వచ్చిందని, ముసుగు తీసేసాడని అన్నారు.

yeluka 09042019

ప్రత్యేక హోదాకు మద్దతు పేరిట కేసీఆర్‌ డ్రామాలాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇప్పుడు మద్దతు ఇస్తామంటున్న కేసీఆర్‌... ఇదే హోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఎందుకు కలిసి రాలేదని ప్రశ్నించారు. సోమవారం ఆయన కృష్ణా జిల్లా తిరువూరు, పామర్రు, పెడన, మచిలీపట్నంలలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. తిరువూరు, పామర్రు సభల్లో మాజీ ప్రధాని దేవెగౌడ కూడా పాల్గొన్నారు. ‘ఏపీకి ప్రత్యేక హోదాకు మా మద్దతు! పోలవరానికి మేం అడ్డంకి కాదు’ అని కేసీఆర్‌ చేసిన తాజా ప్రకటనపై చంద్రబాబు స్పందించారు. ‘కేసీఆర్‌తో కలిసి హోదా సాధిస్తామంటున్న జగన్‌... మంగళవారం సాయంత్రంలోగా తమ ఫెడరల్‌ ఫ్రంట్‌ తరఫున కేంద్రానికి కేసీఆర్‌తో లేఖ రాయించాలి.

yeluka 09042019

పోలవరానికి అడ్డుపడటం లేదంటున్న కేసీఆర్‌.. ఈ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వేసిన కేసులు వాపస్‌ తీసుకోవాలి. ఏపీకి హోదా ఇస్తే తెలంగాణలో పరిశ్రమలు పోతాయని, తమకూ కావాలని కేసీఆర్‌ చెప్పలేదా? ప్రత్యేక హోదా ఇస్తామన్న సోనియాను విమర్శించలేదా? కేసీఆర్‌ ఎప్పుడూ నిజం చెప్పరు! జీవితమంతా అబద్ధాలే. ఆంధ్రావాళ్లు ద్రోహులని తిట్టలేదా? దద్దమ్మలని దూషించలేదా? కోడికత్తిపార్టీకి డబ్బులు ఇచ్చి డ్రామా ఆడిస్తే నమ్మడానికి జనం పిచ్చోళ్లు కాదు. జగన్‌కు వెయ్యి కోట్లు ఇచ్చి.. రాష్ట్రానికి రావాల్సిన లక్షకోట్లు ఎగ్గొట్టే ప్రయత్నంలో ఉ న్నట్లు ప్రజలకు తెలుసు. హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగస్వాములైన ఆంధ్రులకు.. నిబంధనల ప్రకారం రావాల్సిన 58ు వాటాపై పోరాటం సాగిస్తా’ అని చంద్రబాబు ప్రకటించారు. పోలవరం గ్రాఫిక్స్‌ అని మాట్లాడిన కేసీఆర్‌లు ఇప్పుడు ముంపు గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

‘‘కేసీఆర్‌.. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతంటున్నారు. ధైర్యముంటే మంగళవారం సాయంత్రంలోగా దీనిమీద దిల్లీకి లేఖ రాయండి. పోలవరాన్ని అడ్డుకునేందుకు వేసిన కేసులు వెనక్కి తీసుకోండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆస్తుల్లో 58 శాతం వాటాలు పంచండి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. వైకాపాకు ఓటేస్తే అది నేరుగా మోదీకి వెళుతుందని, మోదీ వస్తే.. మరణశాసనాన్ని రాసుకున్నట్టేనని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా తిరువూరు, పామర్రు, పెడన, మచిలీపట్నంలలో సోమవారం నిర్వహించిన రోడ్‌షో, బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌కు కచ్చితంగా మద్దతిస్తామని సోమవారం వికారాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ ప్రకటించారు.

kcr 09042019

చంద్రబాబుకు తెలివి లేదని వ్యాఖ్యానించారు. దీనిపై కృష్ణా జిల్లా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ‘కోడికత్తి పార్టీతో కలిసి రాష్ట్రంలో కుట్ర చేస్తున్న కేసీఆర్‌ను వారం రోజులుగా విమర్శిస్తున్నా. ఆయన నాపై పెత్తనం చేయాలని చూస్తున్నారు. నేనేమైనా కోడికత్తినా పెత్తనం చేయడానికి. కేసీఆర్‌ ఖబడ్దార్‌. జీవితమంతా అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు. మా ఎమ్మెల్యేలను కొనుక్కుని.. ఇప్పుడేదో మహానాయకుడిలా మాట్లాడుతున్నారు. ఆంధ్రావాళ్లు తెలంగాణ ద్రోహులు, పనికిరాని దద్దమ్మలు, సన్నాసులంటూ దారుణంగా తిట్టిన కేసీఆర్‌.. ఇప్పుడేదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాక్కూడా తెలివి లేదంటున్నారు’ అని మండిపడ్డారు.

kcr 09042019

పోలవరం ప్రాజెక్టుకు తాము అడ్డం కాదని చెబుతున్న కేసీఆర్‌.. సుప్రీం కోర్టులో కేసులు ఎందుకు వేశారో చెప్పాలని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతామని కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవినేని మంగళవారం మీడియాతో మాట్లాడారు. అప్పుడు పోలవరంపై కేసులు వేసి.. ఇప్పుడేమో అడ్డం కాదని చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌వి అన్నీ బూటకపు హామీలేనన్నారు. దళితుడిని సీఎం చేస్తాననడం కూడా ఇలాంటిదేనని ఎద్దేవాచేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తుందా?అని ప్రశ్నించారు. 2019 జులై నాటికి గ్రావిటీతో నీరిచ్చేలా చేసిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. అలాంటిది పోలవరం పునాదులే దాటలేదని జగన్‌ ఎలా చెబుతారని ప్రశ్నించారు. జగన్‌ తప్ప లక్షలాది మంది పోలవరం ప్రాజెక్టు చూసి సంబరపడుతున్నారని చెప్పారు. వెయ్యి కోట్ల రూపాయలకు అమ్ముడిపోయి.. కేసీఆర్‌ చెప్పింది జగన్‌ చేస్తున్నారని దేవినేని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు సామంతుడిగా మారారని ఎద్దేవాచేశారు.

తెలుగులో ఉన్న వెబ్ సైట్లలో 80 శాతం వైసీపీ అధినేత జగన్ పెట్టించినవేనని... వెబ్ సైట్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడమేంటని సినీనటుడు శివాజీ మండిపడ్డారు. రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తున్న తనకు కులాన్ని అంటగడుగున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై చేస్తున్న పోరాటం తనకు ఎంతో తృప్తిని ఇస్తోందని... కోట్లాది రూపాయలు కూడా ఆ ఆనందాన్ని ఇవ్వలేవని చెప్పారు. విజయసాయిరెడ్డి తనను విమర్శిస్తున్నారని... తిరిగి తాను విమర్శిస్తే తలను ఆయన ఎక్కడ పెట్టుకుంటారని శివాజీ ప్రశ్నించారు. ఆయన బాసేమో ఏ1, ఆయన ఏ2... మమ్మల్ని విమర్శించే స్థాయా మీది? అని దుయ్యబట్టారు. ఏదో ఒక క్షణంలో జైలుకు వెళతామనే భయంతో బతుకుతున్న మీరా మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు మాట్లాడినా... వారిని కోస్తాం, చంపుతాం అని బెదిరిస్తున్నారని... ఇంకో 20 రోజులు ఆగండి... మీ సంగతి చూస్తామంటూ పోలీసులను సైతం భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

game 27032019

డబ్బు మదంతో ఏది పడితే అది మాట్లాడతారా? అని శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఎప్పుడైనా పోవాల్సిందేనని... గాంధీ, నెహ్రూ, ఎన్టీఆర్, చివరకు రాజశేఖరరెడ్డి కూడా పోయారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రజల మీద నిజంగా అంత ప్రేమ ఉంటే... ఛార్జిషీట్లలో పేర్కొన్న డబ్బును ప్రజలకు ఇచ్చి, ధైర్యంగా అందరి ముందుకు రావాలంటూ జగన్ కు సవాల్ విసిరారు. మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను 'ఉల్లిపాయ పొట్టు' అంటూ విమర్శించారని.. అంత అహంకారం ఎందుకంటూ విజయసాయిపై శివాజీ మండిపడ్డారు. అధికారంలోకి రాకముందే ఇంత కండకావరమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, సామాన్యుడు అనే తేడా లేకుండా అందరినీ చంపుతాం, నరుకుతామంటూ బెదిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మగాడినని... ఎన్నికల్లో వైసీపీ గెలిచినా, అమరావతి గడ్డపై నిలబడి మాట్లాడతానని సవాల్ విసిరారు. కాకిలా వందేళ్లు బతకాలనే కోరిక తనకు లేదని అన్నారు. ఎవరూ ఎవర్నీ ఏమీ చేయలేరని... ముందు కేసుల నుంచి బయటపడి మాట్లాడాలని ఎద్దేవా చేశారు.

‘అలీ కష్టాల్లో ఉంటే సాయపడ్డాను అని మీరంటున్నారు..ఏం సాయ చేశారు? డబ్బిచ్చారా? సినిమాలు లేక ఇంట్లో కూర్చుంటే తీసుకెళ్లి సినిమా అవకాశాలు ఇప్పించారా?’ అని సినీ నటుడు, వైకాపా నేత అలీ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో ప్రచారంలో భాగంగా కల్యాణ్‌ అలీపై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అలీ స్పందించారు. ఆయన మాట్లాడిన వీడియోలను సోమవారం రాత్రి విడుదల చేసారు. ‘‘పవన్‌కల్యాణ్‌గారు రాజమండ్రిలో మీరు ఒక చిన్న కామెంట్ చేశారు. సర్‌..! నేను పుట్టి పెరిగింది రాజమండ్రి. నేను పుట్టిన గడ్డకు ఏదైనా చేస్తే బాగుంటుందని నా తండ్రి పేరు మీద ట్రస్ట్‌ పెట్టి, కులమతాలకు అతీతంగా పేదలకు సేవ చేస్తున్నా.

ali 09042019

"ఆ సమయంలో నా గురించి మాట్లాడాలన్న ఆలోచన మీకు రాకపోయినా, మీ చుట్టు పక్కల ఉన్న వాళ్లు ‘అలీ గురించి ఒక కామెంట్‌ చేయండి. రాజమండ్రి కదా బాగుంటుంది’ అని చెప్పి ఉంటారు. మీరు వేరే ఏ జిల్లాలో నా గురించి కామెంట్‌ చేసినా, నేను స్పందించేవాడిని కాదు. ఎందుకంటే, చిరంజీవిగారు వేసిన బాటలో మీరు వచ్చారు. కానీ, నా బాట నేనే వేసుకున్నా. నా బాటలో నేనే నడిచా, నాకు ఎవరి సపోర్ట్‌ లేదు. చెన్నై నాకు జీవితాన్ని ప్రసాదించింది. ఎంతో కృషి చేస్తే, నేను ఈ స్థాయిలో ఉన్నా. నా వల్ల ఎవరైనా లాభం పొందారు తప్ప. నేను ఎవరి వద్దా చేయి చాపలేదు. నేను ఎవరినీ ఏమీ అడగలేదు.’’

ali 09042019

‘‘అలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయ పడ్డా’ అన్నారు. ఏ విధంగా సాయపడ్డారు? డబ్బిచ్చారా? నాకు సినిమా అవకాశాలు ఇప్పించారా? మీరు ఇండస్ట్రీకి రాకముందే నేను మంచి స్థానంలో ఉన్నా. నేను ఎవరి దగ్గరకు వెళ్లి, ‘అయ్యా నాకు సాయం చేయండి’ అని అడగలేదు. ఆ అల్లా దయ వల్ల చాలా బాగున్నా. ఒకవేళ అడిగే అవకాశం వస్తే, అప్పటికి అలీ ఉండడు. ఆకలితో చచ్చిపోతాను తప్ప. వెళ్లి అడుక్కోను. ఆ విషయం మీకూ తెలుసు. ఎవరి మనసు నొప్పించేలా.. నేను మాట్లాడను. కానీ, మీరు ఆ మాట అనడం బాధేసింది. వైసీపీలోకి వెళ్లడం తప్పేంటి? రాజకీయ పార్టీలోకి వచ్చాక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణం. నేను ఇప్పటివరకూ చాలా సభల్లో పాల్గొన్నా కానీ, ఎక్కడా మీ గురించి, మీ పార్టీ గురించి ఒక్క కామెంట్‌ కూడా చేయలేదు. ఎందుకంటే గతంలో చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా. మీకు నా గుండెల్లో స్థానమిచ్చా. కానీ, మీరు చాలా పెద్ద మాట మాట్లాడేశారు.’’

Advertisements

Latest Articles

Most Read