ఆర్థిక ప్రతిబంధకాలెన్ని ఉన్నా రాష్ట్రప్రభుత్వం వెనకడుగు వేయలేదు. మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు అమలు చేస్తున్న పసుపు-కుంకుమ పథకం చివరి విడత నిధులు రూ.1980 కోట్లను విడుదల చేసింది. డ్వాక్రా సంఘాల మహిళలు సోమవారం నుంచి బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకోవచ్చు. దీనితో ప్రతి డ్వాక్రా మహిళకు రూ.10 వేల వంతున ఇస్తామని తెదేపా ఇచ్చిన హామీని ప్రభుత్వం పూర్తిస్థాయిలో నెరవేర్చినట్టయింది. శనివారం విడుదలయిన 98 లక్షల మంది డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరింది. మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు నెలల వ్యవధిలో మూడు దఫాలుగా రూ.10 వేలు చొప్పున మంజూరు చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఈ పథకాన్ని అత్యంత పకడ్బందీగా చేపట్టింది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావటంతో ఆయా పథకాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరుని తొలగించి పెళ్లికానుక, బీమా పేర్లతోనే అమలు చేస్తోంది. పథకాలకు సంబంధించిన హోర్డింగ్‌లు, బోర్డులలో ఉన్న సీఎం ఫొటోలనూ తొలగించింది.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక డ్వాక్రా మహిళలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన తెదేపా ప్రభుత్వం... వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు మరో రూ.10 వేలు చొప్పున ఇస్తామని ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ముందే చెక్కులు అందజేసింది. ఈ కార్యక్రమాన్ని ఒక ఉత్సవంలా నిర్వహించింది. ఫిబ్రవరి 1న రూ.2,500, మార్చి 8న రూ.3,500 వంతున డ్వాక్రా మహిళలకు అందజేసింది. మిగతా రూ.4 వేలకు సంబంధించి రూ.3,980 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా ఇటీవలే రూ.2 వేల కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. మిగతా రూ.1980 కోట్లను శనివారం విడుదల చేసింది. ఈ ఐదేళ్లలో డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద మొత్తం రూ.18,460 కోట్లు చెల్లించింది. 2014 మార్చి నాటికి స్వయం సహాయక సంఘాల్లో 86 లక్షల మంది సభ్యులుండగా ... పసుపు-కుంకుమ-1లో రూ.8,660 కోట్లు సాయం అందజేసింది. ఈ ఐదేళ్లలో సభ్యుల సంఖ్య 98 లక్షలకు చేరగా... ప్రభుత్వం ఇప్పుడు రూ.9,800 కోట్ల సాయం అందజేసింది.

తెదేపా అధికారంలోకి వచ్చాక ‘కోటి మంది మహిళలు- రూ.లక్ష కోట్ల సాయం’ అన్న నినాదాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సెర్ప్‌ ద్వారా... 98 లక్షల మంది మహిళలకు రూ.20 వేలు చొప్పున పసుపు-కుంకుమ ఇచ్చింది. 54 లక్షల మంది పింఛన్లు అందజేస్తోంది. 2.5 లక్షల మందికి బీమా పథకం కింద రూ.2490 కోట్లు అందజేసింది. పెళ్లి కానుక కింద 90 వేల పేద యువతులకు రూ.325 కోట్ల సాయం అందజేసింది. డ్వాక్రా మహిళలకు రూ.68,800 కోట్ల రుణాలు ఇచ్చింది. రూ.882 కోట్ల ఉన్నతి రుణాలు అందజేసింది. సెర్ప్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల్ని 110 శాతం పెంచింది. ఇది వరకు రూ.20 వేలు ఉండే వేతనాలను ప్రస్తుతం రూ.50 వేలు ఇస్తున్నట్టు సెర్ప్‌ సీఈవో కృష్ణమోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ప్రభుత్వ పథకాల్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నాం. పేదలు, మహిళలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందజేసేందుకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఎన్నికల నియమావళిని తూ.చ. తప్పక పాటిస్తున్నాం. పథకాల్లోను, బోర్డులపైనా ముఖ్యమంత్రి పేరు తొలగించాం. విపక్ష పార్టీ రాజకీయ దురుద్దేశాలతో మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ దుష్ప్రచారం పట్ల మా సిబ్బంది తీవ్ర వేదనకు గురవుతున్నారు’’ అని ఆ ప్రకటనలో కృష్ణమోహన్‌ పేర్కొన్నారు.

గెలుపు ఓటమిలనేవి ఎవరికైనా సహజం. మా అసోసియేషన్ ఇటీవలే ఎన్నికలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆరు వందలకు పైగా మెంబెర్స్ ఉన్న మా అసోసియేషన్ కే నాగబాబు ఏమి చెయ్యలేదు నర్సాపురం కి ఏమి చేస్తాడని ఆదివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో శివాజీరాజా అన్నారు. ఇటీవలే జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ శివాజీరాజాని విమర్శించారు నాగబాబు. జీవిత రాజశేఖర్‌లు ఉన్న నరేష్ ప్యానెల్‌ను గెలిపించాలని కోరారు. దీనికి కౌంటర్‌గా రిటర్న్‌గిఫ్ట్ సమాధానంగా శివాజీరాజా ఆదివారం హోటల్ ఉలవచారులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

game 27032019

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చిరంజీవిగారు నాకు 30 ఏళ్ల నుంచీ తెలుసు. ఆయన మా లాంటి వారందరికీ ఆదర్శం. ఆయన నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య. ఆయన్ని మేము దేవుడులాగా కొలుస్తాము. పవన్ కళ్యాణ్ అన్నా కూడా నాకు చాలా అభిమానం. ఆయనలో ఒక విజన్ ఉంది, ఒక డేర్ ఉంది. వీరిద్దరి మధ్య పుట్టిన నాగబాబుకి ఏ విజన్ లేదు. ఏ రకంగానూ ఆదర్శంగా తీసుకోవడానికి పనికిరాడు. నేను సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. అతను అలా కాదు. ఏ రకంగా నరసాపురం వెళ్లి ఓట్లు అడుగుతాడు

game 27032019

30 ఏళ్ళ నుంచి మెగాస్టార్‌ని మిమ్మల్ని నమ్మిన మేము పరాయి వాళ్ళం అయిపోయామా! 600 మంది ఉన్న మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే మా అసోసియేషన్‌కు ఏమీ చెయ్యలేదు. లక్షలాది ప్రజలున్న నరసాపురానికి ఏమి చేస్తావు. ఏనాడైనా నర్సాపురం వెళ్ళారా.. కనీసం దాని బోర్డర్స్ తెలుసా. ఏనాడైనా అక్కడి ప్రజలకు ఏదైనా చేసారా. పిల్లి‌కి బిచ్చమ్ కూడా పెట్టని నువ్వు ఏ విధంగా అక్కడకు వెళ్లి ప్రజల్ని ఓట్ వేయమని అడుగుతున్నావ్. నీ ప్రసంగాలన్నీ వింటున్నాం, కులాలను రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడుతున్నావ్. నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. అంతే కానీ కులాలను రెచ్చగొట్టొద్దు. దయచేసి ఎవ్వరూ నాగబాబుకి ఓటు వేయవద్దు. ఎందుకంటే అతని గురించి నాకు తెలుసు..’’ అని చెప్పుకొచ్చారు.

 

ఇండియా టుడే గ్రూప్‌ తాజాగా నిర్వహించిన పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (పీఎ్‌సఈ) మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌లో అత్యంత జనాదరణ గలిగిన నేతగా ఎవరిని గుర్తిస్తారని అడిగిన ప్రశ్నకు దక్షిణాది ప్రజల్లో 51 శాతం మంది రాహుల్‌ గాంధీ పేరు చెప్పారు. నరేంద్ర మోదీకి 39 శాతం మందే ఓటేశారు. మిగిలిన నేతలు- మాయావతి, మమత లాంటి వారు తదుపరి స్థానాల్లో ఉన్నారు. అదే ఉత్తరాదిలో తీసుకుంటే మోదీ పాప్యులారిటీ 55 శాతం పైనే ఉంది. రాహుల్‌ 31 శాతం దగ్గరున్నారు. ఇవే ఫలితాలు సీ ఓటర్‌, ఫస్ట్‌ పోస్ట్‌-ఐఎ్‌సపీఓఎస్‌ సర్వేలోనూ, ది హిందూ-లోక్‌నీతి సర్వే(ప్రభుత్వ పాపులారిటీ) లోనూ కూడా ప్రస్ఫుటమయ్యాయి. భారతావని కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా అన్ని వైపులా విస్తరించిన ఉపఖండం. కానీ బీజేపీకి మాత్రం ఎప్పుడూ ఉత్తరాది వారే కనిపిస్తారని రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ. అంతేకాదు- ఏ రంగంలో చూసుకున్నా దక్షిదాది రాష్ట్రాల పట్ల వివక్ష కొనసాగుతూనే వచ్చింది. అందుకే 2017, 2018లో దక్షిణాది రాష్ట్రాల అగ్రనేతలు నిరసనగళం వినిపించారు. వీరిలో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేరళ ఆర్థికమంత్రి థామస్‌ ఐజాక్‌ ప్రముఖంగా నిలిచారు.

game 27032019

తమిళనాడులో అయితే ఏకంగా- 1960ల నాటి ‘‘ద్రవిడ నాడు’’ ఏర్పాటు డిమాండ్‌ మళ్లీ తెరపైకొచ్చింది. స్థూలంగా చెప్పాలంటే ప్రస్తుతం భారత్‌ రెండుగా చీలింది. ప్రాచీన చరిత్ర, సంస్కృతి ఉన్న, ధనికప్రాంతమైన దక్షిణాది ఒకవైపు... పేదరికంలో మగ్గే, యువ ఉత్తరాది మరోవైపు నిలిచాయి. ఉత్తరాది ప్రాంతమంతా ఓ రకంగా దక్షిణాది కట్టే పన్నుల మీద ఆధారపడుతోందన్నది నిపుణుల మాట. సిద్ధరామయ్య మాటల్లో చెప్పాలంటే... ‘‘ఉత్తరప్రదేశ్‌ ఒక రూపాయి పన్ను కడితే రూ.1.79 పైసలు ఆ రాష్ట్రానికి తిరిగి వస్తోంది. కర్ణాటక రూపాయి కడితే తిరిగి వస్తున్నది 47 పైసలు మాత్రమే!

game 27032019

సమస్యల్లా.. దక్షిణాది నిధులు సమకూరుస్తుంది. ఉత్తరాది సమస్యల్ని తీరుస్తుంది. కానీ రాజకీయ అధికారం మాత్రం ఉండదు. పెత్తనమంతా ఉత్తర భారత్‌దే! ఇది చాలా దక్షిణ రాష్ట్రాలకు మింగుడుపడడం లేదు. అందుకే అసంతృప్తి స్వరాలు వినిపించాయి. ముఖ్యంగా పదిహేనో ఆర్థిక సంఘ పరిశీలనాంశాలు (టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌) దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చాయి. రాష్ట్రాలకు పన్ను వాటా కేటాయింపుకు సంబంధించి 1971 జనాభా లెక్కలను కాకుండా 2011 లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకుంటామని కమిషన్‌ చెప్పడం నిరసనకు దారితీసింది. జనాభా అదుపులో పకడ్బందీగా వ్యవహరించిన దక్షిణ రాష్ట్రాలకు ఇది దెబ్బే. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలు జనాభా అదుపులో విఫలమయ్యాయి. దక్షిణాదిని దెబ్బతీసే చాలా టర్మ్స్‌ అందులో ఉన్నట్లు ఆరోపణ. ఈ అసంతృప్తి మోదీ సర్కార్‌పైకి మారింది. కేంద్రం కూడా దీన్ని తగ్గించే ప్రయత్నాలేవీ చేయకపోవడం ఆయన పాపులారిటీని దిగజార్చింది.

 

ఓటమి భయంతో వైసీపీ వీలైనన్ని కుట్రలకు తెగబడుతోంది. తమకు గిట్టనివారిపై నిస్సిగ్గుగా దుష్ప్రచారానికి తెగబడుతోంది. సొంత మీడియాను అడ్డం పెట్టుకుని తాజాగా వైసీపీ ఓ సరికొత్త హైడ్రామాకు తెరలేపింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ, సీఎం చంద్రబాబు మధ్య ఎన్టీఆర్‌ను కించపరిచే విధంగా సంభాషణ జరిగినట్టు అవాస్తవ ప్రచారానికి ఒడిగట్టింది. ఎన్టీఆర్ అభిమానుల్లో ఉద్వేగాలను రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ ఈ పన్నాగం పన్నినట్టు తేలింది. జగన్ సొంత మీడియా సంస్థ సాక్షిని అడ్డం పెట్టుకుని వైసీపీ చేస్తున్న ఈ అసత్య ప్రచారాన్ని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఖండించారు. వైఎస్‌ ఆరోగ్యశ్రీని మించిన పథకం పెట్టాలనుకున్నామని, అందులో ఒక సూచనగా ఆర్కేగారు ఆరోగ్యశ్రీకి మార్పులు చేసి మెరుగుపర్చాలని చంద్రబాబుకు సూచించారని ఆయన తెలిపారు.

game 27032019

ఎన్టీఆర్‌ పేరు మార్చమనే ఉద్దేశంతో చెప్పలేదని, సాక్షి ఛానెల్‌ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని లంకా దినకర్‌ మండిపడ్డారు. వెయ్యికి పైగా వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నామని, ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్‌ వైద్య సేవగా మార్చామని ఆయన తెలిపారు. తమ పార్టీ తరపున ఏ పనిచేసినా ఎన్టీఆర్‌ ఆశీస్సులతోనే చేస్తామని, దురుద్దేశం ఉంటే అన్న క్యాంటీన్లు అని ఎందుకు పెడతామని దినకర్ ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ విదేశీ విద్య పథకం పెట్టామని, ఎన్టీఆర్‌ స్పూర్తితోనే టీడీపీ నడుస్తోందని ఆయన చెప్పారు. వైఎస్‌, చంద్రబాబు సమకాలికులని, వైఎస్‌ని అంటే ఎన్టీఆర్‌కు ఎలా ఆపాదిస్తారని లంకా దినకర్ నిలదీశారు.

 

Advertisements

Latest Articles

Most Read