ఏప్రిల్‌ 1 నుంచి 5 మధ్య 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో సోషల్ పోస్ట్ పొలిటికల్ కన్సల్సెన్టీ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ సర్వే ఏపీలో అధికారం మళ్లీ టీడీపీదేనని అంచనా వేసింది. టీడీపీ 108 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. వైసీపీ 65 సీట్లు గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. జనసేనకు 2 సీట్లు దక్కుతాయని తెలిపింది.ఇక సీఎం చంద్రబాబు పనితీరుపై, ప్రతిపక్ష నేత జగన్ తీరుపై కూడా ఈ సంస్థ అభిప్రాయాలను సేకరించింది. చంద్రబాబు ప్రభుత్వంతో మీ కుటుంబానికి మేలు జరిగిందా అంటే అవును అని 62 శాతం, లేదు అని 38శాతం ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. మొత్తం మీద సీఎం చంద్రబాబు పాలనకు మంచి మార్కులే పడ్డాయని తేలింది.

socialpost 09042019

జగన్‌ నవరత్నాల గురించి అడిగితే.. 88శాతం మంది అసలు అవంటే ఏంటో తెలియదని చెప్పడం కొసమెరుపు. బీజేపీపై ప్రజల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో కూడా ఈ సర్వేలో స్పష్టమైంది. మోదీ ఏపీకి అన్యాయం చేశారా అంటే 94శాతం మంది అవునని కుండబద్ధలు కొట్టడం గమనార్హం. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని 49శాతం మంది, జగన్‌ సీఎం కావాలని 42శాతం మంది భావిస్తున్నట్లు సర్వే తెలిపింది. పవన్‌ సీఎం కావాలని 8శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు వెల్లడించింది. జగన్‌-కేసీఆర్‌-మోదీ ఒక్కటేనని ఏపీలో 75శాతానికి పైగా నమ్ముతున్నారని సోషల్‌ పోస్ట్‌ సర్వే పేర్కొంది. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై వేధింపులని, అందులో భాగంగానే ఏపీ అధికారులను ఈసీ బదిలీ చేస్తోందని 75శాతానికి పైనే నమ్ముతున్నట్లు ఈ సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఏపీలో కేసీఆర్‌ జోక్యానికి 75శాతానికి పైనే వ్యతిరేకమని సర్వేలో వెల్లడైంది.

ఎన్నికల సమయంలో ఐటీ దాడులు ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నేతల ఇళ్లలో సోదాలు జరిపిన ఐటీ అధికారులు ఈరోజు కూడా తమ తనిఖీలను కొనసాగించారు. గుంటూరు జిల్లా గురజాల పట్టణంలోని సాంబశివ నర్సింగ్‌ హోంపై మంగళవారం మధ్యాహ్నం నరసారావుపేట ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గురజాల తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడైన పులికూరి కాంతారావుకు చెందిన ఆసుపత్రి, ఇంటిపై ఈ దాడులు జరిగాయి. వీటికి సంబంధించి కాంతారావు సరైన పత్రాలు చూపించడంతో అధికారులు ఒంటి గంట సమయంలో వెనుదిరిగారు. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి అక్రమ నగదు ఏమైనా ఉందా అనే కోణంలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. గురజాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ సోదాలు జరగడం చర్చనీయాంశమైంది.

gurajala 09042019

గురజాలలో మంగళవారం జరిగిన రోడ్‌షోలో కేసీఆర్, వైఎస్ జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతిస్తా అంటూ కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మడానికి వీల్లేదని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్ జిత్తులమారి నక్క లాంటోడని.. మాట మార్చడంలో దిట్ట అని మండిపడ్డారు. హోదా విషయంలో బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టీఆర్‌ఎస్ ఎందుకు సహకరించలేదని, సోనియా గాంధీ ఏపీకి హోదా ఇస్తానని చెప్పినప్పుడు ఎందుకు వ్యతిరేకించారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ లోటస్ పాండ్‌లో కూర్చొని కేసీఆర్‌కు ఊడిగం చేస్తున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు.

gurajala 09042019

ఇద్దరూ కలిసి ఏపీలో ఏడున్నర లక్షల ఓట్లు తొలగించాలని చూశారని ఆరోపించారు. వైఎస్ జగన్ వెనుక కేసీఆర్, మోదీ ఉన్నారని.. ముగ్గురు కలిసి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ముగ్గురు కలవకపోతే ఏపీలో కక్ష సాధింపు పనులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. బండబూతులు తిడుతున్నాడు. నేను సన్నాసినా.. ఏం తమ్ముళ్లూ మీ ముఖ్యమంత్రి సన్నాసేనా? ఏం చెల్లెమ్మలూ మీకు కోపం రాలేదా? ఏపీ ప్రజలను కేసీఆర్ ఎంతలా అవమానించాడు.. మన బిర్యానీ పేడలా ఉంటుందన్నాడు. మన ఉలవ చారు వాళ్ల దగ్గర పశువులకు పెడతామని తిట్టాడు. ఇలాంటి కేసీఆర్ మాటలను మీరు నమ్ముతారా’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు పలకడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మద్దతు ఇచ్చిన వాళ్లు గెలిచిన దాఖలాలు లేవన్నారు. పాలకొల్లు ఎన్నికల సభలో మాట్లాడిన ఆయన.. ‘‘ఇంకొక శుభవార్త ఏంటంటే.. కేసీఆర్ సపోర్ట్ చేస్తే ఎవరూ గెలవరు. అది గుర్తుపెట్టుకోండి. అది మనకు శుభసూచకం. 2014లో జగన్ అఖండ మెజార్టీతో గెలుస్తారని కేసీఆర్ చెప్పారు. ఏం జరిగిందో తెలుసు. తానొకటి తలిస్తే.. దైవం ఇంకొకటి తలుస్తుంది. మీరు జగన్‌ను తలిస్తే.. యాదాద్రి నరసింహుడు, వెంకన్న మరొకటి తలుస్తున్నారు. మీరు గొప్పగొప్పోళ్లు కావొచ్చు. భగవంతుడు, తల్లి, అల్లా, ఈశ్వరుడు ముందు మీరు చాలా చాలా చిన్నోళ్లు. తగ్గి ఉండటం నేర్చుకోండి. ప్రకృతి ముందు అందరూ తలవొంచుకోవాలి. అహంకారంతో రెచ్చిపోయిన హిరణ్యకశిపుడు లాంటి వారిని స్తంభం చీల్చుకు వచ్చి మరీ నరసింహుడు సంహరించాడు’’ అంటూ కేసీఆర్, జగన్‌లపై వాగ్బాణాలు సంధించారు.

pk 09042019

ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టేలా జగన్‌ తరహాలో తెలంగాణ నాయకులతో తాను కలవబోనని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. నిజంగా ప్రత్యేక హోదాకు మద్దతిచ్చే ధోరణి కేసీఆర్‌కు ఉంటే ఈ ఐదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సైతం దానికి ఎందుకు మద్దతివ్వలేదని నిలదీశారు. ‘‘రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి తిరుమలకు చెప్పులు వేసుకొని వెళ్తారా? అలా చేస్తే వెంకటేశ్వరస్వామి ఆయన్ను ఆశీర్వదిస్తారా? ఇదే పని జగన్‌ యాదాద్రిలో చేస్తే కేసీఆర్‌ అస్సలు ఊరుకోరు. అలాంటి జగన్‌తో కేసీఆర్‌ కలిశారు.’’ అని విమర్శించారు. పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజును రాష్ట్ర అవతరణ దినంగా ప్రకటిస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పాత పెన్షన్‌ విధానాన్నే తిరిగి తీసుకొస్తామని చెప్పారు.

pk 09042019

ప్రస్తుతమున్న సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని, అన్ని ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోదా కల్పిస్తానని చెప్పారు. ఇందుకోసం కొత్త పే కమిషన్‌ ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే జీతభత్యాల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. విద్యా సంస్కరణల కమిషన్‌ను ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల పనివేళలను మారిన పరిస్థితులను అనుగుణంగా మార్చుతామన్నారు. ఒప్పంద సేవల ఉద్యోగులను అర్హతలకనుగుణంగా క్రమబద్దీకరిస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. ఈ సభకు సినీ నటుడు అల్లు అర్జున్‌ హాజరయ్యారు.

ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లెలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోజు మనది కోడికత్తిపై పోరాటం కాదని, కేసీఆర్ పైనా, మోదీపైనా పోరాటం అని స్పష్టం చేశారు. జగన్, కేసీఆర్, మోదీ ముగ్గురినీ కట్టకట్టి బంగాళాఖాతంలో పారేయాలని పిలుపునిచ్చారు. "మనకి అన్యాయం జరిగిందా? లేదా?. మోదీ న్యాయం చేశాడా? నమ్మకద్రోహం జరిగిందా? లేదా? వెంకన్నను కూడా మోసం చేసిన వ్యక్తి మోదీ. ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేశాడు. ఈ రోజు 66 మంద ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఎన్నికల సంఘం మోదీ ఆధ్వర్యంలో పనిచేస్తోందని ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది. "రాష్ట్రపతి గారూ మీరు జోక్యం చేసుకోండి, ఈసీకి స్వయంప్రతిపత్తి లేదు, ఇది దేశానికి మంచిది కాదని ఫిర్యాదు చేశారంటే ఇది మోదీ అన్యాయ పాలనకు పరాకాష్ట తప్ప మరోటి కాదు. నేను సంవత్సరం నుంచి పోరాడుతున్నా. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారు. ఆర్బీఐని కుప్పకూల్చారు. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా ఉపయోగించుకుని మనపై దాడులు చేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమరపాటుగా ఉంటే ఇవే మనకు చివరి ఎన్నికలు అవుతాయి" అంటూ ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.

కేసీఆర్ తనను సన్నాసి అనడంపై సీరియస్ గా స్పందించిన ఆయన "ఏం తమ్ముళ్లూ మీ ముఖ్యమంత్రి సన్నాసా? కేసీఆర్ గొప్ప నాయకుడా? కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. నోరు అదుపులో పెట్టుకోవాలి. నా జోలికి వస్తే తాటతీస్తాను తప్ప వదిలిపెట్టను. నీలాగా నేను నోటికి వచ్చినట్టు మాట్లాడను. నాకు హుందాతనం ఉంది. మీకు, నరేంద్ర మోదీకి బుద్ధి రావాలంటే మీ భాష వాడితే తప్ప మీకు బుద్ధి రాదు. 100 మంది మోదీలు నన్నేమీ చేయలేరు. 500 మంది కేసీఆర్ లు ఏమీ చేయలేరు. 1000 కోడికత్తులు కూడా ఏమీ చేయలేవు తమ్ముళ్లూ!" అంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. జగన్‌లాంటి అవినీతిపరుడు, అసమర్థుడు సీఎం అయితే...ఏపీ తమ గుప్పిట్లో ఉంటుందని కేసీఆర్ భ్రమపడుతున్నారని చంద్రబాబు అన్నారు.

తెలంగాణ వస్తే దళితుడిని సీఎంను చేస్తామని కేసీఆర్ అన్నారు. మరి చేశారా? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతామని కేసీఆర్ వాగ్దానం చేశారని, ఇచ్చిన మాట నిలుపుకోలేదని విమర్శించారు. అప్పుడు తెలంగాణను మోసం చేశారని, ఇప్పుడు ఏపీని మోసం చేయాలని చూస్తున్నారని, ప్రత్యేకహోదాకు సహకరిస్తామని మభ్య పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరంపై కేసీఆర్‌ కూతురే కోర్టుకెళ్లిందని చంద్రబాబు విమర్శించారు. జగన్‌కు ఓటేస్తే మనకు నీళ్లురావని...రాజధాని ఆగిపోతుందని, మన ఆస్తులు మనకు రాకుండా పోతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలని చంద్రబాబు సూచించారు. జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌ పెత్తనాన్ని కొని తెచ్చుకున్నట్టేనని అన్నారు. కేసీఆర్-జగన్‌ తోడుదొంగలని ఇప్పటికే రుజువైదన్నారు. ఏపీ ప్రజలు అప్రమత్తమై కళ్లు తెరచి ఓటేయాలన్నారు. నరేంద్రమోదీకి కేసీఆర్‌, జగన్‌ పెంపుడు కుక్కలని, మోదీ వేసే బిస్కెట్‌ కోసం ఆశపడుతున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Advertisements

Latest Articles

Most Read