చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగునీరు విషయంలో వైసీపీ కార్యకర్తలు దారుణంగా ప్రవర్తించారు. ఇవి వైసీపీ నీళ్లు.. టీడీపీ వాళ్లు పట్టుకోవద్దంటూ వైసీపీ కార్యకర్తలు విద్యార్థిని కొట్టి ఈడ్చుకెళ్లారు. విద్యార్థిని తలపై కొడవలితో నరికారు. అడ్డుకోబోయిన తల్లిదండ్రులపైన కూడా కర్రలతో దాడి చేశారు. అంతేకాక ఇంటి గోడలు కూలగొట్టి వైసీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. తమ సభకు రాలేదని నీళ్ల వంకతో వైసీపీ దౌర్జన్యం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ‘ఇవి వైసీపీ నీళ్లు. టీడీపీ వాళ్లు ఇక్కడ బిందె పట్టడం కుదరదు’ అంటూ ఆ నేతలు వీరంగం సృష్టించారు. ట్యాంకరు నుంచి నీళ్లు పట్టబోయిన ఆమెపై దాష్టీకం ప్రదర్శించారు. అయితే, ఆమె విద్యాధికురాలు. ఏంబీఏ చదువుతోంది. దీంతో ‘ఇవి పంచాయతీ నీళ్లు. అందరివీ..’ అంటూ గట్టిగా వారిని ఎదుర్కొంది. తమకు ఎదురు చెప్పిన ఆమెపై వారు మరింత రెచ్చిపోయారు. ఆమె తలపై కొడవలితో నరికారు. అడ్డొచ్చిన తల్లిదండ్రులపైనా విరుచుకుపడ్డారు.

ycp 08042019

ఎద్దడి వేళ సైతం ఎన్నికల అరాచకాలకు తెగబడుతున్న వైనానికి పరాకాష్ఠగా నిలిచిన ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురంలో ఆదివారం భయోత్పాతం సృష్టించింది. గ్రామంలో వైసీపీ నేతలు ఏర్పాటుచేసిన ఎన్నికల విందుకు తాము వెళ్లలేదన్న కక్ష కడుపులో పెట్టుకొని, తమ కుటుంబంపై కావాలనే దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం, వేసవి ఎద్దడి కారణంగా కృష్ణాపురం గ్రామం ఎద్దడితో కటకటలాడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం పంచాయతీ అధికారులు, గ్రామానికి నీళ్ల ట్యాంకరు పంపించారు. ఈ గ్రామానికి చెందిన ఎం.హరి, కన్యాకుమారిల కుమార్తె కుమార్తె భాగ్యలక్ష్మి (22) బిందె తీసుకొని ట్యాంకరు వద్దకు చేరుకొంది. బిందెకు నీరు పడుతుండగా, అదే గ్రామానికి చెందిన వైసీపీ నేతలు రాజేంద్ర, మహేశ్‌, రాజాబాబు, సుబ్రహ్మణ్యం ఆమెను అడ్డుకున్నారు.

ycp 08042019

‘‘ఇవి వైసీపీ నీళ్లు. టీడీపీ వాళ్లు బిందె పట్టడం కుదరదు’’ అంటూ ఆమెను పక్కకు నెట్టారు. ‘‘ఎవరివైతేనేం...పంచాయతీ అధికారులు సరఫరా చేస్తుంటే బిందెకు పడుతున్నాను’’ అని ఆమె బదులిచ్చింది. దీంతో ఆ నేతలు ఆగ్రహావేశాలకు గురయ్యారు. భాగ్యలక్ష్మిని కిందపడేసి చాలాదూరం ఈడ్చుకెళ్లారు. ఆమెను కొట్టుకొంటూ ఇంటిదాకా తీసుకొచ్చారు. అక్కడ భాగ్యలక్ష్మి తలపై కొడవలితో నరికారు. అక్కడే ఉన్న తల్లిదండ్రులను కర్రలతో చితగ్గొట్టారు. వారి ఇంటిపై దాడిచేసి, బీభత్సం సృష్టించారు. ఈ దాడిలో బాధితుల ప్రహరీ గోడ దెబ్బతింది. స్థానికులు జోక్యం చేసుకొని.. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో మదనపల్లె వైద్యశాలకు తరలించారు. మదనపల్లె ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు, ఈ ఘటనపై పుంగనూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది.

యాభై శాతం వీవీ ప్యాట్లను లెక్కించినట్లయితే ఫలితాల వెల్లడికి ఆరు రోజుల సమయం పడుతుందన్న ఎన్నికల సంఘం(ఈసీ) సమాధానంపై పిటిషన్‌దారులైన 21 ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. ఈసీ తమ డిమాండ్‌ను అంగీకరించినట్లయితే ఫలితాల వెలువరించడానికి ఐదు రోజులు ఆలస్యమైనా తమకు సమ్మతమేనని తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో శనివారం అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఎన్నికల విధానంపై విశ్వాసం కలుగుతుందనుకుంటే ఫలితాల వెల్లడికి 5.2రోజులు ఆలస్యమైనా ఫరవాలేదని పేర్కొన్నారు. లెక్కించే సిబ్బందిని పెంచితే ప్రక్రియ మరింత వేగంగా పూర్తి చేయవచ్చని తెలిపారు. ఈ విషయంలో ఎన్నికల సంఘంపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదన్నారు. ఎన్నికలు సజావుగా, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా జరగడమే తమకు కావాలన్నారు.

game 27032019

మొత్తం 13.5లక్షల ఈవీఎంలలో కేవలం 479 ఈవీఎంలను మాత్రమే వీవీ ప్యాట్‌లతో సరిపోల్చడం వల్ల ప్రజల్లో విశ్వాసం కలగదని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. అలాగే ఎన్నికల సంఘం చెప్పినట్లు సిబ్బందిని పెంచని పక్షంలోనే లెక్కింపునకు 5.2 రోజుల సమయం పడుతుందన్నారు. ఒకవేళ సిబ్బందిని రెట్టింపు చేస్తే 50 శాతం వీవీప్యాట్లను లెక్కించడానికి 2.6 రోజులు.. 33శాతం లెక్కిస్తే 1.8 రోజులు.. 25 శాతం స్లిప్పులను లెక్కిస్తే కేవలం 1.3రోజుల సమయం మాత్రమే పడుతుందని అఫిడవిట్‌లో వివరించారు.

game 27032019

ఈవీఎంలపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తప్పినిసరిగా 50శాతం మేర వీవీప్యాట్లను లెక్కించి, వాటిని ఈవీఎంలతో సరిపోల్చాలని ప్రతిపక్షాలు ఈసీని ఆశ్రయించాయి. ఎన్నికల సంఘం నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీ ప్రతిపక్షాలు కోరినట్లు లెక్కింపు చేపడితే ఫలితాల వెల్లడికి ఆరు రోజులు సమయం పడుతుందని కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈసీ వివరణపై స్పందించాలని సుప్రీంకోర్టు పిటిషన్‌దారులను ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో.. దిగువ కోర్టు తమను పోలీసు కస్టడీకి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ వివేకా వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, ప్రకాష్‌ అనే నిందితులు శనివారం హైకోర్టులో హౌజ్‌ మోషన్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి విచారణ చేశారు. పోలీసు కస్టడీకి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి నిరాకరించారు. అయితే ఇకపైన చేపట్టే విచారణ ప్రక్రియను వీడియో రికార్డు చేసి సీడీ రూపంలో దిగువ కోర్టులో దాఖలు చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడిఉండగా ఆ రక్తపు మరకలను తుడిచేశారని, అసలు నిందితులను రక్షించడానికి సాక్ష్యాలను కనుమరుగు చేశారనేే ఆరోపణలపై గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

game 27032019

పోలీసుల అభ్యర్థన మేరకు వీరిని దిగువ కోర్టు ఈనెల 4 నుంచి 8 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని పేర్కొంది. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కృష్ణారెడ్డి, ప్రకాష్‌లు శనివారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు. కస్టడీకి అప్పగించడం తమ హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ) పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ హత్య గురించి ఫిర్యాదు చేసింది పిటిషనర్లేనని, అసలు నిందితులు ఎవరనేది వాళ్లకు తెలుసనని అభిప్రాయపడ్డారు. దర్యాప్తునకు సహకరించకుండా మౌనం వహించడం తగదన్నారు. వాస్తవాలు రాబట్టేందుకు పోలీసు కస్టడీ అవసరం అని చెప్పారు. ఆ వాదలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కస్టడీకి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలువరించడానికి నిరాకరించారు. అనుబంధ పిటిషన్‌ కొట్టేశారు.

టీడీపీ నేత ఎంపీ. జేసీ దివాకర్ రెడ్డికి చెందిన కాలేజీల్లో ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని యాడికి ప్రాంతంలో జేసీ కుటుంబానికి చెందిన జూనియర్ కాలేజీల్లో ఎన్నికల స్క్వాడ్ సోదాలు జరిపింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బులు దాచిపెట్టారని ఫిర్యాదు రావడంతో తనిఖీలు నిర్వహించామని రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా ఎలాంటి నగదు కూడా లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. కేవలం కరపత్రాలు, పార్టీ ఎన్నికల సామాగ్రి మాత్రమే లభ్యమైనట్లు పేర్కొన్నారు.

game 27032019

ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రంలోని పలువురు రాజకీయ నాయకుల ఇళ్లపై ఎన్నికల స్క్వాడ్, అలాగే ఐటీ శాఖ అధికారులు వరుసగా సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కడప జిల్లాలో పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు జరపడంపై తెలుగు దేశం శ్రేణులు భగ్గుమంటున్నాయి. మరో నేత సీఎం రమేష్ ఇళ్లపై కూడా ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read