వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించిన ఆడియో టేప్స్ శనివారం నాడు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్‌క్లూజివ్‌‌గా ఈ ఆడియో టేపులను ప్రసారం చేసింది. అయితే ఆ వాయిస్ తనది కాదని.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయబోతున్నట్లు ఆయన హడావుడి చేశారు. అయితే ఈ సంచలన ఆడియో విషయంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చెప్పింది ముమ్మాటికి నిజమైంది. ఆ ఆడియోలో ఉన్న వాయిస్‌ ముమ్మాటికి విజయసాయిరెడ్డిదేనని ప్రముఖ ఫోరెన్సిక్‌ సంస్థతో సాంకేతికంగా ఏబీఎన్‌ నిర్థారించింది. ఆ ఆడియోలో ఆంధ్ర ప్రజలకు నిబద్ధత లేదని విజయసాయిరెడ్డి అన్నారు. ఆడియో బయటకు రావడంతో ఆయన మాట మార్చారు.

abn 07042019

ఆ ఆడియోలో ఉన్న వాయిస్‌ తనది కాదని తెలిపారు. అయితే ఫోన్‌ ఆడియోలో ఉన్న వాయిస్‌ విజయసాయిరెడ్డిదేనని స్పష్టమైంది. దీంతో ఆడియో తనదేనని నిరూపించాలంటూ విజయసాయి ఎదురు సవాళ్లు సైతం విసిరిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ‘జాగ్రత్త’లు చెబుతూ... ఆయన ఒక ఆడియో సందేశం పంపించారు. తన సహజ శైలిలో ‘వాడు, వీడు’ అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రధాని కార్యాలయంలో ప్రత్యక్షమవుతూ, కుదిరినప్పుడల్లా ప్రధాని కంట్లో పడటానికి ప్రయత్నించిన ఆయన... ఇప్పుడు చిత్రంగా మోదీపైనా విమర్శలు గుప్పించారు. ఇక... వైసీపీలో కొత్తగా చేరిన కుర్రాళ్లకు ‘ఐక్యూ’ లేదని, గత ఎన్నికల్లో జగన్‌ బంధువులు తప్పుడు సర్వేలు చేసి ఆయనలో భ్రమలు సృష్టించారని వాపోయారు. ‘ఇప్పుడైనా జాగ్రత్త పడదాం’ అని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. సుమారు 12 నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియో క్లిప్‌ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

abn 07042019

విజయసాయి రెడ్డి ఆడియోను శనివారం మధ్యాహ్నం ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ప్రసారం చేసింది. అయితే, అది తన గొంతు కాదని విజయసాయి రెడ్డి జగన్‌ చానల్‌లో చెప్పారు. దీంతో సదరు ప్రసారాన్ని ‘ఏబీఎన్‌’ నిలిపివేసింది. వెబ్‌సైట్‌లోనూ ఆ వార్తను తొలగించింది. ఆ స్వరం విజయసాయి రెడ్డిదేనా, కాదో శాస్త్రీయంగా ధ్రువీకరించుకోవాలని నిర్ణయించుకుంది. జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన, క్లిష్టమైన కేసుల్లో అనేక రాష్ట్రాల పోలీసులకు కూడా సేవలు అందించిన ప్రఖ్యాత ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ను సంప్రదించింది. ఆ సంస్థ నిపుణులు తాజా ఆడియో టేప్‌ను విజయసాయి రెడ్డి గతంలో చేసిన ప్రసంగాల్లోని స్వరాలతో సుమారు మూడు గంటలపాటు పోల్చి చూశారు. చివరికి... అది విజయసాయి స్వరమే అని ధ్రువీకరించారు.

జాతీయ నాయకుల సభలకు జనం రాక విలవిలలాడుతున్న రాష్ట్ర బీజేపీలో కలకలం మొదలైంది. పార్టీ కీలకనేత.. విజయనగరం ఎంపీ అభ్యర్థి.. పాకలపాటి సన్యాసిరాజు కోశాధికారి పదవికి రాజీనామా చేశారు. దీంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రచార సభల ఖర్చుపై జాతీయ నాయకత్వం నుంచి పడ్డ అక్షింతలే ఇందుకు కారణమని.. ఆ సెగ సన్యాసిరాజుకు తగిలిందని తెలిసింది. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలో సన్యాసిరాజే గణనీయమైన స్థాయిలో కార్యకర్తలను కూడగట్టి ప్రచారం చేస్తున్నారని, అసలే ఏపీలో అంతంతమాత్రంగా ఉన్న బీజేపీకి ఈ పరిణామం మరింత గట్టి దెబ్బ అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వస్తున్న జాతీయస్థాయి నాయకుల సభలు వెలవెలబోతున్నాయి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఇటీవల కృష్ణా జిల్లాకు వచ్చారు. అక్కడ కుర్చీలన్నీ దాదాపు ఖాళీగా ఉండటం చూసి అవాక్కయ్యారు.

bjp 07042019

విజయవాడ పర్యటన రద్దు చేసుకుని, విషయాన్ని షా దృష్టికి తీసుకెళ్లారు. ఆయన రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించగా.. ‘మనకు అది బలం లేని ప్రాంతం. మీ సభలకు జనాన్ని భారీగా సమీకరిస్తాం’ అని హామీ ఇచ్చారు. కన్నా పోటీ చేస్తోన్న నరసరావుపేట, పురందేశ్వరి బరిలో నిలిచిన విశాఖపట్నంలో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నరసరావుపేటలో సైతం షాసభకు జనంముఖం చాటేశారు. అసహనానికి గురైన ఆయన అయిష్టంగానే విశాఖపట్నం వెళ్లారు. అక్కడ సభకు జనాన్ని సమీకరించలేక ర్యాలీ చేపడితే వందమంది కూడా కనిపించలేదు. దీంతో షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అక్కడ జనమేలేరు.. కానీ రూ.69లక్షలు ఖర్చు చేశారు, ఏం జరుగుతోంది ఏపీలో’ అంటూ మండిపడ్డారు. రాష్ట్ర పార్టీలో ఈ వ్యవహారం వేడి పుట్టించింది.

bjp 07042019

అటు తిరిగి ఇటు తిరిగి ట్రెజరర్‌ వద్ద ఆగింది. నిజాయితీగా పనిచేస్తున్న తనను అలా అనడం నచ్చని సన్యాసిరాజు కోశాధికారి పదవికి రాజీనామా చేశారు. ఎక్కువ మాట్లాడితే పోటీ నుంచి తప్పుకొంటారేమోనని నాయకత్వం వెనక్కి తగ్గింది. రాష్ట్రంలో పార్టీ సభలకు వచ్చేందుకే ఎవరూ ఆసక్తి చూపట్లేదని.. మనిషికి రూ.500 ఇచ్చి తీసుకొచ్చినా రెండు గంటలకు మించి కూర్చోవడానికి ఇష్టపడట్లేదని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. అన్ని స్థానాల్లోనూ ఎలాగోలా అభ్యర్థులను బరిలో దించిన బీజేపీ ఇప్పుడు పోలింగ్‌ ఏజెంట్ల కోసం నానా పాట్లూ పడుతోంది. ‘పదో తరగతి ఫెయిలైనా పర్లేదు, పేరివ్వు చాలు... ఆ రోజుకు నీకు ఏదో ఇస్తాం’ అని బతిమాలుతున్నా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి. పార్టీ కోశాధికారి సన్యాసిరాజు తప్పుకున్న 24 గంటల్లోనే, ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ప్రచారానికి పార్టీ అధిష్టానం పంపిన డబ్బులో కోట్ల రూపాయలు దుర్వినియోగంపై జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అక్షింతలు వేయడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వంలో కల్లోలం మొదలైంది. ఇప్పటికే రాష్ట్రానికి చేరిన రూ.70 కోట్లలో ఒకే నాయకుడి ఆధీనంలో ఉన్న రూ.30 కోట్లు దారి మళ్లినట్టు రాష్ట్రానికి చెందిన ఒక కీలక నాయకు డు కేంద్ర పార్టీకి నివేదిక ఇచ్చినట్టు చర్చ జరుగుతోం ది.

నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణం రాజు కారుపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సకాలంలో సెక్యూరిటీ సిబ్బంది స్పందించి జనసేన కార్యకర్తలను చెదరగొట్టడంతో రఘురామ కృష్ణంరాజుకు పెను ముప్పు తప్పింది. కానీ అప్పటికే కార్యకర్తలు రఘురాజు ప్రయాణిస్తున్న కారుతో పాటు మరో కారు అద్దాలు ధ్వంసం చేశారు. కాళీపట్నంలో జనసేన మీటింగ్ జరుగుతున్న సమయంలో రఘురాజు కాన్వాయ్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గొడవ జరిగిందని తెలుసుకున్న వైకాళీపట్నం గ్రామానికి భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో వైకాళీపట్నంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గీయులను చెదరగొట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

janasena 06042019 1

అయితే ఈ దాడి వెనుక, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నట్టు తెలుస్తుంది. మొన్నటికి మొన్న ఆయన ఓ సభలో తులూతూ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఆయన మీద విమర్శలు గుప్పించారు. మద్యం తాగి ప్రచార సభకి వచ్చిన ఈయన నాయకుడా? అంటూ కొందరు.. వైసీపీ అధికారంలోకి వస్తే మద్యం నిషేదిస్తాం అంటున్నారు.. ముందు అభ్యర్థులు తాగి ప్రచారానికి రాకుండా చూసుకోండి అంటూ మరికొందరు విమర్శించారు. అయితే ఈ తలనొప్పి చాలదు అన్నట్లు రఘు రామ కృష్ణంరాజు కాపు కులం గురించి మాట్లాడి మరో తలనొప్పి తెచ్చుకున్నారు.

janasena 06042019 1

పవన్ కళ్యాణ్ అవినీతిపరుల తాట తీస్తా అంటూ పలుమార్లు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ రఘురామకృష్ణంరాజు కౌంటర్ వేయాలి అనుకున్నారు. కానీ అది కాస్త బెడిసి కొట్టింది. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే.. 'మీరు కాపులు. కాపు కాసే వాడు కాపు. మీ పని మీరు చేసుకోండి. నార తీసే వృత్తి వేరు, తాట తీసే వృత్తి వేరు. వాళ్ళని వాళ్ళ పని చేసుకోనివ్వండి.' అని రఘురామ కృష్ణంరాజులు వ్యాఖ్యలు చేశారు. అయితే సోషల్ మీడియాలో రఘు రామ కృష్ణంరాజు వ్యాఖ్యల మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాము మాత్రమే పరిపాలన చేయాలి అన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడాడంటూ, ఇది ఆయన అహంకారానికి నిదర్శనం అంటూ వివిధ వర్గాల వారు ఆయన వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. మొత్తానికి నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘు రామ కృష్ణంరాజును వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. మరి ఈ వివాదాలు ఆయన ఎన్నికల ఫలితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.

ప్రస్తుత ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో పరిస్థితి టెన్షన్‌..టెన్షన్‌గా ఉంది. ఎన్నికలు సమీపించే కొద్దీ ఆ నియోజకవర్గంలో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష వైసీపీ వర్గీయులు తమ పార్టీ గెలుపు కోసం అరాచకాలకు తెరలేపుతున్నారు. గ్రామాల్లో తిరుగుతూ టీడీపీ వర్గీయులయిన బీసీలపై బెదిరింపులు, దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల్లో తమకు పట్టున్న ప్రాంతాల్లో టీడీపీకి ఓట్లు పడకుండా చూడాలని ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే భానుకోటలో దళితులు, సనప, బీ యాలేరు గ్రామాల్లో బీసీలపై బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న బీసీ వర్గాలపై నియోజకవర్గంలో వరుసగా దాడులు జరిగాయి.

sriram 07042019 2

ప్రత్యేకించి ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి మండలాల్లో వైసీపీ బెదిరింపులు అధికంగా ఉన్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అరాచకాలపై ఎన్నికల కమిషన్‌కు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఈ దౌర్జన్యాలు, బెదిరింపుల్లో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి సోదరుడు ప్రధానపాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాగైనా ఈసారి గెలవాలనే లక్ష్యంతో ఆయన ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్నట్లు రాప్తాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి సోదరుడి నేరచరిత్రను టీడీపీ నాయకులు సేకరించి సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు అందజేసినట్లు తెలుస్తోంది.

sriram 07042019 3

ప్రధానంగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో ఓ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ను హత్య చేసినట్లు గతంలో ఆయనపై కేసు నమోదైంది. మొండి బకాయిల వసూళ్లకు ఒప్పందాలు చేసుకుని కిడ్నా్‌పలకు పాల్పడినట్లు పోలీసు రికార్డుల్లో నమోదైంది. ఓ సినీ నిర్మాతను కూడా కిడ్నాప్‌ చేయడానికి గతంలో ప్రయత్నాలు చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు రికార్డులు చూపుతున్నాయి. ఇలా అనేక కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నట్లు చూపే ఆధారాలు సేకరించి ఎన్నికల కమిషన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన చేస్తున్న అరాచకాల గురించి కూడా కమిషన్‌కు తెలియజేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీన్నిబట్టి రాప్తాడు నియోజకవర్గంలో అరాచకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో, ప్రజలు ఎంతగా ఆందోళన చెందుతున్నారో అర్థమవుతోంది. మరి ఈ నియోజకవర్గంలో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read