వైఎస్ జగన్ జుట్టు ప్రధాని మోడీ చేతుల్లో ఉంటే.. పిలక తెలంగాణ సీఎం కెసిఆర్ చేతుల్లో ఉందన్నారు సీఎం చంద్రబాబు. పాయకరావుపేటలో చంద్రబాబు రోడ్‌షో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘దేశంలో ఉన్న అన్ని మోసాలకు జగన్ కేంద్రంగా ఉన్నాడు. జగన్‌ జుట్టు మోదీ చేతిలో.. పిలక కేసీఆర్‌ చేతిలోఉంది. జగన్‌ రాష్ట్రాన్ని ముంచడానికి ఒక్క అవకాశం అంటున్నారు. జగన్‌ జైలుకు వెళ్లకుండా ఉండడానికి మేం ఓట్లు వేయాలా? కేసీఆర్‌ ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి.. ఇష్టానుసారం వ్యవహరిస్తే ఖబడ్దార్’’ అని చంద్రబాబు హెచ్చరించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా.. ఇంకా అక్కడే ఉంటే ఆంధ్రాకి నేను ద్రోహం చేసినవాడినే అవుతానని కట్టుబట్టలతో విజయవాడకి వచ్చి అమరావతికి శంఖుస్థాపన చేశానని.. జగన్ ఇప్పటికీ హైదరాబాద్ ముద్దు ఆంధ్రా వద్దు అని లోటస్ పాండ్లోనే భోగాలు అనుభవిస్తున్నాడు.

jaganjuttu 31032019

ఎన్నికలు వచ్చేసరికి ఇప్పుడు అంత చేస్తా.. అన్నీ నేనే చేస్తానని ఇష్టం వచ్చినట్లు, నోటికి వచ్చినట్లు వాగ్దానాలను చేస్తున్నారన్నారు. అయన చేసే వాగ్దానాలను విన్న ప్రజలు ఒక్కరైనా నమ్ముతున్నారా? నలభై ఏళ్ళు అనుభవం, ప్రపంచం మొత్తం మీద తెలిసిన నాకు ఐదేళ్లు పట్టింది రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి.. వారానికి ఒకరోజు కోర్టుకు వెళ్లే జగన్ ఇంకేం చేస్తాడని ప్రజలే ప్రశ్నిస్తున్నారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ఎద్దేవాచేశారు. కేసీఆర్‌ది తుక్కు ఫెడరల్‌ ఫ్రంట్‌ అని చంద్రబాబు విమర్శించారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద రూ.5 లక్షలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. మీకు నచ్చిన ఆస్పత్రిలో వైద్యం చేయించుకోండన్నారు. మందులకు కూడా డబ్బు చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.

jaganjuttu 31032019

రూ.10 లక్షల విలువైన ఇళ్లను కట్టిస్తున్నామని, పేదల గృహాల బకాయిలు రూ.9300 కోట్లను మాఫీ చేస్తున్నామని తెలిపారు. 43 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఏ మొహం పెట్టుకొని మన గడ్డపైకి వస్తున్నారని ప్రశ్నించారు. కియా మోటార్స్‌ మోదీ తెచ్చారనడానికి జగన్‌కు సిగ్గుండాలన్నారు. తన వల్లే కియా మోటార్స్‌ అనంతపురం వచ్చిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణకు మనం బానిసలం కాదని, కేసీఆర్‌కు ఊడిగం చేయాలనుకుంటే జగన్‌ అక్కడే ఉండాలని చెప్పారు. అమరావతి అభివృద్ధి అయితే.. హైదరాబాద్‌ ఎత్తిపోతుందని కేసీఆర్‌ భయపడుతున్నారని మరోసారి ఎద్దేవాచేశారు. జగన్‌వి అన్నీ కోడి కత్తి ఆలోచనలేనని విమర్శించారు. ఒక్క సారి అవకాశం ఇద్దామని మనం ఆత్మహత్య చేసుకుంటామా అని ప్రశ్నించారు. మన పిల్లల భవిష్యత్ అంధకారం చేసుకుంటామా అని చంద్రబాబు మరోసారి ప్రశ్నించారు.

గత ఐదేళ్ల పాలనలో మీరేం చేశారో, నేనేం చేశానో చర్చిద్దాం.. దమ్ముంటే రండి అంటూ తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీకి సవాల్ విసిరారు. రాష్ట్రానికి మోడీ చేసిందేమీలేదని, విశాఖకు రైల్వే జోన్ ఇచ్చినా అది తల లేని మొండెంతో సమానమని చంద్రబాబు అన్నారు. రైల్వే ఆదాయం అంతా రాయ్ గఢ్ కు వెళుతుందని, విశాఖకు రైల్వే జోన్ ఉన్నా.. ప్రయోజనం లేని పరిస్థితి సృష్టించారని మోడీపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదని, పోలవరానికి నిధులు ఇవ్వలేదని అన్నారు. అన్ని విధాలా రాష్ట్రప్రజలను మోసం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కియా మోటార్స్ రాకుండా మోడీ విశ్వప్రయత్నాలు చేశారని, గుజరాత్ కు గద్దలాగా తన్నుకుపోవాలని చూశాడని ఆరోపించారు. ఇప్పుడు కోడికత్తి పార్టీ కియా మోటార్స్ ను ఏపీకి తెచ్చింది మోడీయేనని చెబుతోందని, కనీసం కోడికత్తి పార్టీకైనా అలా చెప్పేందుకు సభ్యత ఉండాలి కదా అని చంద్రబాబు విమర్శించారు. మోడీ ఏ పనీ చేయకపోయినా కోడికత్తి పార్టీ సిగ్గులేకుండా ఆయనకు కితాబిస్తోందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

modicbn 31032019

వైసీపీ నేతలు చెల్లని కాసులని చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రమంతా తెదేపా తుపాను గాలిలా వీస్తోందన్నారు. తెదేపా గాలిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. త్వరలో ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు ఇస్తామన్నారు. పేదవారి పేరుతో బకాయిలు ఉండటానికి వీళ్లేదన్నారు. ప్రతి పేద వారి బకాయిలు అన్నీ రద్దు చేస్తానన్నారు. మన పాలనలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారన్నారు. రాష్ట్రానికి అన్నం పెట్టే రైతులకు అండగా ఉంటానని చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతును ఆదుకుంటున్నామన్నారు. రైతు రుణాలు మాఫీ చేశామన్నారు. రైతులు ఆనందంగా ఉండేందుకు ఏమైనా చేస్తామన్నారు. వృద్దులు తనను వారి పెద్దకొడుకుగా భావిస్తున్నారన్నారు. ఇప్పుడు ఇస్తున్న రూ.2వేల పింఛన్ ను రూ.3వేలకు పెంచుతానన్నారు. అన్న క్యాంటీన్ లతో రూ.5లకే నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు.

modicbn 31032019

బీసీలకు అండగా ఉన్న పార్టీ టీడీపీ అని చంద్రబాబునాయుడు అన్నారు. కియా మోటార్స్ ను గుజరాత్ తీసుకెళ్లేందుకు మోడీ యత్నించారన్నారు. మోడీతో పోరాడి అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ ను తీసుకొచ్చామన్నారు. కియా మోటార్స్ తెచ్చినట్లు మోడీ చెప్పుకోలేకపోయారన్నారు. తన హయాంలోనే హైదరాబాద్ ను అభివృద్ది జరిగిందని అన్నారు. బంగారు గుడ్డుపెట్టే బాతు లాంటి హైదరాబాద్ ను మన రాష్ట్రానికి వచ్చామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేసి నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానన్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలోని బీజేపీలు అభివృద్దికి అడ్డుపడ్డాయన్నారు. మన రాష్ట్రం అభివృద్ది చెందకూడదని కుట్రలు పన్నారన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మోడీ, కేసీఆర్ బెదిరిస్తే నేను భయపడతానా అని చంద్రబాబు అన్నారు. అమరావతిని అడ్డుకునేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ.లక్ష కోట్లు కేసీఆర్ ఇవ్వడం లేదన్నారు.

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా బాలనాగిరెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని చెట్నేపల్లి, మాధవరం, రచ్చుమర్రి, మాలపల్లి, గ్రామాల్లో ఆయన ప్రత్యేక వాహనంలో రోడ్‌షో నిర్వహించారు. మాధవరం, రచ్చుమర్రి గ్రామాల్లో టీడీపీ ఎంపీ కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ తాను గెలుస్తానని తెలిసి ఖగ్గల్‌ గ్రామం లో ఉద్రిక్త వాతావరణం కల్పించారని ఆరోపిం చారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినా, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర మంత్రి అయినా ఆస్తులు సంపాదించుకోలేదని, ప్రజల మనన్నలు పొందానన్నారు. అటువంటి వ్యక్తులకు గెలుపు ఎల్లప్పుడు వెంటే ఉంటుందన్నారు.

tikkareddy 31032019

మాధవరంలో ముస్లింలకు షాదిఖానా ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. జనం ప్రశాంతం గా ఉండాలనే కోరుకుంటున్నా, బాలనాగిరెడ్డి మాత్రం గొడవలను సృష్టిస్తూ అరాచకాలకు పా ల్పడుతున్నారని అలాంటి వ్యక్తికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో రెండు ఓట్లను టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అంతకుముందు రచ్చుమర్రిలో జరిగిన రోడ్‌షోలో తిక్కారెడ్డి, ఆయన సతీమణి వెంకటేశ్వరమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్‌ కుడి కాలువ, కేసీ కెనాల్‌ పైపులైన్‌ పూర్తి చేసి రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరు ఇస్తామని టీడీపీ ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి అన్నారు. మాధవరంలో తిక్కారెడ్డితో కలిసి టీడీపీ ఎంపీ అభ్యర్థి కోట్ల రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌, బీజేపీ, వైసీపీ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని, అటువంటి వారిని నమ్మొద్దన్నారు.

tikkareddy 31032019

కోట్ల అంటేనే నమ్మకం అన్నారు. చంద్రబాబు కూడా నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు ఇస్తానన్నారు. దాడులకు పాల్పడిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని చిత్తుగా ఓడించి తిక్కారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో తిక్కారెడ్డి సతీమణి వెంకటేశ్వరమ్మ, తనయుడు దివాకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, గుడిసె శివన్న, పన్నాగ స్వామి, లక్ష్మికాంత్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, మల్లికార్జునరెడ్డి, ముత్తురెడ్డి, సురే్‌షనాయుడు, చావిడి వెంకటేష్‌, మౌనేశ్వరరెడ్డి, నర్సన్న ఆచారి, అమర్‌నాథ్‌రెడ్డి, గువ్వల భీమన్న పాల్గొన్నారు. మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డికి ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని జిల్లా తెలుగుయువత నాయకుడు దివాకర్‌రెడ్డి అన్నారు. శనివారం కోసిగి మండల పరిధిలోని చింతకుంట గ్రామంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. తిక్కారెడ్డి ప్రచారంలో ఉండగా, వైసీపీ నేతలు కత్తులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటూనే, ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికల సంఘం ప్రధాన అధికారి పదవి నుంచి సునీల్ అరోరా తప్పుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ డిమాండ్ చేశారు. తమకు కేటాయించిన హెలికాప్టర్ గుర్తును కర్నూలులో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులకు కేటాయించారని మండిపడ్డారు. అంతేకాకుండా తమ పార్టీ అభ్యర్థుల బీ ఫారాలను ఎత్తుకెళ్లారని, సంతకాలను సైతం ఫోర్జరీ చేసి వేరే వారికి సీట్లు కేటాయించారని తెలిపారు. వీటితో పాటు ఆళ్లగడ్డలో తమ అభ్యర్థికి వీణను కేటాయిస్తే ఎన్నికల సంఘం నిద్రపోతోందా అని నిలదీశారు. ఆయన నివసిస్తున్న హోటల్‌లో గదులు ఖాళీగా ఉన్నా సరే లేవంటూ మూడు నెలలుగా లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

paul 31032019

తమ పార్టీకి ప్రజల్లో వస్తోన్న ఆదరణను చూసే కుట్రలు చేస్తున్నారని తెలిపారు. తమకు కేటాయించిన గుర్తును టీడీపీ, వైసీపీ మద్దతుదార్లకు సైతం కేటాయిస్తున్నారని, అసలు ఈ ఎన్నికలను రద్దు చేయాలని పాల్ డిమాండ్ చేశారు. జగన్, విజయసాయి రెడ్డి తనపై అనేక కుట్రలు చేస్తున్నారని, తనపై అనేక ఒత్తిడులు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. టీడీపీకి, జనసేన‌కి ఓటువేస్తే ప్రజలను దేవుడు క్షమించడని వ్యాఖ్యానించారు. వాళ్లిచ్చే తాయిలాలకు లొంగకుండా ఆయన పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

paul 31032019

చంద్రబాబు, జగన్ ప్రజాధనాన్ని దోచుకున్నారని, గుండుగీసే నాయకులు కావాలా? లేదా గుండె ధైర్యమున్న ఆయనలాంటి నాయకుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలని ఆయన సవాల్ చేశారు. తనకు ప్రాణహాని ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకున్నా, స్పందన లేదని మండిపడ్డారు. కేవలం ఒక్క గన్‌మెన్‌ని పంపారని, తన ప్రాణాలంటే అంత చులకనా? అని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఆంధ్రా రాజకీయాలతో ఏం సంబంధమని, ఆయన తెలంగాణను ఆయన చూసుకోవాలని ఆయన సూచించారు. అవినీతిపరుడైన జగన్‌తో సంబంధం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisements

Latest Articles

Most Read