వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయని, అవినీతి కేసుల్లో ఉన్న జగన్‌ అధికారంలోకి వస్తే ఏమీ చేయలేరని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయవాడలో జరిగిన కాంగ్రెస్‌ భరోసా సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని నీరుగార్చాలని యత్నిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి కుయుక్తులను సహించేది లేదని అన్నారు. ఈ దేశం ఏ ఒక్కరి సొత్తు కాదని, ఏపీతో తమ కుటుంబానికి ఆత్మీయ బంధం ఉందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ఏం చేస్తామో చెప్పేందుకే రాహుల్‌ గాంధీ ప్రాధాన్యం ఇచ్చారు.

rg 31032019

న్యాయ పథకం పేదల జీవితాన్ని మారుస్తుందన్న రాహుల్ అందరికీ కనీస ఆదాయం కల్పించడమే కాంగ్రెస్‌కు లక్ష్యం అని అన్నారు. ఏపీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని ఆయన మరోసారి ప్రకటన చేశారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్ ఏపీకి న్యాయం చేయలేరన్నారు. విమర్శలు, నెగిటివిటీకి దూరంగా రాహుల్ ప్రసంగం సాగింది. పూర్తిగా దెబ్బతిన్న ఏపీలో... సానుకూలత సృష్టించుకునే వ్యూహంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మూలాలతో సహా తుడిచిపెట్టుకుపోయాక... మళ్లీ తొలి అడుగులేస్తున్నట్టుగా రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్‌కెందుకు ఓటెయ్యాలో చెప్పేందుకు రాహుల్ ప్రాధాన్యం ఇచ్చారు.

rg 31032019

ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. జగన్ పై ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆయనకు అధికారం అప్పగిస్తే ఎలాంటి అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు. ఒకవేళ అధికారం అప్పగించినా అవినీతిలో కూరుకుపోయిన జగన్ ఏపీకి న్యాయం చేరలేరని వ్యాఖ్యానించారు. మొత్తానికి రాహుల్ వ్యాఖ్యలతో జగన్ పై మరింత ఒత్తిడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ తో రాజకీయం చేస్తున్న జగన్, ఇప్పుడు కాంగ్రెస్ ఒకటి రెండు శాతం పుంజుకున్నా, జగన్ కు భారీ దెబ్బ తగలటం ఖాయం. మరో పక్క మోడీ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, జగన్ కేసుల విచారణ స్పీడ్ అయ్యే అవకాసం కూడా ఉంది.

అందరి మీద నోరు పారేసుకుని, వాళ్ళ చేత లెఫ్ట్ అండ్ రైట్ వాయించుకునే జీవీఎల్ మళ్ళీ వచ్చారు. ఈ సారి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కళ్యాణ్‌గా మారిపోయారని ఆరోపించారు. పవన్.. పెద బాబునే కాదు చిన బాబును కూడా పల్లెత్తు మాట అనడం లేదని విమర్శలు గుప్పించారు. మంగళగిరి వైపు ఆయన కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శించారు. పవన్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా నటిస్తున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. అందుకే పవన్ ఇటువంటి నాటకాలకు ఫుల్ స్టాప్ పెడితే ఆయనకే మంచిదని జీవీఎల్ హితవు పలికారు.

gvl 31032019

"దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో మోదీ ఎన్డీఏ ఒకవైపు.. పూర్తిగా భంగపడి, వైఫల్యం చెందిన పార్టీలన్నీ మరోవైపు ఉన్నాయి. ప్రతిపక్ష ఫార్టీలన్నీ కుక్కలు‌ చింపిన విస్తరిలా మారిపోయాయి. బీజేపీకి స్వతహాగా 300కు పైగా సీట్లు రావడం ఖాయం. ఎన్డీఏ కూటమికి గతంలో కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. చంద్రబాబు, రాహుల్ గాంధీ, మమతా వంటి వారికి ఓటమి భయం పట్టుకుంది.అందుకే బీజేపీ పైనా, మోదీ పైనా వ్యక్తిగత విమర్శ లు చేస్తున్నారు. రాహుల్ అందుకే రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. కేరళ వంటి రాష్ట్రంలో కమ్యూనిస్టులతో ఒప్పందం‌ చేసుకుని రాహుల్ పోటీకి సిద్ధమయ్యారు" అని జీవీఎల్ విమర్శలు గుప్పించారు.

gvl 31032019

"చంద్రబాబును ప్రజలు పట్టించుకోకపోవడంతో జాతీయ నేతలను తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటున్నారు. గంటలపైగా మాట్లాడే బాబు ఏపీకి ఏంచేశారో చెప్పడం లేదు. కేంద్ర పథకాలను బాబు తన పథకాలుగా చెప్పుకుంటున్నారు. కియా వ్యవహారంలో అన్నీ కేంద్ర ప్రభుత్వం చేస్తే.. తానే తెచ్చానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబు చెప్పిన సోదే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఆయనను ప్రజలు పట్టించుకోక పోవడంతో జాతీయ నాయకులను తీసుకువచ్చి ప్రచారం చేసుకుంటున్నారు. గంటలు గంటలు మాట్లాడే బాబు ఏపీకి ఏం చేశానో మాత్రం చెప్పడం లేదు. స్టిక్కర్ బాబుగా పేరు గాంచిన చంద్రబాబు కేంద్రం పధకాలను తనవిగా చెప్పుకుంటున్నారు. టీడీపీ ప్రకటనలు చూస్తే చాలా గొప్పగా ఉన్నాయి. వాటి వెనుక అమలు మాత్రం అంతా డొల్లే కేంద్రం పేదలకు ఇళ్లు ఇస్తే.. తన గొప్పగా చెప్పుకుంటున్నారు. త్వరలో సైకిల్‌ పూర్తిగా కనుమరుగు కావడం ఖాయం. టీడీపీలో కొంతమంది రాజకీయ బ్రోకర్లు తయారయ్యారు..నోరుపారేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు" అని జీవీఎల్ విమర్శలు గుప్పించారు.

 

 

పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చల అనంతరం పార్టీలో క్రియాశీలంగా మెలగాలని నిర్ణయించారు. బిజ్జం బనగానపల్లెకు ఆదివారం చేరుకుని విలేఖరుల సమావేశం నిర్వహించ నున్నారు. బిజ్జం స్వగ్రామం అవుకు మండలం చెన్నంపల్లె. 1999లో పాణ్యం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌ రెడ్డిపై 21,246 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2004 ఎన్నికల్లో రెండోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేతిలో 4592 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తరువాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్సార్‌ సమక్షంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బిజ్జం పార్థసారథిరెడ్డి రాజీ అయ్యారు. ఆ తరువాత 15 ఏళ్లుగా బిజ్జం రాజకీయాలకు దూరంగా హైదరాబాదులో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీసీ జనార్దన్‌రెడ్డికి పరోక్షంగా సహకరించారు.

cbn reentry 31032019

ముఖ్యమంత్రి ఆదేశాలతో.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బిజ్జం పార్థసారథిరెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సీఎం ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నాలని కోరినట్లు బిజ్జం పార్థసారథిరెడ్డి శనివారం తెలిపారు. తనకు పట్టున్న బనగానపల్లె, పాణ్యం, డోన్‌, నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని సీఎం కోరినట్లు బిజ్జం తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల విజయం కోసం పాటు పడుతామని బిజ్జం తెలిపారు. బనగానపల్లెలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆదివారం రానున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డితో కలిసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అనంతరం ప్రచారం చేసే గ్రామాలపై చర్చించనున్నట్లు తెలిపారు.

cbn reentry 31032019

అభిమానుల సంబరాలు... తెలుగుదేశం పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన అభిమానులు శనివారం సంబరాలు చేసుకున్నారు. బనగానపల్లె, కోవెలకుంట్ల, అవుకు పట్టణాల్లో టపాసులు పేల్చి హర్షం వ్యక్తం చేశారు. బనగానపల్లె పట్టణంలోని పెట్రోల్‌బంక్‌, పొట్టిశ్రీరాముల సెంటర్‌, బీసీ గుర్రెడ్డి కాంప్లెక్స్‌ వద్ద టపాసులు పేల్చి బిజ్జం రాకను స్వాగతిం చారు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డికి మద్దతుగా ఆది వారం నుంచి బిజ్జం పార్థసారథిరెడ్డి నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని అభి మానులు తెలిపారు. బిజ్జం రాకతో ఎమ్మెల్యే బీసీ విజయం ఖరారైనట్లేనని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భానుముక్కల సొసైటీ చైర్మన్‌ కేవీ కృష్ణారెడ్డి, బనగానపల్లె మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ కోడి నాగరాజు యాదవ్‌, బొబ్బల రామమద్దిలేటిరెడ్డి, ముస్లిం మైనారిటీ నాయ కులు మహ్మద్‌ అలీ, రఫీ, ఫయాజ్‌, బొబ్బల రామ సుబ్బారెడ్డి, ఎర్రబోలు శరత్‌ కుమార్‌రెడ్డి, జావీద్‌, టిప్‌ టాప్‌ కలాం, అర్షద్‌, కాశీం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. Source:Andhrajyothy

 

 

మంగళగిరి అభివృద్ధి అడ్డుకోటానికి పక్క రాష్ట్రము సాక్షిగా పన్నిన, కుట్రను తెలుగుదేశం నేతలు పక్క ఆధారాలతో పట్టుకున్నూరు. ముఖ్య మంత్రి కుమారుడు నారా లోకేష్ పోటీ చేస్తున్న చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం మీద అందరి ద్రుష్టి కేంద్రీకృతం అయిన సంగతి తెలిసిందే. నన్ను గెలిపిస్తే మంగళగిరి ని మరో గచ్చిబౌలి చేస్తాను అని లోకేష్ విస్తృతంగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గం లో ఒక దఫా ప్రచారం పూర్తీ చేసుకుని జిల్లాల పర్యటనకు లోకేష్ వెళ్లారు. ప్రజలకు ఏమి చేస్తాను అనేది చెప్తూ, అక్కడ ప్రజలని ఆకట్టుకుంటున్నారు. మరో పక్క 12 ఓట్లతో గెలిచి, రాష్ట్రంలో జరిగే ప్రతి మంచి పనికి, లిటిగేషన్ పెట్టే, జగన్ ఆప్తుడు ఆర్కే మరో పక్క ఉన్నారు.

lokesh 31032019 1

దీంతో, లోకేష్ ని చట్ట సభలోనికి అడుగుపెట్టనీయకూడదు అని వైకాపా ఎత్తులు వేస్తోంది. దీనిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడు చూడని కొత్త వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. వాళ్ళు అందరు పీకే టీం మనుసులు అని నియోజకవర్గంలో అనుకుంటున్నారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉన్న కార్లు వేసుకుని, మంగళగిరి నియోజకవర్గం లో వైకాపా జెండాతో వాహనాలు తిరుగుతున్నాయి. నల్ల బాట్లతో,ఆ వాహనాల్లో లాప్టాప్ తో కొంత మంది ఉంటున్నారు. వీరు ఇంటి ఇంటికి తిరుగుతున్నారు, ప్రజల వద్ద నుంచి ఆధార్, బ్యాంకు అకౌంట్ లు సేకరిస్తున్నారు. చిన్న చిన్న సమావేశాలు పెడుతున్నారు. అసలు తెలంగాణ నుంచి ట్రాన్స్ పోర్ట్ పర్మిట్ ఉన్న వాహనం వైకాపా జెండా కట్టుకుని నియోజకవర్గం లో ఎలా తిరుగుతోంది ?

lokesh 31032019 1

ఈ వాహనానికి పర్మిట్ ఎవరు తీసుకున్నారు ? పక్క రాష్ట్రము యువకులు కి ఇక్కడ ఏమి పని ? దీనిని పక్క రాష్ట్రము సాక్షిగా మన రాష్ట్ర అభివృద్ధి ఆడుకోటానికి కుట్ర గానే చూడాలి అని మంగళగిరి లో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. లోకేష్ గెలుపుని అడ్డుకోటానికి ఇలాంటి టీంలుని రంగంలోనికి దించారు. దీని వెనెక పక్క రాష్ట్రము లో పెద్దలు హస్తం ఉంది అని నియోజకవర్గం లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఇది పసిగట్టిన తెలుగుదేశం కార్యకర్తలు, వీళ్ళను కాపు కాసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 7 గురు పీకే సభ్యులని పట్టుకుని, మంగళగిరి పోలీసులకు అప్పగించారు. ఓటు కి 20 వేలు ఇస్తాం అంటూ పీకే టీం దొరికిందని, అందుకే పోలీసులకు అప్పచెప్పామని, వీళ్ళు ఇక్కడ ఏ కుట్ర పన్నారో, విచారణలో తేలుతుందని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read