వైసీపీ ఊగుతోంది.. అదేంటని అవాక్కయ్యారా? అంటే ఫ్యాన్ ఊగడంకాదని, కార్యకర్తలు, అభ్యర్థులు ఇప్పుడు ఏపీలో ఊగిపోతున్నారు. ఊగిపోవడం అంటే కోపం ఎక్కువై కాదు.. మందు కిక్కు ఎక్కువై.. ఆయనొక పెద్ద పారిశ్రామిక వేత్త, ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన నేత, టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీ నుంచి నరసాపురంలో లోక్ సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఆయనే రఘురామ కృష్ణంరాజు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ సమావేశంలో ఆయన తీరు అందరినీ నివ్వెరపరిచింది. ఓ సమావేశంలో ఊగిపోతూ, తడబడుతూ మాట్లాడడం చూసి అందరూ అవాక్కయ్యారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాతో వైరల్ అవుతున్నాయి.

raghu 31032019

ఎన్నికల ముందు వరకు టీడీపీలోనే ఉన్న రఘురామకృష్ణం రాజు ఆ తర్వాత తిరిగి వైసీపీలో చేరారు. నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన వివిధ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కానీ ఓ సమావేశంలో ఆయన ఇలా ఊగిపోతూ కనిపించడం చర్చకు దారి తీసింది. రఘురామ కృష్ణం రాజు మందుపుచ్చుకున్నారని కిక్కు ఎక్కువై అలా ఊగిపోయారనే ప్రచారం ఊపందుకుంది. ఊగుతూ మాట్లాడి, తడబడుతూ మాట్లాడి, జై జగన్ అంటూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వెయ్యండి అంటూ, తాగుబోతు మాటలు మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలే కాదు, అభ్యర్థులకు కిక్కు ఎక్కువైందంటూ సోషల్ మీడియాతో కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

raghu 31032019

మొన్నటికి మొన్న నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌ ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. రిటైర్ట్ ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్ గత ఎన్నికల్లోవైసీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు. అయితే ఈసారి సిట్టింగ్ స్థానాన్ని ఇవ్వని పార్టీ అధిష్ఠానం ఆయనకు గూడూరు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో ప్రచారంలో భాగంగా ఈ నెల 27న ఉదయం 7 గంటల సమయంలో గూడూరు పట్టణం దొమ్మలపాళ్యం వద్ద హల్‌చల్‌ చేశారు. ‘ఒక కోటీ ఇరవై రెండు లక్షలు.. హహ్హహ్హ.. ఒక కోటీ ఇరవై రెండు లక్షలు’ అని రోడ్డు మీద అరుస్తూ దారినపోయేవారు హడలిపోయేలా ప్రవర్తించారు. ఆయన ధాటికి తట్టుకోలేక స్థానికులు.. ‘‘స్వామీ మమ్మల్ని వదలిపెట్టండి’’ అని పరుగులు తీశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి మధ్య నిషేధం అంటుంటే, ఆయన అభ్యర్ధులు తాగి రోడ్ల పై పడ్డారు... తాగి ఊగుతుంది, కార్యకర్తలు కాదండీ, జగన్ ఎంపీ, ఎమ్మల్యే అభ్యర్ధులు...

భారీ బహిరంగ సభతో సత్తా చాటేందుకు అధికార తెలుగుదేశం ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఇందిరా ప్రియదర్శిని నగరపాలక మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు అంతా సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పశ్చిమబంగ, దిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరవుతున్నారు. దాదాపు మూడుగంటలపాటు సభ ఉంటుంది. ఈ సభను విజయవంతం చేసే బాధ్యతను అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తలకెత్తుకున్నారు. ఇప్పటికే వీరితో మంత్రి గంటా శ్రీనివాసరావు చర్చించారు. శరవేగంగా పనులు: సమయం తక్కువగా ఉండడంతో ఆయా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయానికి వేదిక నిర్మాణ పనులు పూర్తికానుంది. సభకు హాజరయ్యే ప్రజలు కూర్చొనేందుకు కుర్చీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు.

ktr 31032019

ఆయా పనులను పార్టీ నేతలకు అప్పగించారు. బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలనకు తెదేపా సీనియర్‌ నేత కంభపాటి రామ్మోహనరావు విశాఖకు చేరుకున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను సభాస్థలికి తరలించే విధంగా చర్యలు చేపట్టారు. వార్డుల వారీగా వాహనాలను తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తరలింపు మొదలు కానుంది. కనీసం 60 వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీ వార్డు అధ్యక్షులతో తెదేపా నగర అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌ఎ రెహ్మాన్, పార్టీ రాష్ట్ర నేత కంభంపాటి రామ్మోహనరావులు శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.

ktr 31032019

ఇందిరాప్రియదర్శిని మైదానం తెదేపా నేతలకు బాగా కలిసొచ్చిన వేదికగా పేరొందింది. తొలుత ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి రోడ్‌ షో నిర్వహించాలని పార్టీ నేతలు భావించారు. సభ అయితే బాగుంటుందని రోడ్డుషోను విరమించుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ బహిరంగ సభ నిర్వహించారు. చంద్రబాబుతో పాటు నాటి మిత్రపక్ష నేతలు నరేంద్రమోదీ, పవన్‌కల్యాణ్‌లు హాజరయ్యారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలతో పొత్తు లేదు. ఆ సభ పార్టీకి కొత్త ఊపు తెచ్చిందన్న సెంటిమెంట్‌తో ఇప్పుడు కూడా సభను నిర్వహిస్తున్నారు. అయితే నిన్న కేటీఆర్ మాట్లాడుతూ, మమతా బెనర్జీ మాతోనే ఉన్నారని, ఆమె ఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో ఉంటారని చెప్పిన ఒక్క రోజుకే, ఆమె చంద్రబాబుతో కలిసి విశాఖ మీటింగ్ లో పాల్గుంటారు అనే వార్తా రావటంతో, ఇప్పుడు కేటీఆర్ గారి పరిస్థితి ఏంటో...

రాష్ట్ర పోలీస్‌ బాస్‌పైనా బదిలీ వేటు పడనురదా? కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఈ మేరకు కసరత్తు చేస్తోందా? ఈ ప్రశ్నలకు రాష్ట్ర నిఘా వర్గాలు అవుననే అంటున్నారు. డిజిపి ఠాకూర్‌ తెలుగుదేశం ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆయనను బదిలీ చేయాలని వైసిపి డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకోసం ఆయన తన వాహనంలో నగదును తరలిస్తున్నారని కూడా ఆ పార్టీ ఆరోపించింది. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ కావడంతో ఎన్నికల కమిషన్‌ జోక్యం అనివార్యంగా మారే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచానా వేస్తున్నాయి. అయితే, ఇంటిలిజెన్స్‌ బాస్‌ బదిలీపై చెలరేగిన వివాదం న్యాయస్థానం వరకు వెళ్లడంతో పోలీస్‌ బాస్‌ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

game 27032019

ఇప్పటికిప్పుడు బదిలీపై నిర్ణయం తీసుకోకపైనా నోటీసులు జారీ చేయడం వంటి చర్యలు ప్రారంభించే అవకాశం ఉందని, పోలిరగ్‌ తేదీకి మూడు నాలుగు రోజుల మురదు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా బదిలీ అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే, తమ పార్టీపై వైసిపి నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని టిడిపి నేతలు కనకమేడల రవీంద్ర కుమార్‌, జూపూడి ప్రభాకర్‌ పేర్కొన్నారు. మీడియా వాహనాల్లో మారు మూల ప్రాంతాలకు వైసిపి పెద్ద మొత్తంలో డబ్బు తరలిస్తోందని ఆరోపించారు. శుక్రవారం వారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ, కేంద్రం ప్రభుత్వం ఈసిని ఉపయోగించుకొని టిడిపి కార్యకర్తలను, నాయకులను వేధిస్తోందని ఆరోపించారు. వైసిపి నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ని కలిసి డిజిపిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

game 27032019

అయితే బిజెపి, టిఆర్‌ఎస్‌ల అండతో 'సాకి'్ష మీడియా వాహనాలతో వారే డబ్బు తరలిస్తున్నారని ప్రత్యారోపణలు చేశారు. సాక్షి పత్రిక, టివి ఛానెల్‌లో చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కథనాలు రాస్తున్నారని, వాటిని పెయిడ్‌ ఆర్టికల్స్‌గా భావించాలని ఫిర్యాదు చేశామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా చర్యలు తీసుకోకుండా, విచారణ జరిపి తప్పులుంటే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు టిడిపి తూట్లు పొడిచిందని ప్రధాని మోడీ చేసిన ట్విట్‌ని ఖండిస్తున్నామని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని మోడీ, టిడిపిని, చంద్రబాబుని విమర్శించడానికి రాష్ట్రానికి వస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్య శక్తులన్ని ఏకతాటిపైకి వచ్చి మోడీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

మాజీమంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై నేతలెవరూ మాట్లాడొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన రెడ్డి, వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ దాఖలు చేసిన పిటీషన్లపై శుక్రవారం వాదనలు ముగి శాయి. కేసును ఏప్రిల్‌ 15వ తేదీకి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. తదుపరి విచారణ వరకు అధికార, ప్రతిపక్ష నేతలు వివేకానంద రెడ్డి హత్యపై మీడియా ముందు, బహిరంగ సభల్లో మాట్లాడరాదని ఆదేశించింది. ఇకపై హత్యకు సంబంధించి మాట్లాడబోమంటూ పార్టీల అధినేతలు కోర్టుకు ప్రమాణ పత్రం ఇవ్వాలని పేర్కొంది.

game 27032019

ఈ నెల 15న మాజీమంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు కడప ఎస్పీ ఏడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయగా, సిఐడీ అదనపు డీజీ అమిత్‌ గార్గ్‌ పర్యవేక్షణలో మరో నాలుగు ప్రత్యేక ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఓ వైపు విచారణ జరుగుతున్న సమయంలోనే వివేకా హత్య రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. పరస్పర ఆరోపణల నేపధ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ వైఎస్‌ జగన్‌, వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు.

game 27032019

పిటీషనర్ల తరుపు న్యాయవాదులు బుధవారం తమ వాదనలు వినిపించారు. దీనిపై ప్రభుత్వం తరుపు న్యాయవాదులు శుక్రవారం వాదనలు పూర్తి చేయడంతో తదుపరి విచారణను ఏప్రిల్‌ 15కు హైకోర్టు వాయిదా వేసింది. సిట్‌ విచారణ యథావిధిగా కొనసాగించొచ్చని తన తీర్పులో సూచించిన హైకోర్టు సంబంధిత వివరాలను దర్యాప్తు అధికారులు బహిర్గతం చేయవద్దంటూ ఆదేశాలు వెలువరించారు. అయితే ఈ ఉత్తర్వులు, ఎవరికి ఇబ్బంది అనే చర్చ మొదలైంది. చంద్రబాబుకు ఇందులో పెద్దగా పోయేది ఏమి లేదు, ఎందుకంటే జగన్ నైజం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఒక వేళ ఈ కేసులో ఎమన్నా పెద్ద అరెస్ట్ లు జరిగితే, అప్పుడు జగన్ బ్యాచ్ , ఈ విషయం పై మాట్లాడటానికి ఉండదు. అందుకే హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులు, జగన్ కే ఇబ్బంది అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read