సింహం సింగల్‌గా వస్తుందని షర్మిల చేసిన వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్‌లో షర్మిల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ లోకేష్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో సింహం సింగిల్ గా వస్తుందని పెద్దపెద్ద సినిమా డైలాగులు చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోరాడుతామనీ, సింహం సింగిల్ గానే వస్తుందని వైఎస్ షర్మిల వ్యాఖ్యలను లోకేశ్ ప్రస్తావించారు. ప్రజలు వైసీపీ ‘సింహం’ కామెడీని చూసి నవ్వుకుంటున్నారని దుయ్యబట్టారు.

lokesh 30032019 2

ఈరోజు లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘అబ్బబ్బబా! పైకి బీజేపీతో 'పొత్తు నహీ' అంటారు, జనాలు రాని బీజేపీ సభకి తమ కార్యకర్తలని పంపించి 'హమ్ హై నా' అని భరోసా ఇస్తారు... మళ్లీ సింహం సింగల్ అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు ! జనాలు మీ 'సింహం' కామెడీ చూసి నవ్వుకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు. ఇక, కర్నూలులో నిన్న ప్రధాని మోదీ సభలో కొందరు వ్యక్తులు వైసీపీ జెండాలో కనిపించడంపై నారా లోకేశ్ వ్యంగ్యంగా స్పందించారు. వైసీపీ నేతలు ఓవైపు బీజేపీతో పొత్తుకు నహీ(వద్దు) అని చెబుతూనే జనాలు రాని బీజేపీ సభకు కార్యకర్తలను పంపించి హమ్ హైనా(మీకు మేమున్నాం) అని భరోసా ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

విభజన చట్టం అమలుపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని, ప్రధాని మోదీ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని నిరూపిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఎలక్షన్ మిషన్ 2019పై ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తిక విషయాలను పంచుకున్నారు. అంతేకాదు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. వైసీపీ, బీజేపీపై ప్రజల్లో నమ్మకం పోయిందని, మోదీని, జగన్‌ను జనం విశ్వసించడం లేదని ఆయన పేర్కొన్నారు. కర్నూలు సభలో మోదీ కక్ష మరోసారి బయటపడిందన్నారు. బీజేపీ ఎంతో చేసిందని మోదీ చెప్పడం మరో మోసమని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన చేసిన ద్రోహం తీరనిదని చంద్రబాబు ఆరోపించారు.

modilies 30032019

అంతేకాదు, దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రధాని భ్రష్టు పట్టించారని, అవినీతిపరులకు రెడ్ కార్పెట్ వేశారని సీఎం చెప్పుకొచ్చారు. అభివృద్ధిపై బీజేపీ వక్రభాష్యాలను ప్రజలు నమ్మరని అభిప్రాయపడ్డారు. బీజేపీ రాష్ట్రాలలో డబుల్ ఇంజన్లతో మోదీ ఏం సాధించారని, రైతుల్లో అశాంతి సృష్టించడమా డబుల్ ఇంజన్లతో సాధించిందని ఆయన ప్రశ్నించారు. సన్‌సెట్‌ ఏపీ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహించారు. కష్టపడి శ్రమతో అభివృద్ధి చేసుకుంటున్న రాష్ట్రంపై ఇంత అక్కసా అని ప్రశ్నించారు. కర్నూలు సభలో రాష్ట్రంపై మోదీకి ఉన్న ద్వేషం మరోసారి బయటపడిందని ఆక్షేపించారు. ధైర్యముంటే చెప్పినదానికి, చేసిన దానికి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

modilies 30032019

వాళ్లు చేయకుంటే మనమే శ్వేతపత్రం విడుదల చేద్దామని, వాళ్లు ఢీ అంటే మనమూ ఢీ అందామని పార్టీ నేతలతో సీఎం అన్నారు. మోదీ సభకు వైకాపా కార్యకర్తలను తరలించడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రానికి ఏమీ చేయకపోగా.. నిందలు మోపుదామనుకుంటే సహించొద్దని పిలుపునిచ్చారు. ప్రజలు తెదేపా పట్ల సానుకూలంగానే ఉన్నారన్న అతి విశ్వాసం నాయకులకు తగదని సూచించారు. చివరి వరకూ అందరూ కష్టపడాల్సిందేనని, ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. ఈసారి ఇన్‌ఛార్జిల వ్యవస్థ ఉండబోదని అధినేత తేల్చిచెప్పారు. ప్రజల్లో పార్టీ గెలుపు ఏకపక్షంగా ఉందని, దీన్ని అదునుగా చూసుకుని ఎవరైనా కష్టపడకుంటే ఉపేక్షించబోనని హెచ్చరించారు.

చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధి కుంభార్లపల్లె వద్ద మామిడితోటలో శుక్రవారం రాత్రి పోలీసులు 170 మద్యం కేసులను పట్టుకున్నారు. ఈ తోట యజమాని శ్రీరాములురెడ్డికి వైకాపా నాయకుడిగా గుర్తింపు ఉంది. మామిడితోటలో మద్యం నిల్వలు ఉన్నట్లు పోలీసులకు శుక్రవారం రాత్రి సమాచారం అందింది. దీంతో అక్కడికి వచ్చి గాలించగా 170 మద్యం కేసుల్లో దాదాపు 8,160 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో పంపిణీకి వీటిని ఇక్కడ నిల్వ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీటి విలువ రూ.6 లక్షలు ఉంటుందని సీఐ పేర్కొన్నారు. మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని తోట యజమాని శ్రీరాములురెడ్డిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

mamiditota 30302019 2

శుక్రవారం రాత్రి ముందస్తు సమాచారంతో దాడి చేసిన పోలీసులు మద్యం నిల్వలను కనుగొనగా అక్కడున్న కాపలా దారులు అక్కడి నుంచి జారుకున్నారు. 170 కేసులో 8170 బాటిళ్ల మద్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మామిడి తోట యజమానిపై కేసు నమోదు చేసి అతని కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సీఐ వెంకట్రామిరెడ్డి ఎస్సై రవిప్రకాష్రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో గెలవటం కోసం, పార్టీలు తాపత్రయ పడటం చూసాం కాని, ఇలా ఏకంగా ఒక డంప్ పెట్టుకుని, అదీ సొంత పార్టీ నేత తోటలో పెట్టుకుని, బరి తెగింపు రాజకీయం చెయ్యటం చూస్తున్నాం. ఎలాగూ ప్రజలను పోజిటివ్ వేవ్ తో కొనలేమని, ఇలా నెగటివ్ పనులు చేసి ఆకట్టుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి ఒక పూట విరామం ఇచ్చారు. ఇందులో భాగంగానే ఆయన శనివారం ఉదయం ఆయన నివాసంలోనే ఉన్నారు. అయితే, అక్కడ మాత్రం విరామం తీసుకోకుండా పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు, ప్రస్తుత సమయంలో పార్టీ పరిస్థితి, ప్రచార శైలి ఎలా ఉంది అనే వాటిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొంత మంది నేతలతో చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల్లో ఓడితే నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కూడా అవకాశం ఉండదని, రానున్న ఐదేళ్లు వారు పార్టీలో సామాన్య కార్యకర్తలుగా పని చేయాల్సిందేనని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

cbn 3032019

మధ్యాహ్నం వరకు నివాసంలోనే తాజా రాజకీయ పరిణామాలపై సమీక్షలు చేయబోతున్నారు. దీని అనంతరం ఆయన శ్రీకాకుళం జిల్లాకు పయనమవుతారు. అక్కడ జరగనున్న ప్రచారంలో పాల్గొని, రాత్రి అక్కడే బస చేస్తారు. రాష్ట్ర ప్రజల్లో ఇంత గొప్ప స్పందన తన జీవితంలో చూడలేదని, ప్రచారంలో పాల్గొన్న ప్రతి చోటా జన సముద్రమే కనిపిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. రాజమండ్రిలో మహిళలంతా ఏకపక్షం అయ్యారన్నారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రలోని మహిళలంతా తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారని చెప్పారు. ఎక్కడ చూసినా పార్టీ ప్రచారం ఉధృతంగా సాగుతోందని, ప్రత్యర్థుల ఆరోపణలను బలంగా తిప్పికొడుతున్నారని చంద్రబాబు తెలిపారు.

cbn 3032019

ఇదే స్ఫూర్తి రాబోయే రెండు వారాలు కొనసాగించాలని కోరారు. తానింత కష్టపడేది ప్రజల కోసం, పార్టీ కోసమేనని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా 10 సూత్రాలు ప్రకటించామని, పేదరిక నిర్మూలనకు టీడీపీ 10 సూత్రాలు ఏ విధంగా ఉపయోగపడతాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎవరు ఎంత అణచివేతకు గురిచేసినా అంతే స్థాయిలో పార్టీ పైకి లేస్తుందన్నారు. రేపటి ఎన్నికల్లో ప్రజాతీర్పు దేశానికి దిక్సూచి కాగలదన్నారు. జమ్ము కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ టీడీపీ తరుపున ప్రచారం నిర్వహించారని, త్వరలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లాంటి రాజకీయ ఉద్దండులు టీడీపీకి మద్దతుగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం 22 పార్టీల నేతలు అండగా ఉన్నారని, బీజేపీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే వ్యతిరేకమన్నారు. టీడీపీ గెలుపు దేశానికి మరో మలుపన్నారు.

Advertisements

Latest Articles

Most Read