ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓవైపు గొంతు బొంగురుపోయినా అలాగే మాట్లాడుతూ సభలు, రోడ్ షోలలో పాల్గొంటున్నారు. నిన్న కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన తాజాగా విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి షబానా ఖాతూన్ గురించి ప్రస్తావించారు. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె అయిన షబానా ఖాతూన్ ను తానే అమెరికా నుంచి రప్పించానని చంద్రబాబు వెల్లడించారు.

cbn roadshow 29032019

ఉన్నత విద్యావంతులు, అభ్యుదయ భావాలు ఉన్నవాళ్లు ప్రజల కోసం పనిచేయాలన్నది తన అభిలాష అని, అందుకే ఆమెను ఎన్నికల్లో పోటీచేయాల్సిందిగా ప్రోత్సహించానని చంద్రబాబు తెలిపారు. ఆమె అమెరికాలో ఉంటుందని అపోహ పడవద్దని, ఇకమీదట పూర్తిస్థాయిలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, షబానా మీద ప్రస్తుతం పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్థి గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేశారని, 'చూడండి ఎలా మ్యాచ్ అయిందో' అంటూ చమత్కరించారు. 'పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది కదూ తమ్ముళ్లూ?' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆ క్యాండిడేట్ ఒక పార్టీ అయితే, భర్త మరో పార్టీ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలది భార్యాభర్తల బంధం అని వ్యాఖ్యానించారు.

cbn roadshow 29032019

అంతకుముందు, విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్థి 'పీవీపీ' వరప్రసాద్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ్నించి వచ్చాడీ ఎంపీ క్యాండిడేట్? ఏనాడైనా కనిపించాడా? అంటూ విమర్శించారు. హైదరాబాద్ లో ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ వాళ్లు పంపిస్తే వచ్చాడని ఆరోపించారు. కేశినేని నాని ఐదేళ్లు మనకోసం పోరాడిన వ్యక్తి అని, అతడిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. నానీని మళ్లీ పార్లమెంటుకు పంపిస్తే మన హక్కుల కోసం పోరాడతాడని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కోట్ల హరిచక్రపాణి రెడ్డి పోటీ నుంచి తప్పుకుని టీడీపీకి జై కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ ఎంపీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుని ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం చివరి రోజు కావడంతో పలు చోట్ల రెబల్స్ పోటీ నుంచి తప్పుకున్నారు. టీడీపీ నుంచి తొమ్మిది మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకుని పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, రాజంపేట పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మహేశ్వరెడ్డి ఊహించని విధంగా నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

bjp 29032019

కడప జిల్లా రామాపురం మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎన్ఆర్ఐ మహేశ్వరరెడ్డిని బీజేపీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. గురువారం మధ్యాహ్నం తన నామినేషన్ ఉపసంహరించుకున్న మహేశ్వరరెడ్డి ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ జోష్ చూసి బీజేపీలో చేరి రాజంపేట లోక్‌సభ టిక్కెట్ దక్కించుకున్నట్టు ఎన్ఆర్ఐ మహేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటిలో బీజేపీకి కాస్త క్యాడర్ ఉన్నా, లోతుకు వెళ్లి చూస్తే పరిస్థితులు అనుకూలంగా లేవని అర్ధమైందని అన్నారు. అందువల్లే నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు వివరించిన మహేశ్వర్ రెడ్డి, తాను తొలి నుంచి వైసీపీలో ఉన్నానని, తదుపరి కార్యాచరణపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని అన్నాడు.

bjp 29032019

వైసీపీకి మద్దతుదారుగా ఉన్న మహేశ్వరరెడ్డి టిక్కెట్ కోసమే తమ పార్టీలో చేరినట్టు బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఒత్తిడి చేయడం వల్లే ఆయన పోటీ నుంచి తప్పుకున్నారా? అనే కోణంలో అనుమానిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా రాజంపేట నుంచి పురందేశ్వరి పోటీచేయగా ఆమెకు 4,26,990 ఓట్లు లభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాయలసీమలోనే అడుగుపెట్టబోతున్నారు. కర్నూలులో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసగించనుండగా, రాజంపేట అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ నేతలు కంగారుపడుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడ రోడ్‌షోలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీ గుడివాడ అభ్యర్థి కొడాలి నానిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ‘ఎక్కడ పుట్టాడు ఈయన, ఎక్కడ పెరిగాడు ఈయన, ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు ఈయన’ అని కొడాని నాని టీడీపీలో ఎదిగిన క్రమాన్ని చంద్రబాబు గుడివాడ సభలో గుర్తుచేశారు. ‘పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి అవునా, కాదా’ అని కొడాలి నానిని ఉద్దేశించి చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి ఈరోజు మాటలు పెద్దపెద్దగా మాట్లాడుతున్నాడని చంద్రబాబు విమర్శించారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి అని కొడాలిపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని క్షమించడానికి వీలులేదని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.

kodali 290632019

ఇలాంటి దుర్మార్గుల్ని చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. మామూలప్పుడు కనపడని, ఎలక్షన్స్ అప్పుడు మూటలతో వస్తాడని.. ఆ మూటలతో ఓట్లు కొంటాడని చంద్రబాబు కొడాని నానిపై విమర్శలు చేశారు. దేవినేని అవినాష్ ఇక్కడే ఉంటానని ఇల్లు కూడా కొనుక్కున్నాడని చెప్పారు. వెంట ఉండే దేవినేని అవినాష్‌ను గెలిపించుకోవాలని ఓటర్లకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్‌ అధికారంలో వస్తే అమరావతి అభివృద్ధి ఆగిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్‌ వస్తే అమరావతిలో ఎవరూ పెట్టుబడులు పెట్టరన్నారు. జగన్‌ను చూస్తే పారిశ్రామిక వేత్తలు పారిపోతారని విమర్శించారు. కేసీఆర్‌తో జగన్‌ కలవడం క్షమించరాని నేరమని చెప్పారు. మనల్ని దున్నపోతులు.. కుక్కలు అన్నారని.. ఆంధ్రావారిని ఛీకొట్టారని కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తుచేశారు. అలాంటి వారితో జగన్‌ కలిసివెళ్తున్నారని ఆరోపించారు. 

kodali 290632019

ఏపీకి అన్యాయం చేస్తున్న వ్యక్తి కేసీఆర్‌ అని వివరించారు. బంగారు బాతు లాంటి హైదరాబాద్‌ను అనుభవిస్తూ కేసీఆర్‌ మనల్ని తిడుతున్నారని మండిపడ్డారు. కేసుల కోసం కేసీఆర్‌తో జగన్‌ రాజీపడ్డారన్నారు. సొంత బాబాయి హత్యకు గురైతే గుండెపోటు అని డ్రామాలాడారంటూ ధ్వజమెత్తారు. అయినా మనపై తెలంగాణ పెత్తనం ఏంటి?, మీకు రోషం ఉందా లేదా?, మోదీ మోసం చేశాడా లేదా? అని ప్రశ్నించారు. మోదీ మనపై దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. మోదీకి ఇవే చివరి ఎన్నికలు అని హెచ్చరించారు. మాపై దాడులు చేసి మీరు గెలవలేరన్నారు. రాష్ట్రానికి ప్రజలు కవచంలా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తాను ఐదేళ్లు అహర్నిశలు కష్టపడింది ఎవరి కోసమని అడిగారు. సంక్షేమ పథకాలు తెచ్చింది ఎవరి కోసమని ప్రశ్నించారు. మీరంతా తనకు వెన్నుదన్నుగా ఉండాలని కోరారు. టీడీపీకి ఓటు వేయకుంటే తాను ఎవరి కోసం కష్టపడినట్లని ప్రశ్నించారు. అందుకోసమే తనకు మరో అవకాశం ఇవ్వాలన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలతో భవిష్యత్‌ను మార్చుకుందామని విన్నవించారు.

వైసీపీ నేతల ఫ్రెస్టేషన్ పీక్ స్టేజ్‌కు వెళ్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రచారానికి రాలేదని విశాఖలోని గాజువాకలో ఓ గర్భిణీపై వైసీపీ నేతలు దాడి చేయడం అమానుషమని అన్నారు. వైసీపీ అరాచకాలను అందరూ ఖండించాలని అన్నారు. నేరగాళ్ల పార్టీ వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపు ఇచ్చారు. జగన్‌కు ఓటే్స్తే నేరగాళ్లకు ఓటేసినట్లేనని అన్నారు. దేశం దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్‌పైనే ఉందని, రేపటి ప్రజా తీర్పు దేశానికే ఓ దిక్సూచి అని అన్నారు. జమ్మూకశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ వచ్చి టీడీపీకి ప్రచారం చేశారని త్వరలోనే మమత, అఖిలేష్ వస్తున్నారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై 22 పార్టీల నేతలు అండగా ఉన్నారని, బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ మాత్రమే ఏపీకి వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు.

frustration 29032019

బీజేపీ, దాంతో అంటకాగే వైసీపీని చిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ గెలుపు మొత్తం దేశానికే మలుపు అవుతుందని అన్నారు. రాబోయే 13 రోజులు టీడీపీ శ్రేణులు అవిశ్రాంతంగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఒత్తిడిలోనూ విరోచితంగా పోరాడాలని సూచించారు. వైసీపీ ప్రలోభాలకు లొంగబోమనీ, బీజేపీ, టీఆర్ఎస్ బెదిరింపులకు దడచుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. టీడీపీని ఎంతగా అణగదొక్కితే అంతగా విజృంభిస్తామని హెచ్చరించారు. కర్ణాటక మంత్రులపై ఐటీ దాడులు నిర్వహించడం బీజేపీ వేధింపులకు పరాకాష్ట అని చంద్రబాబు మండిపడ్డారు. ఓటమి భయంతో బీజేపీ తప్పులమీద తప్పులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, సేవామిత్రలు, బూత్ కన్వీనర్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

frustration 29032019

పారిశ్రామిక, క్షీర, హరిత విప్లవాల తరహాలోనే రాష్ట్రంలో సంక్షేమ విప్లవం తెచ్చిన ఘనత తెదేపాదేనని చంద్రబాబు అన్నారు. పేదరికం లేని ఆనందదాయక సమాజం ఏర్పాటే తెదేపా లక్ష్యమని, ఈ సంక్షేమ విప్లవాన్ని ఎన్టీఆర్‌కు అంకితం చేస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం సభ్యులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వాడవాడలా పసుపు జెండా రెపరెపలాడాలని సీఎం ఆకాంక్షించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల మధ్య వేడుకగా జరపాలన్నారు. ఎన్టీఆర్ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. 38 ఏళ్లుగా తెదేపాని గుండెల్లో పెట్టుకొని, పసుపు జెండా భుజాన మోస్తున్న సైనికులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 38 ఏళ్ల చరిత్రలో ఏ పార్టీకీ దక్కని గౌరవం తెదేపాకి దక్కిందని, మొత్తం 23 ఏళ్ల అధికారం ప్రజల్లో తెదేపా ఆదరణకు నిదర్శనమన్నారు.

Advertisements

Latest Articles

Most Read