నిన్న కర్నూల్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభ జరిగిన విషయం తెలిసిందే. ఎస్టీబీసీ మైదానంలో నిర్వహించిన ఈ సభకు ప్రధాని మోదీ హాజరుకావడంతో భారీ భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు స్టేడియంలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో తనీఖల్లో వారికి అవాక్కయ్యే దృశ్యాలు కనిపించాయి. తనిఖీ చేసే సందర్భంలో కొందరు కార్యకర్తల జేబుల్లో వైసీపీ జెండాలు, కండువాలు కనిపించాయి. ఇది బీజేపీ మీటింగ్ కదా, మరి వైసీపీ జెండాలు ఉన్నాయి ఏంటి అని అవాక్కయ్యారు. ఇలా ఒకరు ఇద్దరు కాదు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో ఒక్కసారిగా సెక్యూరిటీ వారికి ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు. ఈ విషయాన్ని అధికారుల వద్దకు తీసుకువెళ్ళారు.
ఏ ఆదేశాలు వచ్చాయో కాని, అప్పుడు వారిని లోపలకి పంపించారు. అయితే, కార్యకర్తల జేబుల్లో వైసీపీ జెండాలు, కండువాలు స్వాధీనం చేసుకుని పక్కనపడేసిన అనంతరం వారిని లోపలికి పంపించారు. లోపలికి వచ్చిన కొందరు వైసీపీ కార్యకర్తలు బారికేడ్లకు ఆ పార్టీ జెండాలు తగిలించారు. 5 కోట్ల ఆంధ్రులను నమ్మించి మోసం చేసి, ఢిల్లీ అహంకారాన్ని, ఆంధ్రుల పై రుద్దుతున్న మోడీ పై, యావత్త ఆంధ్రప్రదేశ్ ఆందోళన చేస్తుంటే, వైసీపీ అధ్యక్షుడు జగన మోహన్ రెడ్డి మాత్రం, ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. కొన్ని రోజుల క్రిందట, గుంటూరులో జరిగిన మోడీ సభకు ఒక పక్క జగన్, ఒక పక్క మోడీ ఫోటోలు, జెండాలు పెట్టి మరీ ప్రజలను తరలిస్తున్నారు.
మరో పక్క, కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు, మోడీకి స్వాగతం పడుతూ, బ్యానర్లు కట్టారు. బీజేపీ..వైసీపీ అక్రమ సంబంధానికి ఇంతకంటే రుజువులు కావాలా?? రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వెనకనుండి మద్దతు ఇచ్చింది ఎవరో తెలిసిందా? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. ఇవ్వడం కుదరదు అన్న బీజేపీ తో కలిసి హోదా తెస్తారా వీళ్ళు....?? కేసుల కోసం మోడీ కాళ్లదగ్గర మొకరిల్లే వీళ్ళ వలన రాష్ట్రానికి ప్రయోజనం ఉందా?? బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీపై పోరాడాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఒకవేళ ప్రధాని సభకు ప్రజాదరణ కరువైతే... చంద్రబాబు వాదనకు బలం చేకూరినట్లవుతుందని, దీనికోసమైనా బీజేపీ సభకు సహకరించాలని వైసీపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు నిర్ణయించుకున్నారు.