ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్ చేసిన ఒక కామెంట్ దేశ రాజకీయాలనే కుదిపేస్తోంది. నిజానికి ఫరూక్ చేసినది ఒక కామెంట్ కాదు.. చాలా రోజులుగా తన మదిలో దాచుకున్న రహస్యాన్ని ఆయన బైట పెట్టారు. జగన్ అధికార దాహం ఎలా ఉంటుందో ఆయన వెల్లడించారు. తండ్రి వైఎస్ చనిపోయిన కొన్ని రోజులకే జగన్ ప్రదర్శించిన పేరాశకు ఫరూక్ చెప్పిన మాటలే నిదర్శనం. ఫరూక్ వెల్లడించినది జగన్‌లోని ఒక కోణంలో ఒక శాతం మాత్రమే. చెప్పింది కొంతే వెల్లడించాల్సిందీ చాలా ఉందని ఫరూక్ అబ్దుల్లా చెప్పకనే చెప్పేశారు. ఫరూక్ ఒక రోజు పర్యటనలోనే మేజర్ ఇష్యూ బైటకు వచ్చేసింది. మరి ఇప్పుడేం జరగబోతోందనేది పెద్ద ప్రశ్నే. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారానికి వచ్చే నేతలు ఏం చెప్పబోతున్నారు. త్వరలో రాబోయే ఎన్సీపీ నేత శరద్ పవార్.. ఇంతకంటే పెద్ద బాంబు పేల్చబోతున్నారా? పవార్ ఏం చెప్పబోతున్నారు? జగన్ వ్యవహారంలో ఇంతవరకు జరిగిందేమిటి?

jaganguttu 28032019

ఇటు ఫరూక్ అటు పవార్.. ఇద్దరూ జగన్‌ను దగ్గర నుంచి చూసిన వాళ్లే. వైఎస్ చనిపోయినప్పుడు జగన్ లోక్ సభ సభ్యుడిగా ఉండేవారు. ఢిల్లీలో అందరితో మాట్లాడేవారు. అవసరం కోసం తెలివిగా అందరితో పరిచయం కూడా పెంచుకున్నారు. తండ్రి వైఎస్ మరణం తర్వాత సీఎం పదవి కోసం లాబీయింగ్ మొదలు పెట్టారు. శరద్ పవార్‌తోనూ తరచూ మాట్లాడేవారు. తొలుత ఫరూక్ అబ్దుల్లా ద్వారా కాంగ్రెస్‌కు గాలం వేయాలనుకున్నారు. జగన్ ప్రతిపాదన చూసి కాంగ్రెస్ నేతలే నోరు వెళ్లబెట్టే పరిస్థితి నెలకొంది. అప్పటికే జగన్ అవినీతి సంగతి తెలుసుకున్న సోనియా, సహా ఇతర నేతలు వైఎస్‌ను హెచ్చరించారు. అసలు జగన్ అవినీతి సంపాదనకు సంబంధించిన వివరాలు తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది.. తాము హెచ్చరించడంతో వైఎస్ తన తనయుడిని దారికి తెచ్చి ఉంటారని అనుకున్నారు. అయితే వైఎస్ మరణం తర్వాత జగన్.. సీఎం పదవి కోసం నేరుగా 1500 కోట్ల ప్రతిపాదన చేయడంతో పార్టీ నేతలు షాక్‌కు గురయ్యారు. అది జగన్ ప్రయత్నాల్లో పార్ట్ వన్ మాత్రమే..

jaganguttu 28032019

వైఎస్ పాత మిత్రులైన శరద్ పవార్ లాంటి పెద్దలు జగన్‌ను దారికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం ఆయన కథలో పార్ట్ టూ అని చెప్పాలి. వైఎస్ చనిపోయిన కొద్ది రోజులకే జగన్ దూకుడును చూసి పవార్ విస్తుపోయారు. ఒక్కసారి పిలిచి మాట్లాడితే యువకుడైన జగన్ అర్థం చేసుకుంటారనుకున్నారు. అక్కడే పొరపాటు పడ్డానని ఆయనకు తర్వాత అర్థమైపోయింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటైన తర్వాత మళ్లీ జగన్ తీరు బైట పడుతోంది. చంద్రబాబు ఆహ్వానం మేరకు కూటమిలో భాగస్వాములైన పలువురు నేతలు ఏపీలో ప్రచారానికి వస్తున్నారు. ఫరూక్ వచ్చిన వెళ్లారు. పవార్ వస్తున్నారు. మమతా బెనర్జీ, దేవెగౌడ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ త్వరలో రాబోతున్నారు. పవార్ ఏం చెప్పబోతున్నారు? జగన్ నేచర్ ఎలాంటిదో ఆయన కుండబద్దలు కొట్టి చెప్పబోతున్నారా? మనకు తెలియని, ఏపీ ప్రజలు విస్తుపోయే నిజాలు వెల్లడించబోతున్నారా? ఢిల్లీలో జగన్‌తో పరిచయం ఉన్న నేతలంతా తలో నిజం బైటపెట్టబోతున్నారా? ఎందుకంటే అఖిలేష్ యాదవ్ లాంటి వారికి జగన్ నేచరేమిటో బాగానే తెలుసు కదా..? ఫరూల్ అబ్దుల్లా ఒక బాంబు పేల్చితే.. మిగతా వాళ్లు పది బాంబులు పేల్చబోతున్నారా ? జగన్ గతంలో పన్నిన వ్యూహాలు మరిన్ని బైటకు రాబోతున్నాయా?

 

 

మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి.. సీబీఐ మాజీ జేడీ, ప్రస్తుత జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ ఆసక్తికర విషయాలు బయపెట్టారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వివేకా వ్యక్తత్వాన్ని ప్రశంసించారు. లక్ష్మీనారాయణకు, టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌కు బంధుత్వాన్ని అంటగడుతూ.. అప్పట్లో వివేకానంద రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వివేకా తనకు ఫోన్ చేసి... ‘‘బాబూ తప్పైంది.. వేరే వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు అలా మాట్లాడాను. ఆఫీసుకు వచ్చి క్షమాపణలు చెబుతాను’’ అన్నారని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఎవరో చెప్పినది విని అలా రియాక్ట్ అయ్యుంటారని.. కాబట్టి దీన్ని అంత సీరియస్‌గా తీసుకోనవసరం లేదని తాను వివేకాతో చెప్పానన్నారు. ఆయన ఆలోచన తీరు అలా ఉంటుందని లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా తనకు ఎలాంటి సబంధం లేదని తెలిపారు. తిత్లీ తుఫాను సమయంలోనే చంద్రబాబును తొలిసారి కలుసుకున్నా అన్నారు.

lakshminarayana 28032019

ఇక విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి, వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్న లక్ష్మీనారాయణ.. విశాఖవాసుల మనసు గెలచుకునేందుకు కొత్త పంధాను ఎంచుకున్నారు. విశాఖకు స్పెషల్ మేనిఫెస్టో అంటూ సంచలన ప్రకటన చేశారు. విశాఖకు మేనిఫెస్టోను బాండ్ పేపర్ మీద ఇవ్వబోతున్నానని.. వాటిని చేయకుంటే తనను కోర్టుకు లాగొచ్చని.. ఆ దమ్ము తమ పార్టీకి ఉందని వ్యాఖ్యానించారు. జేడీ ప్రకటనను జనసేన పార్టీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో ‘విశాఖపట్నానికి మేనిఫెస్టో నేను బాండ్ పేపర్ మీద ఇవ్వబోతున్నాను. రేపు నన్ను కోర్టుకు లాగొచ్చు మీరు చెయ్యలేదు అని. ఆ దమ్ము ఉంది మాకు’అన్నారు.

lakshminarayana 28032019

నామినేషన్ వేసిన రోజే 24 గంటలు విశాఖవాసులకు అందుబాటులో ఉంటానని చెప్పిన లక్ష్మీనారాయణ.. అవసరమైతే బాండ్ పేపర్ కూడా రాసిస్తానన్నారు. తాను రాజకీయాలపైనే దృష్టి పెట్టానని.. మాఫియాలు సపోర్ట్‌ చేసే నాయకులు కావాలా.. సమర్థవంతమైన నాయకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. మిగతా పార్టీలు డబ్బులు ఇచ్చి ముందుకు వస్తే.. జనసేన మాత్రం ఆ గబ్బును వదిలించడానికి ముందుకు వచ్చిందన్నారు. కలాం స్ఫూర్తితో, యువతను ఓ మార్గంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందన్న ఆలోచనతోనే జనసేనలో చేరానన్నారు. తనను అన్ని పార్టీలు ఆహ్వానించాయని, అయితే జీరో బడ్జెట్ రాజకీయాలు చేసేవారితో కలవాలని పవన్ కల్యాణ్‌తో చేతులు కలిపానన్నారు.

వైసీపీ ఆగడాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో అరాచకం చేస్తున్నారు. ఒక పక్క కేంద్రంలో మోడీని అడ్డు పెట్టుకుని, వ్యవస్థలు నాశనం, మరో పక్క బీహార్ ప్రశాంత్ కిషోర్ ఐడియాలతో అరాచాం, ఇలా, రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ, వీళ్ళ అరాచకం ఎక్కువై పోతున్నాయి. తాజగా వీళ్ళ సైకో చేష్టలు బయట పడ్డాయి. వైసీపీ కి ఓటు వేయమనిచెప్పినందుకు వైసీపీ నాయకుడు నాగేశ్వరరావు సిద్దు నాగమణి దంపతులపై దాడి చేశారు. నాగమణి గర్భం పోయే పరిస్థితి వచ్చింది. గర్భవతి అని కూడా చూడకుండా, ఆమెను కొట్టి, జగనన్నకే ఓటు వెయ్యాలి అని బెదిరించారు. అయితే ఈ పెనుగులాటలో, ఆమె గర్భం పొయే పరిస్థితి వచ్చింది.

arachakam 280032019 1

విశాఖ జిల్లా పెదగంట్యాడ లో ఈ వైసీపీ నాయకులు చేసిన అరాచకం. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తామని చెప్పినందుకు వైసీపీ నాయకుడు దాడి చేసి ఆమె గర్భాన్ని కోల్పోయే స్థితికి తెచ్చారు. అధికారంలోకి లేకపోతే నే ఇంత రౌడీయిజం చేస్తున్నారు. నేను ఉన్నాను నేను విన్నాను అనే జగన్ ఏమి విన్నాడు ఎక్కడ ఉన్నాడు? ఇలా అరాచకాలు చేస్తూ, ప్రతి రోజు పెట్రేగిపోతున్నారు. మొన్నటికి మొన్న, ఏకంగా తెలుగుదేశం ఎమ్మల్యే అభ్యర్ధి పైనే దాడి చేసి, కత్తులతో దాడి చేసి, ఆయన ప్రచారం కూడా చేసుకునే అవకాసం లేకుండా చేసారు. ఇప్పుడు ఇలా సామాన్య ప్రజలను కూడా భయపెడుతున్నారు.

కడప జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మను తక్షణం బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. సీనియరు అధికారికి జిల్లా బాధ్యతలు అప్పజెప్పాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్‌.వివేకా నందరెడ్డి హత్య కేసులో నిందితుల అరెస్టులు ఆపేందుకే ఈ బదిలీ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. రాహుల్‌దేవ్‌ శర్మ బాధ్యతలు చేపట్టి సరిగ్గా 38 రోజులకే బదిలీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. కాగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మ హైకోర్టును ఆశ్రయించ డంతో వివేకా హత్యపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ వివరాలను మీడియాకు వివరాలు వెల్లడించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సమయంలో ఇలా ఎస్పీ బదిలీ కావడం సర్వత్రా చర్చ సాగుతోంది.

rahuk 28032019

మూడు నెలల క్రితం అభిషేక్‌ మహంతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయ కారణాలతో మహంతిని ఈ ఏడాది ఫిబ్రవరి 18న ప్రభుత్వం బదిలీ చేసింది. గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్న రాహుల్‌దేవ్‌ శర్మను జిల్లా ఎస్పీగా నియమించడంతో ఆయన ఫిబ్రవరి 18న ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. వచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూలు ప్రకటించడం, ఎన్నికల ఏర్పాట్లలో బిజీబిజీగా ఎక్కడా కూడా రాజీలేకుండా విధులు నిర్వహిస్తున్న రాహుల్‌దేవ్‌ శర్మకు కొద్ది కాలంలోనే సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఈ నెల 15న మాజీ మంత్రి వైఎస్‌.వివేకా నందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వీరిపై ఎస్పీ నేతృత్వంలో 7 బృందాలు, ప్రభుత్వం నియమించిన సిట్‌ లో 5 బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. వివేకా అనుచరులే హంతకులన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. సిట్‌ బృందం వివేకా కుటుంబ సభ్యులతో పాటు ఇది వరకు 65 మంది అను మానితులను విచారించింది. త్వరలో ఈ కేసు ఛేదించి వివేకా హత్యకు కారణాలు పోలీసులు వెల్లడించాలని కేసు దర్యాప్తు వేగవంతం చేశారు.

rahuk 28032019

పోలీసు విచారణ పూర్తిగా గోప్యంగా సాగుతూ వచ్చింది. ఎన్నికల సమయంలో నిందితులు ఎవరన్నది తేలితే ఇబ్బందులు వస్తాయని ఎస్పీని బదిలీ చేస్తే సరిపోతుందని కొందరు వ్యవహరిం చారు. నామినేషన్‌ వేసేందుకు పులివెందులకు వచ్చిన రోజున జగన్‌ మాట్లాడుతూ రానున్న మూడు రోజుల్లో దహనాలు, కొందరిని అరెస్టు చేస్తారని వెల్లడించారు. మీరే ఓట్లు వేయించే బాధ్యత తీసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వివేకా సతీమణి హైకోర్టును ఆశ్రయించి రాష్ట్ర పోలీసు దర్యాప్తు వద్దని, స్వతంత్ర దర్యాప్తు విచారణ చేపట్టాలని పిటీషన్‌ వేశారు. ఇదిలా ఉండగా వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత తన తండ్రి హత్యను రాజకీయం చేస్తున్నారని పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర హోం శాఖ, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌, పోలీసు బృందాలు దాదాపు ఈ కేసు మిష్టరీని ఛేదిస్తూ కొందరు ముఖ్యులను అరెస్టుచేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. వివేకా హత్య కేసు కారణంగానే ఎస్పీ బదిలీ అయ్యారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కాగా, ఎస్పీ బదిలీ కావడంతో ఇక వివేకా హత్యకేసు వ్యవహారం ఇక అటక ఎక్కినట్లేనని, ఎన్నికలు అయిపోయేదాకా ఈ మిస్టరీ వీడే అవకాశం లేదని ప్రచారం సాగుతోంది.

 

 

రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీపార్వతి కోణంలో వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని అనేక వివాదాలు చుట్టిముట్టాయి. ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ.. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి ఆయన్ని మానసిక క్షోభకు గురిచేశారంటూ వేసిన క్యాసేట్టే వేస్తూ, హంగామా చేస్తూ, వాస్తవ ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో చూపించబోతున్నానంటూ టీజర్, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్స్, వీడియోలతో వర్మ వేసిన వేషాలు చూసాం. ఇక ఎన్నికలకు మరో 13 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పుడు ఈ సినిమా పై అనవసర రాద్ధాంతం లేకుండా చూస్తున్నారు.

court 28032019 2

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలను అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ న్యాయవాది ఎస్‌ఎస్‌రావు, తెదేపా నేత పి.మోహన్‌రావుల పేరిట దాఖలైన రెండు వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు ధర్మాసనం ప్రాథమిక విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ చిత్రంలో అధికారపార్టీని తక్కువచేసి ఈ సినిమాలో చూపారని, అభ్యంతరకర సన్నివేశాలున్నాయని పేర్కొన్నారు.హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. అనంతరం గురువారానికి వాయిదా వేసింది. ఇది ఇలా ఉండగానే, ఈ రోజు ఈ విషయం పై మంగళగిరి కోర్ట్ తన తీర్పు ఇచ్చింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై ఇంజన్క్షన్ గ్రాంట్ చేసింది కోర్ట్.

court 28032019 3

15 /4 /2019 వరకు సినిమా హాళ్లలో ప్రదర్శన , సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ యూట్యూబ్ , ట్విట్టర్,ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ తదితర మీడియా లలో కూడా ప్రదర్శన పై కూడా ఇంజన్క్షన్ ఆర్డర్ ఇచ్చింది. అంటే, ఏప్రిల్ 15 వరకు ఈ సినిమా విడుదల చెయ్యటానికి లేదు. మరో పక్క, రాంగోపాల్ వర్మ రాకేష్ రెడ్డి , అగస్త్య మంజు తదితరులకు నోటీసులు పంపమని కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది. చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి ప్రతికూల అంశాలతో నింపేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలైతే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆ సినిమా విడుదలను ఆపేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీడీపీ శ్రేణులు. ఎన్నికలు తొలిదశ పూర్తయ్యే వరకూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అడ్డుకోవాలని టీడీపీకి చెందిని సాధినేని యామిని తదితరులు ఈసీని కలిసి ఫిర్యాదు చేసిని విషయం తెలిసిందే.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read