ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ వ్యూహం సినిమాకి నిర్మాత దాసరి కిరణ్ కి టీటీడీ పాలకమండలి సభ్యత్వం కానుకగా ఇచ్చారు. జగన్ గురువు స్వరూపానంద సిఫారసుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి బూదాటి లక్ష్మీనారాయణపై గతంలో బోర్డ్ మెంబెర్ ఇవ్వగా, ఇప్పుడు సీబీఐ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. దీంతో లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేసారు. ఖాళీ అయిన టిటిడి పాలకమండలి సభ్యత్వాన్ని దాసరి కిరణ్ కి ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. టిడిపి ప్రభుత్వ హయాంలో శేఖర్ రెడ్డికి టీటీడీ పాలకమండలి సభ్యత్వాన్ని ఇవ్వడాన్ని తప్పుబట్టిన జగన్ ..అదే శేఖర్ రెడ్డికి తాను సీఎం అయిన వెంటనే పేరు జనాలు గుర్తు పట్టకుండా టీటీడీ మండలిలోకి తీసుకున్నారు. టీటీడీ పాలకమండలిని వైసీపీ క్విడ్ ప్రోకో వ్యవహారాల వేదికగా మార్చేశారనే ఆరోపణలున్నాయి. వివాదాస్పద నిర్ణయాలతో ఇప్పటికే టీటీడీ ప్రతిష్ట మంట గలిపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ .. ఇప్పుడు తన జీవితాన్ని సినిమాగా తీస్తున్న నిర్మాతకి ప్రతిఫలంగా టిటిడి పాలకమండలి సభ్యుడిని చేసేశారు. ముఖ్యమంత్రి జగన్ బయోపిక్ ``వ్యూహం`` సినిమాకి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాని దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. తన జీవితాన్ని సినిమాగా తీస్తున్నారనే ఒకే ఒక కారణంతో దాసరి కిరణ్ కుమార్ కీ టీటీడీ పాలకమండలి పదవి కట్టబెట్టడంపై వైసీపీలోనే తీవ్ర చర్చ నడుస్తోంది.
news
పరువు పాయే... ఏపి అప్పుల పై, లోకసభలో సంచలన ప్రకటన చేసిన కేంద్రం...
ఆంధ్రప్రదేశ్ దుస్థితి దా"రుణం"గా వుందని కేంద్రం వెల్లడించింది. పూర్తిగా అప్పుల ఊబిలో ఏపీ కూరుకుపోయిందని పార్లమెంట్ వేదికగా వాస్తవాలను కేంద్రం స్పష్టం చేసింది. ఏటేటా విపరీతంగా పెరుగుతున్న ఏపీ అప్పుల భారం ఏ రేంజ్ లో ఉందో లెక్కలతో కేంద్రం బయటపెట్టింది. లోక్‍సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరాలు వెల్లడించారు. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2,29,333.8 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.3,60,333.4 కోట్లకు చేరాయి. మరోవైపు ఏటా అప్పుల శాతం పెరిగిందని గణాంకాలు తేల్చేశాయి. ఆర్థిక మంత్రి బుగ్గన బుకాయింపులు, సలహాదారుల సన్నాయి నొక్కులు కేంద్రం లెక్కల ముందు తేలిపోయాయి. గతంతో పోలిస్తే 2017-18లో రుణాలు 9.8 శాతం తగ్గితే 2020-21 నాటికి 17.1 శాతం పెరుగుదల నమోదైంది. ఏపీ స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం - పెరుగుతూ వస్తోంది అని మంత్రి తెలిపారు. ఉన్న అప్పులు, బడ్జెట్‍లో చూపిన అప్పుల కంటే బడ్జెటేతర అప్పులను భారీగా ఏపీ ప్రభుత్వం చేస్తోందని కేంద్రం పార్లమెంటులో కుండబద్దలు కొట్టింది.
చేపల కూర కర్రీ పాయింట్... ఏపి ప్రభుత్వం కొత్త పధకంతో అవ్వకయిన యువత..
ఎన్నికలకు ముందు అన్నివర్గాలకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక నవరత్నాలు తప్పించి ఇతరత్రా ఏ హామీలు నెరవేర్చే స్థితి లేదు. క్రమంతప్పకుండా ప్రతి ఏటా డిఎస్సీ వేస్తామని వేయలేదు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ ప్రతీ ఏటా జనవరి1న ఇస్తామన్న జాబ్ క్యాలెండరూ ఇవ్వలేదు. నాలుగేళ్లు పూర్తి కావస్తున్న నేటికీ కూడా టీచర్ ఉద్యోగాలు భర్తీకి ఒక్క డిఎస్సీ కూడా వేయలేదు. కొత్త పరిశ్రమలు రాక, ఉన్నవి తరలిపోతున్న సంక్షోభ పరిస్థితుల్లో ఏపీలో ఉపాధి మార్గాలు మూసుకుపోయాయి. నిరుద్యొోగులు, విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు విదేశాలకు వలస పోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి సర్కారు నిరుద్యోగ యువతకు చేపల కూర పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం డ్వాక్రా మహిళలూ సద్వినియోగం చేసుకోవచ్చని ప్రకటించింది. చేపలు, రొయ్యలతో రకరకాల వంటకాలు తయారు చేసేందుకు శిక్షణ ఇవ్వడంతోపాటు అవి అమ్ముకునేందుకు కర్రీ పాయింట్లలా ఏర్పాటు చేసుకోవడానికి రుణాలూ ఇవ్వాలని వైసీపీ సర్కారు ఆలోచిస్తోంది.
ఇప్పటికే చేపలు, రొయ్యల దుకాణాలను ఫిష్ ఆంధ్రా పేరుతో ఆర్బాటంగా ఆరంభించి మూసేశారు. మటన్ మార్టులూ మాయం అయ్యాయి. ఫిష్ ఆంధ్రా ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు చేపలు, రొయ్యల వంటకాలతో రెస్టారెంట్లు పెట్టుకోవాలని నిరుద్యొోగులకు సర్కారు ఆఫర్ ఇస్తోంది. ఈ హోటళ్ల ఏర్పాటుకు అవసరమైన రాయితీ రుణాలను బ్యాంకుల నుంచి ఇప్పిస్తామని జగన్ ప్రభుత్వం నమ్మబలుకుతోంది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపలు, రొయ్యల వంటలు చేయడంలో శిక్షణ ఇస్తామని, స్వయం ఉపాధి రుణాల మోడల్లోనే లబ్ధిదారుల వాట, రాయిితీతో రుణం ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెబుతున్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతూ..కొత్తవి రాని దశలో ఈ చేపల కూర వండే పథకంలో యువత చేరతారా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
అనంతపురంలో వైసీపీకి ఇదేమి ఖర్మ? పెద్దిరెడ్డి వల్ల కూడా కానంతగా దిగజారిపోయింది...
అనంతపురం జిల్లాలో వైసీపీకి ఇదేం ఖర్మ అని తలలు పట్టుకుంటున్నారు వైసీపీ నేతలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరువాత పార్టీలో అన్నీ తానై నడిపించే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా అంతటా వైసీపీలో అసమ్మతిని చక్కదిద్దేందుకు పెద్దిరెడ్డి రంగంలోకి దిగారని తెలుసుకున్న నేతలు ఎక్కడిక్కడే తమ బలప్రదర్శనకి వేదికగా చేసుకున్నారు. పెనుగొండలో మాజీ మంత్రి శంకరనారాయణ తీరు పట్ల తీవ్ర కోపంగా వున్న వైసీపీ అసమ్మతి నేతలు పెద్దిరెడ్డి పై చెప్పులు విసరడానికి కూడా వెనుకాడలేదు. పరిస్థితి చక్కదిద్దేందుకు దిగిన పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా స్థానిక వైసీపీ నేతలు నిరసనకి దిగడం అధిష్టానాన్ని షాక్ కి గురిచేసింది. పెద్దిరెడ్డి కాన్వాయ్ కి అడ్డంపడడం తీవ్రంగా పరిగణించినా అసమ్మతి నేతలు లెక్కచేయలేదు. మంత్రి ఉషశ్రీ పై వ్యతిరేకత కూడా పెద్దిరెడ్డిపై ప్రతిబింబించింది. అసమ్మతి చక్కదిద్దేందుకు పెద్దిరెడ్డి హాజరయ్యే ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. కదిరి, హిందూపురం, పుట్టపర్తి నియోజకవర్గాల వైసీపీలోనూ తిరుగుబాట్లు వైసీపీ పెద్దలు పెద్దిరెడ్డికి తలపోటుగా మారాయి.