పల్నాడులో మొన్న టిడిపి నేతలపై జరిగిన దా-డుల మంట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఘటన పై వెంటనే స్పందించాలని చంద్రబాబు డిజీపికి లేఖ రాసారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపి నేతలు, కార్యకర్తలపై జరిగిన హింసాత్మక దాడుల గురించి డీజీపీకి చంద్రబాబు వివరంగా లేఖ రాసారు. గడిచిన మూడేళ్ళ ల్లో వైసిపి నేతలు చేస్తున్న దాడులు గురించి , రాజకీయ హ-త్య-ల గురించి, ఈ లేఖలో స్పష్టం చేసారు. అంతే కాకుండా పోలీసుల వైఫల్యంపై కూడా చంద్రబాబు ఈ లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి చర్యలకు పాలపడుతున్న నిందితులకి, వారికి సహకరిస్తున్న పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

తిరుపతి లో హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కుప్పంలో పోటీచేస్తారా అని మీడియా వారు అడిగిన ప్రశ్నలకు  హీరో విశాల్ క్లారిటీ ఇచ్చారు. తనకి ఏపి సీఎం జగన్ అంటే అభిమానమే కాని,  అయినా సరే వచ్చే ఎలక్షన్స్ కుప్పం నుంచి  పోటీ చేయను అని ఆయన స్పష్టం చేసారు. తనకు కుప్పంలో చాలా వ్యాపారాలు ఉన్నాయని ,  కుప్పం మొత్తం తనకు తెలుసని , అయిన గానీ తనకు మాత్రం  ఎమ్మెల్యేగా  పోటీ చేసే ఆలోచన లేదని ఆయన తేల్చి చెప్పారు.  ఎమ్మెల్యేల కంటే తాను ఎక్కువగానే  సంపాధిస్తున్నానని , ప్రజాసేవ  సేవ చేయాలంటే రాజకీయాలు ఒక్కటే మార్గం కాదని విశాల్ కీలక వ్యాఖ్యలు చేసారు.

అమెరికాలో ఆంధ్ర తేజం విగ్రహమై అలరించనుంది. తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకం అన్న నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగు సంఘం వారు కథానాయకుడు, మహానాయకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎడిషన్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు ఎడిసన్ మేయర్ సామ్ జోషి అంగీకరించారు. అమెరికాలోని ఓ నగరంలో బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు కానున్న మొట్ట మొదటి విగ్రహం ఎన్టీఆర్ దే.  నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్రహ ఏర్పాటుకు నిధులు, స్థలం ఎంపిక, అనుమతులు సాధించడం వంటివన్నీ పూర్తి అయ్యాయి. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు, తెలుగు భాష వికాసానికి, మన సాహిత్యం, కళలు భావితరాలకు అందించడానికి ఎనలేని సేవలు అందించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కలని సాకారం చేసిన అసోసియేషన్ ప్రతినిధులను ప్రవాస తెలుగువారు అంతా అభినందిస్తున్నారు.

తమ కొడుకు చనిపోగా వచ్చిన పరిహారం రూ. 5లక్షలలో సగం మంత్రి అంబటి రాంబాబు వాటా అడిగారని, ఈ విషయం మేము బయటకు చెప్పామని చంపేస్తామని బెదిరిస్తున్నారని పర్లయ్య, గంగమ్మ దంపతులు ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయినవారికి ఇచ్చే పరిహారంలో మంత్రి అంబటి రాంబాబు సగం వాటా అడుగుతున్నారని  జనసేనాని పవన్​ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చేశారు. పవన్ వ్యాఖ్యలను నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అంబటి సవాల్​ చేశారు. ఒక రోజు గడవక ముందే అంబటి బాధితులు బయటికొచ్చారు. డ్రైనేజి ప్రమాదంలో తమ బిడ్డ చనిపోతే.. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారంలో అంబటి రాంబాబు సగం వాటా అడిగారని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన పర్లయ్య, గంగమ్మ దంపతులు ఆరోపించారు. సత్తెనపల్లి పట్టణంలో ఆగస్టు నెల 20వ తేదీన ఓ రెస్టారెంట్ లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరి ఆడక ముగ్గురు చనిపోయారు. వీరిలో తమ బిడ్డ తురకా అనిల్ కు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల పరిహారం చెక్కు రూపంలో వచ్చిందని, దీనికి లంచంగా మున్సిపల్ చైర్మన్ భర్త సాంబశివరావు 2 లక్షలు అడిగారని అనిల్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమను లంచం అడుగుతున్నాారని అంబటి రాంబాబుకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే, ఆయన పరిహారంలో సగం ఇచ్చి వెళ్లండి అంటూ హుకుం జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం మేము బయటకు చెప్పామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ వీడియోని జనసేన నేతలు, సోషల్మీడియా వైరల్ చేస్తోంది. రాజీనామా ఎప్పుడు అంబటి అని నిలదీస్తోంది.

Advertisements

Latest Articles

Most Read