బీజేపీ నేతల తీరుతో ఆ పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు లేకపోవడం, తనకు ఎంతో ఇష్టమైన గాంధీనగర్ సీటు నుంచి ఆ పార్టీ చీఫ్ అమిత్ షా బరిలోకి దిగుతుండడం, ఈ విషయం తనకు మాట మాత్రమైనా చెప్పకపోవడంతో అద్వానీ తీవ్ర మనస్తాపం చెందినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నిజానికి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవకపోవడం అద్వానీని బాధించలేదని, కానీ బీజేపీ నేతలు ఆయనను అవమానించేలా వ్యవహరించారని సీనియర్ నేత సన్నిహితులు చెబుతున్నారు. గాంధీనగర్ టికెట్‌ను తనకు కేటాయించకపోవడమే కాకుండా ఆ విషయాన్ని కూడా ఆయనకు చెప్పకుండా అవమానించారని పేర్కొంటున్నారు. అంతేకాదు.. జాబితా ప్రకటన తర్వాత కూడా బీజేపీ నేతలు ఎవరూ ఆయనను సంప్రదించకపోవడం అద్వానీని మరింత బాధించిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

pardhasaradhi 25032019

1989-92 ప్రాంతాల్లో సోమ్‌నాథ్‌- అయోధ్య రథయాత్రను చేపట్టి ఆడ్వాణీ బీజేపీని ఓ బలవత్తర రాజకీయ పార్టీగా మార్చడంలో సఫలమయ్యారు. హిందూత్వానికి ప్రతీక అయ్యారు. 1991లో విఫలమైనా 1998, 1999ల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆడ్వాణీ మార్గం ఉపకరించింది. వాజ్‌పేయి ప్రధాని అయినపుడు ఆడ్వాణీ ఉప ప్రధాని పదవిని కూడా అలంకరించారు. హోంమంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో ఓ వెలుగువెలిగిన ఆడ్వాణీ 2014లో మోదీ ప్రభంజనం తరువాత మసకబారిపోయింది. పార్టీపై పట్టు పెంచుకోవడానికి అమిత్‌ షాను అధ్యక్షుఢిగా చేసిన మోదీ- ఆ క్రమంలో ఆడ్వాణీని, మరో ఇద్దరు సీనియర్‌ అసమ్మతి నేతలు - మురళీ మనోహర్‌ జోషి, శాంతకుమార్‌ వంటి వారిని ‘మార్గదర్శక్‌ మండల్‌’ పేరిట మూల కూర్చోబెట్టారు. ఈ మండలి ఎన్నడూ సమావేశమైనది లేదు. పైపెచ్చు, ఆడ్వాణీని ఓ మీటింగ్‌లో మోదీ అసలు పలకరించకుండా చూసీ చూడనట్లు వెళ్లిపోయి నట్లు వీడియోలు వెలువడ్డాయి.

pardhasaradhi 25032019

ఈ విషయం పై, శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’లో బీజేపీని తూర్పారబట్టింది. అద్వానీ రాజకీయ ‘భీష్ముడు’ అని పేర్కొంది. ఆయనను బలవంతంగా రాజకీయాల నుంచి తప్పించారని ఆరోపించింది. ఆయనది బలవంతపు రిటైర్మెంట్ అని పేర్కొంది. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అద్వానీ.. వాజ్‌పేయితో కలిసి పార్టీని నడిపించారని పేర్కొంది. అద్వానీ స్థానాన్ని నేడు మోదీ, అమిత్ షాలు లాగేసుకున్నారని తీవ్ర విమర్శలు చేసింది. గాంధీనగర్ స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు అద్వానీ గెలుపొందారని, ఆ స్థానం నుంచి అమిత్ షా పోటీ చేయడమంటే దానర్థం అద్వానీతో బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటించడమేనని ‘సామ్నా’ పేర్కొంది.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇవాళ మనపోరాటం వైఎస్సార్ కాంగ్రెస్ తో కాదు, టీఆర్ఎస్ పార్టీతోనని ఉద్ఘాటించారు. "వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అది కేసీఆర్ ని గెలిపించినట్టే. కేసీఆర్ మనమీద పెత్తనం చేయాలనుకుంటున్నాడు. కేసీఆర్ మనకు అన్యాయం చేశాడు. 60 ఏళ్ల మన కష్టాన్ని దోచుకుని మనల్ని అవమానంతో పంపించారు. కేసీఆర్.. రా!... వచ్చి పలమనేరులో నా పౌరుషాన్ని చూడు అంటూ ప్రతిఒక్కరూ గర్జించాలి, ఖబడ్దార్ కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డంపెట్టుకుని మా జోలికి వస్తే వదిలిపెట్టం. వైఎస్సార్ కాంగ్రెస్ దివాలాకోరు పార్టీ. ఆ పార్టీ నేతలు మోదీకి ఊడిగం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. మైనారిటీలకు రక్షణగా నేనుంటా" అంటూ ప్రసంగించారు.

pardhasaradhi 25032019

‘‘ఈ ఎన్నికల్లో మా పోరాటం వైసీపీతో కాదు.. టీఆర్‌ఎ్‌సతోనే. వైసీపీని అడ్డుపెట్టుకుని మా జోలికి వస్తే వదిలిపెట్టం! ఖబడ్దార్‌ కేసీఆర్‌.. జాగ్రత్తగా ఉండు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘కేసీఆర్‌ రా.. మా పాలనను చూడు! మా పౌరుషాన్ని చూడు!’ అని సవాల్‌ విసిరారు. రాష్ట్రానికి జగన్‌ అతిపెద్ద సమస్య అని విమర్శించారు. హైదరాబాద్‌లో టీడీపీ సేవామిత్ర యాప్‌ సమాచారాన్ని దొంగలించిన కేసీఆర్‌ దానిని జగన్‌కు ఇచ్చారని ఆరోపించారు. వైసీపీకి ఓటేస్తే బీజేపీకి, టీఆర్‌ఎ్‌సకు వేసినట్లే అని తెపారు. జన్మభూమికి ద్రోహం చేసిన వైసీపీ ఈ గడ్డపై ఉండటానికి వీల్లేదన్నారు. 2014లో కాంగ్రె్‌సకు బుద్ధి చెప్పినట్లే... ఈసారి వైసీపీకి చెప్పాలని పిలుపునిచ్చారు.

pardhasaradhi 25032019

‘‘కేసీఆర్‌ మనల్ని ఎన్నోసార్లు అవమానించారు. ఆంధ్రవాళ్లు దొంగలు, రాక్షసులు అన్నారు. ఆంధ్రా బిర్యానీ పేడతో సమానం, ఉలవచారు మా వద్ద పశువులు తింటాయి అని అవహేళన చేశారు. అలాంటి కేసీఆర్‌తో జగన్‌ చేతులు కలిపారు. ఓట్లు వేసి గెలిపిస్తే కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని కేసీఆర్‌కు తాకట్టు పెడతారు’’ అని బాబు తెలిపారు. ‘‘మోదీ, కేసీఆర్‌, జగన్‌... ముగ్గురూ రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ అన్ని పార్టీలను కొనేశారు. కాంగ్రె్‌సను బలహీనం చేశారు. 16 సీట్లు మావే అని ప్రచారం చేస్తున్నారు. మీరంతా టీడీపీని 25 ఎంపీ సీట్లలో గెలిపిస్తే కేసీఆర్‌, జగన్‌, మోదీలు మన జోలికి రారు’’ అని పేర్కొన్నారు. కేసీఆర్‌ పంపిన వెయ్యికోట్ల సొమ్మును జగన్‌ పంచుతారని... జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవైరెడ్డి, ఆయన అల్లుడు సజ్జల శ్రీ్ధర్‌రెడ్డి పార్టీ వీడడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎంపీ కూతురు సుజలకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కూతురుకు ఎమ్మెల్సీ ఇవ్వనున్నందున పోటీనుంచి తప్పుకుని పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఎంపీ ఎస్పీవైరెడ్డిని అధిష్టానం బుజ్జగించినట్లు తెలుస్తోంది. తన కుటుంబానికి టికెట్ దక్కకపోవడంతో అలకబూనిన ఎంపీ ఎస్పీవైరెడ్డి తన అల్లుడితో కలిసి టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. అంతేగాక నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు జనసేన పార్టీ తరుపున నామినేషన్ పత్రాలు దాఖలు చేయడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం వేగంగా నష్టనివారణ చర్య చేపట్టింది.

pardhasaradhi 25032019

ఎస్పీవైరెడ్డిని అమరావతికి రమ్మని కబురు పంపగా, ఆయన కుమార్తె సజ్జల సుజల శనివారం అమరావతికి చేరుకుని టీడీపీ అధిష్టానంతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. దీనిపై నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డిని వివరణ కోరగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుండి కబురు వచ్చిన విషయం వాస్తవమేనని అన్నారు. తన కుమార్తె సజ్జల సుజల అమరావతి చేరుకుని టీడీపీ అధిష్టానంతో చర్చలు జరిపారన్నారు. అధిష్టానం ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే టీడీపీ ఇస్తున్న ఆఫర్ స్వీకరించడంపై పునరాలోచిస్తామని ఆయన తెలిపారు. ఇంత దూరం వచ్చాకా, జనసేన తరపున ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు నామినేషన్లు వేసి, ప్రచారం ప్రారంభించిన అనంతరం జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

pardhasaradhi 25032019

ఎమ్మెల్సీ ఆఫర్‌ను స్వీకరించి జనసేన పార్టీ తరపున వేసిన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకుని తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలని అధిష్టానం ఆదేశించడంతో ఎస్పీవైరెడ్డి నిర్ణయంపై అందరి దృష్టి పడింది. ఇదే సమయంలో జనసేన నాయకుల్లో టెన్షన్ మొదలైంది. కాగా ఎమ్మెల్సీ ఆఫర్ ప్రకటించిన టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతించాలా, లేక జనసేన పార్టీ తరపున బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోవాలా అన్న విషయంపై కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎస్పీవైరెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆమె వయసు 80 ఏళ్లు. కానీ ఎంతో ఉత్సాహంగా ఎండను సైతం లెక్క చేయకుండా ఇంటింటికీ తిరుగుతూ ‘‘అమ్మా.. నా బిడ్డను ఆశీర్వదించండి, ఇప్పటికే మూడుసార్లు ఓడిపోయాడు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇక ఎన్నాళ్లు బతుకుతానో తెలీదు. చివరగా నా బిడ్డను ఎమ్మెల్యేగా చూడాలనుంది..’’ అంటూ ఆమె చేస్తున్న అభ్యర్థన ఆ నియోజకవర్గ ప్రజలను కదిలిస్తోంది. పలకరింపులో అభ్యర్థన, పిలుపులో ఆత్మీయతతో అందరినీ కట్టిపడేస్తున్న ఆమె మాజీమంత్రి రెడ్డప్పగారి రాజగోపాల్‌రెడ్డి సతీమణి హైమావతమ్మ. తన కుమారుడు, రాయచోటి టీడీపీ అభ్యర్థి రెడ్డప్పగారి రమేష్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం ఆమె చేస్తున్న ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంటోంది.

pardhasaradhi 25032019

పదకొండే ఏట నుంచే రాజకీయాలు.. నేను రాజకీయాలను చిన్నప్పటి నుంచి అంటే 11వ ఏట నుంచే చూస్తున్నాను. మా నాయన వేంపల్లె ప్రెసిడెంటుగా నామినేషన్‌పై ఎన్నో ఏళ్లు పనిచేశారు. అయ్య నామినేషన్‌ ఎప్పుడు ఏస్తారా అని ఎదురు చూసేదాన్ని. మా నాయనకు టికెట్‌ వచ్చినప్పుడల్లా బసిరెడ్డి, వైఎస్‌ రాజారెడ్డి, కడప కోటిరెడ్డి వీళ్లంతా.. మా నాన్న దగ్గరకు వచ్చి నాగిరెడ్డీ.. ఈసారి మేముంటామప్పా మాకివ్వండి అని వాళ్లిప్పిచ్చుకుని పోయేవారు. అప్పటి నుంచే నాకు రాజకీయాలపై ఒక ఆలోచన ఉండేది. పెళ్లి అయి మెట్టినింటికి వచ్చాక మా పెనిమిటి రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టు పనులు చేసేవారు. 1962లో రాజకీయాల్లోకి దిగి లక్కిరెడ్డిపల్లె నుంచి విశ్వనాధరెడ్డిపై పోటీ చేశారు. 350 ఓట్ల తేడాతో మా ఆయన ఓడిపోయారు. తొలిసారి ఓటమితోనే రాజకీయాల్లో ఎన్నో నేర్చుకున్న ఆయన ఆ తరువాత ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పీవీ నరసింహారావు మంత్రి వర్గంలో, ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ రోజుల్లో మంత్రి సతీమణిగా ఇంటి నుంచి బయటికి వచ్చేదాన్ని కాదు. ఆ రాజకీయాలు, ఆ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు. మీటింగులకు కానీ, ఆయనతో పాటు కానీ తిరిగేదాన్ని కాదు. నేను ఇంటిని, పిల్లల సంరక్షణ చూసుకునేదాన్ని.

pardhasaradhi 25032019

కొడుకుకోసం ఎండలో తిరుగుతున్నా... మా ఆయన మొదటి ఎన్నికల్లో రూ.30వేలే ఖర్చు పెట్టారు. ఈ రోజు ఎన్నికల్లో ఎంత ఖర్చవుతుందో మనం చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ మూడుసార్లు రమేష్‌ ఓడిపోయారు. నాకా వయసు పైబడుతోంది. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో రమేష్‌ గెలిచి ఎమ్మెల్యే అయితే చూడాలన్నది నా కోరిక. నేను ఏమీ ఇచ్చుకోలేనయ్యా.. నమస్కారం పెట్టి ఇంటింటికీ వెళ్లి నా బిడ్డను ఆశీర్వదించండి అని కోరుతున్నా. 80 ఏళ్ల వయసులో ఎండలో తిరుగుతూ ఇలా ప్రచారం చేయడం ఇబ్బంది అనుకుంటే ఎలా? బిడ్డ గెలుపు ముందు ఇవేమీ కష్టం కాదు. ఓటర్లకు నేను చెప్పేది ఒకటే. ఈ సారి నా బిడ్డను ఆశీర్వదించండి. తప్పకుండా ఓటేయండి.. మమ్మల్ని గెలిపించండి అని అడుతున్నా. ఏ ఇంటి గడప తొక్కినా అందరూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఇక నా బిడ్డ గెలుస్తాడని నమ్మకం ఉంది. నియోజకవర్గ ప్రజలు కూడా ఈ సారి రమేష్‌ను గెలిపించాలని కోరుతున్నారు. గెలుపునే చూస్తున్నాను కానీ ఎండా, వాన కాదు నాకు. తప్పకుండా బిడ్డ గెలిచి ఎమ్మెల్యే అయితే చాలు.. అని ముగించారు..

Advertisements

Latest Articles

Most Read