అనంతపురం జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాల మధ్య తీవ్ర విభేదాలు ఉండేవి. పరిటాల కుటుంబం మొదటి నుంచి తెదేపాలో ఉండగా.. ఎంపీ జేసీ గత ఎన్నికల వేళ తెదేపాలో చేరారు. తాజా ఎన్నికల్లో మంత్రి పరిటాల సునీత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇద్దరూ పోటీ నుంచి వైదొలగి వారి వారసులకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం తెదేపా శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు అనంతపురం వచ్చారు. ఈ సభలో మంత్రి సునీత తనయుడు శ్రీరామ్‌.. ఎంపీ జేసీ కుమారుడు పవన్‌ ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడమే కాక.. ఉమ్మడిగా అభివాదం చేశారు.

madhav 20032019

చంద్రబాబు రాయలసీమలో చేస్తున్న అభివృద్ధితో ఫ్యాక్షనిజం కనుమరుగు అయింది. పరిటాల – జేసీ వర్గాలు ఒకపార్టీలో ఉంటాయని ఎవరైనా ఊహించారా..? జమ్మలమడుగులో రెండు వర్గాలు కలుస్తాయని అంచనాలున్నాయా…? కోట్ల – కేఈ కుటుంబాలు కర్నూలులో ఒకే జెండా కింద ఉంటాయని అనుకున్నారా..? ఈ మూడు మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా రాజకీయం పోరాటంతో శత్రువులుగా మారిన ఎన్నో కుటుంబాలను.. చంద్రబాబు నాయుడు తన చాణక్యంతో రాజకీయంగా ఒక్కటి చేశారు. సీమలో ఫ్యాక్షన్ కుటుంబాల్ని కలిపిన చంద్రబాబు చాణక్యం..! ఆదినారాయణరెడ్డి – రామసుబ్బారెడ్డిలను… ఒకే వేదికపై చూస్తామని… జమ్మల మడుగు రాజకీయాలపై అవగాహన ఉన్న ఏ ఒక్కరూ అనుకోరు. జేసీ దివాకర్ రెడ్డి – పరిటాల సునీతలు ఒకే పార్టీలో ఉంటారని.. ఎన్నికల ముందు ఎవరైనా ఊహించారా? కోట్ల - కేఈ కుటుంబాలు కలిసి రాజకీయం చేస్తారని కనీసం కలగన్నామా? ఫ్యాక్షన్ అంత లేకపోయినా… నారా రాజకీయానికి.. నల్లారి రాజకీయానికి అసలు సరిపడేది కాదు. కానీ.. ఇప్పుడు నల్లారి కుటుంబాన్ని కూడా.. టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు.

madhav 20032019

కోస్తా నుంచి ఉత్తరాంధ్ర దాక శత్రువర్గాలుగా మారిన కుటుంబాలు .. ఇప్పుడు టీడీపీ గూటికి చేరి ఒక్కటయ్యాయి. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి – కరణం వర్గాల ఫ్యాక్షన్ చిచ్చు మారిపోయింది, వారు కూడా ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. ఇద్దరికీ సీట్లు కేటాయింపు జరగడంతో.. ఎక్కడా ఇబ్బందికర పరిస్థితులు లేవు. విజయవాడలో వంగవీటి, దేవినేని వర్గం మధ్య ఉండే తగాదాలు… చరిత్రలో చెరపలేని విధంగా ఉన్నాయి. ఇప్పుడు… దేవినేని అవినాష్… గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు. వంగవీటి వారసుడు కూడా టీడీపీలో చేరారు. ఇక ఉత్తరాంద్రలో బొబ్బిలి రాజులు, విజయనగరం రాజుల మధ్య శతృత్వం ఇప్పటిది కాదు. కానీ ఇద్దరు ఇప్పుడు కలిసి టీడీపీలోనే రాజకీయాలు చేస్తున్నారు. ఇక వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, శత్రుచర్ల విజయరామరాజు కుటుంబాల మధ్య అంతే వైరం ఉంది. రెండు కోటల పేర్లో వీరి మధ్య గొడవలు ఉండేవి. ఇప్పుడు ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు. విభజించి పాలించడం అనే రాజకీయానికి చంద్రబాబు దూరం..! సాధారణంగా జిల్లాను లేదా.. నియోజకవర్గాన్ని శాసించగలిగే స్థితిలో ఉండే ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉంటారు. ఒకే పార్టీలో ఉండటం అసాధ్యం కానీ.. టీడీపీ అధినేత మాత్రం.. తన మార్క్ రాజకీయంతో అందర్నీ పార్టీలో ఉంచగలుగుతున్నారు. సాధారణంగా ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్న వారు కలవడానికి అసలు ఆసక్తి చూపించరు. కానీ చంద్రబాబు.. ఫ్యాక్షన్‌కు కాలం చెల్లేలా.. వారందర్నీ.. ఒకే తాటిపైకి తీసుకు రాగలుగుతున్నారు. నిజానికి… రాజకీయ పార్టీల లక్షణం.. కలపడం కాదు.. విడగొట్టడం. పార్టీల అధిష్టానాలు ఇలాంటి బలమైన నేతల మధ్య వీలయినంత దూరం పెంచి.. దాన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు.

జగన్‌ కరడుగట్టిన నేరస్థుడు. పులివెందులను కేంద్రంగా మార్చుకున్నారు. అటువంటి వ్యక్తికి ఓటేస్తే రాష్ట్రాన్ని తాకట్టుపెడతారు.’’ అంటూ చంద్రబాబు విమర్శించారు. కర్నూలు, అనంతపురం, కడప ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన వైకాపాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బూత్‌ కన్వీనర్ల, సేవామిత్రల టెలికాన్ఫరెన్సులోనూ మాట్లాడారు. జగన్‌కి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పారు. ‘‘తండ్రిని అడ్డం పెట్టుకొని రూ.లక్ష కోట్లు సంపాదించిన వ్యక్తి వల్ల అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకెళ్లారు. అటువంటి వ్యక్తిని గెలిపించాలా?’’ అని ప్రశ్నించారు. ప్రత్యర్థులు మైండ్‌ గేమ్‌ ఆడతారని, కల్పిత సర్వేలపై తెదేపా నాయకులు ఎవరూ కంగారు పడవద్దని చెప్పారు. బనగానపల్లి తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సభలో ఉండగానే ‘బనగానపల్లిలో తెదేపాకు షాక్‌’ పేరిట సాక్షి టీవీలో ప్రసారమైన క్లిప్‌ను ఆయన చూపించారు.

madhav 20032019

‘‘ఆ పత్రిక, టీవీలకి ఏమైనా ధర్మం ఉందా? నిజాయతీ ఉందా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలని ఇంటింటికి తీసికెళ్లవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. మొదటిసారి డ్రైవర్లను గౌరవించి ఆటోలు, ట్రాక్టర్లకు పన్ను రద్దు చేశామన్నారు. నేనే నంబర్‌ వన్‌ డ్రైవర్‌ని.. డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా తీసుకువెళితే, ఐదు కోట్ల మందికి ఆనందం, ఆరోగ్యం ఇచ్చి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘నాకు రిటర్న్‌గిఫ్ట్‌ ఇస్తానని కేసీఆర్‌ అన్నారు. ఆయన ఒకటిస్తే, బదులుగా నేను పది గిఫ్ట్‌లు సిద్ధంగా ఉంచుతాను. ఇక్కడి ప్రజల్లో ఆక్రోశం చూసి కేసీఆర్‌ తోక ముడిచారు. తెలంగాణలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బెదిరించి చేర్చుకుంటున్నారు. అక్కడ 16 ఎంపీ సీట్లు గెలిచి దేశంలో కేసీఆర్‌ చక్రం తిప్పుతారట. తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ పనులు చేయకుండానే కేసీఆర్‌ 88 సీట్లు గెలిస్తే, అన్నీ చేసిన మనం అత్యధిక అసెంబ్లీ స్థానాలతోపాటు, 25 ఎంపీ స్థానాలు గెలిచి తీరాలి. తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ఎన్నికలతో సంబంధం లేదని కేసీఆర్‌ అంటారు. ఆయనకు ఇక్కడి వైకాపాకు డబ్బులు పంపడంలో సంబంధం లేదా? తెదేపా డేటాను చోరీ చేసి వైకాపాకు ఇవ్వడంలో సంబంధం లేదా? పోలవరాన్ని అడ్డుకోవడంలో సంబంధం లేదా? నవ్యాంధ్ర ప్రజల ఆత్మగౌరవం కోసం ఎంతటి వారినైనా ఢీ కొంటాం’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

madhav 20032019

‘‘జగన్‌ కరడుగట్టిన నేరస్థుడు.. నేరాలకు పులివెందులను కేంద్రంగా మార్చుకున్నారు.’’ అని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు.కడప మునిసిపల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన తెదేపా కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ వివేకా హత్యపై చంద్రబాబు మాట్లాడారు. ‘‘పులివెందులలోని ఇంట్లో వివేకాను క్రూరంగా చంపేశారు.దాన్ని గుండెపోటుగా కొందరు చిత్రీకరించారు. పోలీసులు రాకముందే గది శుభ్రం చేస్తారు.అరాచకానికిది పరాకాష్ఠ కదా. ఇవన్నీ లోటస్‌పాండ్‌లో ఉండే జగన్‌కు తెలియకుండానే జరిగాయా..? చివరకు ఏమీ పట్టించుకోవద్దంటూ ఎసీˆ్పకి ఫోన్‌ చేస్తారు. పోస్టుమార్టానికి వెళ్లాక మాట మార్చారు.. నేను, ఆదినారాయణరెడ్డి, సతీష్‌కుమార్‌రెడ్డి చంపేశామంటారు.. చనిపోయింది వాళ్లింట్లో.. చంపింది వాళ్లింట్లో.. శుభ్రం చేసింది వాళ్లు.. కుట్లు వేసింది వాళ్లు.. కట్లు కట్టింది వాళ్లు.. ఏమిటీ ప్రవర్తన.. ఆఖరుకు దాన్ని గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో సమాధానం చెప్పాలి..’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘ఉదయం 9.17 గంటలకు సాక్షిటీవీలో ఆ విధంగా వేశారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖపై స్పందిస్తూ.. ‘‘సాయంత్రం ఓ లేఖ ఇస్తారు.. ఆయన చనిపోయే ముందు రాసిన లేఖ అని చెబుతారు. అంతా డ్రైవర్‌ మీద పెట్టాలనుకుంటున్నారా.. ఎంత దుర్మార్గం. మీ ఇంట్లో వాళ్ల పాత్ర లేకపోతే ఎందుకు రక్తాన్ని కడిగారు? సాక్ష్యాల్ని తారుమారు చేశారు. మీ మామ ఆసుపత్రి నుంచి బ్యాండేజ్‌లు తెచ్చి కట్టారు.. ఎందుకు గుండెపోటుగా చిత్రీకరించారు..వీటికి సమాధానం చెప్పాలి.’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో జగన్‌ భయంతో తప్పించుకుంటూ ఊరూరూ వెళ్లి సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు.

ప్రజల అండదండలే తెలుగుదేశానికి పెట్టనికోట అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఎలక్షన్ మిషన్- 2019 పై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం కార్యకర్తల్లో ఉత్సాహం కదం తొక్కుతోందని, ప్రజల్లో తెదేపా పట్ల సానుకూలత అద్భుతంగా ఉందన్నారు. 37 ఏళ్ల చరిత్రలో ఇంత సానుకూలత ఎప్పుడూ లేదని చెప్పారు. అదే సమయంలో ఏమరపాటుగా ఉండరాదని సూచించారు. తమ ప్రత్యర్థి కరడుగట్టిన నేరస్థుడనేది గుర్తించాలని, నేరగాళ్లతో పోరాటంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు అన్నారు.

madhav 20032019

వైకాపాకు ఒక్క అవకాశం ఇస్తే పెను ప్రమాదమని హెచ్చరించారు. భూములు మింగేస్తారు.. ఆస్తులు కబ్జా చేస్తారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న తెదేపా అభ్యర్థులను బెదిరిస్తున్నారని, నామినేషన్లు వేయకుండా తెరాసా, వైకాపా నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో జగన్ మేలు కోసమే కేసీఆర్‌ బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏపీలో తన డమ్మీని పెట్టాలనే కుట్రలు చేస్తున్నారని అన్నారు. క్విడ్ ప్రోకో (నీకిది- నాకది) జగన్‌ పాలసీ అని చంద్రబాబు ఎద్దేవాచేశారు. కేసులు మాఫీ చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా అడగనని నరేంద్ర మోదీతో జగన్‌ డీల్ చేసుకున్నారని ఆరోపించారు.

madhav 20032019

అదేవిధంగా ‘కప్పం కడతా- మీ వద్ద నా భూముల స్వాధీనం వద్దు’ అని కేసీఆర్‌తో ఒప్పందం చేసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. జగన్ కేసుల దర్యాప్తు నత్తనడక మోదీ గిఫ్ట్ అని అన్నారు. ఏపీ తాకట్టు మోదీకి జగన్‌ ఇచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ అని దుయ్యబట్టారు. అందుకే ప్రతి నిమిషం తననే జగన్‌ నిందిస్తాడని, మోదీని నిలదీయడని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు తెదేపాదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఈ రోజు నుంచి ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నామని తెలిపారు. తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులంతా సమన్వయంగా పనిచేయాలని సూచించారు.

సినీ నటుడు నాగబాబు జనసేనలో చేరారు. తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున నాగబాబును పోటీలోకి దింపుతున్నట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు పవన్‌ బీ-ఫారాన్ని అందజేశారు. రాజకీయాలకు సంబంధం లేకుండా తనదైన జీవితం గడుపుతున్న వ్యక్తిని తాను స్వయంగా పార్టీకి రావాల్సిందిగా ఆహ్వానించానని పవన్‌ తెలిపారు. తనలో రాజకీయ చైతన్యం మొదలైంది తన సోదరుడు నాగబాబు వల్లేనని చెప్పారు. దొడ్డి దారిలో కాకుండా ధైర్యంగా తన అన్నయ్యను నేరుగా ప్రజాక్షేత్రంలో నిలబెడుతున్నానని తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి నాగబాబు అని చెప్పారు.

madhav 20032019

నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ఆయన విజయం సాధిస్తారనే నమ్మకం తనలో ఉందన్నారు. వరుసకు తనకు తమ్ముడే అయినా తనకు కూడా పవన్‌ నాయకుడేనని నాగబాబు అన్నారు. టికెట్‌ ఇచ్చినందుకు సోదరుడు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ్ముడి స్ఫూర్తితో సత్తా చూపిస్తామన్నారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ అదే జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో నాగబాబు రూ.25 లక్షలు జనసేనకు విరాళంగా ప్రకటించారు. ఆయన తనయుడు వరుణ్ తేజ్‌ కోటి రూపాయలను విరాళమిచ్చారు. ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు ప్రత్యక్షమయ్యారు. దీంతో అప్పటి నుంచి జనసేనలో ఆయన చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.

madhav 20032019

మరోవైపు నాగబాబు రంగ ప్రవేశంతో నరసాపురం ఎంపీ స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. ఇప్పటికే తెదేపా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శివ రామరాజును ఆ పార్టీ ప్రకటించింది. మొన్నటి వరకు ఆయన ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు. వైకాపా కూడా నరసాపురం ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజును బరిలోకి దింపింది. 15 రోజుల కిందటి వరకు ఆయన తెదేపాలోనే ఉన్నారు. అయితే ఇదంతా బాగానే ఉంది. ఎవరు ఎవరితో అయినా కలవచ్చు, ఏ పార్టీలో అయినా చేరవచ్చు. కాని, నిన్నటి దాకా తన యూట్యూబ్ లో చంద్రబాబుని, లోకేష్ ని వారసత్వం అంటూ కబురులు చెప్పి, ఇప్పుడు అదే వారసత్వంతో తన తమ్ముడి పార్టీలో చేరాడు. నీతులు ఈయనకు వర్తించవు ఏమో...

Advertisements

Latest Articles

Most Read