ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 3.84 కోట్లకు చేరిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ ఏడాది జనవరి 11న సమగ్ర ప్రత్యేక సవరణ-2019కు సంబంధించిన తుది జాబితా ప్రచురించే నాటికి 3.69 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈ మూడు నెలల వ్యవధిలో 15 లక్షల మంది పెరిగారన్నారు. ఓటు నమోదు కోసం వచ్చిన ఫారం-6లో ఇంకా 10,62,441 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాల్సి ఉందని, ఈ నెల 25 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మరో 9.50 లక్షల మంది ఓటర్లు పెరిగే అవకాశముందని భావిస్తున్నామన్నారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

madhav 20032019

ఆయన మాటల్లో... "తొలగించిన ఓట్లు 1.55 లక్షలు.. జనవరి 11 తర్వాత ఓట్ల తొలగింపు కోసం దాదాపు 9 లక్షలకు పైగా ఫారం-7 దరఖాస్తులొచ్చాయి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత 1,55,099 మంది పేర్లను జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించాం. వీరంతా మృతిచెందిన వారు, ఒకే వ్యక్తి పేరు రెండు, మూడు సార్లు జాబితాలో ఉన్నవి, వలస వెళ్లిన వారివి. మిగతా దరఖాస్తులను నకిలీవిగా గుర్తించి తిరస్కరించాం. మోసపూరితంగా వచ్చిన దరఖాస్తులపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోన్న కథనాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ఏమైనా జరుగుతోందా?..అని నిఘా పెట్టాం. ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. "

madhav 20032019

"ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విటర్‌ తదితర ఖాతాలపై నిఘా పెట్టాం. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకూ వివిధ పార్టీలకు 89 నోటీసులు జారీ చేశాం. తెదేపాకు 48, వైకాపాకు 30, జనసేనకు 11 నోటీసులిచ్చాం. నోటీసులు ఇచ్చినంత మాత్రాన వారు తప్పు చేసినట్లు కాదు. మేం గుర్తించిన అభ్యంతరకర అంశాలకు సంబంధించి వివరణ కోరతాం. వారిచ్చే సమాధానం పట్ల సంతృప్తి చెందితే సరే.. లేదంటే అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో ఆ మొత్తాన్ని కలపడం, పద్ధతి మార్చుకోమని హెచ్చరించటం, కేసులు నమోదు చేయటం వంటివి చేస్తాం. నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున జిల్లాల వారీగా అభ్యర్థుల వివరాలు తెలుసుకుంటున్నాం. వారి సామాజిక మాధ్యమాలపై కూడా పర్యవేక్షణ ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. శాంతిభద్రతలకు విఘాతం లేకుండా.. శాంతిభద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా చూసేందుకు వీలుగా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షిస్తున్నాం. వివేకా హత్య అనంతరం కడప జిల్లా ఎస్పీతో మాట్లాడి నివేదిక తెప్పించుకున్నాం. కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల అధికారులతోనూ మాట్లాడాం."

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే.. వివేకాను కిరాయి హంతకులతో హత్య చేయించినట్లుగా పోలీసులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గానూ కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దీంతో కిరాయి హంతకులను పట్టుకోవడం పోలీసులు, సిట్ బృందాలకు పెను సవాల్‌గా మారింది. కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో ఈనెల 15న వివేకా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య వెనక ఉన్నదెవరు..ఏమి ఆశించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.. తదితర కారణాలను పూర్తిస్థాయిలో బయట పెట్టేందుకు సిట్ బృందం, పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే మాజీ మంత్రి సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, డ్రైవర్‌ ప్రసాద్‌తో సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని 5రోజులుగా సిట్‌ విచారిస్తోంది. ఈక్రమంలోనే వివేకా హత్య వెనుక సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామానికి చెందిన పరమేశ్వరరెడ్డి ప్రమేయం ఉన్నట్టు విచారణలో తేలిందని విశ్వసనీయ సమాచారం.

madhav 20032019

ఈ నేపథ్యంతోనే ఆయన్ని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో మంగళవారం సింహాద్రిపురం మండలం దిద్దెకుంట గ్రామానికి చెందిన శేఖరరెడ్డితోపాటు అతని అనుచరులైన మరో నలుగురిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని కడపకు తరలించినట్లు సమాచారం. వీరితోపాటు వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన రాగిపిండి సుధాకరరెడ్డిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వివేకా హత్య ఇంటి దొంగల పనే అని మీడియా ఎదుట పరమేశ్వరరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. తొలుత వివేకా గుండెపోటుతో మృతి చెందాడని ఎలా నిర్ధరణ చేశారు? స్నానపుగదిలో ఉన్న మృతదేహాన్ని పడక గదిలోకి ఎందుకు తీసుకొచ్చారు? గదిలో ఉన్న రక్తపు మరకలను ఎందుకు తుడిచేశారు? మృతదేహంపై ఉన్న గాయాలకు బట్ట ఎందుకు కట్టారు? పోలీసులకు సమాచారం ఆలస్యంగా ఎందుకిచ్చారు? వంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పటికే దొరకలేదు.

madhav 20032019

ఇందుకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి సమీప బంధువులు వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహరరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డి, జనార్దనరెడ్డిలను స్థానిక మైదుకూరు డీఎసీˆ్ప శ్రీనివాసులు విచారించారు. రాజకీయంగానా, వ్యాపార లావాదేవీలా..మరేదైనా కారణం వల్ల హత్య చేశారా..అనే కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. బెంగళూరులో రూ.వందల కోట్లు విలువ చేసే స్థిరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించాలంటూ అదుపులో ఉన్న ఎర్ర గంగిరెడ్డిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లినట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలిసినప్పటికీ ఆధారాల కోసం దర్యాప్తు మరింత ముమ్మరం చేశారని సమాచారం. హత్య కేసు విచారణలో భాగంగా కొంతమంది అనుమానితులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని కడపలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ఇప్పటికే వారిని అదుపులోకి తీసుకుని నాలుగు రోజులు పూర్తవడంతో వారందరి నివాసాల నుంచి మంగళవారం దుస్తులు సేకరించి.. కడపలో వారికి అందజేసినట్లు తెలిసింది.

బెదిరింపులకు లొంగలేదు, ఒత్తిళ్లకు తలొగ్గలేదు.. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆయన లెక్కలేంటి? అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు కీలక నేతలను సయితం పక్కనపెట్టారు. వారు పెట్టిన ఒత్తిడికి తలొగ్గలేదు. నేతల బెదిరింపులను సయితం లెక్కచేయలేదు. బెదిరించిన వాళ్లకు కూడా గట్టి హెచ్చరికలే పంపారు. చాలా మంది వెళ్లిపోయారు. అయినా చంద్రబాబు బెదరలేదు. నిజానికి అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. కొందరైతే చంద్రబాబును పరోక్షంగా బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ ఒత్తిడులకు ఆయన తలొగ్గలేదు.

madhav 20032019

ప్రకాశం జిల్లాలో కనిగిరి, దర్శి అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థుల ఎంపికపై అనూహ్యమైన ఒత్తిడి వచ్చింది. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబారావును.. అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని, అవసరమైతే తాను వచ్చి మూడు రోజులు ప్రచారం కూడా చేస్తానని నందమూరి బాలకృష్ణ చెప్పారు. కానీ కనిగిరి నియోజక వర్గంలో టీడీపీ నిర్వహించిన సర్వేలో బాబూరావు గెలిచే అవకాశం లేదని తేలింది. ఇటీవల పార్టీలో చేరిన ఉగ్రనరసింహరెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తారని టీడీపీకి నివేదిక అందింది. ఇదే విషయాన్ని బాలయ్యకు చంద్రబాబు చెప్పారు. బాబూరావును దర్శిలో పోటీ చేయించాలని కోరారు. ఎందుకంటే దర్శిలో బాబూరావు సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువ మంది ఉన్నారు. వైసీపీ తరఫున తమ బంధువు పోటీ చేస్తున్నారని బాబూరావు చెప్పినప్పటికీ రాజకీయాల్లో బంధుత్వాలు ఉండవని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్న శిద్ధా రాఘవరావు.. తన కుటుంబసభ్యుల్లో ఒకరికి దర్శి టిక్కెట్ ఇవ్వాలని కోరినప్పటికీ చంద్రబాబు ఆయనకు సర్ది చెప్పారు.

madhav 20032019

ఇక మరో పక్క, చంద్రబాబు అసాధారణ రీతిలో సిటింగ్‌ ఎమ్మెల్యేల్లో 43 శాతం మందిని మార్చి.. కొత్తవారికి అవకాశం కల్పించారు. ఈ స్థాయిలో మార్పులు ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున 102 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇద్దరు స్వతంత్రులు, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తర్వాత ఆ పార్టీలో చేరారు. వీరితో కలిపి ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 127కి పెరిగింది. ఈ సీట్లలో 34 చోట్ల ఈసారి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించారు. ఒకట్రెండు చోట్ల ఎమ్మెల్యేలు బలంగా ఉన్నా ఇతరత్రా సమీకరణల కారణంగా మార్చారు.

ఇంట్లో ఉన్నందుకు అద్దె చెల్లిస్తున్నారు! వారి బతుకేదో వారు బతుకుతున్నారు! కానీ... వారి బతుకుపైనా, భవిష్యత్తుపైనా సర్వాధి కారాలూ తనవే అ న్నట్లుగా ఆ ఇంటి య జమాని వ్యవహరించా రు. ‘మా ఇంట్లో అద్దెకు ఉంటున్నారు! మేం చెప్పిన పార్టీకే ఓటు వేయాలి’ అని ఒత్తిడి తెచ్చారు. ‘మా ఓటు.. మా ఇష్టం’ అని చెప్పినందుకు... వృద్ధులనే కనికరం కూడా లేకుండా అర్ధరాత్రి ఇంటిని నుంచి వెళ్లగొట్టారు. గుంటూరుజిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురంలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన భీమినేని అంకమరావు(70), మహాలక్ష్మమ్మ (65) దంపతులు చెరుకుమల్లి బుజ్జి అనే స్థానిక వైసీపీ నేత ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

madhav 20032019

‘మా పార్టీకే ఓటు వేయండి’ అని ఆ దంపతులను బుజ్జి పలుమార్లు అడిగారు. ‘చంద్రబాబు వల్ల మాకు నెలకు 2వేల పింఛను వస్తోంది. మగపిల్లలు లేకపోయినా ఆయనే పెద్దకొడుకులా ఆదుకుంటున్నారు. మా ఓటు ఆయనకే వేస్తాం’ అని వాళ్లు చెబుతూ వచ్చారు. సోమవారం రాత్రి బుజ్జి వారితో వాదనకు దిగారు. ‘వైసీపీకి ఓటు వేస్తామని మాట ఇవ్వండి’ అని పట్టుబట్టారు. వృద్ధ దంపతులు అంగీకరించలేదు. ‘ఐతే బయటికి నడవండి’ అంటూ వారిచేత బుజ్జి ఇంటిని ఖాళీ చేయించారు. చేసే దేమీలేక అంకమరావు దంపతులు అర్ధరాత్రి చిన్న బడ్డీ కొట్టులోకి సామాన్లు మార్చుకున్నారు. రాత్రికి అక్కడే తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు.. వారికి చిన్న గదిలో ఆవాసం ఏర్పాటు చేశారు.

 

Advertisements

Latest Articles

Most Read