టీడీపీ తరపున లోక్‌సభ ఎన్నికలకు పోటీచేసే 25 స్థానాలు, అసెంబ్లీ బరిలోకి దిగే 36 మంది అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. ఎంపీల జాబితాలో కొన్ని సంచలనాలు చోటుచేసుకున్నాయి. ఉండి ఎమ్మెల్యే శివరామరాజును నరసాపురం ఎంపీగా బరిలోకి దించారు. దివంగత మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు ఎం.భరత్‌ను విశాఖ నుంచి, రాజమహేంద్రవరం సిటింగ్‌ ఎంపీ మురళీమోహన్‌ కోడలు మాగంటి రూపను అదే స్థానం నుంచి పోటీచేయిస్తున్నారు. నంద్యాల స్థానాన్ని గౌరు వెంకటరెడ్డి బావ మాండ్ర శివానందరెడ్డికి కేటాయించారు. మొత్తం 25 ఎంపీ స్థానాలకు, పది మంది సిట్టింగ్‌ ఎంపీలకు అవే స్థానాలు దక్కాయి. జాబితాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, నలుగురు కేంద్ర మాజీ మంత్రులున్నారు. రాజమహేంద్రవరం, అనంతపురంలో ప్రస్తుతం ఎంపీల వారసులకు టికెట్లు కేటాయించారు. జాబితాలో ఇద్దరు మహిళలకు ప్రాతినిథ్యం కల్పించారు. నలుగురు ఎస్సీలు, అయిదుగురు బీసీలు, ఒక ఎస్టీకి సీట్లు లభించాయి.

cbn 19032019 1

అసెంబ్లీకి :నెల్లిమర్ల-పతివాడ నారాయణస్వామి నాయుడు, విజయనగరం-అదితి గజపతిరాజు, భీమిలి-సబ్బం హరి, గాజువాక-పల్లా శ్రీనివాసరావు, చోడవరం-కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు, మాడుగుల -గవిరెడ్డి రామానాయుడు, పెందుర్తి - బండారు సత్యనారాయణ మూర్తి, అమలాపురం - ఐతాబత్తుల ఆనందరావు, నిడదవోలు - బూరుగపల్లి శేషారావు, నర్సాపురం - బండారు మాధవనాయుడు, పోలవరం - బొరగం శ్రీనివాసరావు, ఉండి- మంతెన రామరాజు, తాడికొండ - తెనాలి శ్రావణ్‌ కుమార్‌, బాపట్ల - అన్నం సతీశ్‌ ప్రభాకర్‌, నర్సరావుపేట- డాక్టర్‌ అరవింద్‌ బాబు, మాచర్ల - అంజిరెడ్డి, దర్శి - కదిరి బాబూరావు, నిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కావలి - విష్ణు వర్ధన్‌ రెడ్డి, నెల్లూరు రూరల్‌ - అబ్దుల్‌ అజీజ్‌, వెంకటగిరి - కె.రామకృష్ణ, ఉదయగిరి - బొల్లినేని రామారావు, కడప - అమీర్‌బాబు, కోడూరు - నరసింహ ప్రసాద్‌, ప్రొద్దుటూరు - లింగారెడ్డి, కర్నూలు - టీజీ భరత్‌, నంద్యాల - భూమా బ్రహ్మానంద రెడ్డి, కోడుమూరు-బి.రామాంజనేయులు, గుంతకల్లు- ఆర్‌.జితేంద్ర గౌడ్‌, శింగనమల-బండారు శ్రావణి, అనంతపురం అర్బన్‌ - ప్రభాకర్‌ చౌదరి, కల్యాణదుర్గం-ఉమామహేశ్వర నాయుడు, కదిరి- కందికుంట వెంకటప్రసాద్‌, తంబళ్లపల్లె- శంకర్‌ యాదవ్‌, సత్యవేడు- జేడీ రాజశేఖర్‌, గంగాధర నెల్లూరు-హరికృష్ణ, పూతలపట్టు - తెర్లాం పూర్ణం

cbn 19032019 1

ఎంపీ అభ్యర్థులు వీరే... శ్రీకాకుళం- కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విజయనగరం-అశోక్‌ గజపతిరాజు, అరకు-కిశోర్‌ చంద్రదేవ్‌, విశాఖపట్నం- ఎం.భరత్‌, అనకాపల్లి- ఆడారి ఆనంద్‌, కాకినాడ- చలమలశెట్టి సునీల్‌, అమలాపురం- గంటి హరీశ్‌మాధుర్‌, రాజమహేంద్రవరం- మాగంటి రూప, నరసాపురం - శివరామరాజు, ఏలూరు- మాగంటి బాబు, మచిలీపట్నం - కొణకళ్ల నారాయణరావు, విజయవాడ - కేశినేని శ్రీనివాస్‌ (నాని), గుంటూరు- గల్లా జయదేవ్‌, నరసరావుపేట- రాయపాటి సాంబశివరావు, బాపట్ల (ఎస్సీ) - శ్రీరాం మాల్యాద్రి, ఒంగోలు- శిద్దా రాఘవరావు, నెల్లూరు- బీద మస్తాన్‌రావు, తిరుపతి- పనబాక లక్ష్మి, చిత్తూరు- ఎన్‌.శివప్రసాద్‌, కడప- సీహెచ్‌ ఆదినారాయణరెడ్డి, రాజంపేట- డి.సత్యప్రభ, కర్నూలు- కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, నంద్యాల - మాండ్ర శివానంద్‌రెడ్డి, అనంతపురం- జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, హిందూపురం- నిమ్మల కిష్టప్ప

 

 

గుంటూరు జిల్లాలోని బాపట్ల ఎస్సీ రిజర్వుడ్‌ లోక్‌సభ స్థానానికి రాజధాని ప్రాంతంలోని ఉద్దండ్రాయినిపాలేనికి చెందిన నందిగం సురేష్‌ పేరును ఖరారు చేశారు. వైసీపీ అధినేత జగన్‌ 9 మంది లోక్‌సభ అభ్యర్థులతో తొలి జాబితాలోనే సురేష్‌ పేరును ప్రకటించారు. ఉద్దండ్రాయిని పాలెంలో అరటితోట దగ్ధం అయిన కేసులో సురేష్‌పై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. దాంతో వైసీపీ అధిష్ఠానానికి సురేష్‌ దగ్గరయ్యారు. తొలుత యువజన విభాగం నాయకుడిగా సురేష్‌ క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో బాపట్ల ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాన్ని రాజధాని ప్రాంతానికి చెందిన సురేష్‌కు కేటాయించాలన్న భావనతో అధిష్ఠానం ఆయన వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. తొలి జాబితాలోనే సురేష్‌ పేరు రావడం విశేషం.

bapatla 18032019

శనివారం రాత్రి ఆ పార్టీ విడుదల చేసిన జాబితాలో బాపట్లకు నందిగం సురేష్‌ పేరును ప్రకటించింది. రాజధాని ప్రాంతం ఉద్దండరాయునిపాలేనికి చెందిన ఆయన రాజధానిలో పార్టీ తరఫున చేసిన ఆందోళనల్లో చురుకుగా పాల్గొన్నారు. తొలి నుంచి అధినేత జగన్‌కు సన్నిహితంగా ఉంటుండగా ఏడాది కిందట బాపట్ల లోక్‌సభ సమన్వయకర్తగా నియమించారు. నరసరావుపేట లోక్‌సభ సమన్వయకర్తగా విజ్ఞాన్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. గుంటూరు లోక్‌సభకు సమన్వయకర్తగా మూడేళ్లు పనిచేసిన తర్వాత నరసరావుపేటకు మార్చారు. నరసరావుపేట నుంచి కూడా తొలిజాబితాలో చోటు దక్కలేదు. గుంటూరు, నరసరావుపేట లోక్‌సభ స్థానాలపై సందిగ్ధం కొనసాగుతోంది.

bapatla 18032019

స్థిరాస్తి వ్యాపారం చేసేవారు. తొలుత కాంగ్రెసులో ఉన్నారు. వైకాపా ఆవిర్భావం తర్వాత దానిలో చేరారు. బాపట్ల లోక్‌సభ సమన్వయకర్తగా ఏడాదిపైగా కొనసాగుతున్నారు. మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గతంలో వైకాపా యువజన విభాగంలో పని చేశారు. కొంతమంది అయితే.. అసలు తమకు సీటు వస్తుందని ఊహించలేదని.. జగనన్న తమకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను ఎంపీ అభ్యర్థిగా జగన్ ఎంపిక చేస్తారని అస్సలు ఊహించలేదని సురేష్ తెలిపారు. వైఎస్ జగన్ ఆశీస్సులతో తాను ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వచ్చేది జగన్ నాయకత్వమేనని.. వచ్చే నవ నాయకత్వానికి నాంది పలకడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఈసందర్భంగా తెలిపారు.

బీజేపీ ఏపీ లో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 123చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల ఒక ఆంగ్ల టీవీ స్టింగ్‌ ఆపరేషన్‌లో బ యట పడిన విధంగానే చంద్రబాబుపై పోటీకి అభ్యర్థిని రంగంలోకి దించిన బీజేపీ.. పులివెందులలో మాత్రం తన రహస్య మిత్రుడికి మద్దతిచ్చింది. కుప్పంలో ఎన్‌.ఎస్‌. తులసీనాథ్‌ అనే వ్యక్తిని పోటీకి దించింది. పులివెందులలో ఎవరి పేరూ ప్రకటించలేదు. 2014లో విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విష్ణుకుమార్‌రాజుకు మరోసారి టిక్కెట్‌ కేటాయించిన బీజేపీ నాయకత్వం.. సిటింగ్‌ ఎమ్మెల్యే మాణిక్యాలరావుకు టిక్కెట్‌ కేటాయించలేదు. దీంతో మాణిక్యాలరావు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది.

madhavi 18032019

బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ఎన్నికల బరినుంచి తప్పుకోవడంతో కైకలూరులోనూ ఎవ్వరినీ బరిలో దించలేదు. శనివారం పార్టీలో చేరిన కడప జిల్లా బద్వేల్‌ ఎమ్మెల్యే జయరాములుకు అదేస్థానం నుం చి పోటీ చేసేందుకు గ్రీన్‌ సిగ్నలిచ్చింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ తమకు టిక్కెట్‌ కేటాయించలేదని అసంతృ ప్తి వ్యక్తం చేస్తోన్న మంగళగిరి చేనేత సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు జగ్గారపు రామ్మోహన్‌రావును అక్కడి నుంచి బరి లో దించింది. అయితే అదే జిల్లా గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తారనుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు జాబితాలో లేదు.

madhavi 18032019

ఆయన స్థానం నుంచి సినీనటి పసుపులేటి లతా మాధవికి టికెట్‌ ఇచ్చారు. మాధవీలత అసలు పేరు పసుపులేటి మాధవి. ఆమె కర్ణాటకలోని బళ్లారిలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. అక్కడే ఉన్నత విద్యాభ్యాసం చేసిన అనంతరం టాలీవుడ్ లో ప్రవేశించి అనేక చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. పెదకూరపాడు స్థానం ఖాళీగా ఉంచడంతో కన్నా అక్కడి నుంచి బరిలో దిగే అవకాశాలున్నాయి. కాగా, రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాతో శుక్రవారం కన్నా లక్ష్మీనారాయణ బృందం ఢిల్లీకి వెళ్లింది. శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నేతృత్వంలో సమావేశమైన సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ 123 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

పార్టీల నుంచి టికెట్ ఆశించిన నేతలు చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో ఆయా పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రోజులు తిరగకుండానే ఇతర పార్టీల్లోకి చేరేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఓ టీడీపీ నేత మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. శ్రీశైలం నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బుడ్డా రాజేశేఖర్‌రెడ్డి పేరును టీడీపీ ఖరారు చేసింది. జాబితాలో కూడా ఆయన పేరును ప్రకటించింది. సోమవారం నుంచే నామినేషన్‌ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే ఇలాంటి సమయంలో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని బుడ్డా రాజశేఖరరెడ్డి చేసిన ప్రకటన కలకలం రేపింది. బుడ్డా తీసుకున్న ఈ నిర్ణయం కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది.

srisailam 18032019 2

టికెట్ ఖరారు తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పేనని, తనకు తెలుగుదేశం పార్టీ అన్ని అవకాశాలు కల్పించిందని చెప్పారు. కుటుంబ పరిస్థితుల వల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని బుడ్డా తెలిపారు. అయితే బుడ్డా తప్పుకోవడంతో ఆయన అనుచరులు నిరాశకు గురవుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి రాజకీయాల్లో కొనసాగాలని కార్యకర్తలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం తట్టుకోలేని ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే తన సోదరుడైన శేషారెడ్డికి శ్రీశైలం టికెట్ ఇవ్వాలని బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు.

srisailam 18032019 3

శ్రీశైలం నుంచి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ తన తమ్ముడు శేషారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరిన బుడ్డా తమ్ముడి కోసం సీటు త్యాగం చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే, శ్రీశైలం నుంచి ఏవీ సుబ్బారెడ్డిని బరిలో దించాలని తెదేపా అధిష్ఠానం ప్రతిపాదించినట్టు సమాచారం. మహానంది, బండిఆత్మకూరు మండలాల్లో సుబ్బారెడ్డికి పట్టుంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం చేసిన ప్రతిపాదన పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని సుబ్బారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు, బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి వైఖరిపై తెదేపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వేల్పనూరులోని ఆయన నివాసం వద్ద నినాదాలు చేస్తున్నారు. రాజశేఖర్‌ రెడ్డి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఆందోళనకు దిగారు.

Advertisements

Latest Articles

Most Read