త్రిముఖ పోరులో వైసీపీకి కలిసి వస్తుందని, ఈ సారి విజయం తమదేనని నిన్నటి వరకు గంభీరంగా ఉన్న వైసీపీ నేతల ఆశలపై చంద్రబాబు నాయుడు నీళ్లు చల్లారు. సీనియర్‌ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తల్లో ఏ స్థాయిలో ఉత్సాహం పెరిగిందో అదే స్థాయిలో వైసీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. విద్యావంతుడు, కార్యకర్తలతో కలిసి అడుగులు వేసే స్వభావం ఉన్న వ్యక్తి, రాజకీయంగా సరైన దిశా నిర్దేశం చేయగల సమర్థుడు కావడంతో ప్రతిపక్షాలు ఆయోమయంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం అయిన ప్రత్తిపాడు తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వుంది. నవ్యాంధ్రలో జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం విజయకేతనం ఎగురవేసింది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన రావెల కిషోర్‌ బాబు పార్టీని వీడి జనసేన తరుపున ప్రత్తిపాడు నుంచే పోటీ చేస్తున్న ఈ తరుణంలో ప్రత్తిపాడులో త్రిముఖ పోటీ ఏర్పడింది.

magunta 16032019

దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే వైసీపీ, జనసేన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ అయిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు ప్రత్తిపాడు సీటు కేటాయించారు. డొక్కాకు తొలి నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గంతో సత్సంబంధాలున్నాయి. ప్రత్తిపాడులో మంచి పేరు ఉన్న రాయపాటి శిష్యుడిగా డొక్కాకు మంచి పేరు ఉంది. అంతే కాకుండా కార్యకర్తలకు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ బలాన్నిచ్చి వారికి అండగా ఉంటారనే నమ్మకం కూడా ఆ పార్టీ కార్యకర్తలలో ఉంది. ఈ నేప థ్యంలో ఆయనపై ఎలా గెలుపొందాలో అని ఇప్పటి నుంచే వైసీపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు.

magunta 16032019

డొక్కా మార్కు రాజకీయం.. ఇదిలా ఉంటే డొక్కా మార్కు రాజకీయంపై వైసీపీ శ్రేణుల్లో అలజడి మొదలైంది. ప్రత్తిపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా దాదాపు మేకతోటి సుచరిత పేరునే అదిష్ఠానం ఖరారు చేసే అవకాశాలు ఉండడంతో ఇంకా జాబితా విడుదల కానప్పటికీ ఆమె నియోజకవర్గంలో చురుకుగా పర్యటిస్తూనే ఉన్నారు. అయితే మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ ఆమెకు పూర్తి స్థాయి రాజకీయ అనుభవం లేదనేది సొంత పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్న మాట. గత ఎన్నికల్లో ఓటమికి ఇదే కారణంగా వారు భావిస్తూ.. ఈ సారి కూడా అదే పరిస్థితి నెలకొంటుదేమోనని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆ పార్టీలో ప్రత్తిపాడు పై పట్టు ఉండి రాజకీయ నైపుణ్యం కలిగిన నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో డొక్కా రాజకీయం ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని వైసీపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.

 

దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పేరిట ఓ లేఖ పెద్ద దుమారం తీసుకువస్తోంది. కారు డ్రైవరు ప్రసాద్‌ తనను చచ్చిపోయేట్లు కొట్టాడని వివేకా పేరుతో రాసిన లేఖను ఆయన బంధువులు శుక్రవారం సాయంత్రం పోలీసులకు అందించారు. ఇదే లేఖపై జగన్‌ స్పందిస్తూ గొడ్డలితో నరికి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతన్న వ్యక్తి ఎలా ఈ లేఖ రాయగలుగుతారని ప్రశ్నించారు. కారు డ్రైవరు ప్రసాద్‌, రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు ఆర్‌.సుధాకర్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ లేఖను పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి అసలు వైఎస్‌ వివేకానే ఈ లేఖ రాశాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాత్రి 11.30గంటలకు కారు డ్రైవరు ప్రసాద్‌ వివేకాను ఆయన నివాసంలో వదలి వెళ్లిపోతుండగా భోజనానికి డబ్బులివ్వగా తాను ఇంట్లోనే భోంచేస్తానని వెళ్లిపోయాడు. ఉదయం 5.30 గంటలకు పీఏ కృష్ణారెడ్డి వచ్చారు. 6.30గంటల ప్రాంతంలో వాచ్‌మేన్‌ వెనుక వైపు తలుపు తీసిన విషయాన్ని గుర్తించి కృష్ణారెడ్డికి వివరించారు. ఇద్దరూ వెళ్లి చూడగా బాత్‌రూంలో వివేకా విగత జీవుడై కనిపించాడు. అప్పుడే గుండెనొప్పితో కుప్పకూలిపోయి దెబ్బలు తగలడంతో రక్తస్రావమై వివేకా చనిపోయాడని బంధువులే పప్రాథమికంగా నిర్ధరించారు. బెడ్రూములో రక్తపు మరకలను కడిగేసినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులకు 6.40 గంటలకు సమాచారం రావడంతో సీఐ శంకరయ్య సంఘటన స్థలానికి చేరే సమయానికే రక్తాన్ని తుడుస్తూ కనిపించడంతో ఆయన ఇలా చేయకూడదంటూ అడ్డు తగిలారు. పోస్టుమార్టం నిర్వహించే వరకు అందరిలోనూ హఠాన్మరణం చెందినట్లుగా ప్రచారం సాగుతూ వచ్చింది. డాక్టర్లు పోస్టుమార్టం చేసేందుకు మృతదేహాన్ని పరిశీలించినప్పుడు తలపై బలమైన గాయాలు, ఒళ్లంతా గొడ్డలితో నరికిన గాట్లు కనిపించాయి. అప్పుడే హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సాయంత్రం వరకు హైడ్రామా కొనసాగుతూ వచ్చింది. డీఐజీ, ఎస్పీతో పాటు క్లూస్‌టీం, జాగిలాలు తదితర విచారణ బృందాలన్నీ తరలివచ్చాయి. అనుమానాస్పద మృతిగా మొదట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ హత్య జరిగినట్లుగా పోస్టుమార్టం సమయంలోనే తేలింది. ఈ హత్య వెనుక ఎవరున్నారు, ఎందుకు జరిగింది, ఏవైనా ఆర్థిక లావాదేవీలా, కుటుంబ కలహాలా, లేదా ఇతర వ్యవహారాలా అన్న చర్చ జోరుగా సాగుతూ వచ్చింది. 5గంటలకు జగన్‌ పులివెందులకు విచ్చేసి వివేకా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. గంట తరువాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పది నిమిషాల ముందు వివేకానందరెడ్డి బంధువులు డీఎస్పీ నాగరాజును కలిసి ఇంట్లో ఈ లేఖ దొరికిందంటూ ఓ లేఖ అందించారు. ఆ లేఖలో రక్తపు మరకలు ఉన్నాయి.

‘నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటరు రాసేకి చాలా కష్టపడ్డాను. డ్రైవరు ప్రసాద్‌ను వదలి పెట్టవద్దు. ఇట్లు వివేకానందరెడ్డి’ అని ముగింపు పలికారు. ఈ లెటరు అందుకున్న పోలీసులు కారు డ్రైవరు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. పులివెందులకు చెందిన ప్రసాద్‌ ఒకటిన్నర నెలగా కారు డ్రైవరుగా వివేకాకు సేవలందిస్తున్నాడు. గురువారం రాత్రి 11.30కు ఇంటి వద్ద వదలిన ప్రసాద్‌ తిరిగి ఎప్పుడొచ్చాడన్నది అంతుచిక్కని ప్రశ్న. జగన్‌ చెప్పినట్లు గొడ్డలితో దారుణంగా నరకడంతో తీవ్ర గాయాలపాలైన వివేకా లెటరు రాసే పరిస్థితిలో ఉన్నాడా అనేది సందేహమే. మరి వివేకా బంధువులే ఈ లెటరును తీసుకువచ్చి పోలీసులకు అందించడం వెనుక అంతరార్థం ఏమిటన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఉదయం గుండెనొప్పితో చనిపోయారని చెప్పడం, ఆ తరువాత పోస్టుమార్టానికి తరలించే సమయంలోనే గొడ్డలితో నరికినట్లు గుర్తించారు. బెడ్‌రూంలో ఉన్న రక్తపు మరకలు తుడవడం ఇవన్నీ కూడా పోలీసులు వచ్చే లోపే వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైఎస్‌ రాజారెడ్డి హత్యలో ముద్దాయిగా జైలు జీవితం అనుభవించి ఇటీవలే విడుదలైన రాగిపిండి సుధాకర్‌రెడ్డికి ఈ హత్యలో ప్రమేయం ఉందన్న ఆలోచనలతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా పోలీసులే డ్రామా ఆడుతున్నారంటూ హత్యను గుండెనొప్పితోనే చనిపోయాడని సృష్టించే ప్రయత్నం జరిగిందని, ఈ ప్రభుత్వం ఈ పోలీసులపై నమ్మకం లేదని జగన్‌ ఆరోపిస్తూ సీబీఐ లేదా థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. కర్నూలు డీఐజీ, జిల్లా ఎస్పీలు పర్యవేక్షిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. ఒకటి, రెండురోజుల్లో ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు, ఎందుకు జరిగింది అన్నది తేలనుంది. సంఘటట జరిగి వెలుగులోకి వచ్చిన 12 గంటల తరువాత లేఖను బయట పెట్టి వివేకా రాసినట్లుగా చెప్పడంలో కూడా ఏదో మతలబు దాగి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.

 

వైఎస్ వివేకానందరెడ్డి హత్యను గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం ఎందుకు చేశారని, బెడ్‌రూమ్‌లో రక్తాన్ని ఎవరు, ఎందుకు తుడిచారు.. వంటి అంశాలకు వైకాపా అధినేత జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. బయిట వ్యక్తి హత్యకు గురైతే సాక్ష్యాలను కాపాడుతామని, ఇంట్లో మనిషి కావడంతో సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఉదయం ఈ విషయం తెలియగానే తాను బాధ పడ్డానని, ఆ తరువాత వివేకా కుటుంబ సభ్యులు డ్రామా ఆడటం ప్రారంభించారన్నారు. ఉదయం 5.30 గంటలకు ఇంటికి వెళ్తే, తలుపు తీయకపోతే వెనుక నుంచి తీశారని, అప్పటికే బాత్ రూమ్‌లో వివేకానంద రెడ్డి పడి ఉన్నారని తెలిపారు. ఉదయం 6.30 గంటలకు అవినాష్‌రెడ్డి వచ్చారని తెలిపారు. పోలీసులకు పోన్ చేశారని, అప్పుడు కూడా హత్య అని చెప్పకుండా గుండెపోటు అని, ఆసుపత్రికి తరలించారని ఆరోపించారు.

magunta 16032019

శవాన్ని బెడ్‌రూమ్ నుంచి బాత్ రూమ్‌కు, బాత్‌రూమ్ నుంచి బెడ్‌రూమ్‌కు ఎవరు, ఎందుకు తరలించారో చెప్పాలన్నారు. అంతపెద్ద నేరం జరిగితే కీలకమైన ఫోరెన్సిక్ సాక్ష్యాలను ఎందుకు మాయం చేసే ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. శవాన్ని ఆసుపత్రికి తరలించి అక్కడ కూడా గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారని, మెదడు బయటకు వచ్చేంత గాయం అయితే అది హత్యో, గుండెపోటో తెలియదా అని ప్రశ్నించారు. హత్య జరిగినప్పుడు పంచనామా జరపకుండా శవాన్ని ఎలా ఆసుపత్రికి తరలిస్తారని అన్నారు. బెడ్‌రూమ్‌లో తలకు గాయం తగిలిందని గుడ్డ కట్టారని, ఆ తరువాత ఆసుపత్రికి తరలించడం వంటివి చేశారన్నారు. హత్యగు గురైంది వారి కుటుంబ సభ్యుడని, ఎందుకు సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం చేశారని, ఎవరిని కాపాడేందుకు ఈ వ్యవహారాలన్నీ చేశారని ప్రశ్నించారు. పోలీసులకు ఫిర్యాదు 8 గంటలకు ఇచ్చారన్నారు. ఉదయం 5.30కు తెలిస్తే, చాలా సేపటి తరువాత ఫిర్యాదు ఇచ్చారన్నారు. అక్కడ ఉన్న సీఐ కూడా శవాన్ని తరలించడానికి సహకరించడంపై విచారణ చేయాల్సి ఉందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ జగన్, అతని కుటుంబ సభ్యుల స్వరంలో మార్పు వచ్చిందని తెలిపారు.

magunta 16032019

వాస్తవాలను బయటకు రాకుండా చేసి, రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారన్నారు. కేసును పరిశీలిస్తే చాలా సందేహాస్పదంగా ఉందన్నారు. కుటుంబ సభ్యుడు హత్యకు గురైనా గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. జగన్ తన ఇంట్లో జరిగిన నేరానికి సాక్ష్యాలు లేకుండా మాయం చేయడం ద్వారా ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలకు వివరించాలన్నారు. లేఖ ఎవరు రాశారు, ఉదయం లేనది సాయంత్రం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆ పరిస్థితుల్లో లేఖ రాసే వీలు ఉంటుందా అని సందేహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు అందరూ చూశాక కూడా హత్య కాదని నమ్మించే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పుడు సీబీఐ విచారణ అడుగుతున్నారని, తప్పులు కప్పిపుచ్చుకునేందుకు మరికొన్ని తప్పులు చేసి, ఇప్పుడు తప్పించుకునేందుకు సీబీఐ విచారణ అడుగుతున్నారన్నారు. సీబీఐ అయితే వీరు చెప్పినట్లు వినే వీలు ఉందని అడుగుతున్నారన్నారు. కుటుంబ సభ్యుడు హత్యకు గురైతే సాక్ష్యాలను లేకుండా చేయడం కరడు కట్టిన నేరస్థులే చేయగలరన్నారు. హత్యను సహజ మరణంగా చూపించే ప్రయత్నం చేశారన్నారు. ఇలా ఎందుకు చేశారో జగన్ కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసి రాజకీయానికి వాడుకుంటారా అని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే ఆదేశించానని తెలిపారు.

తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు 1982లో స్థాపించగా, అప్పటి నుంచి మంగళగిరిలో ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం అభ్యర్థి గెలువగా, ఆపై మూడు దశాబ్దాల్లో ఒక్కసారి కూడా ఆ పార్టీ అభ్యర్థి గెలవలేదు. 1985లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు, తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జమునపై దాదాపు 5 వేల ఓట్ల ఆధిక్యంలో గెలుపొందగా, ఆపై టీడీపీ అక్కడ విజయం సాధించలేదు. ఆపై మంగళగిరి స్థానాన్ని తెలుగుదేశం తనకు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలకే కేటాయిస్తూ వచ్చింది. 1994 మినహా అన్ని ఎన్నికల్లో మంగళగిరిని కాంగ్రెస్ గెలుచుకోగా, 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2009 ఎన్నికల్లో అక్కడ ప్రజారాజ్యం పార్టీ రెండో స్థానంలో నిలిచింది. అంటే ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ తరఫున మంగళగిరి నుంచి గడచిన 30 ఏళ్లలో ఎమ్మెల్యేనే లేడు.

magunta 16032019

అటువంటిది ఇప్పుడు టీడీపీ యువనేత నారా లోకేశ్, తాను తొలిసారిగా పోటీ పడేవేళ, అదే మంగళగిరి స్థానాన్ని ఎంచుకుని పెద్ద సాహసాన్నే చేశారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, మారిన పరిస్థితులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిన తరువాత, మంగళగిరి నియోజకవర్గంలోని అత్యధిక విస్తీర్ణం, రాజధాని అమరావతి పరిధిలోకి వెళ్లడం తెలుగుదేశం పార్టీకి లాభిస్తుందని అంచనా. ఈ నియోజకవర్గంలో 3 లక్షలకు మందికిపైగా ఓటర్లు ఉండగా, అందులో లక్షకు పైగా బీసీల ఓట్లు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం వరకూ వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్న ఈ నియోజకవర్గం, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆధారంగా నడుస్తోంది.

magunta 16032019

రాజధానికి దాదాపు 40 వేల ఎకరాల భూమిని తీసుకోవడం, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడటంతో ఈ ప్రాంత ప్రజల్లో సానుకూల ధోరణి కనిపిస్తోందని, అదే తమకు ఓట్ల రూపంలో కనిపిస్తుందని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నా, స్థానిక సమీకరణాలు కాస్తంత అడ్డుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడి కొన్ని బీసీ సంఘాలు లోకేశ్ పట్ల తమ వ్యతిరేకతను చూపిస్తున్నాయి. పద్మశాలీలకు సీటివ్వాలని ఓ వర్గం, ఎవరైనా బీసీనే నిలబెట్టాలని మరో వర్గం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కొన్ని సానుకూలతలు, మరికొన్ని ప్రతికూలతలూ ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ గెలుపు అంత సులువు కాదుకానీ, ఆయన గెలుస్తారన్న నమ్మకం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి.

Advertisements

Latest Articles

Most Read