మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మరణవార్త విన్నప్పుడు చాలా బాధ కలిగిందని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వివేకా హత్యోదంతం తదనంతర పరిణామాలపై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ రోజు ఉదయం 7గం కు వైఎస్ వివేకానంద రెడ్డి మరణ వార్త విని బాధపడ్డాను. హార్ట్ అటాక్ తో మృతి అని వార్త విని బాధపడ్డాను. వెంటనే ప్రగాఢ సంతాపం తెలియజేశాను. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించాను. ఇక ఆ తరువాత అసలు డ్రామా ప్రారంభించారు-ఉదయం 5.30కే వివేకా ఇంటికి వెళ్లడం, తలుపు కొడితే తీయకపోవడం, భార్యకు ఫోన్ చేశారని, లేట్ గా ఇంటికి వచ్చారని ఆమె చెప్పడం-ఇంటి వెనుక తలుపు తీసివుండటం,6.45కి అవినాష్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేయడం-7.30 కల్లా అందరూ అక్కడికి చేరడం-గుండెనొప్పి,వాంతులు అనడం, ఆసుపత్రికి అనడం,ఈ లోపు అన్నీ తుడిచేయడం- అప్పటివరకు అది హత్య అని చెప్పలేదు. సాధారణంగా నేరం జరిగిన ప్రాంతాన్ని చిందరవందర చేయరు. మరెందుకు ఇక్కడ తుడిచేశారు..? బాత్ రూమ్ లో డెడ్ బాడి ఉందని చెప్పారు. తరువాత బెడ్ రూమ్ కు బాడిని మార్చారు. తలకు దెబ్బ తగిలిందని గుడ్డకట్టారు. బాత్ రూమ్ వద్ద రక్తపు మడుగు కడిగేయడం,తరువాత బాడిని ఆసుపత్రికి తరలించడం. అక్కడేదో వైద్యం చేయిస్తున్నట్లు చెప్పడం నాటకం. గుండెనొప్పి,పొద్దున్నే వాంతులు అన్నారు. ఎందుకు ఈ విధంగా కప్పెట్టాలని చూశారు...?
ఆసుపత్రికి తీసుకెళ్లేవరకు ఎందుకు దాచిపెట్టారు..? హార్ట్ అటాక్ అని ఎందుకు మొదట చెప్పారు..? బాత్ రూమ్ నుంచి బెడ్ రూమ్ కు ఎట్లా తరలించారు..? బెడ్ రూమ్ నుంచి ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు..? మీ ఇంట్లో జరిగిన హత్య ఇది. మీరే ఎందుకు సీన్ ఆఫ్ అఫెన్స్ మార్చారు...?సాక్ష్యాధారాలు తుడిచేయాలని ఎందుకు ప్రయత్నించారు..?ఇది హత్య అని మొదటే ఎందుకు చెప్పలేదు..? బాత్ రూమ్ లో పడితే తగిలిన దెబ్బలని ఎందుకు నమ్మించారు..?కేసులు ఏమీ వద్దని మొదట ఎందుకు అన్నారు..? ఉదయం 9.30గం దాకా ఎందుకీ నాటకం ఆడారు..? తలపై ఎంతో బలమైన గాయం అయ్యింది, మెదడు కూడా బైటకు వచ్చింది. అలాంటిది గుండెనొప్పి అనడం ఏమిటి..? బాత్ రూమ్ లో వాంతులు అనడం ఏమిటి..? బాత్ రూమ్ లో పడి గాయం అయ్యిందని అనడం ఏమిటి..? అవినాష్ కు ఎవరు చెప్పారు..? అవినాష్ మొదట ఎవరికి ఫోన్ చేశారు..? మొదట ఫోన్ చేసి ఎవరికేమి చెప్పారు..? ఈసి గంగిరెడ్డి,భాస్కర రెడ్డి అనేకమంది వెళ్లారు...? అప్పుడే ఇది హత్య అని ఎందుకు చెప్పలేదు..? మీ సమీప బంధువు దారుణ హత్యకు గురయ్యాడు. దీనిని హత్య అని మొదట చెప్పకుండా ఎందుకు దాచారు..? ఆసుపత్రికి తీసుకెళ్లక ముందు హత్య అని తెలియదా..? ఆసుపత్రికి తీసుకెళ్లేదాకా ఎందుకు దాచారు..?మీ ఇంట్లో జరిగిన హత్య ఇది. దానికి గుండెనొప్పి అని ఎందుకు చెప్పారు? హత్య జరిగిన తరువాత పంచనామా చేస్తారని తెలియదా..? పంచనామా జరగకుండా బాడిని ఎందుకు తీసుకెళ్లారు..? బాత్ రూమ్ లోకి ఎవరు తీసుకెళ్లారు..? బాత్ రూమ్ నుంచి బెడ్ రూమ్ కు ఎవరు తెచ్చారు..?
అప్పుడు లెటర్ లేదు,సాయంత్రానికి లెటర్ వచ్చింది. దీనితో ఎవరికి సంబంధం ఉంది అనేది బైటకు రావాలి. జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా,గర్హిస్తున్నా మనిషి చనిపోయాడని తెలియగానే బాధపడ్డాను, వెంటనే సంతాపం ప్రకటించాను. పోస్ట్ మార్టమ్ జరిగేదాకా ఇది హత్య అనేది దాచారు. ఆసుపత్రి డ్రామా ఆడారు, గుండెనొప్పి అన్నారు. బైటవాళ్లు చంపితే సాక్ష్యాలను ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంట్లోవాళ్లు చేస్తే చెరిపేసిన సాక్ష్యాలను బైటకు లాగాలి. అదే పోలీసులు చేస్తున్నారు. ఎందుకు బెడ్ రూమ్ కడిగారు,ఎందుకు ఫోరెన్సిక్ సాక్ష్యాలు తుడిచారు. మెదడు బైటకొచ్చే గాయం అయితే ఇదేనా మీరు చేసేది..?గుండెనొప్పి వస్తే తలలో రక్తం వస్తుందా..? కుటుంబ సభ్యుడు హత్యకు గురయ్యాడు. ఆయన హత్య సాక్ష్యాలను తుడిచేస్తారా..? మీ ఇంటికి ఎవరెవరు వచ్చారు..? ఎందుకు బాడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు..? గుండెనొప్పి అని మొదట చెప్పింది మీరు కాదా..? బాత్ రూమ్ లో వాంతులని చెప్పలేదా..? ఫిర్యాదు ఇచ్చాక, ఆసుపత్రిలో వాస్తవాలు బైటకొస్తే అప్పుడింకో డ్రామా ఆడతారా..? ఉదయం నుంచి రాత్రివరకు డ్రామాల మీద డ్రామాలాడతారా..? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలెందుకు తడుముకుంటున్నారు..? మీ చిన్నాన్న చనిపోతే నీకు బాధ లేకపోతే...? పినతండ్రి హత్యకు గురైతే స్పందన లేకపోతే..?ఉదయం 8గంటల దాకా ఎందుకని ఫిర్యాదు ఇవ్వలేదు..? ఉదయం 6.30గంకు చనిపోయినట్లు మీకు తెలిసింది. ఉదయం 7.30గం కల్లా సంఘటనా ప్రాంతానికి వచ్చారు. ఇంట్లోనే వైఎస్ వివేకా హత్యకు గురైంది చూసి ఆ వచ్చినాళ్లు ఏం చేయాలి..? గుడ్డకట్టి 2గంటలపాటు ఆసుప్రతి అన్నారు. బెడ్ రూమ్,బాత్ రూమ్ కడిగేశారు. ఎందుకు ఇదంతా చేశారు? ఎవరిని తప్పించడానికి చేశారు..? ఆ లెటర్ ఇచ్చింది పోలీసులు కాదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన లెటర్ అది. ఆ లెటర్ ఎవరు రాశారో ఇచ్చినాళ్లే చెప్పాలి. లేదా దర్యాప్తులో పోలీసులే తేలుస్తారు అది ఎలా వచ్చిందో..? సత్యం అనేది ఎప్పుడూ సత్యమే. సత్యాన్ని చెరిపేయడం ఎవరి తరం కాదు. దీనికి జవాబివ్వాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు సమాధానం చెప్పాల్సింది జగన్ కుటుంబ సభ్యులే"