వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో నమ్మలేని నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పులివెందులలోని స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే వివేకా శరీరంపై బలమైన గాయాలుండటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వైఎస్ కుటుంబసభ్యులు సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో సుధాకర్‌రెడ్డి జైలు శిక్ష అనుభవించాడు. మూడు నెలల కింద సత్ప్రవర్తన కింద కడప సెంట్రల్‌ జైలు నుంచి సుధాకర్‌రెడ్డి విడుదలయ్యాడు. ఆయన హత్యకు గురైనట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. కొద్ది సేపటి క్రితమే కడపలోని రిమ్స్‌ వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేయడంతో ఆయన భౌతికకాయాన్ని పులివెందులకు తరలించారు.

jagan kcr 15032019

1998 మే 23న రాజారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఇడుపులపాలయలోని వ్యవసాయక్షేత్రాన్ని చూసేందుకు తన అనుచరుతలతో కలిసి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ప్రత్యర్థులు దాడి చేసి ఆయన్ను హత్య చేశారు. రాజారెడ్డి హత్య కేసులో 13 మందికి అప్పటి ఉమ్మడి హైకోర్టు 2006లో జీవిత ఖైదు విధించింది. దోషులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ ఏడాది టీడీపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. విడుదలైన వారిలో సుధాకర్‌రెడ్డి కూడా ఉన్నాడు. రాజారెడ్డి హత్య కేసులో సుధాకర్‌రెడ్డి 8వ ముద్దాయిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

 

jagan kcr 15032019

వివేకానంద రెడ్డి శుక్రవారం ఉదయం పులివెందులలోని తన నివాసంలో రక్తపు మడుగులో పడి ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తంచేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. హత్య కోణంలోనే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. పులివెందులలో వివేకా నివాసానికి వెళ్లిన ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ సుమారు రెండు గంటల పాటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత దీన్ని హత్యగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు, వివేకా మరణం హత్యగా తేలడం సంచలనంగా మారింది. ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? దీనిలో కుట్ర కోణాలేంటనే దానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనేది తేల్చేందుకు అన్ని కోణాల్లో దృష్టిసారిస్తున్నారు.

వైఎస్‌ వివేకానంద మృతి పై సంచలన నిర్ణయం తీసుకుంది ఏపి ప్రభుత్వం. హత్య విషయంలో, ప్రతిపక్షం ఆరోపణలు ఉదృతం చేస్తూ, ఫ్యామిలీ గోడవలని రాష్ట్ర శాంతి బధత్రల చర్యగా మార్చి, గొడవలు చెయ్యాలనే ఆలోచనలో జగన్ పక్షం ఉండటంతో, ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయ్యింది. హత్య విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. అడిషనల్‌ ఎస్పీ బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. వివేకా మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనుమానాస్పద మృతి వార్తలపై చంద్రబాబు తక్షణమే స్పందించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన స్పష్టం చేశారు.

ap 15032019

వివేకా మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివేకా మృతి పట్ల అనుమానాలు రావడంపై వెంటనే స్పందించారు. అప్పటికప్పుడు పోలీస్‌ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు, కడప పోలీసులతో చంద్రబాబు మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని కడప ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ చెప్పారు. ఫోరెన్సిక్‌ నిపుణులను రప్పిస్తున్నామని, కేసును సీరియస్‌గా తీసుకున్నామని ఆయన తెలిపారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కడప ఎస్పీ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, వైఎస్‌ వివేకా ఇంటికి చేరుకున్న డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ ఘటనా స్థలిని క్షుణ్ణంగా పరిశీలించింది.

ap 15032019

ఆయన శరీరంపై ఏడు చోట్ల బలమైన గాయాలు ఉన్నాయని తెలిపారు. వివేకానంద రెడ్డి తలపైన, ఛాతిపైనా గాయాలు ఉన్నాయని, ఈ హత్యకు సంబంధించి తాము కొన్ని ఆధారాలు సేకరించినట్టు చెప్పారు. ఘటనా స్థలంలో కొన్ని వేలిముద్రలు గుర్తించామని, అవి ఎవరివో తేల్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తుందని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని స్పష్టంచేశారు. ఈ కేసు విచారించి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

‘‘కేసీఆర్‌.. మీకో నమస్కారం. రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రులను తిట్టారు. ఇవాళ విడిపోయాం. ఇక ఆంధ్రులను వదిలేయండి. శిష్టా ఆంజనేయ శాస్త్రి చెప్పినట్టు రాజ్యాంగబద్ధ విరోధం ఉండాలి. ప్రజల మధ్య విరోధం కాదు’’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో గురువారం జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘కేసీఆర్‌... మీరు ఉద్యమానికి నాయకత్వం వహించారు. తక్కువ హింసతోనే రాష్ట్రాన్ని సాధించారు. మీపై గౌరవం ఉంది. మీ గొడవల వల్ల ప్రజలను శిక్షించకండి’ అని విజ్ఞప్తి చేశారు. 1996లో బీజేపీ ‘ఒక ఓటు, రెండు రాష్ట్రాలు’ అనే తీర్మానం చేసి తెలుగు ప్రజలను రెండు ముక్కలు చేసిందన్నారు. ఆ బాధ, కన్నీళ్లు ఉన్నప్పటికీ... మోదీ ప్రధాని కావాలని తాను కోరుకున్నానని తెలిపారు. ‘మీరు ప్రధానైతే మంచి రోజులొస్తాయనుకున్నాం. కానీ.. ఏవీ? పార్లమెంటుసాక్షిగా హామీ ఇచ్చిన, మేనిఫెస్టోలో పెట్టిన ప్రత్యేక హోదా ఎందుకివ్వలేదు? భయపెట్టి పాలిస్తానంటే భయపడతామా? మేమేం తప్పు చేశాం. ఆంధ్రులు ఈదేశ పౌరులు కారా? పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టడంలేదు? చంద్రబాబుపై కోపం ఉంటే ఆయనా, మీరూ చూసుకోండి! ఆ కోపం ఆంధ్రాపై ఎందుకు చూపిస్తారు!’ అని పవన్‌ నిలదీశారు. రాష్ట్రాన్ని ఒకసారి కాంగ్రెస్‌ దెబ్బకొట్టిందని... ఇప్పుడు బీజేపీ ఆ పని చేస్తోందని ధ్వజమెత్తారు.

pk 15032019

జగన్‌...తండ్రి మాటపై గౌరవం లేదా! రాష్ట్రాన్ని గట్టి దెబ్బకొట్టిన బీజేపీ.. వైసీపీకి దొడ్డి దారిన అండగా ఉందని పవన్‌ విమర్శించారు. ‘జగన్‌ దీనికి బదులివ్వాలి. బీజేపీతో ఎందుకు కలిశారో స్పష్టత ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు. బీజేపీతోపాటు టీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌, హరీశ్‌లతో తనకు జగన్‌కంటే ఎక్కువ సాన్నిహిత్యం ఉందని.. అయితే, రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేటప్పటికి వాళ్లతో విభేదించానని తెలిపారు. ‘తెలంగాణ విడిపోతే ఏమవుతుందో వైఎస్‌ చెప్పారు. ఆయన కొడుకుగా జగన్‌ ఆ మాటలు మరిచిపోయారు. తండ్రి మాటపై గౌరవం అదేనా!’ అని పవన్‌ ప్రశ్నించారు.‘చంద్రబాబు పోటీ చేయొచ్చు. జగన్‌ పోటీ చేయొచ్చు. కానీ.. కేసీఆర్‌ను ఎందుకు తెస్తారు? ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టిన వ్యక్తులకు అండగా ఉండడం మంచిది కాదు. బీజేపీ, కేసీఆర్‌తో మీకెందుకు? వాళ్లతో కలసి ఉన్న నేనే విభేదించాను. మీరు బయటకు రాకుండా ఆంధ్రుల ప్రజల ఆత్మాభిమానాన్ని కాపాడగలరా?’ అని జగన్‌ను ప్రశ్నించారు. ధర్మకర్తలా ఉండాల్సిన సీఎం.. అవినీతికి కొమ్ము కాస్తుంటే బాధ కలిగిందని తెలిపారు. ‘కొందరు జనసేనకు కేవలం గోదావరి జిల్లాలే బలం అన్నారు. నన్ను కాపులా చూస్తున్నారా? నాకు కులం లేదు. శ్రీకాకుళం నాది, విశాఖ నాది, బొబ్బిలి నాది, కోస్తా నాది, రాయల సీమ నాది!’ అని పవన్‌ ప్రకటించారు. సినిమాల్లో తొడగొట్టడం వేరు, నిజజీవితం వేరన్నారు.

 

pk 15032019

వైసీపీ నేత జగన్‌లా బీసీల పేరిట సదస్సు పెట్టి ప్రజలను విభజించనని పవన్‌ తెలిపారు. ‘32 మందితో విడుదల చేసిన జనసేన తొలి జాబితాలో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాను. జగన్‌ కడప ఎంపీ సీటును బీసీలకు ఇవ్వగలరా? పులివెందుల సీటును బీసీలకు ఇవ్వగలరా? మీ వాళ్లను కాదని మిగతా వారికి సీట్లు ఇవ్వగలరా? వ్యక్తులు, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా మీరు సీట్లు ఇవ్వగలరా’ అని పవన్‌ ప్రశ్నించారు. అందరూ కులాలను విభజించి రాజకీయం చేస్తుంటే తాను ఏకం చేసి రాజకీయం చేస్తున్నానన్నారు. ‘తెలంగాణ నేతలు ఉద్యమ సమయంలో కాపు, కమ్మ, మాల, మాదిగ అని తిట్టలేదు. మొత్తం ఆంధ్రావాళ్లని చెత్త తిట్లు తిట్టారు. అంబేద్కర్‌ కోరుకున్నట్లుగా కుల నిర్మూలన జరుగుతుందో లేదో... కానీ నేను కులాల మధ్య ఐక్యత సాధిస్తాను’ అని పవన్‌ స్పష్టం చేశారు. ‘రెడ్డి’ అంటే కులం కాదని, ధర్మాన్ని రక్షించే వాడని అర్థమని నిర్వచించారు. ‘ఈ పదాన్ని బ్రిటిష్‌ వాళ్లు ఇచ్చారు. నాయుడు, రెడ్డి అనే పదాలు అన్ని కులాల్లోను ఉంటాయి’ అని తెలిపారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిది సాధారణ మరణం కాదనీ… అతడిని హత్య చేశారని పోస్టుమార్టమ్ రిపోర్టులో తేలింది. ఆయన నుదురు, తల వెనుక, చేతుల భాగంలో దాడి చేసినట్టుగా… లోతైన గాయాలున్నట్టు డాక్టర్లు తేల్చారు. పదునైన ఆయుధాలు వాడినట్టుగా డాక్టర్లు వివరించారు. వైఎస్ వివేకానందరెడ్డి నుదుటిపై లోతుగా రెండు గాయాలున్నాయని.. వీటిని వేట కత్తులతో వేసినట్టుగా భావిస్తున్నారు. వివేకా తల వెనుక భాగంలోనూ బలమైన గాయం అయింది. దాడిని అడ్డుకునేందుకు చేతులు అడ్డుపెట్టినప్పుడు చేతులపై గాయాలైనట్టు భావిస్తున్నారు. నుదిటి పై రెండు లోతైన గాయాలు, తల వెనుక మరో గాయం, ఛాతి భాగంలో ఒకటి, తొడ భాగంలో ఒక గాయం, చేతిపై మరో గాయం ఇలా.. మొత్తం ఏడు గాయాలున్నట్టు పోస్టుమార్టమ్ రిపోర్టు నిర్ధారించింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా వైఎస్ వివేకాది హత్యే అని నిర్ధారించారు పోలీసులు.

vivkea 1532019

వైఎస్ వివేకానందరెడ్డి గురువారం రాత్రి ఒక్కరే ఇంట్లో ఉన్నారని పీఏ కృష్ణారెడ్డి చెప్పారు. ఉదయం ఇంటికి వెళ్లి పిలిస్తే ఆయన లేవలేదనీ.. పార్క్ సైడ్ డోర్ తెలిచి ఉండటంతో.. అందులోంచి ఆయన బెడ్ రూమ్ కు వెళ్లామనీ… అక్కడే బాత్రూమ్ లో ఆయన పడిఉన్నాడని తెల్సుకున్నామన్నారు. తెల్లవారుజామున బాత్ రూమ్ లో రక్తపు మడుగులో వివేకా పడి ఉన్నాడని… ఆయనే కుటుంబసభ్యులకు చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు సిట్ ను ఏర్పాటుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రిమ్స్‌ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. పులివెందులలోని స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలిసింది.

vivkea 1532019

తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. వైఎస్ వివేకాకు ఒక కుమార్తె ఉంది. అయితే వివేకా మృతిపై పలు అనుమానాలు వెంటాడుతున్నాయి. దీంతో ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకా తల, చెయ్యికి గాయాలు కావడంపై అనుమానం మరింత పెరిగింది. సమాచారం తెలుసుకున్న ప్రతిపక్ష నేత జగన్, వివేకా కుమారై, ఆయన సతీమణీ హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరారు. శనివారం వివేకా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వివేకా ఇంటిని డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ పరిశీలించాయి. వివేకా మృతి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు. ఫోరెన్సిక్‌ నిపుణులను రప్పిస్తున్నామని, కేసును సీరియస్‌గా తీసుకున్నామని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కడప ఎస్పీ హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read