నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్‌ స్థానానికి టీడీపీ అభ్యర్థిత్వం సాధించిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి హఠాత్తుగా అదృశ్యమయ్యారు. 15 ఏళ్లుగా రాష్ట్రప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నిటినీ మంజూరు చేయించుకుని.. అవి బ్యాంకు లో డిపాజిట్‌ అయిన మరుక్షణమే పత్తాలేకుండా పోయారు. వైసీపీలో చేరి నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో తెలుగుదేశం అధిష్ఠానం బిత్తరపోయింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం అర్ధరాత్రి వరకు ఆదాల అమరావతిలోనే ఉన్నారు. టీడీపీ టికెట్‌ సాధించడంతో పాటు బిల్లులన్నిటినీ క్లియర్‌ చేసుకున్నారు. సుమారు రూ.43 కోట్లకు క్లియరెన్స్‌ వచ్చింది. ఆ పని పూర్తికాగానే ఆదాల నెల్లూరు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు.

aadala 16032019

సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రూ.43 కోట్లు కంపెనీ ఖాతా లో జమయ్యాయని మొబైల్‌కు మెసేజ్‌ వచ్చింది. దానిని చూసిన వెంటనే ప్రచారం ముగించారు. అర్జెంట్‌గా అమరావతికి రమ్మంటున్నారంటూ బయల్దేరారు. అంతే.. ఆ తర్వాత కనిపించలేదు. టీడీపీ నేతలు ఆయనతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఫోన్‌ స్విచాఫ్‌లో ఉంది. ఆదాల పార్టీ ఫిరాయించారని, వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం వైసీపీ వర్గాల నుంచే మొదలైంది. కంగారుపడిన టీడీపీ నేతలు ఆయన కోసం ప్రయత్నించారు. అందుబాటులోకి రాలేదు. ఈలో పు ఆయన అనుచరులు ఆయన ఇంటి వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఆదాల పార్టీని మోసగించారని టీడీపీ నేతలకు అర్థమైంది.

aadala 16032019

600 కోట్ల పనులు కైవసం.. ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి మారినప్పుడు వలసలు పెరుగుతాయని టీడీపీ నాయకత్వం ఒకింత కలవరపడింది. ఆ సమయంలోనే ఆదాల కూ డా వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఇలా తానే ప్రచారం సృష్టించి అధిష్ఠానంపై ఒత్తిడి పెంచి.. తాను పార్టీ మారకుండా ఉండేందుకు రూ.600 కోట్ల విలువైన సోమశిల హైలెవల్‌ కెనాల్‌ పనులు దక్కించుకున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆదాల కదలికలపై అనుమానం వచ్చిన కొందరు నాయకులు ఈ సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు చేరవేశారు. దీంతో ఆదాల ముఖ్యమంత్రిని కలిసి టీడీపీతోనే ఉంటానని నమ్మబలికారు. దాంతో సీఎం ఆయన మాటకు విలువిచ్చారు. ఎన్నికల సమావేశాల సందర్భంగా.. టీడీపీ తరపున లోక్‌సభకు పోటీచేయాలని సీఎం ప్రతిపాదించినప్పుడు ఆదాల ససేమిరా అన్నారు. నెల్లూరు రూరల్‌ కోసం పట్టుబట్టారు. తీరా ఇప్పుడు టికెట్‌ ఇచ్చాక కనిపించకుండా పోయారు.

 

 

కర్నూల్ జిల్లాలోని మంత్రాలయం మండలం ఖగ్గలు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ- వైసీపీ వర్గీయుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి గాల్లోకి కాల్పులు జరిపారు. కాగా ఘర్షణలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వర్గీయులు వేటకొడవళ్లతో దాడికి యత్నించారు. ఈ ఘర్షణలో ఎడమ కాలికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన నేతలు ఆయన్ను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఏఎస్సై తిరుపాల్‌కు కూడా గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం తిరుపాల్‌ను ఆస్పత్రికి తరలించడం జరిగింది.

kurnool 16032019 1

అయితే ఈ కాల్పులు జరిపిందెవరు..? కాల్పులు జరిపేదాక పరిస్థితి ఎందుకెళ్లింది..? కాల్పులు జరిపిన వ్యక్తులకు తుపాకులు ఎక్కడ్నుంచి వచ్చాయి..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మంత్రాలయం అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తిక్కారెడ్డి శనివారం ఉదయం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో ఖగ్గల్‌ వెళ్లారు. తొలి నుంచి వైకాపాకు పట్టున్న గ్రామమైన ఖగ్గల్‌లో తెదేపా జెండా ఆవిష్కరించడానికి తిక్కారెడ్డి సహా పలువురు కార్యకర్తలు అక్కడకి చేరుకున్నారు. దీంతో వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డి భార్య జయమ్మ, ఆయన కుమారుడు ప్రదీప్‌రెడ్డి గ్రామస్థులతో కలసి అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో తిక్కారెడ్డి గన్‌మెన్‌ గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రమాదవశాత్తూ తిక్కారెడ్డి ఎడమకాలికి బుల్లెట్‌ గాయమైంది.

kurnool 16032019 1

మాధవరం ఏఎస్‌ఐ వేణుగోపాల్‌ కుడి కాలికి గాయమైంది. దీంతో వారిని ఆదోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గ్రామంలో పెద్ద ఎత్తున మోహరించారు. వైకాపా అసలు ఏం చెయ్యాలనుకుంటుంది ?? ఈ రోజు మంత్రాలయం తెదేపా అభ్యర్ధి మీద వేటకొడవళ్ళతో దాడి చేసింది. పోలీసులు గాల్లోకి కాల్పులు చెయ్యక తప్పని పరిస్థితి. ఏఎస్సై తిరుపాలు కి కూడా గాయాలు. కనీసం ప్రచారం కూడా ప్రారంభించలేదు. ఇలాంటి వ్యక్తులు పొరపాటున అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి ?? తెదేపా అభ్యర్ధులకు విజ్ఞప్తి, దయచేసి సెక్యురిటీ లేకుండా బయటకు రాకండి. మిమ్మల్ని చంపటానికి కూడా వెనుకాడని దుర్మార్గులు మీ ప్రత్యర్ధులుగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో బిజీబిజీగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యూహం రచించింది. అధికారులందరూ ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో.. ఈ నెల 11వ తేదీన.. ప్రాజెక్టుపై తనకున్న అభ్యంతరాలను తెలియజేస్తూ సుప్రీంకోర్టులో చడీచప్పుడు కాకుండా పిటిషన్‌ వేసింది. కోర్టు వ్యాజ్యాల విషయంలో అప్రమత్తంగా ఉంటున్న ఏపీ జల వనరుల శాఖ ఈ పిటిషన్‌ వివరాలను సేకరించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని నేరుగా కోరనప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ అంతరార్థం మాత్రం అదేనని ఆ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.

jagan kcr 15032019

ఈ పిటిషన్‌లో ముఖ్యంగా 3 అంశాలను ప్రస్తావించారు. మొదటిది.. ప్రాజెక్టు నిర్మాణంవల్ల బ్యాక్‌వాటర్‌ ఎంత ఎత్తులో.. ఎంత వరకూ విస్తరిస్తుంది? రెండోది.. ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలు.. సహాయ పునరావాసం. మూడోది.. ఈ ప్రాజెక్టు నిర్మాణంవల్ల తెలంగాణ భూభాగంలోని జల విద్యుత్కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులూ లేవని తేల్చిచెప్పాలి. వీటన్నిటిపైనా తక్షణమే అధ్యయనం చేపట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఆయా అంశాలపై అధ్యయన నివేదిక వచ్చేంతవరకూ పోలవరం నిర్మాణం ఆపాలన్నదే దాని ఉద్దేశంగా కనిపిస్తోందని రాష్ట్ర ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ గతంలో కేసీఆర్‌ కుమార్తె, ఎంపీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని గుర్తు చేస్తున్నారు.

 

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మరణవార్త విన్నప్పుడు చాలా బాధ కలిగిందని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వివేకా హత్యోదంతం తదనంతర పరిణామాలపై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ రోజు ఉదయం 7గం కు వైఎస్ వివేకానంద రెడ్డి మరణ వార్త విని బాధపడ్డాను. హార్ట్ అటాక్ తో మృతి అని వార్త విని బాధపడ్డాను. వెంటనే ప్రగాఢ సంతాపం తెలియజేశాను. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించాను. ఇక ఆ తరువాత అసలు డ్రామా ప్రారంభించారు-ఉదయం 5.30కే వివేకా ఇంటికి వెళ్లడం, తలుపు కొడితే తీయకపోవడం, భార్యకు ఫోన్ చేశారని, లేట్ గా ఇంటికి వచ్చారని ఆమె చెప్పడం-ఇంటి వెనుక తలుపు తీసివుండటం,6.45కి అవినాష్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేయడం-7.30 కల్లా అందరూ అక్కడికి చేరడం-గుండెనొప్పి,వాంతులు అనడం, ఆసుపత్రికి అనడం,ఈ లోపు అన్నీ తుడిచేయడం- అప్పటివరకు అది హత్య అని చెప్పలేదు. సాధారణంగా నేరం జరిగిన ప్రాంతాన్ని చిందరవందర చేయరు. మరెందుకు ఇక్కడ తుడిచేశారు..? బాత్ రూమ్ లో డెడ్ బాడి ఉందని చెప్పారు. తరువాత బెడ్ రూమ్ కు బాడిని మార్చారు. తలకు దెబ్బ తగిలిందని గుడ్డకట్టారు. బాత్ రూమ్ వద్ద రక్తపు మడుగు కడిగేయడం,తరువాత బాడిని ఆసుపత్రికి తరలించడం. అక్కడేదో వైద్యం చేయిస్తున్నట్లు చెప్పడం నాటకం. గుండెనొప్పి,పొద్దున్నే వాంతులు అన్నారు. ఎందుకు ఈ విధంగా కప్పెట్టాలని చూశారు...?

ఆసుపత్రికి తీసుకెళ్లేవరకు ఎందుకు దాచిపెట్టారు..? హార్ట్ అటాక్ అని ఎందుకు మొదట చెప్పారు..? బాత్ రూమ్ నుంచి బెడ్ రూమ్ కు ఎట్లా తరలించారు..? బెడ్ రూమ్ నుంచి ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు..? మీ ఇంట్లో జరిగిన హత్య ఇది. మీరే ఎందుకు సీన్ ఆఫ్ అఫెన్స్ మార్చారు...?సాక్ష్యాధారాలు తుడిచేయాలని ఎందుకు ప్రయత్నించారు..?ఇది హత్య అని మొదటే ఎందుకు చెప్పలేదు..? బాత్ రూమ్ లో పడితే తగిలిన దెబ్బలని ఎందుకు నమ్మించారు..?కేసులు ఏమీ వద్దని మొదట ఎందుకు అన్నారు..? ఉదయం 9.30గం దాకా ఎందుకీ నాటకం ఆడారు..? తలపై ఎంతో బలమైన గాయం అయ్యింది, మెదడు కూడా బైటకు వచ్చింది. అలాంటిది గుండెనొప్పి అనడం ఏమిటి..? బాత్ రూమ్ లో వాంతులు అనడం ఏమిటి..? బాత్ రూమ్ లో పడి గాయం అయ్యిందని అనడం ఏమిటి..? అవినాష్ కు ఎవరు చెప్పారు..? అవినాష్ మొదట ఎవరికి ఫోన్ చేశారు..? మొదట ఫోన్ చేసి ఎవరికేమి చెప్పారు..? ఈసి గంగిరెడ్డి,భాస్కర రెడ్డి అనేకమంది వెళ్లారు...? అప్పుడే ఇది హత్య అని ఎందుకు చెప్పలేదు..? మీ సమీప బంధువు దారుణ హత్యకు గురయ్యాడు. దీనిని హత్య అని మొదట చెప్పకుండా ఎందుకు దాచారు..? ఆసుపత్రికి తీసుకెళ్లక ముందు హత్య అని తెలియదా..? ఆసుపత్రికి తీసుకెళ్లేదాకా ఎందుకు దాచారు..?మీ ఇంట్లో జరిగిన హత్య ఇది. దానికి గుండెనొప్పి అని ఎందుకు చెప్పారు? హత్య జరిగిన తరువాత పంచనామా చేస్తారని తెలియదా..? పంచనామా జరగకుండా బాడిని ఎందుకు తీసుకెళ్లారు..? బాత్ రూమ్ లోకి ఎవరు తీసుకెళ్లారు..? బాత్ రూమ్ నుంచి బెడ్ రూమ్ కు ఎవరు తెచ్చారు..?

అప్పుడు లెటర్ లేదు,సాయంత్రానికి లెటర్ వచ్చింది. దీనితో ఎవరికి సంబంధం ఉంది అనేది బైటకు రావాలి. జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా,గర్హిస్తున్నా మనిషి చనిపోయాడని తెలియగానే బాధపడ్డాను, వెంటనే సంతాపం ప్రకటించాను. పోస్ట్ మార్టమ్ జరిగేదాకా ఇది హత్య అనేది దాచారు. ఆసుపత్రి డ్రామా ఆడారు, గుండెనొప్పి అన్నారు. బైటవాళ్లు చంపితే సాక్ష్యాలను ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంట్లోవాళ్లు చేస్తే చెరిపేసిన సాక్ష్యాలను బైటకు లాగాలి. అదే పోలీసులు చేస్తున్నారు. ఎందుకు బెడ్ రూమ్ కడిగారు,ఎందుకు ఫోరెన్సిక్ సాక్ష్యాలు తుడిచారు. మెదడు బైటకొచ్చే గాయం అయితే ఇదేనా మీరు చేసేది..?గుండెనొప్పి వస్తే తలలో రక్తం వస్తుందా..? కుటుంబ సభ్యుడు హత్యకు గురయ్యాడు. ఆయన హత్య సాక్ష్యాలను తుడిచేస్తారా..? మీ ఇంటికి ఎవరెవరు వచ్చారు..? ఎందుకు బాడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు..? గుండెనొప్పి అని మొదట చెప్పింది మీరు కాదా..? బాత్ రూమ్ లో వాంతులని చెప్పలేదా..? ఫిర్యాదు ఇచ్చాక, ఆసుపత్రిలో వాస్తవాలు బైటకొస్తే అప్పుడింకో డ్రామా ఆడతారా..? ఉదయం నుంచి రాత్రివరకు డ్రామాల మీద డ్రామాలాడతారా..? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలెందుకు తడుముకుంటున్నారు..? మీ చిన్నాన్న చనిపోతే నీకు బాధ లేకపోతే...? పినతండ్రి హత్యకు గురైతే స్పందన లేకపోతే..?ఉదయం 8గంటల దాకా ఎందుకని ఫిర్యాదు ఇవ్వలేదు..? ఉదయం 6.30గంకు చనిపోయినట్లు మీకు తెలిసింది. ఉదయం 7.30గం కల్లా సంఘటనా ప్రాంతానికి వచ్చారు. ఇంట్లోనే వైఎస్ వివేకా హత్యకు గురైంది చూసి ఆ వచ్చినాళ్లు ఏం చేయాలి..? గుడ్డకట్టి 2గంటలపాటు ఆసుప్రతి అన్నారు. బెడ్ రూమ్,బాత్ రూమ్ కడిగేశారు. ఎందుకు ఇదంతా చేశారు? ఎవరిని తప్పించడానికి చేశారు..? ఆ లెటర్ ఇచ్చింది పోలీసులు కాదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన లెటర్ అది. ఆ లెటర్ ఎవరు రాశారో ఇచ్చినాళ్లే చెప్పాలి. లేదా దర్యాప్తులో పోలీసులే తేలుస్తారు అది ఎలా వచ్చిందో..? సత్యం అనేది ఎప్పుడూ సత్యమే. సత్యాన్ని చెరిపేయడం ఎవరి తరం కాదు. దీనికి జవాబివ్వాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు సమాధానం చెప్పాల్సింది జగన్ కుటుంబ సభ్యులే"

Advertisements

Latest Articles

Most Read