దేశంలో ఎన్నికల నగరా మోగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో అత్యవసరంగా సమావేశమయ్యారు. సమావేశంలో ఎన్నికల షెడ్యూల్, తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సమావేశం అనంతరం సీనియర్ నేతలు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు హైదరాబాద్ లో కూర్చుని మాట్లాడటం ఎంతో ఎవరికీ అర్ధం కావటం లేదు. కేసీఆర్ సామంతుడు అని మరోసారి రుజువైంది.

lokeshtweet 10032019 1

అయితే జగన్ హైదరాబాద్ లో , ఏపి ఎన్నికల పై సమీక్ష చెయ్యటం పై, లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. ఇది లోకేష్ ట్వీట్ "ప్రియ‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లారా! ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఈసీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో పార్టీ నేత‌ల‌తో సీఎం చంద్ర‌బాబు సమావేశమయ్యారు. తెలంగాణలోని లోట‌స్‌పాండ్‌(హైద‌రాబాద్‌)లో వైకాపా నేత‌లతో జ‌గ‌న్ అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వహించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ఎవ‌రు రావాలి? ఎవ‌రు కావాలో మీరే తేల్చుకోండి.." "*కలువ కుంట జగన్ మోడీ రెడ్డి గారు* ఏపీలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌పైన న‌మ్మ‌కంలేద‌ని ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు.అలాగే ప్ర‌వ‌ర్తించారు.కలువ కుంట కే పరిమితం అయ్యారు. ఎన్నిక‌ల న‌గారా మోగ‌డంతో తెలంగాణ‌లోని లోట‌స్‌పాండ్‌లో పార్టీనేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై న‌మ్మ‌కంలేద‌ని నామినేష‌న్లు కూడా తెలంగాణ‌లో వేస్తారా?" అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

lokeshtweet 10032019 1

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా స్పందించారు. ఏప్రిల్ 11న ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, అయితే ఓటు దొంగలు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా తమ ఓటును కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కు అనీ, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ సూచించారు. ప్రజలు తమ ఓటు ఉందో లేదో జాబితాలో చూసుకుని, ఒకవేళ లేకపోతే ఫారం-6 ద్వారా ఓటు పొందాలని తెలిపారు. ఓట్లు తొలగించేందుకు ఓటు దొంగలు వచ్చారని, వారి నుంచి ప్రజలు తమనుతాము కాపాడుకోవాలని పేర్కొన్నారు. బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఓటేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.

 

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. మొదటి దశలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్నాయి. షడ్యుల్ ప్రకటించిన అనంతరం ఏపీ, తెలంగాణో డేటా చోరీపై ఆయన మాట్లాడారు. "ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓట్ల తొలగింపు, ఫామ్‌-7పై.. మాకు ఫిర్యాదులు అందాయి. ఓట్ల తొలగింపు అంశంపై దర్యాప్తు ప్రత్యేక బృందాన్నీ పంపాము. బృందం నివేదికను ఇచ్చిన తరవాత చర్యలు తీసుకుంటాము. ఆయా రాష్ట్రాల సీఈవోల నుంచి వివరాలు కోరాం" సీఈసీ తెలిపారు.

cec 10032019

మరో పక్క, తెదేపాకు సంబంధించిన సమాచారం చోరీకి గురైందంటూ నమోదైన కేసులో సిట్‌ దర్యాప్తును వేగవంతం చేసింది. అందులో భాగంగా ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు ఫిర్యాదులో పేర్కొన్న వాటితో పాటు తాము సేకరించిన ప్రాథమిక సమాచారంలోని అంశాలను క్రోడీకరించి విశ్లేషిస్తోంది. సమాచార తస్కరణ జరిగి ఉంటే దానికి సంబంధించిన డిజిటల్‌ ఆధారాల సేకరణ, దీని వెనుక జరిగిన కుట్ర మూలాలను గుర్తించాలని తొలి లక్ష్యంగా పెట్టుకున్న సిట్‌.. ఆ మేరకు సభ్యుల మధ్య పని విభజన పూర్తి చేసింది. కేసు దర్యాప్తునకు సంబంధించి సిట్‌ సభ్యులైన పి.హరికుమార్‌, ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు, పీహెచ్‌డీ.రామకృష్ణ, యు.రామ్మోహన్‌రావుల మధ్య పని విభజన పూర్తిచేసి వారికి వేర్వేరు బాధ్యతలు అప్పగించింది. ఒకటి రెండు రోజుల్లో వనరులన్నీ సమకూర్చుకున్న అనంతరం సిట్‌ దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.

17వ లోక్‌సభ ఎన్నికలకు గాను కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా షెడ్యూల్‌ విడుదల చేశారు. మొత్తం 543 ఎంపీ స్థానాలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుద చేయడం జరిగింది. జూన్‌ 3తో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగియనున్నది. ఆదివారం మీడియాతో మాట్లాడిన సీఈసీ... దేశంలో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని.. అన్ని రాష్ట్రాల సీఈవోలతో చర్చించినట్లు సీఈసీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ఒకే విడతలో జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. మొత్తం 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒకే దశలోనే జరగనున్నాయి.

ap elections 10032019

ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. కాగా మే 23న కౌంటింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా, ఏప్రిల్ 11నే జరగనున్నాయి. నోటిఫికేషన్ వివరాలు.. - మార్చి 18న తొలి విడత ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ - మార్చి 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ - మార్చి 26న నామినేషన్ల పరిశీలన - నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28 గడువు - మే 23న ఓట్ల లెక్కింపు...ఏప్రిల్ 11న ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్(25), అరుణాచల్(2), అసోం(5), బీహార్(4), చత్తీస్ గఢ్(1), జమ్ముకశ్మీర్(2), మహారాష్ట్ర(7), మణిపూర్(1), మేఘాలయ(2), మిజోరం(1), నాగాలాండ్(1), ఒడిషా(4), సిక్కిం(1), తెలంగాణ(17), త్రిపుర(1), యూపీ(8), ఉత్తరాఖండ్(5), వెస్ట్ బెంగాల్(2), అండమాన్(1), లక్షద్వీప్(1)లలో పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.

ap elections 10032019

" శాంతిభద్రతలు, బలగాల మోహరింపుపై చర్చించాం. రైతులకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్‌ ఉంటుంది. పరీక్షలు, పండుగ తేదీలను పరిగణనలోకి తీసుకున్నాం. 99.36 శాతం ఓటర్లకు గుర్తింపు కార్డులు ఉన్నాయి. టోల్‌ ఫ్రీ నెంబర్‌- 1950కి కాల్‌ చేసి ఓటు సరిచూసుకోవచ్చు. ఓటర్ల తుదిజాబితా ప్రకటించాక మార్పులుండవు. పోలింగ్‌కు 5 రోజుల ముందు ఓటర్‌ స్లిప్‌లు ఇస్తాం. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పిస్తాం. మొత్తం 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వీవీప్యాట్లను ఉంచుతాం. ఓటర్‌కార్డు లేకుంటే 12 గుర్తింపు కార్డులతో ఓటేయవచ్చు. దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు ఉంటాయి" అని సీఈవో ప్రకటించారు.

 

 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య డేటా లీక్ తో పాటు ఫారం-7 అంశం కూడా తీవ్రరూపం దాల్చుతోంది. ఓట్ల తొలగింపుకు ఉద్దేశంచిన ఫారం-7ను కనీవినీ ఎరుగని స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారంటూ పెద్దఎత్తున ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై ఎన్నికల సంఘానికి టీడీపీ మంత్రులు ఫిర్యాదు చేశారు. ఇది వైసీపీ పనే అని మంత్రులు ఫరూఖ్, అమర్ నాథ్ రెడ్డి తదితరులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఫారం-7 దరఖాస్తుల దర్యాప్తులో కొత్త కోణం తెరపైకి వచ్చింది. ఏపీకి సంబంధించిన ఓట్లను తొలగించాలంటూ హైదరాబాద్ నుంచే కాకుండా ఎక్కడో బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి కూడా ఆన్ లైన్ లో దరఖాస్తులు అప్ లోడ్ అయినట్టు ఏపీ పోలీసులు గుర్తించారు.

form7 10032019

అంతేకాదు, 80 ఏళ్ల వృద్ధుడి పేరుతోనూ ఫారం-7 దరఖాస్తు కనిపించినట్టు సమాచారం. దానికితోడు మరణించినవారి పేరుతోనూ దరఖాస్తులు కుప్పలకొద్దీ దర్శనమిచ్చినట్టు తెలుస్తోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులోనే ఈ విషయాలన్నీ తెలియడంతో, లోతుగా దర్యాప్తు చేస్తే కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. సదరు దరఖాస్తుల్లో పేర్కొన్న ఓటర్ల ఐడీలు ఇవ్వాలని, ఆ ఐడీలతో తమ వద్ద ఉన్న సమాచారాన్ని సరిపోల్చుకుంటామంటూ ఏపీ పోలీసులు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల సంఘం ఏపీ పోలీసుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. త్వరలోనే ఐడీ వివరాలు అందజేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో, ఫారం-7 అక్రమాల గుట్టు త్వరలోనే వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

form7 10032019

రాష్ట్రంలో పోలింగ్ బూత్ అధికారులు మండల తాహశీల్దారు ఇచ్చిన పిర్యాదు మేరకు ఇప్పటి వరకు 350 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులను రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది. ఆ బృందం ఇప్పటికే సేకరంచిన సమాచారాన్ని పోలీస్ బాస్‌కు తెలియజేశారు. ఆన్‌లైన్‌లో అందిన దరఖస్తుల గుట్టు రట్టవ్వాలంగే ఎన్నికల కమషన్ సర్వర్‌లోని బ్యాకప్ డేటాను సేకరించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమషన్ సర్వర్లు కోయంబత్తూరులోని సీ డాక్‌లో ఉంటాయి. ఈ సర్వర్ల బ్యాకప్ డేటాను తీసుకోవాలంటే ఐడీ నెంబర్ కేటాయించాల్సి ఉంటుంది. ఐడీ నెంబర్ ఆధారంగా బ్యాకప్ ఓపెన్ చేస్తే ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తుల గుట్టు రట్టుకానుంది.

Advertisements

Latest Articles

Most Read