మీడియా స‌మావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు... ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కుట్ర చేశారు. సాక్ష్యాలతో సహా దేశం ముందు బైటపెడుతున్నాను. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు దీనిపై ఆలోచించాలి. దుష్ట చతుష్టయం కుట్రలు దేశం తెలుసుకోవాలి. నరేంద్రమోది,అమిత్ షా, కెసిఆర్,జగన్ బరితెగించారు. ప్రజలు అసహ్యించుకుంటారు అనేది వదిలేశారు. ప్రజలు ఛీ కొడతారు అనే భయం లేకుండా చేశారు. ఒక మహా కుట్రకు ఏవిధంగా నాంది పలుకుతారో ఇదే రుజువు. చాలా నీచాతినీచంగా వ్యవహరించారు. విజయసాయి రెడ్డి 19.02.2019న ప్రధాన ఎన్నికల అధికారికి ఒక వినతి రాశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ - ఇల్లీగల్ యాక్సిస్ టు డిజిటల్ డేటా ఆఫ్ ఇండివిడ్యువల్స్ బై తెలుగుదేశం పార్టీ-కంప్లయింట్-యాక్షన్-రిగార్డింగ్ ’’ పేరుతో వినతి రాశారు. ఆ వినతిని తయారు చేసింది ఫిబ్రవరి 19న అయితే ఈసికి ఇచ్చింది ఫిబ్రవరి 22న మరునాడే (23.02.2019), ఐటి గ్రిడ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్ వేర్ కంపెనీపైన తెలంగాణ పోలీసులతో చట్టవిరుద్దంగా దాడి చేయించారు. టిడిపి సేవామిత్ర యాప్ సమాచారం, సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమ నిధి, ఇన్సూరెన్స్ సమాచారం అంతా చోరీ చేశారు. రాత్రికి రాత్రి అశోక్ ఆఫీస్ పై దాడి చేయడం, నలుగురు ఉద్యోగులను బెదిరించడం, వాళ్ల కుటుంబ సభ్యులను వేధించడం అన్నీ చేశారు.

విజయసాయి రెడ్డి ఫిబ్రవరి 22నే ఢిల్లీలో ఇచ్చారు, 23న హైదరాబాద్‌లో దిగారు, ఆ రోజే అశోక్ కంపెనీపై దాడి చేశారు. 26.02.2019 న టైమ్స్ ఆఫ్ ఇండియాలో దీనిపై వచ్చింది. ‘‘డేటా బ్రీచ్ బై టిడిపి యాప్..? యుఐడిఏఐ (ఉడాయ్), ఈసి లాంచ్ ప్రోబ్’’ శీర్షికతో వచ్చింది. అందులో ఫిర్యాది విజయసాయి రెడ్డి అని స్పష్టంగా రాశారు. తాను ఫిర్యాదు చేశానని విజయసాయి ఎందుకని చెప్పలేదు..?. 23.02.2019న దాడి, సోదాలు, ఎంక్వైరీ, బెదిరించడం ఫొటోలతో సహా బైటకొచ్చింది. 02.03.2019 అర్ధరాత్రి 12.15కు ఫిర్యాదు వచ్చింది. ఎవరన్నా అర్ధరాత్రి ఇలాంటి ఫిర్యాదు చేస్తారా..? అర్ధరాత్రి ఫిర్యాదు వస్తే, ఉదయం 7గంటలకల్లా ఉద్యోగుల ఇళ్లకెళ్లి సోదాలు, వేధింపులు.. తెల్లకాగితాలపై విఆర్ వోల సంతకాలు తీసుకోవడం ఏంటని..? అంటూ కేసు అథెంటిసిటిపైనే అనుమానాలు ఉన్నాయని హైకోర్ట్ ఆర్డర్ లో పేర్కొంది. కేస్ డైరీ చూస్తే, ఇన్వెస్టిగేషన్ పైనే అనుమానాలు ఉన్నాయని హైకోర్ట్ ఆర్డర్ లో పేర్కొంది. మార్చి 3 సాయంత్రం 7గంటల కల్లా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇంకో ఫిర్యాదు. దశరథరామి రెడ్డి అనేవాడితో మరో కంప్లయింట్ రిజిస్టర్ చేస్తారు. 07.03.2019న సిట్ ఛీఫ్ (స్టీఫెన్ రవీంద్ర) ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు 23 వతేది దాడి, సోదా నిజమేనని ఒప్పుకున్నాడు. హైకోర్ట్ తప్పు పట్టింది అనేది సైబరాబాద్ కమిషనర్ ప్రెస్ మీట్ లో చెప్పరు. ఫిబ్రవరి 23 ముందే విచారణ చేశామని సిట్ ఛీఫ్ (స్టీఫెన్ రవీంద్ర) ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆ విచారణ గురించి సైబరాబాద్ కమిషనర్ ఎందుకు చెప్పలేదు..? ఫిబ్రవరి 22 దాడి,సోదాల ఫొటోలు టిడిపి నేతలు విడుదల చేశారు.

ఆ తరువాతే సిట్ ఛీఫ్ విచారణ నిజమే అని ఒప్పుకున్నారు. ఎవరి ఫిర్యాదుతో ఫిబ్రవరి 22న విచారణ పేరుతో ఐటి గ్రిడ్ కంపెనీపై దాడి చేశారు..? ఎవరి ఫిర్యాదుతో కంపెనీలో డేటా తీసుకుపోయారు.? అక్కడి ఉద్యోగులను బెదిరించారు..? ఆ ఫిర్యాదుదారు విజయసాయి రెడ్డేనా..? ఫిబ్రవరి 23, మార్చి 2,3,4 తేదీలలో విజయసాయి రెడ్డి ఎక్కడ ఉన్నారు..? ఆ 4 రోజులు హైదరాబాద్ లో మకాం వేశారా, లేదా..?. ఫిబ్రవరి 19న విజయసాయి రెడ్డి ఇచ్చిన వినతిలోనే కుట్రకు స్కెచ్ ఉంది. కుట్రకు కార్యాచరణ ప్రణాళిక రాశారు. వినతికి అనుబంధంగా కుట్ర యాక్షన్ ప్లాన్ కూడా ఈసికి అందించారు. రాసుకున్న స్కెచ్ కూడా ఈసికి వినతిలో జత చేశారు. అక్కడే దుష్టచతుష్టయం మహాకుట్ర బైటపడింది. ఈ కుట్ర ‘బాహుబలి’ కుట్రలను మించిపోయింది. ఈసికి ఇచ్చిన వినతిలో యాక్షన్ పాయింట్స్, టాకింగ్ పాయింట్స్ కూడా రాశారా లేదా..?. సోదాల్లో ఐటి గ్రిడ్ ఆఫీసులో ఏం చేయాలి..? ఎవరెవరిని ఎలా ఇబ్బందులు పెట్టాలి..? కుట్ర స్కెచ్ యాక్షన్ ప్లాన్‌లో అన్నీ రాశారు. దేశం ముందు ఈ సాక్ష్యాధారాలు ఉంచుతున్నాను. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలే వీళ్లను చీత్కరించాలి. ‘‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’’ అంతా అందులో రాసుకున్నారు-సెర్చ్, ఎఫ్ ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, డేటా సీజ్ చేయడం, ఉద్యోగుల సెల్ ఫోన్లు లాగేసుకోవడం, వేధింపులు-బెదిరింపులు,సేవామిత్ర యాప్ ను డిజేబుల్ చేయడం, సేవామిత్ర కీలక కార్యకర్తలను గుర్తించి బెదిరించడం, కోర్ట్ ద్వారా సిబిఐ విచారణ కోరడం, నేషనల్ మీడియా అటెన్షన్ డ్రా చేయడం, సిఈవోకు, ఉడాయ్ కు లెటర్స్ పంపాలని అనడం, ఐటి గ్రిడ్ కంపెనీపై సోదాలపై అల్లరి చేయడం.... అంతా ‘‘ ప్రి-ప్లాన్డ్ కాన్స్ఫిరసి’’. కొందరు మంత్రులను కూడా టార్గెట్ చేయాలని రాశారు. ఉన్నతాధికారులను, తెలుగుదేశం నేతలను టార్గెట్ చేయాలని రాశారు. దేశ చరిత్రలో ఇంత మహాకుట్ర చూడలేదు, వినలేదు.

వైకాపాకు చెందిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు శనివారం అరెస్ట్‌చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కారణంతో ఆయనపై వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌లో నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది. నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన శ్రీధర్‌రెడ్డి నెల్లూరులోని వైకాపా కార్యాలయం వద్ద దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు వెళ్లగా.. ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అరెస్ట్‌కు నిరసనగా కార్యాలయం ముందు శ్రీధర్‌రెడ్డి భైఠాయించారు. దీంతో వైకాపా కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు, కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తొలుత జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం సెంట్రల్ జైలుకు తరలించారు.

kotamreddy 09032019 1

అంతకుముందు వేదాయపాళెం పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే హల్‌చల్‌ చేశారు. గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసు స్టేషన్‌కు తమ అనుచరులతో కలిసి చేరుకుని సీఐ నరసింహారావుతో వాగ్వాదానికి దిగారు. వివరాల మేరకు.. గురువారం ఓ ప్రైవేటు సంస్థ నగరంలో సర్వే నిర్వహిస్తోంది. అయితే స్థానిక వైకాపా నాయకులు హజరత్‌ నాయుడు, శ్రీనివాసులు, మరికొంత మంది కలిసి వారి నుంచి ట్యాబులు లాక్కొని దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయంపై సర్వే చేస్తున్న సిబ్బందిపై కేసులు నమోదు చేయాలని స్థానిక నాయకులు పోలీసులను కోరారు. అయితే పోలీసులు వారిని స్టేషన్‌లోనే ఉంచుకున్నారు. వైకాపా నాయకులపై కేసులు నమోదు చేశారు. అనంతరం ఈ విషయంపై మాట్లాడేందుకు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పోలీసు స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో మాట్లాడారు. ఒకానొక సమయంలో స్టేషన్‌లో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

kotamreddy 09032019 1

వైకాపా నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి కూడా సీఐతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తన అనుచరుడితో మాట్లాడుతూ సీఐ నిన్ను కులం పేరుతో దూషించాడని, సీఐపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు చెప్పారు. ఓట్లను తొలగిస్తున్నారని, వైకాపా నాయకులు ఫిర్యాదు చేస్తే వారిపైనే కేసులు నమోదు చేస్తారా.. అంటూ పెద్ద కేకలతో పోలీసులతో మాట్లాడారు. మీ ఎస్పీ, డీజీని ఎవరిని పిలుస్తావో పిలువు అంటూ భీష్మించుకుకూర్చొన్నారు. దీంతో ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే పోలీసులను బెదిరిస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అయింది. ఎమ్మెల్యేతో వచ్చిన నాయకులు జరిగిన సంఘటన మొత్తం చిత్రీకరించి వాట్సాప్‌లో పొందుపరచడంతో విషయం అందరికి తెలిసింది.

 

గత వారం రోజులుగా తెలంగాణా, ఢిల్లీ, జగన్, విజయసాయి రెడ్డి కలిసి హైదరాబాద్ వేదికగా జరిగిన కుట్రలను చంద్రబాబు బయట పెట్టారు. ఇది హైదరాబాద్ వేదికగా జరిగిన కుట్ర కాదు, ఢిల్లీ స్థాయిలో జరిగిన కుట్ర ఇది అంటూ చంద్రబాబు సాక్ష్యాలు బయట పెట్టారు. తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని పెద్ద కుట్రకు తెరలేపారని చెప్పారు. ఇంత దారుణమైన కుతంత్రాలు చరిత్రలో ఎప్పుడూ లేవని విమర్శించారు. ‘బాహుబలి’ సినిమాలో చూపించిన దాని కంటే ఇది మహాకుట్ర అని అన్నారు. డేటా చోరీ వ్యవహారంపై అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంపై కుట్రలు జరుగుతున్నాయి. చేసిన కుట్రలు బయటపడితే ప్రజలు ఛీ కొడతారని కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. తెదేపా డేటాను దొంగిలించి వైకాపాకు ఇవ్వాలని కుట్ర పన్నారు. తెదేపాను నాశనం చేయాలని చూస్తున్నారు. దుష్ట చతుష్టయం ఏమేం చేస్తున్నారో ప్రజలకు చాలా సార్లు చెప్పా. ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమైన కుట్ర, కుతంత్రాలు చరిత్రలో ఎప్పుడూ లేవు. ఓ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి అధికారులే దీనికి సూత్రధారులు.’’

cbn 09032019 1

ఇవే సాక్ష్యాలు అంటూ చంద్రబాబు చెప్పిన వివరాలు... ఫిబ్రవరి 19న చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రజల డేటాను టీడీపీ చట్టవిరుద్ధంగా చోరీ చేస్తోందని కంప్లెయింట్ ఇచ్చారు. దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాదు పొరపాటున ఆ లేఖలో, ఈ విషయం పై చెయ్యవలసిన ప్లాన్ అఫ్ ఆక్షన్ రాసుకున్నారు. అది కూడా పొరపాటున ఆ లేఖలో పెట్టటంతో, వీళ్ళ కుట్ర బయట పిండి. 22వ తేదీ యాక్షన్ స్టార్ట్ చేశారు. ఆ కుట్రలో తెలంగాణ ప్రభుత్వం కూడా భాగస్వామి అయింది. 23వ తేదీ ఐటీ గ్రిడ్ సంస్థ మీద దాడులు చేశారు. ఎవరూ ఫిర్యాదు చేయకుండానే డైరెక్టుగా ఆ సంస్థలో తనిఖీలు చేశారు. ఇది చట్టవిరుద్ధం. ఆ సంస్థలో టీడీపీకి సంబంధించిన సమాచారాన్ని పట్టపగలు దోపిడీ చేశారు. ఐటీ గ్రిడ్ డైరెక్టర్ అశోక్ కుటుంబాన్ని వేధించారు. ఐటీ గ్రిడ్ మీద దాడులు చేసిన తర్వాత వారం రోజులకు మార్చి 2వ తేదీ అర్థరాత్రి 12.05 గంటలకు డేటా పోయిందని ఫిర్యాదు ఇచ్చారు. అర్థరాత్రి డేటా పోయిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తారా? ఏపీ డేటా పోయింది కాబట్టి మాకు సమాచారం ఇవ్వాలి కదా?

cbn 09032019 1

తెల్లకాగితాల మీద వీఆర్‌ఓల సంతకాలు ఎందుకు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించిన విషయాన్ని ఎందుకు బయటపెట్టడం లేదు? మార్చి 4న సైబరాబాద్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 23వ తేదీన ఐటీ గ్రిడ్ మీద సోదాలు చేశామని చెప్పలేదు. మార్చి 7న సిట్ ఏర్పాటు చేశారు. సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర మాత్రం 23వ తేదీ ఐటీ గ్రిడ్‌లో తనిఖీలుచేశామని ఒప్పుకున్నారు. అసలు ఫిర్యాదు లేకుండా ఐటీ గ్రిడ్ మీద దాడి ఎందుకు చేశారు? మార్చి 2,3,4 తేదీల్లో విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నారు. విజయసాయిరెడ్డి దర్శకత్వంలో, సీఎం ఆఫీసు సూచనలతో జరిగిన దాడి. మల్టీ విలన్ క్రిమనల్. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం, దగా, నిర్వీర్యం చేశారు. జగన్, విజయసాయిరెడ్డి, కేసీఆర్, కేటీఆర్, మోదీ, అమిత్ షా అందరూ ఉన్నారు. డేటా చోరీ మీరు చేసి మళ్లీ టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ నాయకులు వెళ్లి గవర్నర్‌ను కలుస్తారా? అందరూ ఒకే పల్లవి పాడుతున్నారు. ముందస్తుగా కుట్ర చేసి, దాన్ని సర్దిచెప్పుకోవడానికి మళ్లీ తప్పు చేస్తున్నారు. తెలంగాణలో పింఛన్లు ఇస్తే తప్పులేదు. వైసీపీ రూ.2వేలు ఇస్తానంటే తప్పులేదు. మేం ప్రభుత్వం తరఫున అధికారికంగా ప్రజలకు మేలు చేస్తుంటే కడుపుమంటా?

దొంగలు దొరికారు. కాకపోతే అందరి దొంగలు లాగే, ఈ దొంగాలు కూడా, జైలుకు వెళ్లి వచ్చినా, బుద్ధి రాలేదు. బెయిల్ పై బయట తిరుగుతూ, తమ దొంగ బుద్ధి చూపించారు. తాను రాసుకున్న దొంగ స్కెచ్, పొరపాటున ఎలక్షన్ కమిషన్ కు పంపించి దొరికిపోయాడు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీ విషయంలో తెలంగాణ పోలీసులు అతిగా ప్రవర్తించారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి డైరెక్షన్ లో తెలంగాణ పోలీసులు డ్రామాను కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలు ఎంత దొంగతం చేసినా, చిన్న ఆధారం వదిలేస్తారని, ఆ ఆధారమే, విజయసాయి రెడ్డిని ఇప్పుడు పట్టించింది.

vs 09032019

విజయసాయి రెడ్డి 19.02.2019న ప్రధాన ఎన్నికల అధికారికి ఒక వినతి రాశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ - ఇల్లీగల్ యాక్సిస్ టు డిజిటల్ డేటా ఆఫ్ ఇండివిడ్యువల్స్ బై తెలుగుదేశం పార్టీ-కంప్లయింట్-యాక్షన్-రిగార్డింగ్ ’’ పేరుతో వినతి రాశారు. ఆ వినతిని తయారు చేసింది ఫిబ్రవరి 19న అయితే ఈసికి ఇచ్చింది ఫిబ్రవరి 22న. ఫిబ్రవరి 19న విజయసాయి రెడ్డి ఇచ్చిన వినతిలోనే కుట్రకు స్కెచ్ ఉంది. కుట్రకు కార్యాచరణ ప్రణాళిక రాశారు. వినతికి అనుబంధంగా కుట్ర యాక్షన్ ప్లాన్ కూడా ఈసికి అందించారు. రాసుకున్న స్కెచ్ కూడా ఈసికి వినతిలో జత చేశారు. అక్కడే దుష్టచతుష్టయం మహాకుట్ర బైటపడింది. ఈ కుట్ర ‘బాహుబలి’ కుట్రలను మించిపోయింది. ఈసికి ఇచ్చిన వినతిలో యాక్షన్ పాయింట్స్, టాకింగ్ పాయింట్స్ కూడా పొరపాటున పెట్టి ఇచ్చారు.

vs 09032019

సోదాల్లో ఐటి గ్రిడ్ ఆఫీసులో ఏం చేయాలి..? ఎవరెవరిని ఎలా ఇబ్బందులు పెట్టాలి..? కుట్ర స్కెచ్ యాక్షన్ ప్లాన్‌లో అన్నీ రాశారు. దేశం ముందు ఈ సాక్ష్యాధారాలను చంద్రబాబు ఉంచారు. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలే వీళ్లను చీత్కరించాలి. ‘‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’’ అంతా అందులో రాసుకున్నారు-సెర్చ్, ఎఫ్ ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, డేటా సీజ్ చేయడం, ఉద్యోగుల సెల్ ఫోన్లు లాగేసుకోవడం, వేధింపులు-బెదిరింపులు,సేవామిత్ర యాప్ ను డిజేబుల్ చేయడం, సేవామిత్ర కీలక కార్యకర్తలను గుర్తించి బెదిరించడం, కోర్ట్ ద్వారా సిబిఐ విచారణ కోరడం, నేషనల్ మీడియా అటెన్షన్ డ్రా చేయడం, సిఈవోకు, ఉడాయ్ కు లెటర్స్ పంపాలని అనడం, ఐటి గ్రిడ్ కంపెనీపై సోదాలపై అల్లరి చేయడం.... అంతా ‘‘ ప్రి-ప్లాన్డ్ కాన్స్ఫిరసి’’. కొందరు మంత్రులను కూడా టార్గెట్ చేయాలని రాశారు. ఉన్నతాధికారులను, తెలుగుదేశం నేతలను టార్గెట్ చేయాలని రాశారు. దేశ చరిత్రలో ఇంత మహాకుట్ర చూడలేదు, వినలేదు.

Advertisements

Latest Articles

Most Read