ఎన్నికల షెడ్యూలు రాగానే ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను పక్కకు తప్పిస్తారంటూ ఒక్కసారిగా ప్రచారం ఊపందుకుంది. వైసీపీ వర్గాలు వాట్సాప్ లో దీనిపై హల్‌చల్‌ సృష్టిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అదే సమయంలో... జగన్‌కు అనుకూలంగా ఉన్నట్లు టీడీపీ ఆరోపిస్తున్న కేసీఆర్‌ పత్రికలో ‘డీజీపీ మార్పు’పై గురువారం ఒక వార్త ప్రత్యక్షమైంది. డీజీపీ ఠాకూర్‌పై వైసీపీ అధినేత తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను మార్చేయాలని ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. పోలీస్‌ బాస్‌లు, కీలక స్థానాల్లో ఉన్న అధికారులపై ఎన్నికల సమయంలో విపక్షాలు ఫిర్యాదు చేయడం సాధారణంగా జరిగేదే! కానీ, ఇప్పుడు నవ్యాంధ్రలో జరుగుతున్న రాజకీయం వేరు.

thakur 08032019 2

జగన్‌కు బీజేపీ, టీఆర్‌ఎస్‌ కొమ్ము కాస్తున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా డీజీపీని మార్చేయాలని జగన్‌ కోరడం... ‘షెడ్యూలు రాగానే మార్చడం ఖాయమని’ కేసీఆర్‌ పత్రికలో రావడాన్ని టీడీపీ వర్గాలు ప్రత్యేకంగా చూస్తున్నాయి. అదే సమయంలో... డీజీపీని మార్చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్న విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈసీపై ఒత్తిడి తెచ్చే చర్యల్లో భాగంగానే ఇదంతా జరుగుతోందనే అనుమానం వ్యక్తమవుతోంది. కోడ్‌కు ముందే కొరడా...: నిజానికి ఎన్నికల కమిషన్‌ ఈసారి నవ్యాంధ్రపై ‘ప్రత్యేక’ దృష్టి సారించింది. రాష్ట్ర సీఈవోగా ఉన్న సిసోడియా చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారంటూ ఆయనను మార్చాలని సూచించింది.

thakur 08032019 3

రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించి... సీఈవోగా ద్వివేదీని నియమించింది. ఇక... ఎన్నికల సన్నద్ధతపై నిర్వహించిన సమావేశంలో ప్రజెంటేషన్‌ సరిగ్గా ఇవ్వలేకపోయారంటూ శ్రీకాకుళం కలెక్టర్‌ను మార్పించింది. తాను కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి మూడు రోజులే అయ్యిందని చెప్పినా పట్టించుకోలేదు. పట్టుపట్టి మరీ తాను అనుకున్నది సాధించింది. ఈసీ వైఖరిపై ‘కోడ్‌కు ముందే కొరడా’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు... షెడ్యూలు ప్రకటించి, ఎన్నికల కోడ్‌ రాగానే డీజీపీ ఠాకూర్‌ను కూడా మార్చాలని ఈసీ ఆదేశించడం ఖాయమని తెలుస్తోంది.

కాంట్రాక్టు కార్మికులకు ఏపీఎస్‌ ఆర్టీసీ ముందస్తు ఉగాది కానుకను ఇచ్చింది. సంస్థలో పనిచేస్తున్న 1,213మందిని యాజమాన్యం రెగ్యులర్‌ చేసింది. మొత్తం 347మంది కండక్టర్లు, 866మంది డ్రైవర్లను రెగ్యులర్‌ చేస్తున్నట్లు పేర్కొంటూ గురువారం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(అడ్మిన్‌) ఉత్తర్వులు విడుదల చేశారు. వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఇటీవల ఆర్టీసీలోని కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం ఈయూ నేతృత్వంలో ఫిబ్రవరిలో సమ్మెకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో ఫిట్‌మెంట్‌తో పాటు పలు సమస్యల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించింది. అయితే ఆర్టీసీలో బలమైన కార్మిక సంఘమైన ఎన్‌ఎంయూ మరిన్ని సమస్యలపై సమ్మె నోటీసు ఇచ్చింది.

salary 080232019 1

ఇటీవల ఎన్‌ఎంయూ రాష్ట్ర నాయకులతో యాజమాన్యం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 15లోగా దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు ఎన్‌ఎంయూ రాష్ట్ర నేతలు చల్లా చంద్రయ్య, రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఏప్రిల్‌ 1నుంచి కొత్త జీతాలు అందుకోవడంతో పాటు భారీ మొత్తంలో అరియర్స్‌ పొందనున్న కార్మికులకు గుర్తింపు సంఘం ఈయూ రాష్ట్ర నేతలు పలిశెట్టి దామోదర్‌రావు, వైవీ రావు శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు డిస్‌ ఎంగేజ్‌లో ఉన్న మరో 150మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవడానికి కూడా ఎండీ అంగీకరించారని వారు పేర్కొన్నారు.

salary 080232019 1

దీని ఫలితంగా 866 మంది కండక్టర్లు, 347 మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుంది. ఆయా సిబ్బంది పని చేస్తున్న రీజియన్లలో తగినన్ని ఖాళీలు లేనప్పటికీ, వారిని ముందుగా రెగ్యులర్‌ చేసి ఆ తర్వాత అవసరమైన పక్షంలో ఖాళీల సంఖ్యను బట్టి ఇతర రీజియన్లలో సర్దుబాటు చేస్తారు. ఆ మేరకు సిబ్బంది నుంచి ముందే అంగీకార పత్రాలు తీసుకుంటారు. 2019 మార్చి 15వ తేదీ నుంచి వీరి ఉద్యోగాలు రెగ్యులర్‌ అవుతాయి. తాజా ఉత్తర్వులు ఫలితంగా రూ.13,700 వేతనం అందుకుంటున్న వారికి రూ.26 వేలు, రూ.12,540 వేతనం అందుకుంటున్న వారికి రూ.25 వేలు వేతనం అందనుంది. ఆర్టీసీ ఒప్పంద ఉద్యోగుల ఉద్యోగాల క్రమబద్ధీకరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు.

త్వరలోనే ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను నియమిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలీస్‌శాఖ, ఆర్టీసీలో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించామన్నారు. శుక్రవారం గుంటూరులో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థ భారతదేశానికి గొప్పవరమని అన్నారు. కోటి మంది సభ్యులుండే ఏకైక వ్యవస్థ డ్వాక్రా సంఘాలని, డ్వాక్రా సంఘాల ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి తెస్తామన్నారు. సామాన్య మహిళ.. అసాధారణ శక్తిగా మారిందని చంద్రబాబు కొనియాడారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని, ఇవాళ 98 లక్షల మందికి రూ.3,500 ఇచ్చామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

rtsdriver 08032019

రాష్ట్రాభివృద్ధికి డ్వాక్రా సంఘాలు ఎంతో సహకరించాయని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్‌ మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని, మహిళలకు తల్లిదండ్రుల ఆస్తిలో సమానహక్కు ఉండాలని ఆనాడు చట్టం తీసుకొచ్చారన్నారు. తొలిసారి మహిళలకు విశ్వవిద్యాలయాన్ని.. తిరుపతిలో ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయాల్లోకి మహిళలు రావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై నిర్లక్ష్య ధోరణి పోవాలని, మహిళలు వంటింటికే పరిమితం కాకూడదన్నారు. మహిళలు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు అన్నారు. అన్నాచెల్లెళ్ల బంధం-టీడీపీతో అనుబంధం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పుడు 'అన్న ఎన్టీఆర్’పై కుట్రలు తిప్పికొట్టింది ఆడబిడ్డలేనని, ఇప్పుడు ‘చంద్రన్నపై కుట్రలను’ చిత్తు చేయాల్సింది మహిళలేనని పిలుపునిచ్చారు.

rtsdriver 08032019

మహిళలే తెలుగుదేశానికి జవజీవాలు అని ఆయన వ్యాఖ్యానించారు. చదువులో, ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు టీడీపీ ఘనతేనని చెప్పారు. ఆడబిడ్డకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆరేనని గుర్తుచేశారు. ఆడబిడ్డలకు ‘పసుపు-కుంకుమ’ పెట్టింది టీడీపేనని చంద్రబాబు చెప్పారు. ‘‘ప్రతి కుటుంబానికి నాలుగైదు రకాల ప్రభుత్వ లబ్ది. ప్రభుత్వ లబ్ది పొందిన అందరి ఓట్లు తెలుగుదేశానికే. రైతులు, మహిళలు, యువతరం మద్దతు టీడీపీకే. మహిళల్లో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంచాం. ప్రతి మహిళ ఖాతాలో ఈరోజే రూ.3,500 ఎంతో ఆనందంగా ఉంది. బోగస్ చెక్కులని అన్న వైసీపీకి మహిళలే బుద్ధిచెప్పాలి. ఇది మా చంద్రన్న ఇచ్చిన ‘పసుపు-కుంకుమ’ అని చాటాలి. ఈ 3 రోజులు అన్నిచోట్ల ర్యాలీలు, సభలు నిర్వహించాలి. దొంగలను నమ్మం అని మహిళలంతా సంకల్పం చేయాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఏపీ పోలీసులపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర ఆరోపణలు చేశారు. మొన్నటి దాక ఈయన ఫ్రెండ్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీసుల పై ఆరోపణలు చేస్తే, ఇప్పుడు జీవీఎల్ మొదలు పెట్టారు. రాష్ట్ర పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులని టిడిపి కార్యకర్తలు అంటూ, దిగజారుడు వ్యాఖ్యలు సెహ్సారు. ఏపీలో ఓట్ల తొలగింపుపై ఈసీకి ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం జీవీఎల్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని ధ్వజమెత్తారు. ఎన్నికల నిబంధనలకు తెలుగుదేశం తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. ఫామ్-7ను ఎవరైనా దరఖాస్తు చేయొచ్చన్నారు. అది నిజమైందో... కాదో ఎన్నికల సంఘం తేల్చుతుందని చెప్పారు.

gvl 08032019 1

టీడీపీకి వ్యతిరేక ఓట్లు తొలగించడంపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆధార్‌, ఓటర్‌ డేటాను ఏపీ ప్రభుత్వం దొంగిలించి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. మరో పక్క, ఆంధ్రప్రదేశ్ డీజీపీని మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఏపీ బీజేపీ నేతలు కలిసి ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. అనంతరం కన్నా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేనివారి ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం తొలగించిన ఓట్లను తిరిగి చేర్చాలని సీఈసీని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అధికారులు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు మతిస్థిమితం సరిగా లేదని కన్నా వ్యాఖ్యానించారు.

Advertisements

Latest Articles

Most Read