తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలు అందిస్తున్న మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వద్ద ఏపీలోని ఓటర్ల వివరాలన్నీ అక్రమంగా ఉన్నాయంటూ కూకట్‌పల్లిలో ఉంటున్న లోకేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పోలీసులు అక్కడికి వెళ్లి సోదాలు చేపట్టడం తెలిసిందే. అయితే ఇక్కడ పక్కా ప్లాన్ తో, జగన, కేసీఆర్ వ్యవహరించారు. శానివాసం సోదాలు మొదలు పెట్టారు. ఆదివారం సెలవు, సోమవారం శివరాత్రి సెలవలు. ఇలా కోర్ట్ కి వెళ్ళే అవకాసం లేకుండా, మూడు రోజులు తమ పోలీసులతో ఇష్టం వచ్చినట్టు చెయ్యవచ్చు అని ప్లాన్ చేసారు. ఈ మూడు రోజుల్లో, అక్కడ వారిని బెదిరించి, డేటా మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేసి, సెలవలు ఉన్న రోజుల్లో ప్లాన్ అమలు చేసేలా, వ్యూహం రచించారు.

cbn 04032019

అయితే ఇది పసిగట్టిన తెలుగుదేశం పార్టీ, ఏపి ప్రభుత్వం ధీటుగా, ఈ కుట్రను తిప్పి కొట్టింది. వీళ్ళ కుట్ర భగ్నం చెయ్యటం కోసం, కోర్ట్ మెట్లు ఎక్కారు. సెలవు రోజులు అయినా సరే, అత్యవసరంగా హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అంటే జడ్జి ఇంటి దగ్గర విచారణ. రెండు రాష్ట్రాల మధ్య కేసు కావటంతో, దీనిపై విచారణకు హైకోర్టు అనుమతించింది. సాయంత్రం 5.30 గంటలకు జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ నివాసంలో జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తమ ఉద్యోగులు రేగొండ భాస్కర్‌, ఫణి కడులూరి, గురుడు చంద్రశేఖర్‌, విక్రమ్‌గౌడ్‌ రెబ్బాలను తెలంగాణ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారంటూ ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ డైరెక్టర్‌ డి.అశోక్‌ ఇచ్చిన పిటీషన్ పై విచారణ చేపట్టారు.

cbn 04032019

పిటిషనర్ల తరఫు న్యాయవాది కృష్ణప్రకాశ్‌ వాదనలు వినిపిస్తూ ఆదివారం తెల్లవారుజామున 5.30, 7 గంటల మధ్య వేర్వేరు సమయాల్లో ఈ నలుగురినీ అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. శనివారం అర్థరాత్రి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు వీరిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నారు. అయితే వారి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో లేవని చెప్పారు. వారి బంధువుల ద్వారా సమాచారం తెలుసుకుని కోర్టు సెలవులు ఉండటంతో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశామని వివరించారు. ఆరుగురు పోలీసులు సాధారణ దుస్తుల్లో వచ్చి బలవంతంగా ఈ నలుగురిని తీసుకెళ్లారని, కుటుంబసభ్యులు అడ్డుకున్నా పట్టించుకోలేదని వెల్లడించారు. దీంతో, ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన రేగొండ భాస్కర్‌, ఫణి కడులూరి, గురుడు చంద్రశేఖర్‌, విక్రమ్‌గౌడ్‌ రెబ్బాల అనే నలుగురు ఉద్యోగులను సోమవారం ఉదయం 10.30 గంటలకల్లా తమ ముందు హాజరుపరచాలంటూ తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదివారం ఆదేశించింది.

ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఏపీ వ్యాప్తంగా 45 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సెక్షన్ 120బి.419, 420, 465, 471 ఐపీసీ సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్‌ 66డి, సెక్షన్ 31 ఆర్‌పీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. శ్రీకాకుళం 3, తూ.గో 14, కృష్ణా 3, గుంటూరు 1, ప్రకాశం 4, చిత్తూరు 3, అనంతపురం 1, కర్నూలు 8, విశాఖ జిల్లాలో 8 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని సీఈవో స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపు కోసం ఆన్‌లైన్‌లో ఫాం.7 కింద వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఐపీ అడ్రస్‌లు సేకరిస్తున్నామని, విచారణ జరపాలని పోలీస్‌ శాఖను కోరామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు మీ సేవా సిబ్బంది హస్తం ఉందని, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.

ec 03032019

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, అనుచరుల ఓట్ల తొలగింపునకు వైసీపీ కుట్రపన్నిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఓట్ల తొలగింపు విషయం పై ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వైసీపీ ఎన్నికల సలహాదారు ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ ఓట్ల తొలగింపు నెట్‌వర్క్‌ చేపట్టి పెద్ద దందా చేస్తుందని తెలుగుదేశం ఆరోపిస్తుంది. గతంలో తెలంగాణాలో గుట్టుచప్పుడు లేకుండా ఓట్లు తొలగించినట్లుగానే ఆంధ్రాలో కూడా తొలగింపు కార్యక్రమం చేపట్టారన్నారు. ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేస్తున్నవారె వరో కూడా తెలియకుండా ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచి దరఖాస్తు చేస్తుంది కూడా తెలియకుండా ఓ పథకం ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంద న్నారు. ఈ తొలగింపులు ఎక్కువగా టీడీపీ నాయకుల ఓట్లతోపాటు టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కూడా గల్లంతు అవుతున్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.

ec 03032019

ఎన్నికల్లో ఓటమి భయం తోనే వైసీపీ ఇలాంటి బోగస్‌ ఓట్ల చేర్పుల కార్య క్రమానికి శ్రీకారం చుట్టి టీడీపీ ఓట్లను తొలగిస్తుం దని తెలిపారు. ఈ విషయం ఉన్నతాధికారులతో పాటు ఎన్నికల కమిషన్‌ దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్లు టిడిపి నేతలు చెప్పారు. ఓట్ల తొలగింపు కుట్ర చేస్తున్నవారిని వదలవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. మంత్రి లోకేష్ కూడా ఇదే అంశంపై ట్వీట్ చేశారు. ప్రతి గ్రామంలోనూ టీడీపీ ఓట్లను తొలగించేందుకు వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు. బిహార్ గ్యాంగ్ డైరెక్షన్‌లో దొంగబ్బాయి. చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో టీడీపీని ఎదుర్కొనే దమ్ములేకే వైసీపీ దద్దమ్మ పనులు చేస్తోందని లోకేష్ దుయ్యబట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించారని, దీని వెనుక ఉన్న కుట్రదారులను వెంటనే అరెస్టు చేయాలని చంద్రగిరి టీడీడీ నేత నాని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో గతంలో ఉన్న ఓట్లు, తాజా ఓటర్ల లిస్టులో తొలగించిన తర్వాత ఓటర్ లిస్టులను ఆయన మీడియాకు చూపించారు. ప్రతి మండలంలోనూ టీడీపీ ఓటర్లను కుట్రపూరితంగా తొలగించారని, సైబర్ నేరానికి పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గుజరాత్ రాజకీయాన్ని దేశం మొత్తానికి రుద్దాలని ప్రధాని మోదీ యత్నిస్తున్నారని ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. కేసీఆర్, జగన్ లతో కలసి మోడీ కుట్రలకు పాల్పడుతున్నారని గుంటూరులో నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో గల్లా జయదేవ్ మండిపడ్డారు. వీరి ముగ్గురి దృష్టి ప్రస్తుతం తనపై పడిందని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగంతో మోదీని ప్రశ్నించినందకు ఈడీ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. పక్కాగా ట్యాక్సులు కడుతున్నా ఐటీ రైడ్స్ చేశారని మండిపడ్డారు. తప్పు చేసినట్టు తేలితే జైలుకు వెళ్లడానికి తాను సిద్ధమని గల్లా జయదేవ్ అన్నారు.

galla 030321019

రాష్ట్ర విభజన ఎంత అన్యాయమో.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైల్వే జోన్‌ కూడా అంతేనని ఎంపీ గల్లా జయదేవ్‌ ధ్వజమెత్తారు. సరకు రవాణా ఆదాయం ఒడిశాలోని రాయగడకు, ప్రయాణికుల ఆదాయం విశాఖకు వచ్చేలా భాజపా కుట్ర చేసిందని మండిపడ్డారు. కేంద్రం ప్రకటించిన జోన్‌ వల్ల 70% ఆదాయం పక్క రాష్ట్రానికి పోతోందని, ఖర్చులు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు మిగులుతాయని పేర్కొన్నారు. శనివారం ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని చెప్పి 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తున్నారు. చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారన్న మోదీ ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగించడంపై ఏం చెబుతారు?

galla 030321019

' ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ఉద్దేశంతోనే ప్రధాని పర్యటనకు ఒక్కరోజు ముందు కేంద్రం రైల్వే జోన్‌ ప్రకటించింది. విభజన హామీలు ఎంతమేర అమలు చేశారో చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్‌ చేస్తే... ప్రధాని సమాధానం చెప్పకుండా జారుకున్నారు.’ అని ధ్వజమెత్తారు. పాకిస్థాన్‌పై వైమానిక దాడులు రక్షణ మంత్రికి తెలుసా?: పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో భారతసైన్యం చేసిన వైమానిక దాడుల గురించి దేశ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా తెలియనట్లుందని జయదేవ్‌ అన్నారు.‘కీలక నిర్ణయాల్ని మంత్రివర్గ సహచరులతో చర్చించకుండా ఏకపక్షంగా తీసుకుంటున్నారు. మోదీ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. మరోసారి మోదీ ప్రధాని అయితే అంతే?’ అని వ్యాఖ్యానించారు.

ఐటీ గ్రిడ్‌ కంపెనీ ఉద్యోగుల అదృశ్యంపై హైకోర్టులో హెబియస్‌కార్పస్‌ పిటిషన్‌ దాఖలైంది. ఉద్యోగులు రేగొండ భాస్కర్‌, ఫణి కడలూరి, చంద్రశేఖర్‌, విక్రమ్‌గౌడ్‌ కనిపించడం లేదని సహోద్యోగి అశోక్‌ పిటిషన్‌ వేశారు. తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డీజీపీతో పాటు సైబర్‌క్రైం వింగ్‌, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌‌ని ప్రతివాదులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు సోమవారం ఉదయం 10:30 గంటలకు నలుగురిని ప్రవేశపెట్టాలని ఆదేశించింది. అయితే ఆ నలుగురికి తాము 160 నోటీసు ఇచ్చామని తెలంగాణ పోలీసులు తెలిపారు. కేసు డైరీలో బ్లాంక్‌ పేపర్లు ఉండడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ కుటుంబ సభ్యులైనా తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టుకుని పోలీసులపై ఫిర్యాదు చేయరని హైకోర్టు మండిపడింది. అఫిడవిట్‌తో రావాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.

kcrourt 03032019

ఇది సీన్ టు సీన్ కోర్ట్ లో జరిగింది.. "కంపెనీ పై ఫిర్యాదు వస్తే నలుగురు ఉద్యోగస్తులను ఎందుకు అరెస్ట్ చేసారు అని ప్రశ్నించిన హై కోర్టు. వారు నిందితులు కానప్పుడు ఎందుకు అరెస్ట్ చేసారు అని ప్రశ్నించిన హై కోర్ట్. వారు నిందితులు కాదు విట్నెస్ మాత్రమే అని చెప్పిన తెలంగాణ పోలీసులు. విట్నెస్ అయితే నోటీసులు ఇవ్వకుండా నేరుగా ఎలా అరెస్ట్ చేసారు అని ప్రశ్నించిన హై కోర్ట్. మీ దగ్గర ఉన్న రికార్డ్స్ ఇవ్వండి అని అడిగిన హై కోర్ట్. ఎటువంటి సమాచారం లేకుండా తెల్ల కాగితాల పై విఆర్ఓ సంతకాలు ఉన్న పేపర్స్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయిన తెలంగాణ పోలీసులు. ఒక వ్యక్తి,లేదా సంస్థ పై సోదాలు నిర్వహించి, పంచనామా పూర్తి అయిన తరువాత ఆయా విషయాలు పొందుపర్చి...అక్కడే స్థానిక విఆరోఓ సంతకం తీసుకుంటారు.మీరు తెల్ల కాగితాల పై సంతకాలు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించిన హై కోర్టు. ఇది చూస్తేనే మీ దురుద్దేశం అర్థం అవుతుంది వెంటనే అరెస్ట్ చేసిన నలుగురు ఐటీ ఉద్యోగులను రేపు కోర్టు ముందు ప్రవేశపెట్టాలి అని తెలంగాణ పోలీసులను ఆదేశించిన హై కోర్టు"

kcrourt 03032019

తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలందిస్తున్న హైదరాబాద్‌లోని మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో ఉన్న ‘ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’లో సైబరాబాద్‌ పోలీసులు శనివారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. కొన్ని హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దానిపై ఏపీ నుంచి పోలీసులు మాదాపూర్‌కు రావడంతో ఈ సోదాల వ్యవహారం 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలందిస్తున్న ‘సేవా మిత్ర’ మొబైల్‌ యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 3 కోట్ల మంది ఓటర్ల జాబితా ఉందంటూ వైకాపా నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ పోలీసులు తొలుత కేసు నమోదు చేశారు. దీని పై ఆ కంపెనీ కోర్ట్ కి వెళ్ళింది...

Advertisements

Latest Articles

Most Read