తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు . కుట్ర రాజకీయాలతో ఏపీకి చెందిన వారి పై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కేంద్రంగా టీడీపీపై ముప్పేట దాడికి కుట్ర జరుగుతోందని అన్నారు. మోదీ డైరెక్షన్లో వైసీపీ అధినేత జగన్,తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసి టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసిన తిప్పికొడతామని చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాలను సహాకారం ఆందిస్తున్న సాప్ట్ వేర్ కంపెనీలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమైన సమాచారాన్ని చౌర్యం చేసేందుకు విఫలయత్నం చేశారని దుయ్యబట్టారు. ఏ అధికారంతో తమ ప్రభుత్వానికి చెందిన కంపెనీలపై దాడులు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ కేంద్రంగా టీడీపీపై ముప్పేటదాడికి కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ముఖ్య సమాచారం అపహరించేందుకు భారీగా కుట్ర పన్నుతున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోదీ డైరెక్షన్లో జగన్, కేసీఆర్ కలిసి టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పార్టీ సభ్యత్వం, సేవామిత్ర, ఎన్నికల వ్యూహాల సమాచారం చౌర్యానికి ప్రయత్నం జరిగిందంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రయత్నం విఫలమవడంతో తెలంగాణ పోలీసులను ప్రయోగించి.. టీడీపీని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీకి ఐటీ సపోర్ట్ ఇస్తున్న సంస్థలపై దాడులు చేస్తున్నారని, పార్టీ సభ్యత్వాలు, సేవామిత్రల సమాచారం ఇవ్వాలని ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఐటీ కంపెనీ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. నలుగురు ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేసి సమాచారమివ్వాలని పోలీసులు వేధిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. పార్టీ సమాచారం అపహరించి టీడీపీని దెబ్బతీసేందుకు భారీ స్కెచ్ వేస్తున్నారని, కుట్రలను తిప్పికొడతామని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు కూడా హైదరాబాద్ కేంద్రంగా ఏపీపై కుట్ర జరుగుతోందని వెల్లడించారు. మోదీ, జగన్, కేసీఆర్ రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీతో కుట్రలు ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రంలో సామంతరాజు వ్యవస్థ తీసుకురావాలన్నదే వీరి ఆలోచనన్నారు. ఏపీపై ద్వేషం చూపిన కేసీఆర్, కేటీఆర్‌లు జగన్‌పై ప్రేమ చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని మరో బిహార్ చేసేందుకు ప్రశాంత్ కిషోర్ సాయంతో కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు హెచ్చరించారు.