టీడీపీలో చేరికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ చేరికలు టీడీపీ గెలిచే పార్టీ అనే భావనను తీసుకొచ్చేందుకు బాగా ఉపయోగపడుతున్నాయి. ముందుగా ఈ రేసును వైసీపీ మొదలు పెట్టింది. ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుని హడావుడి చేసింది. కానీ వారంతా టికెట్లు రానివారన్న క్లారిటీ రావడం.. దిగ్గజాలన్న నేతలు కనీసం వైసీపీ వైపు చూడకపోతుండటంతో టీడీపీ దీనిని పకడ్బందీగా ఉపయోగించకుంటోంది. గెలిచే పార్టీ అన్న ఇమేజ్‌ను నిలబెట్టుకుంటోంది. నేటికీ లోటస్‌పాండ్‌లో జగన్ రోజూ కండువాలు కప్పే కార్యక్రమాన్ని చేపడుతూనే ఉన్నారు. కానీ ఏ ఒక్క నేత కూడా ప్రజాబలం ఉన్నవారు కాకపోవడంతో రాజకీయ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.

cbn 022032019

20 ఏళ్ల క్రితం రాజకీయాలు మానుకున్న దాసరి జైరమేష్, అసలెప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేని నార్నే శ్రీనివాసరావులతో పాటు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణిలో ఉన్న నేతలకు కూడా జగన్ స్వయంగా కండువాలు కప్పుతున్నారు. కానీ అనుకున్నంత బజ్ రావడం లేదు. టీడీపీలో టికెట్లు గ్యారంటీ లేని మరికొందరు నేతలు కూడా వైసీపీతో టచ్‌లో ఉన్నారు. అయితే వారిని చేర్చుకుంటే ఇప్పటికే ఉన్నవారికి ఇబ్బందవుతుందని.. వారు తిరుగుబాటు చేస్తే మొదటికే మోసం వస్తుందని వైసీపీ నేతలు ఆగిపోతున్నారు. తోట త్రిమూర్తులు, మోదుగుల వేణుగోపాలరెడ్డి వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు.

cbn 022032019

ఇప్పటికే చీరాలలో ఆమంచి చేరికతో యడం బాలాజీ వైసీపీ గుడ్ బై చెప్పారు. రేపో, మాపో టీడీపీలో చేరనున్నారు. దీంతో చేర్చుకున్నవారి బలం కన్నా.. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వారు దూరమవటం వైసీపీకి నష్టంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పలువురికి టికెట్లు నిరాకరించినప్పటికీ వారిని పిలిచి మాట్లాడుతున్నారు. భవిష్యతులో న్యాయం చేస్తామని బుజ్జగిస్తున్నారు. కర్నూలులో వరుసగా పార్టీ నేతలు చేరుతున్నప్పటికీ ఎవరికీ అసంతృప్తి లేకుండా చేస్తున్నారు. వరుసగా షెడ్యూల్ ప్రకారం కీలక నేతలను చేర్చుకుంటూ ఉండటంతో గెలిచే పార్టీ అన్న ఇమేజ్‌ను చంద్రబాబు పెంచుకుంటూ పోయే ప్రణాళిక అమలు చేస్తున్నారు. టీడీపీలో చేరుతున్న దిగ్గజ నేతలందరినీ వైసీపీ సంప్రదించింది. కానీ ఆ పార్టీ వైపు ఎవరూ చూడటం లేదు.

 

 

దశాబ్దాల కల నెరవేరినందుకు సంతోషించాలా? 125 ఏళ్ల అనుబంధాన్ని తుంచేసినందుకు బాధపడాలా? విశాఖ రైల్వేజోన్‌ ప్రకటిస్తూనే... వాల్తేరు డివిజన్‌ను ఎత్తివేయడంపై వ్యక్తమవుతున్న ఆవేదన, ఆక్రోశమిది! జోన్‌ను ప్రకటించేసి, అప్పటిదాకా అక్కడున్న డివిజన్‌ను ఎత్తివేయడం భారతీయ రైల్వే చరిత్రలో ఇదే మొదటిసారి! డివిజన్‌ ఉన్నచోట కొత్తగా జోన్‌ వస్తే... రెండింటినీ కొనసాగించారు తప్ప డివిజన్‌ను రద్దు చేయలేదు. ప్రస్తుతం భారతీయ రైల్వేలో 16 రైల్వే జోన్‌లు ఉన్నాయి. సికింద్రాబాద్‌ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఉండగా... అక్కడ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో రెండు డివిజన్‌లు కొనసాగుతున్నాయి. కోల్‌కతా కేంద్రంగా తూర్పు, ఆగ్నేయ రైల్వే జోన్‌లు నడుస్తున్నాయి. కోల్‌కతా కేంద్రంగానే హౌరా, సియల్దా డివిజన్లు కూడా ఉన్నాయి. బిలా్‌సపూర్‌ డివిజన్‌ను అప్‌గ్రేడ్‌ చేసి ఆగ్నేయ మధ్య రైల్వే జోన్‌ను ఇచ్చారు. డివిజన్‌ను యథాతథంగా కొనసాగించారు. చెన్నై, ముంబైలో కూడా జోన్‌, డివిజన్‌లు ఒకేచోట ఉన్నాయి.

అయితే... ఒక్క విశాఖ విషయంలోనే కేంద్ర ప్రభుత్వం భిన్నంగా వ్యవహరించింది. కొత్తగా దక్షిణకోస్తా రైల్వేజోన్‌ ప్రకటించి... విశాఖ కేంద్రంగా 125 ఏళ్లుగా ఉన్న వాల్తేర్‌ డివిజన్‌ను రద్దు చేసింది. దీనిని రెండు ముక్కలు చేసింది. ఒక ముక్కతో ఒడిసాలోని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్‌ ప్రకటించింది. మరో ముక్కను విజయవాడలో కలిపింది. డివిజన్‌, జోన్‌ ఒక చోటలేకపోవడంవల్ల పరిపాలన, నిర్వహణ, సమన్వయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సమస్యలు, డిమాండ్‌లు, అనుమతుల వంటివి ముందుగా డివిజనల్‌ అధికారుల దృష్టికి వెళ్లిన తర్వాతే ప్రధానకేంద్రానికి రావాలి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర రైల్వే సమస్యల పరిష్కారానికి ‘వాల్తేరు’ను కొనసాగించాల్సిన అవసరం ఉంది. విశాఖ రైల్వే స్టేషన్‌కు, వాల్తేరు డివిజన్‌కు 125 ఏళ్ల చరిత్ర ఉంది. 1893-96లో బెంగాల్‌-నాగపూర్‌ రైల్వేగా(బీఎన్‌ఆర్‌) ఉన్న సమయంలో విశాఖకు రైల్వే లైను వచ్చింది. అప్పట్లో విశాఖను వాల్తేరు స్టేషన్‌గా పిలిచేవారు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర పల్లెవాసులు విశాఖను ‘వాల్తేరు’గానే పిలుచుకుంటారు. 1960లో డీబీకే (దండకారణ్య, బొలంగీర్‌, కిరుబురు) పేరుతో అతి పెద్ద ప్రాజెక్టుకు ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టారు. దీంతో భారతీయ రైల్వే చరిత్రలోనే వాల్తేరు డివిజన్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి ప్రత్యేక స్థానం ఉంది.

కొత్తవలస-కిరండోల్‌ (దండకారణ్య లైను 446 కిలోమీటర్లు), సంబల్‌పూర్‌-టిట్లాఘర్‌ (బొలంగీర్‌ లైను -.182 కిలోమీటర్లు, బీమాల్‌గర్‌-కిరుబురు (కిరుబురు లైను... 34 కిలోమీటర్లు) మార్గాలను వాల్తేరు రైల్వే డివిజన్‌ ఇంజనీర్లే నిర్మించారు. కొత్తవలస-కిరండోల్‌, కొరాపుట్‌-రాయగడ లైన్‌ల ఏర్పాటులో వాల్తేర్‌ డివిజన్‌ ఇంజనీరింగ్‌ అధికారుల ప్రతిభపై ఇప్పటికీ అనేకమంది అధ్యయనాలు చేస్తుంటారు. అదే సమయంలో తీర ప్రాంతం, ఓడ రేవుల అనుసంధానం, రైలు మార్గం ఉన్న నేపథ్యంలో విశాఖకు ప్రాధాన్యం పెరిగింది. కొత్తగా జోన్‌లు, డివిజన్లు, పరిధుల మార్పులు చోటు చేసుకున్నప్పటికీ... వాల్తేరు డివిజన్‌కు మాత్రం ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. ఈ డివిజన్‌తో ఉత్తరాంధ్రవాసులకు భావోద్వేగమైన అనుబంధం ఉంది. డివిజన్‌ రద్దు చేసేముందు ఇక్కడ పనిచేసే ఉద్యోగుల అభిప్రాయాలు కూడా తెలుసుకోలేదు. లైన్ల విభజన, విలీనంపై రైల్వే మంత్రి స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రధాన ఆదాయ వనరులుగా గుర్తింపు పొందిన కేకే లైను, కేఆర్‌ లైను, ఆర్‌వీ లైన్లను రాయగఢ డివిజన్‌లోనే కలుపుతున్నట్లు తెలుస్తోంది. దువ్వాడ, కొత్తవలస, విజయనగరం ప్రధాన లైనులో ఉన్నా(మెయిన్‌ లైన్‌) విశాఖ రైల్వే స్టేషన్‌ మెయిన్‌ లైనులోకి రాకపోవడంతో మెలికలు పెట్టవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘‘ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏమీ చేయరు. నన్ను తిట్టడానికే వస్తారు. ఒకవేళ నేను కనిపిస్తే కొడతారేమో!’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్రోశించారు. తనపై ఆయన కోపం చూస్తే ఇదే అనిపిస్తోందని తెలిపారు. శుక్రవారం విశాఖ సభలో మోదీ తనపై చేసిన విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ ఘాటుగా బదులిచ్చారు. శుక్రవారం రాత్రి పొత్తుపోయాక ఉండవల్లిలోని తన నివాసంలో తూర్పు గోదావరి జిల్లా పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడారు. కుటుంబ పాలన అని మోదీ నన్ను విమర్శింస్తున్నారు. ఆయనకు కుటుంబం ఉంటే కదా తెలిసేది! మనం రోబోలం కాదు. మానవులం. భారతదేశం ఔన్నత్యం కుటుంబ వ్యవస్థలోనే ఉంది. ఎవరి వారసులైనా సామర్థ్యం ఉంటేనే రాణిస్తారు. మోదీ నన్ను బెదిరించాలని చూస్తున్నారు. ఐటీ, ఈడీ, సీబీఐలను చూపిస్తున్నారు. నాడు తిరుపతిలో బాంబులేస్తేనే భయపడలేదు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీలతో ఉన్నా. భయపడే ప్రసక్తే లేదు. పదే పదే కూటమిని విమర్శించడంతోనే ఆయన ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోంది.

cbn punch on modi 02032019

పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మన వైమానిక దళ సిబ్బంది సాహసోపేతంగా చేసిన దాడిని అభినందించాం. కానీ... అదే సమయంలో మోదీ రాజస్థాన్‌లో రాజకీయ సమావేశం పెట్టి ‘దేశాన్ని నేనే కాపాడుతున్నాను’ అని చెప్పుకొచ్చారు. కీలకమైన ఆ సమయంలో ఢిల్లీలో ఉండి, అఖిలపక్ష సమావేశం పెట్టి, అందరినీ కలుపుకొని పోవాల్సిన ప్రధాని... రాజస్థాన్‌లో రాజకీయ సభలో పాల్గొన్నారు. అలాంటి వ్యక్తి... మన దేశభక్తిని శంకిస్తున్నారు. పాకిస్థాన్‌ పార్లమెంటులో విపక్షాల గురించి చర్చించారని మోదీ అంటున్నారు. కానీ... నిజానికి అక్కడ చర్చించింది ‘ఈ దాడితో బీజేపీ మొత్తం 22 సీట్లు గెలుచుకుంటుంది’ అని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప వ్యాఖ్యలపైనే. మరోవైపు... ఎన్నికల ముందు పాక్‌తో యుద్ధం జరుగుతుందని రెండేళ్ల క్రితమే తనకు చెప్పినట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

cbn punch on modi 02032019

విశాఖను రాష్ట్ర యువకుల కలల నగరంగా మోదీ అభివర్ణించారు. జోన్‌ ఇస్తున్నామని చాలా గొప్పమాట చెప్పారు. మన విమర్శలను తప్పుపట్టారు. కచ్చితంగా విమర్శించాం. వాల్తేరు డివిజన్‌ను ఎత్తివేసి, 7000 కోట్ల ఆదాయాన్ని రాయగఢ డివిజన్‌కు ఇచ్చేశారు. మా జోన్‌కు డబ్బుల్లేకుండా... మాయా జోన్‌ ఇచ్చారు. డివిజన్‌ లేకుండా జోన్‌ ఇవ్వడమే మోదీ మాయాజాలం. తెలుగుదేశం పట్టుదలకు 35 ఏళ్ల చరిత్ర ఉంది.. మహానాయకుడు సినిమా చూస్తే అర్థమవుతుంది. అవసరమైతే మోదీకి ఇంకోసారి సినిమా చూపిస్తాం. రాష్ట్రం ప్రభుత్వం ఏమీ చేయలేదంటున్నారు. కానీ... కేంద్రమే 700 అవార్డులు ఇచ్చింది. మీకు ధైర్యం ఉంటే చెప్పండి... ఈ అవార్డులు తప్పుడువని చెప్పాలి. రైతుకు ఆరువేలు ఇస్తారట. ఇప్పటికి రెండువేలు ఇచ్చారు. మేం 24,500కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. మీరు ఆరువేలు ఇస్తే అదనంగా తొమ్మిదివేలు ఇస్తున్నాం. ఐదెకరాల పైన ఉంటే పైసా ఇవ్వం అన్నారు. వాళ్లు రైతులు కారా? ఎందుకివ్వరు? మేం వారికి కూడా రూ.10వేలు ఇస్తామన్నాం అని చంద్రబాబు అన్నారు.

కృష్ణా జిల్లాలో అధికశాతం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల బరిలో టీడీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. 16 అసెంబ్లీ స్థానాలకు గానూ, పదింటిని అధినేత ఖరారు చేశారు. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. మరోవైపు టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీలో అభ్యర్థుల ఖరారుపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఎవరు ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారో అనే దానిపై ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులుగా ఉన్న వారిలోనూ స్పష్టత కరువైంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ అలముకుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వైసీపీ పెద్దలు తమ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడం లక్ష్యంగా చేసుకున్నారు. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారానికి పూనుకున్నారు. జిల్లాలో మైలవరం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మంత్రి దేవినేని ఉమా పోటీ చేస్తున్నారు. ఆయన్ను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో వైసీపీ నేతలు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు.

jagan 02032019

ఓటర్లను ప్రలోభ పెట్టడంతోపాటు సోషల్‌ మీడియా వేదికగా మంత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారు. గురువారం మంత్రి ఉమా జి.కొండూరులో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే వాట్సప్‌లో ‘టీడీపీ నేతల పట్ల మంత్రి ఉమా చులకన వైఖరి..’ అంటూ మెసేజ్‌లు హల్‌చల్‌ చేయడం ప్రారంభించాయి. మైలవరం ఏఎంసీ చైర్మన్‌ ఉయ్యూరు వెంకటనరసింహారావు పట్ల మంత్రి చులకనగా మాట్లాడటంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి అలాంటిదేమీ జరగలేదని సాక్షాత్తూ వెంకట నరసింహారావు ఖండించారు. టీడీపీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టించేందుకు వైసీపీ నాయకులు ఇలాంటి మెసేజ్‌లను ప్రచారంలోకి తీసుకొస్తున్నారని నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారుతున్నారంటూ వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందేశాలను ప్రచారంలోకి తెచ్చారు. వీటిపై స్పందించిన ఎమ్మెల్యే వంశీ.. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని, కేవలం గన్నవరం టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో అయోమయం సృష్టించడానికే వైసీపీ శ్రేణులు ఇలాంటి సందేశాలను వ్యాప్తి చేస్తున్నాయన్నారు.

jagan 02032019

గుడివాడలోనూ ఇదే తరహా ప్రచారం నడుస్తోంది. ఇక్కడి నుంచి వైసీపీ తరఫున కొడాలి నాని బరిలోకి దిగనున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ బరిలో దిగవచ్చని భావిస్తున్నారు. దీంతో స్థానిక, స్థానికేతర అభ్యర్థుల నడుమ పోటీ అంటూ సామాజిక మాధ్యమాల్లో స్థానికతను రెచ్చగొట్టేలా వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ బలంగా ఉన్న మైలవరం, గుడివాడ, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో టీడీపీ అనుకూల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం ద్వారా లబ్ధి పొందాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఈ నియోజకవర్గాల్లోని తమ పార్టీ కార్యకర్తల ద్వారా టీడీపీ అనుకూల ఓటర్ల ఓట్లను తొలగించా లంటూ ఫారం -7 ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయిస్తున్నారు. టీడీపీ అనుకూల ఓటర్ల జాబి తాను దగ్గర పెట్టుకుని పెద్దఎత్తున ఫారం-7లను నింపి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. ఈ విషయమై టీడీపీ నాయకులు అప్రమత్తమై ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతో ఎన్నికల సంఘం గురువారం ఓ ప్రకటన విడుదల చేసి అప్రమత్తం చేసింది.

Advertisements

Latest Articles

Most Read