తొలి రోజే కేరళ రాష్ట్రం కొచిన్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్‌ విమానం హౌస్‌ఫుల్‌ అయింది! దేశీయ విమానయాన రంగంలో విజయవాడ ఎయిర్‌పోర్టు మరో ప్రస్థానాన్ని ప్రారంభించింది. విజయవాడ విమానాశ్రయం నుంచి ఏడవ రాష్ట్ర సర్వీసుగా కేరళ రాష్ట్రంలోని కొచిన్‌ విమాన సర్వీసు శుక్రవారం ప్రారంభమైంది. పొరుగు రాష్ర్టాలైన తెలంగాణాలో హైదరాబాద్‌కు, తమిళనాడులోని చెన్నై, కర్నాటకలోని బెంగళూరు, దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలోని దేశ ఆర్థిక రాజఽధాని ముంబాయిల తర్వాత.. ఏడవ రాష్ట్ర సర్వీసుగా కేరళ రాష్ట్రం కొచిన్‌కు సర్వీసు ప్రారంభం కావటం గమనార్హం. స్పైస్‌ జెట్‌ విమానయాన సంస్థ ఈ సరీసును ప్రారంభించింది. ఈ సర్వీసు రోజూ విజయవాడ నుంచి కొచిన్‌కు బయలు దేరటం గమనార్హం. రోజు సాయంత్రం స్పైస్‌జెట్‌ విమానం 4.20 వచ్చి 5 గంటలకు బయలుదేరి తిరుపతి మీదుగా కొచ్చిన్‌ వెళుతుంది.

gannavaram 02032019

ఈ సర్వీసుకు సంబంధించి 72 సీట్ల సామర్ధ్యం ఉంది. తొలి రోజు అన్ని సీట్లు నిండాయి. దేశీయంగా పర్యాటకంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో కేరళ ప్రధానమైనదని చెప్పుకోవాలి. దేశీయంగా కేంద్ర పాలిత ప్రాంత గోవాతో సరిసమానంగా కేరళకు పర్యాటకల సంఖ్య పోటెత్తుతుంటుంది. ప్రధానంగా కోస్తా జిల్లాల ప్రాంతాల ప్రజలకు కేరళ రాష్ట్రంతో ప్రత్యేక బంధం ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఎక్కువుగా కేరళ రాష్ర్టానికి పర్యాటక విడిది చేస్తుంటారు. అక్కడి సహజ అందాల నేపథ్యంలో, ప్రతి వేసవి సీజన్‌లోనూ భారీ సంఖ్యలో పర్యాటకులు కేరళ వెళుతుంటారు. కేరళ వెళ్లేవారికి ఈ విమాన సర్వీసు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

gannavaram 02032019

పర్యాటకుల అవసరాలను తీర్చటంలో ఎంతగానో ఈ విమాన సర్వీసు దోహదపడనుంది. వీటన్నింటికంటే మించి చూస్తే ప్రధానంగా శబరిమలై వెళ్లే యాత్రికులకు మన ప్రాంతం నుంచి అనుకూలంగా ఉంటుంది. ఈ విమాన సర్వీసు ద్వారా త్వరగా శబరిమలైకు చేరుకుని అయ్యప్పస్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. కొచిన్‌ సర్వీసును ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలి ఓటింగ్‌ పాస్‌ను ఎనికేపాడుకు చెందిన ఫాదర్‌ జోసఫ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ దీనివలన తిరుపతి, బెంగళూరు, కొచ్చిన్‌ వెళ్ళేవారికి మంచి సౌలభ్యంగా ఉంటుందన్నారు. ఎయిర్‌పోర్టు ఏసీపీ వెంకటరత్నం, సంస్థ ప్రతినిధి కుతుబ్‌ తదితరులు పాల్గొన్నారు.

భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ స్వదేశానికి చేరుకున్నారు. వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను పాక్‌.. భారత్‌కు అప్పగించింది. లాహోర్‌ నుంచి రోడ్డు మార్గంలో అభినందన్‌ను పాక్‌ అధికారులు తీసుకువచ్చారు. సరిహద్దు వద్ద ఆయనకు భారత వాయు సేన ఘన స్వాగతం పలికింది. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించింది. అక్కడి నుంచి అభినందన్‌ను నేరుగా దిల్లీ తీసుకెళ్లి అక్కడ పూర్తిస్థాయి వైద్యపరీక్షలు చేయనున్నారు. తొలుత సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో భారత అధికారులకు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇమిగ్రేషన్‌ పక్రియ కారణంగా అప్పగింత ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అభినందన్‌ను పాక్‌ అప్పగించింది.

అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన అభినందన్‌ సురక్షితంగా భారత్‌ చేరుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. సరిహద్దుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. శత్రువు చెరలో చిక్కినా స్థైర్యం కోల్పోలేదని అభినందన్‌ను యావత్‌ భారతావని కొనియాడుతోంది. అభినందన్‌కు స్వాగతం పలికేందుకు సరిహద్దు వద్దకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా జై హింద్‌, భారత్‌ మాతాకీ జై నినాదాలతో మార్మోగుతోంది. నిబంధనల ప్రకారం అతడు భారత్‌కు రాగానే విచారణ చేయనున్నారు. అటారీ చేరుకున్న అభినందన్‌ను భారత వైమానిక దళానికి చెందిన ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు తరలిస్తారు. అక్కడ ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆయన ఫిట్‌నెస్‌ స్థాయి ఏ మేరకు ఉందనే దాన్ని పరీక్షిస్తారు. అనంతరం ఆయన శరీరంలో పాక్‌ ఆర్మీ ఏమైనా బగ్‌ను అమర్చిందా? అనేది తెలుసుకునేందుకు స్కానింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

అంతేకాదు.. ఆయన మానసిక పరిస్థితి, ఆలోచనా విధానం ఏ విధంగా ఉందో పరీక్షిస్తారు. అభినందన్‌ నుంచి సమాచారం రాబట్టేందుకు శత్రుదేశం అతడిని టార్చర్‌ చేసిందా? అనే విషయానికి సంబంధించి వివరాలను సేకరిస్తారు. ఇంకా ఏదైనా అవసరం అనిపిస్తే ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) అధికారులు ఆయన్ను ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. సాధారణంగా ఐఏఎఫ్‌ అధికారిని ఐబీ, రా అధికారులు విచారించేందుకు అనుమతి లేదు. కానీ, క్లిష్టమైన కొన్ని కేసుల్లోనే ఈ విధంగా విచారణ చేయాల్సి ఉంటుంది. భారత్‌కు చెందిన వింగ్‌ కమాండర్‌ను పాక్‌ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. శాంతికి సంకేతంగా ఆయన్ను భారత్‌కు అప్పగించనున్నట్లు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నిన్న పార్లమెంట్‌లో ప్రకటించారు.

రెండు రోజుల క్రితం, ఒకే రోజు 5 వేలు ఓట్లు తొలగించారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రమ్రంతా ఓట్లు తొలగింపుపై ఒకేసారి లక్షల్లో అభ్యంతరాలు ఇంటర్నెట్ ద్వారా ఎన్నికల అధికారులకు చేరాయి. దీంతో జిల్లా ఎన్నికల అధికారులు సైబర్‌క్రైం జరిగినట్టు గ్రహించి ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకువెళ్లడంతో ఏపీ అంతటా ఓట్లు తొలగింపు అలజడి ఆరంభమైంది. 13 జిల్లాల్లో 5 లక్షల 20 వేల ఓట్లు ఫారం-7 ద్వారా డిలీషన్ కోసం 24 గంటల్లో అప్‌లోడ్ కావడం పట్ల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 32000 ఓట్లు ఒక్కరోజులో తొలగింపునకు ఫారం-7 అప్‌లోడ్ కావడం గమనార్హం. ఈ పేర్లు ఓటరు జాబితా నుండి తొలగించాలంటూ తమకు అభ్యంతర పత్రం వచ్చిందంటూ యంత్రాంగం.. మరోపక్క అభ్యంతరం వ్యక్తం చేసిన పత్రంలో సిఫార్సు చేసిన వారి పేర్లు కూడా స్థానికులదే కావడం.. ఇదే విషయమై అధికారులు విచారణతో గ్రామాల్లో ఓట్లు తొలగించే ఫారమ్-7 పెను అలజడినే సృష్టించింది.

గడచిన కాలంగా గ్రామాల్లో నివాసం ఉంటున్న తమ పేర్లను ఓటు తొలగింపు జాబితాలో కనిపించే సరికి సంబంధిత ఓటర్లు అందోళన చెందుతుండగా.. ఆయా ఓట్లు తొలగించాలంటూ అభ్యంతరం జాబితాలో సిఫార్సు చేసిన పేరు ఉన్న వారిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలస జీవనం.. వృత్తిరీత్యా వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని.. వీరి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించాలంటూ ఫారం-7లో ఇంటర్నెట్ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేయడం సాధారణం. అయితే గడచిన 90 రోజుల్లో కేవలం రెండు అంకెలుకే పరిమితమైన ఇటువంటి అభ్యంతరాలు జాబితా ఒకేరోజు వేలల్లో ఉండడంతో యంత్రాంగం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ తంతు కేవలం నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా చోటుచేసుకుంది. రాష్ట్ర ఎన్నికలు కమీషన్ కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించింది.

కమీషన్ డాష్‌బోర్డులో ఒకేసారి ఓట్లు తొలగించాలంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన జాబితా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలు వారీగా వందల సంఖ్యలో రావడంతో అధికారులు పొలింగ్ కేంద్రాలు వారీగా సిబ్బందిని అప్రమత్తం చేశారు. నియోజకవర్గం వారీగా సగటున 4 వేలు వరకు ఇటువంటి అభ్యంతరాలు కేవలం రెండు రోజుల్లో రావడంతో అధికారులు, యంత్రాంగం అయోమయానికి గురయ్యారు. ఇప్పటికే ఎన్నికలు ప్రక్రియకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయడంలో తలమునకలై ఉన్న యంత్రాంగానికి ఫారం-7 సృష్టించిన అలజడి మరింత తలనొప్పిగా తయారు అయ్యింది. శ్రీకాకుళం జిల్లాలో అధిక సంఖ్యలో ఫారం-7 అప్‌లోడ్ చేసే వారిని గుర్తించి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలంటూ ఆదేశించారు. అటువంటి వారిని వెంటనే గుర్తించి క్రిమినల్ చర్యలు చేపట్టాలన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నవారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు.

కర్నూలు జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి ఎమ్మెల్యే గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి రాజీనామా చేశారు. పాణ్యం టికెట్ మాకే ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్‌ను ఆడిగామని, మొదట ఇస్తామన్నారు.. ఇప్పుడు లేదంటున్నారని గౌరు చరిత చెప్పారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చే భరోసా జగన్‌లో కన్పించడం లేదని, గతంలో ముస్లింలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్‌ ఇవ్వలేదని, ఇప్పుడు తనకు ఎమ్మెల్సీ ఇస్తానంటే ఎలా నమ్మాలని ఆమె ప్రశ్నించారు. ఈనెల 9న టీడీపీలో చేరుతున్నామని గౌరు చరిత దంపతులు ప్రకటించారు. జిల్లాలో వైఎస్‌ కుటుంబానికి పాతికేళ్లుగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు విధేయతగా ఉంటూ వస్తున్నారు.

gowru 01032019 1

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అడుగుజాడల్లో నడిచారు. ఆయన ఏది చెప్పినా కాదనలేదు. 1999 ఎన్నికల్లో గౌరు వెంకటరెడ్డి తొలిసారిగా వైఎస్‌ సూచన మేరకు నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత ఓ హత్య కేసులో జైలుకు వెళ్లారు. 2004లో ఆయన సతీమణి గౌరు చరిత ఎమ్మెల్యే పోటీ చేసి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో నందికొట్కూరు ఎస్సీకి రిజర్వుడు కావడంతో పోటీకి దూరంగా ఉన్నారు. వైఎస్‌ మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్‌ కాంగ్రెస్‌ నుంచి బయటకు రావడం, అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గౌరు దంపతులు వైఎస్‌ కుటుంబానికి, జగన్‌కు మద్దతుగా నిలిచారు. జగన్‌ స్థాపించిన వైసీపీలో చేరి జిల్లాలో ఆ పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పాణ్యం వైసీపీ అభ్యర్థిగా గౌరు చరిత పోటీ చేసి గెలుపొందారు.

gowru 01032019 1

పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితకు జగన్ టికెట్ నిరాకరించడంతో గౌరు దంపతులు తెలుగుదేశంలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పాణ్యం, కల్లూరు మండలాల కార్యకర్తలతో గౌరు దంపతులు సమావేశం అయ్యారు. టీడీపీలోకి వెళ్లడంపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. త్వరలోనే గౌరు దంపతులు సైకిలెక్కనున్నట్లు సమచారం. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరు నెలల క్రితం బీజేపీని వీడి వైసీపీలో చేరారు. ఆయనకే వైసీపీ టికెట్‌ ఖరారైందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ వచ్చారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని మరొకరికి టికెట్‌ ఇవ్వరని గౌరు కుటుంబం చెబుతూ వచ్చింది. కాటసాని వర్గం తమకే టికెట్‌ అంటూ నియోజకవర్గంలో వేగం పెంచుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో పాదయాత్ర ముగించి హైదరాబాద్‌కు చేరుకున్న జగన్‌ను గౌరు దంపతులు కలిసి టికెట్‌పై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని, ఎమ్మెల్సీ ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఒకసారి నియోజకవర్గాన్ని వదులుకుంటే ప్రజాబలం కోల్పోతామని, సీటు తమకే ఇవ్వాలని గౌరు ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయింది. జగన్‌ను నమ్ముకుంటే ఇలా అన్యాయం చేస్తారని అనుకోలేదని గౌరు వర్గీయులు మథనపడుతూ వచ్చారు.

Advertisements

Latest Articles

Most Read