నిన్న సాయంత్రం, సరిగ్గా 6 గంటల సమయంలో, మీడియాకు రైల్వే మంత్రి ఆహ్వానం పంపారు. 7 గంటల 15 నిమషాలకు రమ్మని, ఏపి పై ముఖ్యమైన ప్రకటన ఉంటుంది అన్నారు. మోడీ వచ్చే రెండు రోజులు ముందైనా, రాజకీయం కోసమైనా, ఆందోళనలకు తలొగ్గి అయినా రైల్వే జోన్ ప్రకటిస్తున్నారు అంటూ, ఆ ప్రకటన కోసం అందరూ ఎదురు చూసారు. చెప్పినట్టు గానే, బుధవారం రాత్రి 7 గంటల 15 నిమషాలకు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆకస్మికంగా విశాఖ రైల్వేజోన్‌పై ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కానీ... ఆ ప్రకటన లోతుపాతుల్లోకి వెళ్లాకగానీ ఇందులోని గిమ్మిక్కులు బయటపడలేదు. మోడీ/షా ల మోసం గురించి తెలిసి కూడా, నమ్మి సంతోష పడినంత సమయంలోనే, వీళ్ళ మోసం తెలుసుకుని బాధపడాల్సిన పరిష్తితి.

modi 28022019 2

వివరాల్లోకి వెళితే... ఇప్పటిదాకా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లతో ‘విశాఖపట్నం రైల్వేజోన్‌’ ఏర్పాటు చేస్తున్నట్లు పీయూష్‌ ప్రకటించారు. అత్యంత కీలకమైన, 125 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌ను కేంద్రం చరిత్రలో కలిపేసింది. ఈ డివిజన్‌ను రెండు ముక్కలు చేసింది. ఒక ముక్కను విజయవాడ డివిజన్‌లో కలిపారు. మరో ముక్కతో ఒడిసాలోని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు చేస్తున్నారు. అంటే... విశాఖ కేంద్రంగా జోన్‌ ఉంటుందికానీ, డివిజన్‌ ఉండదు. ఇది తలలేని మొండెంతో సమానమే! విశాఖ జోన్‌గా ఉన్నప్పటికీ... డివిజన్‌ ఉండదు. వాల్తేర్‌ డివిజన్‌తో మనకు వచ్చిన ‘వాటా’.

modi 28022019 3

వాల్తేర్‌ డివిజన్‌ ఆదాయంలో దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. గత ఏడాది రూ.7,500 కోట్ల ఆదాయం సంపాదించి పెట్టింది. కోరాపుట్‌, కిరండోల్‌ లైన్‌ల పరిధిలో బైలదిల్లా గనుల నుంచి ఇనుప ఖనిజం రవాణాయే దీని ప్రధాన ఆదాయ వనరు. ఇప్పుడు... ఇప్పుడు ఈ ఆదాయమంతా కొత్తగా ఏర్పడనున్న రాయగఢ డివిజన్‌కు దక్కుతుంది. ప్రయాణికుల ఆదాయం మాత్రమే విశాఖ జోన్‌ పరిధిలోకి వస్తుంది. విశాఖలోని రెండు పోర్టుల వరకు ఇనుప ఖనిజం రవాణా అయినప్పటికీ ఇసుమంత ఆదాయం కూడా మన జోన్‌కు రాదు. కేకే లైన్‌లో అరకు వరకు అత్యంత క్లిష్టమైన రైల్వే మార్గం. దీని నిర్వహణ భారం మాత్రం విశాఖ జోన్‌ నెత్తిన పడుతుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వే స్టేషన్లు ఖుర్దా (ఒడిసా) డివిజన్‌లో ఉన్నాయి. ఇకపైనా అలాగే ఉంటాయి. వీటన్నింటినీ విశాఖ జోన్‌లో కలపాలన్నది ఉత్తరాంధ్ర వాసుల డిమాండ్‌. దీనిని కూడా మోదీ సర్కారు నెరవేర్చలేదు. విశాఖ రైల్వే జోన్‌ కేవలం భావోద్వేగ అంశం మాత్రమే కాదు! ఇది నిరుద్యోగ యువత జీవితాలతో ముడిపడినది. జోన్‌తోపాటు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డును కూడా ఇస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు.

దశాబ్ధాల ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ, విభాజన చట్టంలో హక్కుగా రావాల్సిన విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఎట్టకేలకు కేంద్రం ప్రకటించింది. ఎన్నో పోరాటాలు, ఎన్డీఏ నుంచి బయటకు రావటం, కేంద్ర క్యాబినెట్ నుంచి బయటకు రావటం, ప్రజల్లో పోరాటాలు, పార్లమెంట్ లో పోరాటాలు, చివరకు ఢిల్లీలో కూడా దీక్ష చేసి, కేంద్రాన్ని దోషిగా నిలబెట్టారు చంద్రబాబు. మిగతా అన్ని హామీలు ఎలా ఉన్నా, పైసా ఖర్చు లేని ప్రత్యేక రైల్వే జోన్‌ ఎందుకు ఇవ్వరు, ఇది కక్ష కాదా అంటూ అందరూ అడుగుతూ ఉండటంతో, కేంద్రానికి వేరే దారి లేని పరిస్థితి. మరో రెండు రోజుల్లో ప్రధాని వైజాగ్ పర్యటన ఉంది అనగా, దాపుగా 5 ఏళ్ళ తరువాత, ఎన్నికలకు వెళ్ళే ముందు, కేంద్రం రైల్వే జోన్ ప్రకటించింది.

zone 27022019

కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ బుధవారం అధికారికంగా ప్రకటన చేశారు. కొత్త రైల్వే జోన్‌కు సౌత్‌ కోస్ట్‌ రైల్వేగా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లతో ఈ జోన్‌ ఏర్పాటువుతుంది. మిగిలిన కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేస్తామని గోయల్‌ వెల్లడించారు. జోన్‌ ఏర్పాటు దిశగా త్వరలోనే అధికారిక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత వాల్తేర్‌ డివిజన్‌ను రెండు భాగాలుగా విభజిస్తామన్నారు. ఒక భాగాన్ని విజయవాడ డివిజన్‌లో కలిపి జోన్‌లో ఉంచుతామని, మరో భాగాన్ని రాయగడ డివిజన్‌గా మారుస్తున్నామని తెలిపారు. రాయగడ డివిజన్‌ ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌లో భాగంగా ఉంటుందని గోయల్‌ వివరించారు.

zone 27022019

అయితే ఈ ప్రకటన పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజా నిర్ణయంతో వాల్తేరు రైల్వే డివిజన్ రద్దవుతుంది. ఈ డివిజన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటూ ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్‌లోని భాగాలను కవర్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని రెండుగా విభజించి, అందులో సగ భాగాన్ని విజయవాడ డివిజన్లో కలుపుతారు. మిగిలిన సగంతో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేసి తూర్పు కోస్తా రైల్వేలో కలుపుతున్నారు. వాల్తేరు డివిజన్ లో మూడింట రెండు వంతులు ఒరిస్సాకి కేటాయించంతో, ప్రధాన లాభాలు అన్నీ ఒరిస్సాకి వేల్లిపోతాయని అంటున్నారు. లాభాలు తెచ్చే డివిజన్ లోని కిరండల్ ఇనుము ఖనిజం మూలంగా వచ్చే ఆదాయాన్ని రాయగడ్ కు తరలించారు. 80 శాతం ఆదాయాన్ని పాలకుండ లాంటి భాగం రాయ్ గడ్ కు వెళుతుంది...ప్యాసింజర్ ల పై వచ్చె ఆదాయమే కోస్టల్ రైల్వే జోన్ మనది.. మళ్ళీ కష్టపడి కోస్టల్ రైల్వే జోన్ ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తెలుగుప్రజలదని నిరూపించుకోవాలి... ఉత్తరాంధ్ర ప్రజల కల పాక్షికంగా నెరవేరుతోంది... రైల్వేలో ఉద్యోగాలు వచ్చే అవకాశంతో కొంతలోకొంత యువకులలో ఉత్సాహం నెలకొననుంది.. అయితే ఇదే స్పూర్తితో, పోరాడి, మిగతా హామీలు కూడా సాధించుకోవాల్సిన పరిస్థతి మన రాష్ట్ర ప్రజలది.

విధి ఎంత బలీయమైనదో, ఈ రోజు జగన్ మొహన్ రెడ్డికి తెలిసినంతగా, ఎవరికీ తెలిసి ఉందందు. ముందుగా, మన అమరావతిలో మరో ఆనందాల హడావిడి. గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకుడు అడుగిడుతూ అమరావతిలో గృహప్రవేశం చేస్తున్న శుభవేళ. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు. ఇదే సందర్భంలో మన సాక్షిటీవీలో, పేపర్ లో, అమరావతి పై చిమ్మిన విషం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అమరావతి బురదలో, సిఎం బస్సు దిగబడితే నవ్వుకొన్నాం. ఉద్యోగులకు బురదే స్వాగతం చెప్పిందని చెణుకులు విసిరాం. అయినా ఒక్కొక్కటిగా సీఎం బస్సు నివాసంతో మొదలయ్యి, ఇటీవలే హైకోర్టు, ఆఖరుగా అపొజిషన్ లీడర్ నివాసం వరకు, అన్నీ తరలి వచ్చేశాయి.

jagna 27022019

భూములు ఇచ్చిన అన్నదాతలు భోజనానికి పిలిస్తే జగన్ రెడ్డి వెళ్లలేదని బాధపడ్డారు. ఈ రోజు ఆయన కూడా అమరావతి లో ఓ ఇంటివాడై భోజనం పెడుతున్నారు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది. అమరావతి సంకల్పం, ఆ మట్టి అలాంటిది. అమరావతిలో అగ్నిపర్వతాలు బద్దలయ్యి లావా ఎగజిమ్ముతుంది అని రాయడం తప్ప, అన్ని ఉపద్రవాలు వస్తాయి అని సాక్షిలో నిత్యం వ్రాసి, కేసులు వేసారు. భూమి కుంగింది అని ఒకసారి, బురద నేల అని ఒకసారి, భూకంపం వస్తుందని ఒకసారి, ఇలా అనేకం. ఆ భయంతో, తోడు కోసమో ఏమో, ఇటుకే పెట్టలేదని ప్రచారం చేసి, అన్నీ సమకూర్చాక, ఇలా భారీ భవంతిని బ్రహ్మాండంగా కట్టుకొని, జగన్ రావడం సంతోషంగా వుంది.

jagna 27022019

భాగ్యనగరం బోసిపోయేలా ఆంధ్రా అంతా వచ్చేసింది, సినిమా & ఐటీ వాళ్లు తప్ప. వాళ్లకూ తప్పదనుకోండి. లోటస్ అంటే కలువ, పాండ్ అంటే కుంట, ఇదేదో మన కల్వకుంట్ల ఇంటి పేరుకు తగ్గదిలా వుందనుకొని, లోటస్ పాండ్ కు వెళుతున్న, అక్కడి సీఎం కుటుంబం కూడా, ఇక్కడికి వచ్చిపోయేలా, జగన్ స్వాగతించాలని ఆశిస్తున్నా. ఈ హడావుడితో, వందల నుండి వేలు దాటి, లక్షల మంది రాకపోకలతో అమరావతి అలరాలుతుంది. ఆ స్థాయిలో వ్యాపారాలు పెరుగుతాయి. చరిత్రలోని అమరావతికి, మరో సారి లోకం ఛత్రిపట్టే సన్నివేశాలు చూడ్డం, మన తరం అదృష్టం. అన్నదాతల నుండి ప్రణాళికలు ఇచ్చిన సింగపూర్ వరకు, ప్రతి ఒక్కరికీ, పేరు పేరునా ధన్యవాదాలు. మనం ఎంత విషం చిమ్మినా, అక్కడే ఇల్లు కట్టుకోవాల్సి రావటం, ఇది, ది పవర్ అఫ్ అమరావతి... ఇప్పటికైనా అర్ధమైందా జగన్ ?

గత కొద్ది రోజులుగా రెచ్చిపోతున్న వైసీపీ, ఈ రోజు మరింతగా దిగజారింది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ చంపటానికి కూడా వేనుకాడము అన్నట్టు ప్రవర్తిస్తుంది. గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా, వైకాపా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన చర్చాకార్యక్రమానికి ఇరు పార్టీల కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తెదేపా కార్యకర్తకు గాయాలయ్యాయి. ఈ ఘర్షణను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. గాయపడిన కార్యకర్తను ఆస్పత్రికి తరలించారు.

ycp 27022019 1

ఈ ఘటన పై, అక్కడ స్థానికి ఎమ్మల్యే పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ ఇది "వైఛీపీ నాయకుల ఆగడాలకు అంతేలేదా? గతంలో ఎప్పుడైనా, ఏనాడైనా మన వినుకొండలో ఇలాంటి ఘటనలు మనం చూశామా? వచ్చే ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదనే విషయం వైఛీపీ నాయకులకు తెలిసిపోయినట్లుంది. అందుకే దాడులకు తెగబడుతున్నారు. మొన్నటికి మొన్న జనసేన కార్యకర్తలపై మీ పార్టీ రౌడీ మూకలు రాళ్లదాడి చేశాయి. ఇప్పుడు నియోజకవర్గం టీవీ9 నిర్వహించిన డిబేట్లో పాల్గొనే దమ్మూ, ధైర్యం లేక అమాయక ప్రజల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని ఇనుప రాడ్లతో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మన నియోజక వర్గంలో ఎప్పుడైనా, ఏనాడైనా ఇలాంటి ఘటనలు మనం చూశామా.? ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు ప్రజలపై దాడులకు తెగబడుతున్నారు."

ycp 27022019 1

"అమాయక ప్రజల మీదా మీ ప్రతాపం.? అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ భరించాం.. కానీ అమాయక ప్రజలపై దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాను. మీ రౌడీల దాడిలో తెలుగు యువత అధ్యక్షుడు ఘంటా బలరాం తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంకా ఎన్నాళ్ళు ఈ అరాచకాలు. మీ పార్టీ వాళ్లే ఈ నియోజక వర్గంలో ఉండాలా? మిగిలిన ప్రజల్ని ఉండనివ్వరా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు మీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు."

Advertisements

Latest Articles

Most Read