పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి... ఇద్దరూ ఇద్దరే.. నీచ రాజకీయాలు చెయ్యటంలో పెట్టింది పేరు. ఎవరో శ్రీరెడ్డి, రామో గోపాల్ వర్మ కలిసి, పవన్ కళ్యాణ్ ని ఎదో తిడితే, నా తల్లిని చంద్రబాబు తిట్టించాడు అంటూ, పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజకీయం నడిపాడో చూసాం. అంతే కాదు, ఇప్పుడ అంటే ఎదో అందుకున్న తరువాత సైలెంట్ అయ్యాడు కాని, అంతకు ముందు వరకు బహిరంగ సభల్లో, లోకేష్ శారీరక ఆకృతి పై ఎలాంటి వ్యాఖ్యలు, వెటకారం చేసాడో చూసాం.. మరో పక్క జగన్ మోహన్ రెడ్డి రాజకీయం అయితే, ఇక చెప్పే పనే లేదు. నలుగురు నలుగురు పెళ్ళాలు, కార్లు మార్చినట్టు మారుస్తాడు అంటూ, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత కామెంట్ లు చేసారు. అప్పట్లో జనసేన నేతలు షర్మిల పెళ్ళిళ్ళు పై, మాట్లాడుతూ, ఇరు వర్గాలు నీచంగా తిట్టుకున్నాయి.

pk 25022019 2

అయితే ఇప్పుడు ఆ నలుగురు నలుగురు పెళ్ళాల్లో, ఒకటైన పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తో జగన్ మైండ్ గేమ్ మొదలు పెట్టారు. ఇప్పటికే, కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గేమ్ లో భగంగా, ఇప్పుడు అదే కర్నూల్ కు ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ ని పర్యటించేలా ప్లాన్ చేసాడు జగన్. ఇద్దరూ ఒకే జిల్లాలో పర్యటించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తినెలకొంది. పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా రైతుల సమస్యలు తెలుసుకునేందుకు కర్నూలులో పర్యటిస్తున్నారు. ఆదివారం రాత్రే ఆమె మంత్రాలయం చేరుకున్నారు. స్థానిక ఎస్‌వీబీ అతిథిగృహంలో బస చేసిన ఆమె ఉదయాన్నే.. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆత్మహత్యకు కారణాలు, బాధిత కుటుంబాల పరిస్థితులు అడిగి తెలుసుకోనున్నారు. ఆమె.. త్వరలో రైతు సమస్యలపై సినిమా తీయనున్నారు. ఈ నేపథ్యంలో.. ఆమె ఈ పర్యటన చేస్తున్నారు.

pk 25022019 3

అయితే ఇక్కడ రేణు దేశాయ్ తో పాటు సాక్షి సిబ్బంది ఉండటమే అసలు హైలైట్. రేణు దేశాయ్ సాక్షి టీవీ లో యాంకర్ గా తన రెండవ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు అనే వార్తా బాగా ప్రచారం అవుతుంది. ఇందుకు తగ్గట్టే, సాక్షి సీనియర్ యాంకర్ స్వప్నతో కలిసి, సాక్షి టీవీ లోగోతో అక్కడి రైతులను ఇంటర్వ్యూ చేస్తూ కనిపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ని డైవర్ట్ చేయడానికి ఇది జగన్ పన్నిన కుట్రనా.. అనే ప్రశ్న అటు కర్నూల్ జిల్లా లోనూ మరియు జనసైనికుల లోనూ మొదలయ్యింది. ఒక్కసారిగా ఆమె సాక్షి లోగోతో ప్రత్యక్షమవ్వడంతో అంతా గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ కు ధీటుగా రేణు దేశాయ్ ను రంగంలోకి దించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రేణు దేశాయ్ నిర్వహించబోయే కార్యక్రమాలను సాక్షి టీవీ లైవ్ కవరేజ్ మాత్రమే ఇస్తుందని రేణు దేశాయ్ సిబ్బంది చెప్తున్నారు. ఏది ఏమైనా, పవన్ ను రెచ్చగొట్టటానికి, జగన్ ఇలా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇద్దరూ ఇద్దరే కాబట్టి, వాళ్ళు ఎలా కొట్టుకుంటే మాకేంటి అంటూ, తెలుగుదేశం పార్టీ, జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంది. జగన్ చేస్తున్న ఇలాంటి రాజకీయం నీచమైనది అయినా, పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి రాజకీయాలే మా పై చేసారని, ఇప్పటికైనా పవన్ వాస్తవాలు గ్రహించాలని తెలుగుదేశం పార్టీ అంటుంది.

కోట్ల కుటుంబం టీడీపీలో చేరిక మార్చి 2కి వాయిదా పడింది. జనవరి 19న ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఆయన సతీమణి, డోన్‌ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, తనయుడు కోట్ల రాఘ వేంద్రరెడ్డి కలిశారు. వారం పది రోజుల్లోగా కోట్ల కుటుంబం టీడీపీలో చేరుతుందని అందరూ భావించారు. అయితే కార్యకర్తల అభిప్రాయాలు తీసుకునేందుకు సమయం తీసుకున్నారు. కార్యకర్తలు సానుకూలంగా స్పదించడంతో సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకు గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టు, ఎల్లెల్సీ బైపాస్‌ పైప్‌లైన్‌ కెనాల్‌ ఇస్తే టీడీపీలో చేరేందుకు సిద్ధమని కోట్ల ప్రకటించారు. ఈ మూడు ప్రాజెక్టులతో పాటు ఆర్డీఎస్‌ ప్రాజెక్టుకు కూడా ముఖ్యమంత్రి అనుమతులు, నిధులు ఇస్తూ జీవో జారీ చేశారు.

kotla 25022019

దీంతో ఈ నెల 28న కోడుమూరులో నిర్వహించే భారీ బహిరంగ సభకు సీఎం చంద్రబాబును ఆహ్వానించి ఆయన సమక్షంలోనే టీడీపీలో చేరాలని కోట్ల కుటుంబం ఏర్పాట్లు చేసుకుంది. 28న కేఈ ప్రతాప్‌ కుమారుడి పెళ్లి.. ఈ నెల 28న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్‌ టీడీపీ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్‌ కుమారుడు కేఈ నితిన్‌, అక్షితల వివాహం గోవాలో జరగనుంది. పెళ్లికి రెండు మూడు రోజుల ముందే డిప్యూటీ సీఎం కేఈతో పాటు ఆయన కుటుంబ సభ్యులు గోవాకు వెళుతున్నారు. 28న కోట్ల కుటుంబం టీడీపీలో చేరాలని భావించింది. కోట్ల, కేఈ కుటుంబాల మధ్య దశాబ్దాల రాజకీ య వైరం ఉంది.

kotla 25022019

ఈ నేపథ్యంలో 28న కోడుమూరు సభకు రాలేకపోతే ప్రజలకు మరో విధంగా సంకేతం వెళ్లే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కోట్ల చేరిక సమయంలో రెండు కుటుంబాలు ఉంటేనే కార్యకర్తలకు మంచి సందేశం వెలుతుందని సీఎం భావించారు. దీంతో 28వ తేదీన నిర్వహించాల్సిన సభను మార్చి 2కి వాయిదా వేసుకోవాలని కోట్లకు సీఎం సూచించినట్లు తెలిసింది. దీంతో బహిరంగ సభ తేదీని 2వ తేదీ నిర్వహించాలని కోట్ల వర్గం నిర్ణయించింది. ఈ సభకు సీఎంను ఆహ్వానించేందుకు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోమవారం అమరావతికి వెళుతున్నారు. సీఎంను కలిసి, కర్నూలు లోక్‌సభ స్థానంపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం.

చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రగిరిలో సర్వే వివాదంలో చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పాకాలలో సర్వే చేస్తున్నవారిని అడ్డుకొని ట్యాబ్‌లు లాక్కొన్నవారిని అరెస్ట్ చేసి చిత్తూరు పీటీసీకి తరలించారు. అయితే అరెస్ట్ చేసినవారిని పీటీసీలో పెట్టే అధికారం లేదంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి సత్యవేడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అయితే తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా పోలీసులు వేధిస్తున్నారంటూ స్టేషన్‌లోనే నిరసనకు దిగారు. సత్యవేడు పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. వైసీపీ కార్యకర్తలతో పాటు అక్కడకు పోటా పోటీగా టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఏ ఎస్పీ సుప్రజ ... అదనపు బలగాలను మోహరించారు.

chevireddy 2022019 2

అంతకు ముందు, నిన్న సాయంత్రం, సర్వే చేసేందుకు వచ్చిన వ్యక్తులపై దౌర్జన్యం చేసి అడ్డుకున్న వైకాపా నాయకులను పోలీసులు అరెస్టు చేసిన వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆదివారం రాత్రి చిత్తూరులో ధర్నా చేపట్టారు. పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ పోలీసు శిక్షణ కేంద్రం ఎదుట బైఠాయించారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని జయదేవ్‌ కాలనీకి కొందరు వ్యక్తులు ఆదివారం సర్వే కోసం వచ్చారు. వారిపై స్థానిక వైకాపా నాయకులు దౌర్జన్యం చేసి అడ్డుకున్నారు. వైకాపా నాయకులు దౌర్జన్యం చేసి ట్యాబులు లాక్కున్నారంటూ ఆ వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

chevireddy 2022019 3

కాలనీకి చెందిన నాయకులు నంగా నరేష్‌రెడ్డి, చెన్న కేశవరెడ్డి, ప్రకాష్‌రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకుని చిత్తూరులోని పీటీసీకి తరలించారు. సమాచారం అందుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కరరెడ్డి రాత్రి 10.45 గంటలకు చిత్తూరుకు చేరుకుని అక్కడి పోలీసు శిక్షణ కేంద్రం ఎదుట బైఠాయించారు. తమ పార్టీ వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిత్తూరు తెదేపా నాయకులు సైతం అక్కడికి చేరుకున్నారు. వైకాపా నాయకుల దౌర్జన్యం నశించాలంటూ వారు నినదించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి చెవిరెడ్డి ఓవర్ యాక్షన్ చెయ్యటంతో, అరెస్ట్ చేసి పోలీసులు లోపలేసారు.

కేసీఆర్‌, దొంగ కంపెనీల సృష్టికర్త జగన్‌ ఏకమై ఆంధ్రప్రదేశ్‌పై హైదరాబాద్‌లో కుట్రలు చేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ విమర్శించారు. 26ప్రశ్నలతో ఆదివారం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. పోలవరం, ఇతర ప్రాజెక్టులపై జగన్‌ సలహాలతో కేసులు వేసిన కేసీఆర్‌ ఏపీపై కక్ష గట్టారని మండిపడ్డారు. ‘మిత్రులను బట్టి గుణం తెలిసిపోతుంది. 12 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్‌తో కలిసి మీరు నవ్యాంధ్రపై చిమ్ముతున్న విషం ప్రజలకు అర్థమైంది’ అని పేర్కొన్నారు. ‘నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గురుకుల ట్రస్ట్‌, అయ్యప్ప సొసైటీ నిర్మాణాలను తొలగించిన మీరు లోటస్‌ పాండ్‌లో జగన్‌ భవంతి, జగన్‌ పత్రిక కార్యాలయం ఎందుకు తొలగించలేదు. జగన్‌ ఇంద్ర భవనంలో అక్రమాలను సీబీఐ, టౌన్‌ ప్లానింగ్‌ నిర్ధారించినా ఎందుకు చర్యల్లేవో ప్రజలకు చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

devineni 25022019

కుట్రలను తిప్పికొట్టి జగన్‌ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడం తథ్యమని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో దేశ ప్రధానిని నిర్ణయించేది ముఖ్యమంత్రి చంద్రబాబేనని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్‌ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో అన్నారు. రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ సీఎం కే.చంద్రశేఖరరావు, ఆయన కొడుకు కె.తారక రామారావుల పెత్తనమేంటని నిలదీశారు. కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో కూర్చొని వైసీపీ తరఫున ఏపీ లోక్‌సభ అభ్యర్థులను నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. బ్రీఫ్‌కేసు కంపెనీలు సృష్టించిన రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి భాగోతం బయటపెట్టాలని ప్రధాని మోదీని డిమాండ్‌ చేశారు. బ్రీఫ్‌ కేసు కంపెనీల ద్వారా హవాలా మార్గంలో రాష్ట్రానికి డబ్బు తరలించడానికి కుట్రలు చేస్తున్నారన్నారు.

devineni 25022019

జగన్‌ లండన్‌ వెళితే తప్పేంటని, హవాలా డబ్బు తెచ్చుకుంటే తప్పేంటని బీజేపీ అద్దె మైకు జీవీఎల్‌ అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ, అమిత్‌ షా ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారని నిలదీశారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలసి ఆడుతున్న నాటకాలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్‌ చక్రవర్తి, యువరాజు కేటీఆర్‌ ద్వారా సామంత రాజుగా జగన్‌ని ప్రకటించి ఏపీ ప్రజలపై పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వైసీపీ, టీఆర్‌ఎ్‌సలకు కంబైన్డ్‌ గిఫ్ట్‌ ఇవ్వడానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్‌ జ్యోతిష్యం తెలంగాణలో పనిచేసినట్లుగా ఆంధ్రాలో పనిచేయదని మంత్రి కేఎస్‌ జవహర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని టీఆర్‌ఎస్‌ నాయకులకు ఆంధ్రా రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్‌ లండన్‌ టూర్‌కు వెళ్లేటప్పుడు ఏపీ వైసీపీ బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగిస్తే మేలని సూచించారు.

 

 

Advertisements

Latest Articles

Most Read