జగన్ లండన్ వెళ్తూ వైకాపా ఇన్‌ఛార్జి పదవిని కేటీఆర్‌కు అప్పగించారా? అని మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. కేసీఆర్‌ చక్రవర్తి ఆయన యువరాజు కేటీఆర్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సామంత రాజుగా జగన్‌ను ప్రకటించారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణాలో ఆయన రాజుగా ఉంటూ, ఏపిని కూడా కైవసం చేసుకొని, ఇక్కడ జగన్ ను సామంత రాజుగా పెట్టి, ఏపిని హైదరాబద్ నుంచి పాలించే కుట్ర చేస్తున్నారని అన్నారు. వైకాపా, తెరాస జోడీకి సంయుక్తంగా ప్రజలు గిఫ్ట్‌ ఇవ్వబోతున్నారని అన్నారు. ‘‘మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. మీ పెత్తనాలు, కుటుంబ పాలన కోసం రాష్ట్రాన్ని విడదీశారు. ఇప్పుడు మా రాష్ట్రంపై పెత్తనం చేయాలని బయల్దేరితే సహించేది లేదు’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన దేవినేని.. మోదీ, కేసీఆర్‌, జగన్‌పై విమర్శలు గుప్పించారు.

devineni 24022019

హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసే వారిపై దాడులు చేస్తున్నారని, నోటీసులు ఇచ్చి ఆస్తులు ఆక్రమించుకుంటామని బెదిరిస్తున్నారని దేవినేని ఆరోపించారు. మోదీ నాయకత్వంలో కేసీఆర్ దుర్మార్గాలు, కుట్రలు చేస్తున్నారని.. మోదీ, జగన్‌, కేసీఆర్‌ కలిసి చంద్రబాబుపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు 26 పార్టీలను ఏకతాటిపైకి తెస్తే మా దేశభక్తిని శంకిస్తారా? అని ప్రశ్నించారు. అధికారం ఉందనే మిడిసిపాటు తగదని ఎద్దేవాచేశారు. ‘‘మీరు మాట్లాడే ప్రతి మాటా మా ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉంది. ఐదు కోట్ల మంది ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని దేవినేని అన్నారు. జూన్‌లో చంద్రబాబు చెప్పే ప్రధానే దిల్లీలో వస్తున్నారని, చరిత్ర పునరావృతమవుతుందని పేర్కొన్నారు. పోలవరంపై కవిత కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.

devineni 24022019

అందుకే జగన్‌ పోలవరం వెళ్లట్లేదు... జగన్‌ ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించలేదని మంత్రి దేవినేని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పునాదులు కూడా లేవలేదని జగన్‌ చెబుతున్నారని, కానీ, అక్కడ జరుగుతున్న అభివృద్ధి చూస్తే ఎక్కడ వాస్తవాలు చెప్పాల్సి వస్తుందోనని వెళ్లట్లేదని విమర్శించారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఏ ప్రాజెక్టు కూడా ఇంత వేగంగా జరగట్లేదని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌ నుంచి రూ.4,121 కోట్లు ఖర్చు పెట్టి పనులను పరుగెత్తిస్తున్నారు అని చెప్పారు. రూ.1500 కోట్లు ఇచ్చి దిల్లీని తలదన్నే రీతిలో రాజధాని నిర్మించాలని మోదీ ఎగతాళి చేశారని విమర్శించారు. మోదీ తెలుగు జాతిపై ఎందుకు కక్ష గట్టారు? అని ప్రశ్నించారు.

టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా కోసం ఆ పార్టీ కేడర్‌ ఉత్కంఠతగా ఎదురుచూస్తోంది. కడప, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు తదితర జిల్లాల్లో అభ్యర్థులపై ఇప్పటికే స్ఫష్టత ఇచ్చారు. ఈ వారంలో బయటకు ప్రకటించకపోయినా జిల్లాలో కొన్ని నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు అభ్యర్థులకు స్పష్టత ఇవ్వనున్నారు. దీని కోసం అధినేత ఉండవల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో లోకసభ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు ప్రారంభించారు. ఇప్పటికే ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విస్తరించిన బాపట్ల తొలి రౌండ్‌ పూర్తయింది. మూడు రోజుల క్రితం చంద్రబాబును కలిసి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, పొలిట్‌ బ్యూరో సభ్యురాలు అరుణకుమారి తమ లోకసభ పరిధిలోని కొన్ని అసెంబ్లీ సీట్లలో సిట్టింగులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు బలహీనంగా ఉన్నారని, వారిస్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.

108 26112018 3

దీంతోపాటు కొన్ని నియోజకవర్గాలపై తమ వద్ద ఉన్న సమాచారాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. మార్పులు చేర్పులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం. దీంతోపాటు అధినేత వరుసగా లోకసభ నియోజకవర్గాల వారీగా జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహిస్తుండడంతో సర్వత్రా టెన్షన్‌ నెలకొంది. అధినేత చేతిలో జాతకాలు.. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే నాలుగు నుంచి ఐదు సర్వేలను అధిష్టానం నిర్వహించింది. దీంతో పాటు ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై వివరాలు సేకరించారు. దీంతో పాటు సీఎం నిఘా వర్గాల ద్వారా అందరి జాతకాలను తెప్పించారు. వాటి అధారంగా టిక్కెట్ల ఎంపిక ఉంటుందని, దీంతో కొందరు నేతల్లో టెన్షన్‌ నెలకొంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగులకు వ్యతిరేకంగా అధికార పార్టీలోని మరోవర్గం కూడా నిరసన గళాలు విప్పుతోంది.

108 26112018 3

మరికొంత మంది గ్రూపు మీటింగులు పెట్టి వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. అభ్యర్థిని మార్చకపోతే ఓటమి తప్పదంటూ సున్నితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో వైపు కొన్ని పార్టీలతో పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయని సంకేతాలనూ వదులుతున్నారు. దీంతో సిట్టింగులకు స్థానచలనం ఉండొచ్చని పరోక్ష హెచ్చరికలు అందుతున్నాయి. దీంతో అతికొద్ది మందికి మినహా ఎవరికీ సీటుపై స్పష్టత రాలేదు. ఏం జరుగుతుందో తెలియక అనుచరులు కూడా డైలమాలో పడుతున్నారు. మరికొంత మంది తమ వారసులను పరిశీలించాలంటూ అనుచరుల ద్వారా సంకేతాలు పంపుతున్నారు. వారసులను వెంట పెట్టుకుని వెళ్లి అధినేతను కలిసి నేరుగా బయోడేటాలను అదిస్తున్నారని సమాచారం.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ గ్రామసభలో చేసిన ప్రసంగం మార్ఫింగ్‌ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యవహారంలో మరో వైసీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ పార్టీ మీడియా కో-ఆర్డినేటర్‌ కామిరెడ్డి వెంకట నరసింహారావును అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ కేసులో పెదపాడు మండలం తోటగూడెంకు చెందిన వైసీపీ నాయకుడు కత్తుల రవికుమార్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం సాయంత్రం దెందులూరు ప్రాంతంలోని శ్రీరామవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి వెంకట నరసింహరావుని (నానీ) పోలీసులు.. ఆయన అత్తగారి ఇంటి దగ్గర అదుపులోకి తీసుకొన్నారు. నరసింహరావుకు ద్వారకా తిరుమల మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన యువతితో ఏలూరులో శుక్రవారం రాత్రే వివాహమైంది.

ycp 24022019

శనివారం సాయంత్రం వధువుతో కలిసి ఆయన తన అత్తవారి ఇంటికి చేరుకొన్నారు. అప్పటికే అక్కడ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఆ ఇంటికి చేరుకొన్న మరుక్షణమే పోలీసులు కామిరెడ్డిని తమతో తీసుకువెళ్లిపోయారు. ఈ సమాచారం వైసీపీ నాయకులకు తెలియడంతో, వారంతా త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికి కామిరెడ్డిని ఎక్కించిన వాహనం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొంది. దాన్ని అడ్డగించి వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇంతలో అక్కడకు వచ్చిన డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావుతో వాగ్వివాదానికి దిగారు. కామిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని గట్టిగా డిమాండ్‌ చేశారు. వైసీపీ నాయకులతో డీఎస్పీ చర్చలు అర్ధరాత్రి దాటాకా కొనసాగాయి. మరోవైపు, వీడియో మార్ఫింగ్‌ వ్యవహారంలో కామిరెడ్డి ప్రమేయంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

 

ycp 24022019

ఇది ఇలా ఉంటే, జనసేన ప్రచార రథాలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఏటీ అగ్రహారంలో జనసేన పార్టీ నేత తోట చంద్రశేఖర్ ప్రచార రథాలపై రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడిలో ఇద్దరు మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో వారిని జీజీహెచ్‌కు తరలించారు. వైసీపీ నేతల ఆక్రోశంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రచారరథాలను అడ్డుకోవాలని చూస్తే వైసీపీ నేతల ప్రచారాన్ని కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ దాడి తెలుసుకున్న లోకేష్, వైసీపీ దౌర్జన్యాలని ఎండగట్టింది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఒక్కొక్కరికి ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ నుంచి పిలుపు వస్తోంది. హైదరాబాద్‌ వచ్చి తనను కలవాలంటూ సమన్వయకర్తలను ఆయన ఆదేశిస్తున్నట్టు తెలిసింది. జిల్లాలో 12 మంది సమన్వయకర్తలకు గత నాలుగు రోజుల్లో కబురు అందగా, శనివారం మరో ముగ్గురు సమన్వయకర్తలు హైదరాబాద్‌ వెళ్లి ప్రశాంత్‌కిషోర్‌ను కలిశారు. ఒక్కొక్కరితో వేర్వేరుగా అర్ధగంట సేపు ప్రశాంత్‌కిషోర్‌ మాట్లాడినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గాల్లో తమ బృందం ఇప్పటివరకూ నాలుగుసార్లు చేపట్టిన సర్వే వివరాలను వారి ముందు పెట్టి తాజా పరిస్థితిని కూడా వివరించినట్టు తెలిసింది. ఈ భేటీ తర్వాత తమకు టిక్కెట్‌ వస్తుందో రాదో కూడా సమన్వయకర్తలకు అవగాహన వచ్చేస్తోందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

prasanthkishore 24022019

ఎన్నికలు దగ్గరపడడంతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో సమన్వయకర్తలుగా పనిచేస్తున్న వారి సమర్థత, ప్రజల్లో వున్న పట్టు, ఎన్నికల్లో టిక్కెట్‌ ఇస్తే పరిస్థితి ఏమిటి? అనేదానిపై పార్టీ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ (పీకే) సారథ్యంలో పలుమార్లు సర్వే నిర్వహించారు. సర్వే నివేదికల ఆధారంగా పలుచోట్ల సమన్వయకర్తల మార్పు, ఎన్నికల నిర్వహణపై తరగతులు, ప్రజలకు దగ్గరయ్యేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా గత మూడు నెలల కాలంలో రెండుసార్లు సర్వే చేయించారు. మరో వారం, పది రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి వుండడంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో పీకే వ్యక్తిగతంగా భేటీ అవడం ప్రారంభించారు. అందులో భాగంగా విశాఖ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల్లో 12 మందిని పీకే హైదరాబాద్‌ పిలిపించుకుని ఇప్పటికే భేటీ అయ్యారు.

prasanthkishore 24022019

తాజాగా దక్షిణ, ఉత్తర, గాజువాక నియోజకవర్గాల సమన్వయకర్తలను హైదరాబాద్‌ రావాలని వర్తమానం పంపించడంతో వారంతా శుక్రవారమే బయలుదేరి వెళ్లారు. శనివారం మధ్యాహ్నం ముగ్గురితో వేర్వేరుగా అర గంట సేపు పీకే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిలో లోపాలు, ఒకవేళ టిక్కెట్‌ ఇస్తే గెలుపొందేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్థానికంగా ఎవరెవరిని కలుపుకుపోవాలి...వంటి సూచనలు, సలహాలతో కూడిన కాగితాన్ని వారి చేతిలో పెట్టినట్టు తెలిసింది. సమన్వయకర్తలనే కాకుండా గతంలో సమన్వయకర్తలుగా పనిచేసిన వారిని, ప్రస్తుతం టిక్కెట్‌ ఆశిస్తున్న వారిని, పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్న నేతలను కూడా ఇప్పటికే హైదరాబాద్‌ పిలిపించి పీకే మాట్లాడినట్టు తెలిసింది.

 

 

Advertisements

Latest Articles

Most Read