విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వెలంపల్లి శ్రీనివాస్‌ వైసీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ తనదేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేయాలని కోరాడ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కోరాడ విజయ్‌కుమార్‌ ఉవ్విళ్లూరుతున్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీలో వెలంపల్లిని వ్యతిరేకిస్తున్న వర్గాన్ని అక్కున చేర్చుకుని అడుగులు ముందుకు వేస్తున్నారు. వైసీపీ టికెట్‌ను దక్కించుకోవడానికి కోరాడ విజయ్‌కుమార్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే వెలంపల్లి, కోరాడ మధ్య అంతర్యుద్ధానికి కారణమైంది. విజయ్‌కుమార్‌ ట్రస్ట్‌ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కోరాడ చిట్‌ఫండ్‌ కంపెనీని నడుపుతున్నారు. త్వరలో ఈ చిట్‌ఫండ్‌ కంపెనీని మూసివేస్తున్నారని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల్లో కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

ycp 21022019

వెలంపల్లి యూత్‌ పేరుతో ఈ తరహా పోస్టింగ్‌లు వస్తున్నాయి. దీనిపై కోరాడ విజయ్‌కుమార్‌ సైబర్‌ క్రైం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు బదలాయించారు. ఈ విషయంలో కోరాడ విజయ్‌కుమార్‌కు పారిశ్రామికవేత్త కోగంటి సత్యం బాసటగా నిలుస్తున్నారు. విజయ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు ఆయన వెంట సత్యం రావడం గమనార్హం. వెలంపల్లి, కోగంటి సత్యం మధ్య కొద్దికాలంగా వివాదాలు ఉన్నాయి. ఇటు కోరాడకు, అటు కోగంటికి కామన్‌ శత్రువుగా వెలంపల్లి మారారు. దీంతో కోరాడ, కోగంటి కలిసి వెలంపల్లి దూకుడుకు బ్రేక్‌ వేయాలని చూస్తున్నారు.

 

ycp 21022019

పశ్చిమ నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో బీసీ అభ్యర్థిగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్లు కోరాడ ఫౌండేషన్‌ చైర్మన్‌ కోరాడ విజయ్‌కుమార్‌ తెలిపారు. పాత బస్తీ జెండాచెట్టు సమీపంలోని ఆయన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21 నుంచి నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలోనూ బీసీలకు తగిన ప్రాధా న్యం ఇవ్వలేదని, ఈ క్రమంలో పశ్చిమ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిగా పాద యాత్ర చేస్తూ అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార దిశగా ముందుకు సాగుతానని తెలిపారు. నియోజకవర్గంలో 85 శాతం పేదలు, ముఖ్యంగా కొండప్రాంతంలోని ప్రజల జీవనవిధానం పూర్తిస్థాయిలో మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కడప, జిల్లాలో టీడీపీ అభ్యర్థుల తొలిజాబితా దాదాపు రెడీ అయినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పులివెందుల నుంచి సతీష్‌రెడ్డి, జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి, కడప లోక్‌సభ నుంచి మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీ అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇప్పటికే లైన్‌క్లియర్‌ చేశారు. మిగిలిన 8 అసెంబ్లీ స్థానాలు, రాజంపేట లోక్‌సభ అభ్యర్థిత్వంపై పార్టీ అధినేత జిల్లా నేతలతో చర్చలు సాగిస్తున్నారు. కడప లోక్‌సభ పరిధిలో నేతలతో సమీక్ష జరిపేందుకు బుధవారం ఉదయం 7.30 గంటలకు అమరావతిలోని ప్రజావేదికలో జరిగే సమావేశానికి హాజరుకావాలని జిల్లా నేతలకు పిలుపు అందింది. మంగళవారం సాయంత్రమే నేతలంతా అమరావతికి చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల తరువాత రాజంపేట లోక్‌సభ పరిధిలోని కడప, చిత్తూరు జిల్లాల నేతలు హాజరుకావాలని కోరారు. అయితే మంత్రి ఆది రాత్రి 9 గంటలకు అమరావతికి చేరుకోవడంతో మొదట కడప, ఆ తరువాత రాజంపేట లోక్‌సభ సమీక్షలు జరపాలని భావించారు. సీఎం వేరే జిల్లాల సమీక్షలో బిజీగా ఉండడంతో కడప సమీక్షను వాయిదా వేసి రాజంపేట సమీక్ష ఈ రోజు జరిపారు.

kadapa 21022019

రాజంపేట పార్లమెంట్‌ నియోజవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు సీఎం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. పీలేరు-నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట-చెంగల్రాయుడు, రాయచోటి-రమేష్ రెడ్డి, పుంగనూరు-అనూషరెడ్డి, రైల్వే కోడూరు-నరసింహ ప్రసాద్ పేర్లను చంద్రబాబు ప్రకటించారు. మదనపల్లె, తంబాలపల్లె సీట్లపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. కడప లోక్‌సభ పరిధిలోని పులివెందుల, జమ్మలమడుగు అభ్యర్థులు ఖరారుకావడంతో మైదుకూరు అభ్యర్థి ఎంపికపై పెద్దఎత్తున చర్చ సాగుతోంది. మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి మైదుకూరు నుంచి పోటీ చేయించాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. మైదుకూరు ఇన్‌చార్జిగా వున్న పుట్టా సుధాకర్‌యాదవ్‌ను ప్రొద్దుటూరు నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న దానిపై గురువారం చర్చించనున్నారు.

kadapa 21022019

కడప సెగ్మెంట్‌ నుంచి మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అష్రఫ్‌కు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి పేర్లను, బద్వేల్‌లో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సిఫారసు మేరకు లాజరస్‌ పేరును పరిశీలిస్తున్నారు. ఒకటిరెండు రోజుల్లో అధికారికంగా అభ్యర్థుల పేరుతో తొలిజాబితా ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ సమీక్షలో మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమరనాధ్‌రెడ్డి, ఎంపీ సీఎం రమేష్‌, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జయరాములు టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, టీడీపీ నేతలు బత్యాల చెంగల్‌రాయుడు, వరదరాజులరెడ్డి, విజయమ్మ, లింగారెడ్డి పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా కొండవీడులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రైతు కోటయ్య మృతి రాజకీయ దుమారం రేపుతోంది. దీంతో ముందస్తుగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఘర్షణలు లేకుండా జాగ్రత్త పడ్డారు.. యడ్లపాడు మండలం పుట్టకోటలో కొండవీడు కోట ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్న సమయంలో రైతు కోటయ్య మృతి చెందాడు.. ఆ రైతును కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈఘటనపై బీజేపీ, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వమే రైతు ఆత్మహత్యకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి..

pullaro 21022019

రైతు ఆత్మహత్య ఘటనపై నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేసింది వైసీపీ. కొండవీడులో ఈకమిటీ పర్యటించింది. పుట్టకోటకు వెళ్లిన వైసీపీ నిజనిర్థారణ కమిటీ వాహనాలను గ్రామ శివార్లలోనే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో కమిటీ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాహనాలను అక్కడే వదిలేసి గ్రామంలోకి నడుకుంటూ వెళ్లారు.. కోటయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. రైతు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. రైతు మృతికి పోలీసుల వేధింపులే కారణమని ఆరోపించారు వైసీపీ నేతలు.

pullaro 21022019

రైతు మృతిని రాజకీయం చేస్తోందంటూ వైసీపీ తీరుపై మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. కోటయ్య పొలంలో హెలిపాడ్ నిర్మించామని నిరూపిస్తే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని.. లేదంటే జగన్ రాజకీయాలు వదిలేస్తారా అని ప్రత్తిపాటి సవాల్ విసిరారు. ప్రజల్లో టీడీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు మంత్రి నక్కా ఆనందబాబు. రైతు కోటయ్య మృతిపై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కోటయ్య మృతిపై అధికార-విపక్షాలు వెనక్కు తగ్గడం లేదు. రాజకీయ సవాళ్లు విసురుకుంటున్నాయి. ఈ హత్యకు బాధ్యత ప్రభుత్వానిదే అని వైసీపీ ఆరోపిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతోంది. అయితే అదే స్థాయిలో అధికార పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.

వైసీపీ అధినేత జగన్ అమరావతికి ఎప్పుడు షిప్ట్ కాబోతున్నారు. మంగళగిరి మండలం తాడేపల్లి 2వ వార్డు అమరారెడ్డి కాలనీలో రెండెకరాలు భూమిని జగన్ కొనుగోలు చేసి ఇల్లు, ఆఫీస్ ఒకే చోట నిర్మించారు. నిజానికి ఫిబ్రవరి 14న గృహ ప్రవేశం జరగాల్సి ఉంది. అయితే రకరకాల కారణాల వల్ల వాయిదా పడింది. జగన్ ఇల్లు ఎలా ఉన్నా ఇప్పుడు ఇంటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇల్లు, ఆఫీస్ ఎంత విస్తీర్ణంలో నిర్మించారు. ఎలా నిర్మించారన్న చర్చ వినిపిస్తోంది. తాడేపల్లిలో జగన్ ఇల్లు మరో లోటస్‌పాండ్‌లా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత రాజకీయలను చూస్తుంటే జగన్ అమరావతికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

jaganhouse 21022019

చేరికలు, చర్చలు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచే జరుగుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వివిధ పార్టీల నేతల నివాసాలు, పార్టీ ఆఫీసుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, జగన్‌ను కలిశారు. తాను ఫిబ్రవరి 14న ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో గృహప్రవేశం చేస్తున్నానని, ఈ కార్యక్రమానికి రావాలని జగన్‌ ఆహ్వానించారు. ఇందుకు కేసీఆర్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే అనుకోని కారణాల వల్ల గృహప్రవేశ కార్యక్రమం వాయిదా పడింది.

jaganhouse 21022019

ఇప్పటీకే అన్ని పార్టీల ఆఫీసులు అమరావతి కేంద్రంగా నిర్మించుకున్నారు. జగన్ అమరావతిలో ఇల్లు నిర్మించలేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఆయన తన నివాసాన్ని అమరావతిలో నిర్మిస్తున్నారు. రెండు భవనాల్లో మొదటి భవనం వైసీపీ ప్రధాన కార్యాలయంగా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కార్యకర్తలకు, నేతలకు అన్ని సౌకర్యాలు ఉండేలా భవనాలను నిర్మిస్తున్నారు. ఈ భవనాలు రాజధానికి కేవలం పది కిలోమీటర్లు దూరంగా ఉండడం.. జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో ఆ ప్రాంతాన్ని జగన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

 

Advertisements

Latest Articles

Most Read