జమ్మలమడుగు శాసనసభ్యుడుగా వచ్చే ఎన్నికల్లో రామసుబ్బారెడ్డిని గెలిపించే బాధ్యత తనదేనంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. జమ్మలమడుగు నగర పంచాయతీకి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు ఆయన బుధవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా నేను గెలుస్తానో లేదో రామసుబ్బారెడ్డిని మాత్రం జమ్మలమడుగులో గెలిపిస్తానన్నారు. జమ్మలమడుగులో వైసీపీకి కొత్తగా వచ్చిన బిక్షగాడు ముందు తనపై విమర్శలు చేసి, ప్రస్తుతం మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిపై విమర్శలు చేస్తున్నాడన్నారు. జగన్‌ పత్రికలో డొక్కు వార్తలు రాసి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు.

jammalamadugu 21022019 1

జగన్‌మోహన్‌రెడ్డి వాళ్లనాన్న రాజశేఖర్‌రెడ్డి మహానేత అంటుంటారని, మరి రాష్ట్రాన్ని పదింతలు అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఏనేత అని పిలువాలో జగన్‌ ఆలోచించుకుని చెప్పాలన్నారు. తాను ఇటీవల పులివెందులకు ప్రచారానికి వెళ్లానన్నారు. ఎక్కడ చూసినా రైతులకు నీళ్లు రాకూడదని, వర్షం రాకుండా ఉండాలని, ప్రమాదాలు జరగాలని, వీధిలైట్లు వెలగరాదని, డ్వాక్రా వారికి చెక్కులు చెల్లకుండా ఉండాలనే ఆలోచన జగన్‌కు ఉందన్నారు. మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రజలు టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని కోరారు.

jammalamadugu 21022019 1

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇచ్చిన మాట ప్రకారం తామిద్దరం కలిశామని, ఆ తర్వాతనే జమ్మలమడుగు ప్రాంత అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు కేటాయించారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికోసం తాము ఎంతో కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చైౖర్‌పర్సన్‌ తులసి, టీడీపీ నాయకులు జంబాపురం రమణారెడ్డి, వేమనారాయణరెడ్డి, పొన్నపురెడ్డి శివారెడ్డి, వైస్‌చైౖర్మన్‌ ముల్లాజానీ, కమిషనర్‌ లక్ష్మిరాజ్యం, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, తాతిరెడ్డి రోహిత్‌రెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మిదేవి, రజియా, గడ్డవీధి రషీద్‌, సయ్యద్‌, ఉస్మాన్‌, దేవగుడి యూత్‌, ఆర్‌.రామకృష్ణారెడ్డి, కోలా కృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయమంతా ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతోంది. ఫిబ్రవరి 22న ‘మహా నాయకుడు’ విడుదలవుతుండగా, మార్చి నెల మొదటి వారంలో రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలపై అటు సినీ రంగంతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా అత్యంత ఆసక్తి నెలకొంది. అయితే.. ఈ రెండు చిత్రాల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాంగోపాల్ వర్మ వైసీపీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చేందుకే ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌తో తెలిసిపోయింది.

lakshmintr 21022019

పనికిమాలిన దర్శకుడు, ఒక పనికిమాలిన రాజకీయవేత్త డబ్బులుతో, తెలుగు ప్రజలు మాహనుభావుడిగా కొలుచుకునే అన్న ఎన్టీఆర్ ను కించ పరుస్తూ, తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్‌ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు... ఎన్నికల్లో కొత్త తరం ఓటర్లే ఎక్కువని, వారికి ఎన్టీఆర్‌ చరిత్రపై అవగాహన పెంచాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్టీఆర్‌ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు చేస్తున్నారని, కుట్రదారుల దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై, రాంగోపాల్ వర్మపై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కారణజన్ముడు అని, సినిమా, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవలను తెలుగుజాతి మరువదు అని కీర్తించారు.

lakshmintr 21022019

పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ సినిమా పై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పనికిమాలిన దర్శకుడు, ఒక పనికిమాలిన రాజకీయవేత్త డబ్బులుతో, తెలుగు ప్రజలు మాహనుభావుడిగా కొలుచుకునే అన్న ఎన్టీఆర్ ను కించ పరుస్తూ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి, గతంలో జగన్ బావ బ్రదర్ అనిల్ తో, రాంగోపాల్ వర్మ, పార్క్ హయత్ హోటల్ లో చర్చలు జరిపిన విషయం కూడా తెలిసిందే. తరువాత సినిమా ముహూర్తం షాట్‌కు తిరుపతిలో వైసిపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వైసీపీ ప్రముఖ నేతల ఫొటోలతో పోస్టర్లు ఏర్పాటు చేసి, సినిమాకు మద్దతు తెలిపారు. ఈ పోస్టర్లలో విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజాతో సహా ఇతర నేతలను చిత్రించారు. ఒక మహానుభువడి చరిత్రని, ఇలా రాజకీయం కోసం వాడుకుంటున్న వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పాలి...

చంద్రబాబుని సాధించాలి అంటే వాళ్లకు ఉన్న ఒకే ఒక పిల్ల కేసు ఓటుకి నోటు కేసు. అయితే ఇది తెలంగాణా ఏసిబి నుంచి, ఎప్పుడు ఈడీ చేతిలోకి వెళ్లిందో కాని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, ఇప్పుడు మరోసారి ఈడీని రంగంలోకి దించారు. కోడి కత్తి కేసు పై ఎన్ఐఏ చేతులు ఎత్తేయటంతో, ఇప్పుడు ఈ కేసు పట్టుకుని చంద్రబాబుని ఎలా అయినా దీంట్లో దోషిగా చూపించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఈడీ అధికారులు తాజాగా కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. దీంతో నిన్న రేవంత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. గత రెండు రోజులుగా రేవంత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. అయితే ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

revanth 21022019

ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్‌గా ఈడీ ప్రశ్నలు ఉన్నాయని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘కేసీఆర్‌ భుజాలపై తుపాకీ పెట్టి చంద్రబాబును కాల్చాలని మోదీ చూస్తున్నారు. ఈడీ అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. కేసీఆర్‌, మోదీ ఒత్తిడితో ఈడీ అధికారులు పనిచేస్తున్నారు. కేసులో రాజకీయ కుట్ర కనిపిస్తోంది. చంద్రబాబు టార్గెట్‌గా ఈడీ విచారణ ఉంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హైకోర్టు కొట్టేసిన కేసును తిరగదోడుతున్నారు. మంగళవారం నుంచి అడిగిన ప్రశ్నలే అడిగి వేధిస్తున్నారు.’’ అని అన్నారు. ఈడీ అధికారుల గురి అంతా ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపైనే ఉందని, ఆయన్ని లక్ష్యంగా చేసుకుని తనను వేధిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

revanth 21022019

కేసీఆర్‌, మోదీలు కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, హైకోర్టు తీర్పులకు భిన్నంగా ఈడీని ఉసిగొల్పారని ధ్వజమెత్తారు. అడిగిన ప్రశ్నలనే తిరిగి అడుగుతూ ఈడీ అధికారులు తనను వేధింపులకు గురి చేశారన్నారు. విచారణ ముగిశాక రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబును ఈ కేసులో ఇరికించే లక్ష్యంతో ఈడీ అధికారుల ప్రశ్నలున్నాయి. కేసులు పెట్టడం ద్వారా నన్ను వేధించాలని కేసీఆర్‌ చూస్తున్నారు. ఇప్పటికే నాపై 66 కేసులున్నాయి. అందులో ఇదొకటి. ఇవేవీ న్యాయస్థానాల్లో నిలబడవు. ఇది రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదు. కేసుల విచారణకు సహకరిస్తూనే కేసీఆర్‌పై పోరాటం కొనసాగిస్తా. పార్లమెంటు ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా’ అని పేర్కొన్నారు.

నేరస్థులతో పోరాటం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెదేపా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ పడేది నేరస్థులతోనే అని సీఎం చంద్రబాబు తెలిపారు . నేరస్థుల ఆలోచనలు భిన్నంగా ఉంటాయన్నారు. వివిధ మార్గాల్లో దుష్ప్రచారం చేస్తారన్నారు. హత్యలు, దోపిడీలు, దాడులు ప్రత్యర్థుల సంస్కృతి ఆధిక్యం కోసం దేనికైనా దిగజారే పార్టీ వైసీపీ అని, నేరమయ రాజకీయాలకు చిరునామా జగన్ కుటుంబం అని సీఎం దుయ్యబట్టారు. ప్రత్యర్థుల నేరచరిత్ర గుర్తుంచుకొని, ప్రతిపక్షం తప్పుడు పనులను సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. తెదేపా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

cbn jagan 21022019

వాళ్లే సీన్‌ క్రియేట్‌ చేసి దుష్ర్పచారం చేస్తారని నేతలను హెచ్చరించారు. అలాగే ఫోటోలను మార్ఫింగ్‌ చేస్తారని.. వీడియో కటింగ్‌లు చేస్తారని చెప్పారు. అందుకే నేరస్థులతో పోరాటంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. చేయని తప్పులు తమపై రుద్దుతారని, తప్పులు జరిగేలా స్కెచ్‌లు వాళ్లే వేస్తారని దుయ్యబట్టారు. ఒక కన్ను ఎప్పుడూ ప్రతిపక్షంపై ఉండాలని నేతలతో చంద్రబాబు అన్నారు. రాజధానిలో రూ.లక్ష కోట్ల అవినీతి అని దుష్ర్పచారం చేసిన వైసీపీ...ఆ వ్యవహారాన్ని తాను ఖండిస్తే వెనక్కి తగ్గిందని గుర్తుచేశారు. భూములు రైతుల వద్దే ఉంటే అవినీతికి చోటెక్కడ అని ప్రశ్నించారు. రాజధానికి భూములు ఇవ్వకుండా రెచ్చగొట్టారని..రైతులు వినకపోతే విధ్వంసాలకు తెగబడ్డారని ఆయన ఆరోపించారు. రాజధానికి, పోలవరంకు వ్యతిరేకంగా అనేక కేసులు వేశారన్నారు.

cbn jagan 21022019

రాజకీయాల్లో నేరగాళ్లను తెచ్చిన పార్టీ వైసీపీ అని విమర్శించారు. నేరమయ రాజకీయాలకు చిరునామా జగన్‌ కుటుంబమన్నారు. మోదీ, షా, కేసీఆర్‌, జగన్‌ కుమ్మక్కై కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. నలుగురి కుట్రలను ధైర్యంగా ఎదుర్కోవాలని నేతలకు తెలిపారు. కేసీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సామాన్యుల్లో భయం పెంచుతున్నారని అన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ కుట్రల మీద కుట్రలు చేస్తోందని, కులాల మధ్య చిచ్చు పెడుతోందని చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్లమెంటు వారీగా సమీక్షలు చేస్తున్నామన్నారు. నాలుగు ఎంపీ సీట్లలో ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. అన్ని అసెంబ్లీ స్థానాలకు సమన్వయ కమిటీలు, ఏరియా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేశామన్నారు. సమీక్షల సందర్భంగా వీరితో స్వయంగా సీఎం భేటి అవుతారని తెలిపారు. తెదేపా గెలుపులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాక్షించారు. అందరికీ జవాబుదారీతనం ఉండాలన్నారు.

Advertisements

Latest Articles

Most Read