జగన్ చేసిన తప్పుతో, వైసీపీ ఫ్యాన్ గుర్తు కనుమరుగు అవుతుందా ? అవును అనే సమాధానం వస్తుంది. ఇప్పటికే జగన్ చేసిన పొరపాటు పై, ఎలక్షన్ కమిషన్ నోటీస్ కూడా ఇచ్చింది. విషయం ఏమిటంటే, జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ ను తొలగించాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ కోరుతున్నారు. పార్టీ నుండి తనను సస్పెండ్ చేయడంపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లిన శివకుమార్ ముందుగా ఫ్యాన్ గుర్తును ఫ్రీజ్ చేయమని కోరుతానంటున్నారు. వైసీపీ పార్టీ మళ్లీ తిరిగి తనకు వచ్చేదాకా పోరాటం చేస్తానని, ఎన్నికల సంఘంలో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు.

gannvaarma 22022019

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్ఆర్ కాంగ్రెస్) పేరుతో శివకుమార్ అనే లాయర్ స్థాపించి రిజిస్టర్ చేసుకోగా జగన్ మోహన్ రెడ్డి అతని దగ్గర నుండి పార్టీని తీసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షుడిగా జగన్, వ్యవస్థాపకునిగా శివకుమార్ ఉన్నారు. శివకుమార్ తెలంగాణ జనరల్ సెక్రటరీగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు పార్టీలో కూడా అంతే ప్రాధాన్యత ఉంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వైసీపీ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన జగన్ శివకుమార్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దీంతో అప్పుడే జగన్ పై ఘాటుగా స్పందించిన శివకుమార్ బహిష్కరణ ఎత్తివేయాలని లేనిపక్షంలో పార్టీ నుండి జగన్ బయటకు పోవాలి అంటూ అల్టిమేటం జారీచేశారు. దీంతోపాటు న్యాయపోరాటంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించగా ఇప్పుడు జగన్ కు నోటీసులు జారీ చేసింది.

gannvaarma 22022019

వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ సస్పెన్షన్‌పై మార్చి 11లోపు వివరణ ఇవ్వాలని సీఈసీ ఆదేశించింది. కాగా దివంగత రాజశేఖర్ రెడ్డి అభిమాని శివకుమార్.. 2009లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైఎస్‌పై ఉన్న అభిమానంతో ఆ పార్టీని జగన్‌కు అప్పగించారు. అప్పటినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్, గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ కొనసాగుతున్నారు. శివకుమార్ మాత్రం వైసీపీలో క్రియా శీలక కార్యకర్తగా కొనసాగారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు మద్దతివ్వడాన్ని శివకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వైఎస్ జగన్.. శివకుమార్‌ను వైసీపీ నుంచి బహిష్కరించారు. వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన శివకుమార్.. ఆ పార్టీ తనదని, తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.

మొన్న రైతు ఆత్మహత్యని చంద్రబాబుని అంటకట్టటం, నిన్న చింతమనేని కట్ పేస్టు వీడియో, ఈ రోజు చంద్రబాబు దేశ ద్రోహ వ్యాఖ్యలు అంటూ విష ప్రచారం.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, వైసీపీ, తన ఫేక్ ప్రచారానికి పదును పెట్టింది. లోటు పాండ్ లో బీహార్ బ్యాచ్ మొత్తం దిగి, ఈ దొంగ ప్రచారం ఉద్రతం చేసారు. ప్రతి రోజు తెలుగుదేశం పార్టీ ఈ బురద కడుక్కునే పరిస్థితి తెచ్చారు. రాను రాను, ఈ వికృత పోకడులు ఎక్కువ అయ్యే అవకాసం ఉంది. ఇది ఒక్కటే కాదు, రాజకీయంగా కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇదుగో ‘పూసపాటి’..అదిగో ‘పరిటాల’ మరియు గంటాలు వైకాపాలో చేరబోతున్నారని సోషల్‌మీడియాలో ప్రచురితమైన కథనాల వెనుక వైకాపా నేతల ప్రమేయం ఉందని బయటపడింది. గత మూడు,నాలుగు రోజుల నుంచి ఇంకేముంది ‘అశోక్‌గజపతిరాజు’ టిడిపిని వీడి విజయనగరం వైకాపా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.

gannvaarma 22022019

పరిటాల సునీత ఆయన కుమారుడు వైకాపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయడం ఖాయం. మంత్రి గంటా శ్రీనివాసరావు టిడిపిని వీడి వైకాపాలో చేరి ఆయన ఎంపిగా, ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ముగ్గురికి టిడిపిని వీడే అవకాశం లేదు. అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటారే తప్ప..వైకాపాలో చేరే అవకాశమే లేదు. ‘అశోక్‌’ ఎటువంటి నాయకుడో..అందరికీ తెలుసు. తమ కుటుంబానికి ‘చంద్రబాబు’ పెద్దదిక్కు అని..ఆయన మాటే వేదవాక్కు అని ‘పరిటాల సునీత’ చెబుతున్నారు. గతంలో తాను తప్పుచేసి పార్టీని వీడానని..ఇప్పుడు అటువంటి పనిచేయనని మంత్రి గంటా శ్రీనివాసరావు అంటున్నారు. గంటా విషయం పక్కన పెడితే…పరిటాల కుటుంబం, అశోక్‌లు వైకాపాలో చేరతారని ప్రచారం చేయడం ఏమిటి..? జరిగే పనేనా..? ఈ ప్రచారం వెనుక సూత్రధారులు ఎవరు..? పాత్రధారులు..ఎవరు..?

gannvaarma 22022019

దీనిపై ప్రభుత్వం విచారణ చేయలేదు. ఎవరెవరో ఏదో రాసుకుంటారు..అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ‘చంద్రబాబు’ చెప్పడంతో..ఆ ముగ్గురు నాయకులు ఈ కథనాలపై స్పందించడం లేదు. వైఎస్‌ ‘జగన్‌’ను తీవ్రంగా వ్యతిరేకించే ‘పరిటాల’, అశోక్‌లు వైకాపాలో ఏ కారణాలతో చేరతారనే దానిపై సంతృప్తికరమైన జవాబు రావడం లేదు. సోషల్‌మీడియాను ఆయుధంగా మలచుకుని..అనుకూలంగా ముందుకు వెళ్లాల్సిన వైకాపా నేతలు..అదుగో…టిడిపి నేతలు..మంత్రులు వైకాపాలో చేరబోతున్నారని.. దుప్రృచారం చేస్తూ వస్తున్నారు. దీనిపై మంత్రి సునీత పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అశోక్‌కు తెలుగు రాదు..అటువంటి కథనాలను ఆయన అసలు పట్టించుకోరు. తానేమిటో..చంద్రబాబుకు తెలుసు..తన ప్రజలకు తెలుసు..వారిద్దరికి మాత్రమే తాను చెబుతానని..మిగతా వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.

ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుపై కొద్దిరోజులుగా టీడీపీ అధినేత కుస్తీ పడుతుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. అసెంబ్లీ వారీగా కాకుండా పార్లమెంట్‌ స్థానాన్ని యూనిట్‌గా చేసుకుని ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంపీ అభ్యర్థితో పాటు ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికను ఏక కాలంలో చేపట్టనున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా పిలిచి పరిస్థితిని అడిగి తెలుసుకుని, సంబంధిత ఎమ్మెల్యే గురించి నివేదికను అక్కడే చదివి విన్పించి.. బాగా లేకుంటే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థి గురించి సిట్టింగ్‌ ఎమ్మెల్యేల అభిప్రాయం అడగడం ద్వారా ఎంపీ అభ్యర్థి ప్లస్‌, మైనస్‌లను తెలుసుకుంటున్నట్లు సమా చారం.

gannvaarma 22022019

దీంతో పాటు సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేకు సంబంధించి సీటు దక్కేదీ లేనిదీ డైరెక్టుగా చెప్పడం లేదు. ఒక వేళ టిక్కెట్టు దక్కే అవకాశం ఉంటే ‘ వెళ్లి ప్రజల్లో ఉండండి.. పథకాలను, భవిష్యత్‌ పరిస్థితులను వివరించండి. ప్రతి పక్ష నాయకుల మైనస్‌లు గుర్తించి ప్రజలకు వివరించండి.’ అంటున్నట్లు చెబుతున్నారు. టిక్కెట్టు మార్చే యోచన ఉన్న చోట్ల సంబంధిత ఎమ్మెల్యేల సమీక్షలో చివరిగా ప్రజల్లోనే ఉండండి. టిక్కెట్టు ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేయండి అని చెబుతూ పంపిస్తున్నట్లు సమాచారం. ఇలా జరుగుతున్న సమీక్షల గురించి తెలుసుకుంటున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు గుబులు పట్టుకుంది. తమ పరిస్థితి ఏమిటన్నది బేరీజు వేసుకుం టున్నారు..

 

gannvaarma 22022019

ప్రజలకు అందు బాటులో ఉన్నామా, లేదా.. ఎమ్మెల్యేగా పనితీరు పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి ఏ స్థాయిలో ఉంది.. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, వివిధ శాఖల పనితీరును మెరుగు పర్చే దిశగా ఏమైనా కృషి చేశామా.. అని ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంత మందికి సాయం అందజేయగలిగామన్నది కూడా బేరేజు వేసుకుంటున్నారు. అయితే మన జిల్లాలోని కొంత మంది ఎమ్మెల్యేలు ప్రజలకు అంతంత మాత్రంగా అందుబాటులో ఉంటున్న పరిస్థితి ఉంది. అలాగే సెటిల్‌మెంట్లు చేస్తున్న వారూ ఉన్నారు. గ్రూపుల బెడదను ఎదుర్కొంటున్న నాయకులు ఉన్నారు. కొన్ని చోట్ల స్థానిక ప్రజా ప్రతినిధు లుగా ఉన్న ఎంపీపీ, జడ్పీటీసీ, పార్టీ మండల అధ్యక్షులతో పొసగని వారు న్నారు. ఇటీవల కాలంలో జిల్లా టీడీపీలో గ్రూపుల బెడద స్పష్టంగా కన్పిస్తోంది.

కర్నూలు జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉన్న వైసీపీకి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేరాక తమకు ప్రాధాన్యత తగ్గిందని గౌరు దంపతులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా, టికెట్ విషయంలో జగన్ హామీ ఇవ్వలేదని గౌరు వర్గం అలకబూనింది. గౌరు దంపతులు రెండ్రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం. వచ్చే నెల 6న గౌరు ఫ్యామిలీ టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాటసాని పార్టీలో చేరిన సందర్భంలో మీకు పార్టీ టికెట్ దక్కుతుందా అని ఆమెను మీడియా ప్రశ్నించినప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరిగింది.

gannvaarma 22022019

అప్పట్లో ఆమె ఏమన్నారంటే.. జగన్‌తో కొట్లాడైన పాణ్యం టికెట్ తెచ్చుకుంటామని వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో తమ కుటుంబానికి అంత చనువు ఉందని గౌరు చరిత తెలిపారు. అదే ధీమాతో ఎన్నికల ప్రచారం కూడా జోరుగా చేశారు. మరోపక్క పాణ్యం సీటుపై జగన్ తనకు హామీ ఇచ్చారని చెబుతూ కాటసాని కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. గత కొన్ని నెలలుగా జరిగిన పరిణామాల మూలంగా తమకు ప్రాధాన్యం తగ్గిందని గౌరు దంపతులు మనస్తాపం చెందినట్లు తెలిసింది. దీంతో ఇక పార్టీలో ఉండి ప్రయోజనం లేదని భావిస్తున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో ఈ పరిణామం వైసీపీని షాక్‌కు గురిచేసింది. ఇప్పటికే గత ఎన్నికల్లో తమ పార్టీ తరపున గెలుపొందిన భూమా కుటుంబం, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరడంతో పార్టీ బలహీనంగా మారింది.

 

gannvaarma 22022019

గత ఎన్నికల్లో వైసీపీ తరపున పాణ్యం నుంచి గౌరు వెంకట్ రెడ్డి సతీమణి గౌరు చరిత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆ తరువాత పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గిందని గౌరు దంపతులు అసంతృప్తితో ఉన్నారు. కాటసాని వచ్చే ఎన్నికల్లో పాణ్యం టికెట్ ఆశిస్తున్నారు. ఈ అంశంపైనే గౌరు దంపతులు వైసీపీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారని సమాచారం. పాణ్యం టికెట్‌ను మరోసారి గౌరు దంపతులకు కేటాయించే విషయంలో వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. పాణ్యం టికెట్ తమకు రాదనే భావనలో ఉన్న గౌరు దంపతులు... త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కర్నూలు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఓ వైపు కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థుల ఎంపికను చంద్రబాబు ఖరారు చేస్తున్న దశలో... వైసీపీలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisements

Latest Articles

Most Read