సినీ నటుడు నాగార్జున వైసీపీ అధినేత జగన్‌తో భేటీ కావడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున వైసీపీలో చేరనున్నారని కొందరు, నాగార్జునకు గుంటూరు ఎంపీ టికెట్ ఖాయమైందని మరికొందరు, నాగార్జున తనకు కావాల్సిన వ్యక్తి కోసం జగన్‌ను కలిశారని ఇంకొందరు.. ఇలా మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేడు టెలీకాన్ఫరెన్స్‌లో ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. నేరస్థులతో సినీనటుల భేటీ దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన జగన్ లాంటి వ్యక్తులతో నాగార్జున భేటీ కావడం సరైంది కాదని పలువురు టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా రాజకీయ వర్గాల్లో నాగార్జున, జగన్ భేటీ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

nagarjuna 20022019

దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీ హైదరాబాద్ కేంద్రంగా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. దేశ ప్రయోజనాల కోసమే కేంద్రస్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు వివరించారు. రాష్ట్రాల్లో ఎవరి బలాల మేరకు వాళ్లు పోటీ చేస్తారని చెప్పారు. ఏపీకి ద్రోహం చేసి నేటికి ఐదేళ్లు అని... నమ్మకద్రోహాన్ని నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని నేతలను ఆదేశించారు. ప్రత్యేక హోదా సహా మిగిలిన ఐదు హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఆర్ధికలోటులో నాలుగో వంతు కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యాత్ర చేస్తోందని, రాష్ట్రంలో ఆ పార్టీ విషయంలో మనం స్పష్టతతో ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

nagarjuna 20022019

దేశ ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్ర స్థాయిలో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాక్ స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో రాజకీయ లబ్ధి దాగి ఉందా? అనే అనుమానం దేశవ్యాప్తంగా బలపడుతోందని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే భాజపా రిమోట్ కంట్రోల్‌లో ఉందని తెలిపారు. కృష్ణా జిల్లా నేతల్లో చాలా వరకూ గొడవలు లేకుండా ఎవరి పరిధిలో వారు పని చేసుకుంటున్నారని కితాబిచ్చారు. పేదల సంక్షేమానికి అందరూ కలిసి రావాలని సీఎం పిలుపునిచ్చారు. పనిచేసే వారికే ప్రజా దీవెనలు ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 20... సరిగ్గా ఈ రోజుకు ఏపీకి ద్రోహం చేసి 5 ఏళ్లు అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. నమ్మక ద్రోహానికి ఐదో వార్షికానికి నిరసనలు జరపాలని సూచించారు. 5 కోట్ల మందిని నమ్మించి మోసం చేసి 5 ఏళ్లు అయ్యిందని, ప్రత్యేక హాదాతో సహా మిగిలిన 5 హామీలు గాలికి వదిలేశారన్నారు. రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీ ఇవ్వలేదని, వెనుకబడిన జిల్లాలకిచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నారని ఆక్షేపించారు. భాజపా నమ్మక ద్రోహాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలన్నారు. జాతీయస్థాయిలో భాజపాయేతర పార్టీలతో కలిసి పనిచేస్తామని మరోమారు స్పష్టం చేశారు.

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మో‌హన్‌రెడ్డితో టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున భేటీ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం లోటస్‌పాండ్‌‌కు వెళ్లిన నాగార్జున.. సుమారు అరగంటకు పైగా జగన్‌‌తో భేటీ అయి పలు విషయాలపై చర్చించారు. త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరీ ముఖ్యంగా వైసీపీ తరఫున గుంటూరు ఎంపీగా నాగార్జున పోటీ చేస్తారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే భేటీ అనంతరం నాగ్ మీడియాతో మాట్లాడుకుండానే వెళ్లిపోయారు. ప్రస్తుతం జగన్-నాగ్‌ భేటీ అటు ఏపీ రాజకీయాల్లో.. ఇటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

galla 19022019

అయితే ఈ భేటీపై.. ఫస్ట్ టైం నాగార్జున పెదవి విప్పారు. వైఎస్ జగన్ మా కుటుంబ సన్నిహితుడని.. మర్యాద పూర్వకంగానే కలిశానని ఆయన స్పష్టం చేశారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని నాగ్ మరోసారి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ను విజయవంతంగా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు నాగార్జున చెప్పారు. తాను ఎవరికో టికెట్ ఇప్పించాలని జగన్‌ను కలిశానని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని ఆయన కొట్టి పారేశారు. ఎవరికో టికెట్ ఇవ్వాలని సంప్రదించాల్సిన అవసరం తనకు లేదని నాగార్జున చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే భేటీ అనంతరం వచ్చిన పుకార్లకు నాగ్ ఫుల్‌‌స్టాప్ పెట్టేశారని చెప్పుకోవచ్చు.

galla 19022019

అయితే అంతకు ముందు, మీడియా ఈ విషయం పై గల్లాను ప్రశ్నించింది. " నాగార్జున నాకు మంచి స్నేహితుడు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు నాతో అనలేదు. జగన్‌ను ఎందుకు కలిశారో కూడా నాకు తెలియదు. ప్రత్యర్థులు ఎవరైనా పోటీ ఎప్పుడూ ఉంటుంది. అమ్మ పోటీ చేసిన 4 ఎన్నికలు చూశాను.. కానీ ఈసారి జరగబోతున్న ఎన్నికలు పూర్తిగా భిన్నం. ఏపీ ప్రభుత్వంపై నెగటివ్‌ ఓటు లేదు.. పూర్తి పాజిటివ్‌ ఓటు ఉంది. అభ్యర్థుల ఎంపికలో సీఎందే తుది నిర్ణయం" అని గల్లా జయదేవ్‌ చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే ప్రత్యర్థులు ఎవరైనా సరే తాను మాత్రం పోటీ చేసి తీరుతానని గల్లా పరోక్షంగా వ్యాఖ్యానించారు. మరో పక్క, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, ‘నార్నె’ సంస్థల అధినేత నార్నె శ్రీనివాసరావు ఇటీవలే వైసీపీ అధినేత జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. వైసీపీలో ఆయన చేరతారని, గుంటూరు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఈ విషయమై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ని మీడియా ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ తరపున మీపై నార్నె శ్రీనివాసరావు పోటీ చేస్తారని చెబుతున్నారని..’ అని అడగగా, ‘ఎవరినైనా రానీయండి. నేను మొదటిసారిగా ఇక్కడి నుంచి పోటీ చేసింది, ‘విన్నింగ్ సీటు, విన్నింగ్ ప్లేస్’ అని రాలేదు. గుంటూరు అంటే మా మామగారి ఊరు... కాబట్టి ఇక్కడికి వచ్చాను ఎన్నికలు ఎక్కడైనా కష్టంగానే ఉంటాయి. ముందు నుంచి కష్టపడితేనే గెలుపు వస్తుంది’అని జయదేవ్ చెప్పుకొచ్చారు.

తండ్రి శవం పక్కన ఉంచుకుని ముఖ్యమంత్రి కుర్చీ కోసం రాజకీయం చేసిన వాడికి, సామాన్య ప్రజలు రాజకీయం చెయ్యటం ఒక లెక్కా ? రాబందులు శవం కోసం తాపత్రయ పడినట్టు, మన ప్రతి పక్ష నాయకుడు కూడా ఎక్కడ శవం దొరుకుతుందా, దాంతో రాజకీయం చేద్దామా అని చూడటమే. కొండవీడు కోట ముగింపు ఉత్సవాల సందర్భంగా కోటేశ్వరరావు అనే రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై, ఈ రోజు సాక్షి పేపర్ లోనే కాదు, ఏకంగా జగన్ కూడా పోలీసులు రైతుని కొట్టి చంపేశారు అంటూ ట్వీట్ చేసారు. ఈ ఆరోపణలను గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఖండించారు. మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ... కోటేశ్వరరావు అనే రైతు తన పొలం వెనుకవైపు ప్రాంతంలో ఎండ్రిన్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ ఘటనపై పోలీసు విచారణ జరుగుతోందని చెప్పారు. పోలీసు శాఖను నిందిస్తూ, గౌరవానికి భంగం కలిగిస్తూ విష ప్రచారం జరుగుతోందని... అందుకే తాను మీడియా సమావేశం పెట్టానని తెలిపారు. రైతు అనుమతితోనే ముందుభాగంలో ఉన్న 4 ఎకరాల భూమిని కంట్రోల్ లోకి తీసుకోవడం జరిగిందని ఎస్పీ చెప్పారు. పురుగుల మందు తాగిన సమయంలో అతని పక్కన పున్నారావు అనే పాలేరు ఉన్నాడని... ఘటన జరిగిన వెంటనే పక్కనే ఉన్న వందలాది మంది పోలీసులకు చెప్పకుండా మృతుడి కుమారుడికి పున్నారావు ఫోన్ చేసి చెప్పాడని తెలిపారు.

దాదాపు 25, 30 నిమిషాల వరకు పోలీసులకు ఈ విషయమే తెలియదని అన్నారు. అతని కుమారుడు బైక్ పై ఘటనా స్థలికి వచ్చాడని... వాస్తవానికి సభ ఉన్న నేపథ్యంలో బైక్ లను ఆ స్థలానికి అనుమతించలేదని... కానీ, తన తండ్రి పురుగుమందు తాగాడని చెప్పడంతో పోలీసులు అతన్ని ఆపకుండా పంపించారని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పురుగుమందు తాగిన వ్యక్తిని పోలీసులు భుజాన వేసుకుని వచ్చారని, దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని చెప్పారు. అతన్ని కాపాడాలనే తాపత్రయంలో పక్కనే ఉన్న విద్యుత్ శాఖకు చెందిన వాహనాన్ని పొలంలోకి తీసుకెళ్లడం జరిగిందని... ఈ క్రమంలో రెండుమూడు లైన్ల కనకాంబరం మొక్కలు పాడయ్యాయని ఎస్పీ చెప్పారు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా దురదృష్టవశాత్తు కాపాడలేకపోయామని తెలిపారు. ఇంత చేసినా పోలీసులపై చాలా దారుణంగా దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారని మండిపడ్డారు. పోలీసులు తప్పు చేస్తే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదని... శాఖాపరంగా తామే శిక్షిస్తామని చెప్పారు. రెండు రోజుల క్రితం చిన్న తప్పు చేసిన ఒక ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేశామని... సత్తెనపల్లిలో డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై క్రిమినల్ కేసులు పెట్టి, సస్పెండ్ చేశామని తెలిపారు. పోలీసు శాఖ నిబద్ధత ఇదని చెప్పారు. ఈ ఘటనపై కూడా డీఎస్పీ స్థాయి అధికారి చేత విచారణ చేయిస్తామని తెలిపారు.

రైతును పోలీసులు కొట్టి చంపారనే విషప్రచారానికి తెరలేపారని... సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఎవరు కొట్టి చంపారని ఎస్పీ ప్రశ్నించారు. హెలిపాడ్ కోసం రైతు పొలం తీసుకున్నారనే ప్రచారం కూడా చేస్తున్నారని... వాస్తవానికి రైతు పొలానికి, హెలిప్యాడ్ కు అర కిలోమీటర్ పైగా దూరం ఉందని చెప్పారు. పురుగుమందు తాగి చనిపోయాడని పాలేరు పున్నారావే చెబుతున్నాడని అన్నారు. కనకాంబరం పంటను పోలీసులు తొక్కేశారంటూ మరో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తోటలో ముందువైపు కొంచెం బొప్పాయి తోట ఉందని... తోటలోకి ఎవరూ రాకుండా చూడాలని మృతుడి భార్య కోరితే... మైక్ లో అనౌన్స్ మెంట్ చేయడం కూడా జరిగిందని చెప్పారు. విపరీతమైన ఎండ ఉన్న కారణంగా సేద తీరేందుకు కొందరు చెట్ల కిందకు వెళ్లి ఉండవచ్చని తెలిపారు. జరిగింది ఇదైతే... పోలీసులు కొట్టి చంపారని, కనకాంబరాల పంట నాశనం చేశారని, బొప్పాయి కోసేశారని ఇష్టమొచ్చినట్టు విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఒక 50 బొప్పాయిలు కోసినా... వాటి విలువ రూ. 500 ఉంటుందని... ఈ మాత్రానికే మనస్తాపం చెంది ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా? అని ప్రశ్నించారు. ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. పోలీస్ శాఖను నిర్వీర్యం చేయాలనే పనులను మానుకోవాలని... పోలీసు శాఖ నిర్వీర్యమైతే సమాజం మొత్తం నిర్వీర్యమవుతుందని రాజశేఖర్ బాబు అన్నారు. విషయం తెలిసిన వెంటనే అప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారని... దాన్ని కూడా ఇష్యూ చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. పని కట్టుకుని దుష్ప్రచారం చేయవద్దని కోరారు. పోలీసులు కొట్టారనే విషయాన్ని ఎవరైనా చూశారా? అని ప్రశ్నించారు. పక్కనున్న పున్నారావు కూడా పోలీసులు కొట్టారని చెప్పడం లేదని అన్నారు. మనమంతా ఎటు పోతున్నామని అసహనం వ్యక్తం చేశారు. కోటేశ్వరరావు పోస్ట్ మార్టంను కూడా వీడియో షూట్ చేయించామని చెప్పారు.

ఏపీ భవన్‌ క్యాంటిన్‌కు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చారు. రాహుల్‌కు టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్‌ స్వాగతం పలికారు. ఏపీ పర్యటనకు ముందు రాహుల్‌ ఏపీ భవన్‌ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 22న తిరుపతిలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. ఏపీ పీసీసీ ఆధ్వర్యంలో ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’ చేపట్టింది. ఈ యాత్రలో రాహుల్ పాల్గొననున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఈ నెల 19 నుంచి 13 జిల్లాల్లో ప్రత్యేకహోదా భరోసా యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా 22న రాహుల్‌గాంధీ వస్తున్న సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అమలు చేస్తానని ప్రధాని మోడీ మాట ఇచ్చి తప్పిన ప్రాంతమైన తిరుపతిలోనే రాహుల్‌ ప్రత్యేకహోదా భరోసా యాత్ర లో పాల్గొననుండడం విశేషం.

rahul 19022019 2

ఇక ఎన్ని కలు సమీపిస్తున్న వేళ.. ప్రజల్లోకి చొచ్చు కు వెళ్లేందుకు గాను కాంగ్రెస్‌ సమస్త అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్ర విభజన పాపాన్ని మూట గట్టుకున్న కాంగ్రెస్‌ 2014లో మట్టికరచింది. అప్పటితో పోలిస్తే ఇపుడు కొంతమేర పరిస్థితి మెరుగుపడిందన్న విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో యూపీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధానిగా రాహుల్‌గాంధీ తొలి సంతకం ఏపీకీ ప్రత్యేక హోదాపైనే ఉంటుందని స్వయంగా రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఈ ప్రకటనను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో కాంగ్రెస్‌ కొంతమేర ముందుకు వెళ్లింది. ఇదే క్రమంలో ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర పేరుతో మంగళవారం నుంచి బస్సు యాత్ర చేపట్టనుంది.

rahul 19022019 3

ఈ సందర్భంగా 13 జిల్లాల నుంచి కాంగ్రెస్‌ నేతలు అనంతపురానికి ఇప్పటికే చేరుకున్నారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 13 రోజుల పాటు 13 జిల్లాల్లో నిర్వహించనున్న ఈ యాత్ర మార్చి 3వ తేదీన ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. మొత్తం 2251 కిలోమీటర్ల పొడవునా జరుగనున్న ఈ యాత్ర సందర్భంగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 22వ తేదీన తిరుపతి రానున్నారు. రాహుల్‌ రాక సందర్భంగా 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా మడకశిరలో ప్రారంభమయ్యే భరోసా యాత్రకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమన్‌చాందీ, కర్ణాటక మంత్రి శివకుమార్‌ , ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరన్‌తో పాటు ఏపి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా హాజరవుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read