మనం ఎంతో మంది పార్టీ మారే వాళ్ళని చూసి ఉంటాం..మారేది పదవుల కోసమే అయినా, ఎన్నో నీతి సూక్తులు చెప్తూ, నేనే అభినవ గాంధీ అన్నంత బిల్డ్ అప్ ఇస్తూ ఉంటారు. చివరకు ఆమంచి లాంటి వాడు కూడా పార్టీ మారుతూ వివేకానందుడి నీతులు చెప్తూ, నేనే అవినీతికి వ్యతిరేకంగా అందుకే అవినీతి పై పోరాటం చేస్తున్న జగన్ వద్దకు వచ్చి, అవినీతి పై యుద్ధం చేస్తా అని చెప్పాడంటే, ఛీ జీవితం అనిపించదు. అయితే, ఈ రోజు పార్టీ మారిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు మాత్రం, ఉన్నది ఉన్నట్టు చెప్పుకొచ్చారు. అయితే వెంటనే లోటస్ పాండ్ నుంచి ఆదేశాలు రావటంతో మాట మార్చారు అనుకోండి అది వేరే విషయం. జగన్ ను కలవక ముందు, జగన్ ను కలిసిన తరువాత, ఆయన మాటలు మారిపోయాయి.
జగన్ ను కలవక ముందు, పార్టీ మారడానికి గల కారణాన్ని ఆయన మీడియాకు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో అమలాపురం ఎంపీ టికెట్ ఇవ్వబోమని టీడీపీ స్పష్టం చేసిందని, అందుకే పార్టీ మారుతున్నట్లు ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంలో రవీంద్రబాబు స్పష్టం చేశారు. ఇంత స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నువ్వు సరిగ్గా పని చెయ్యలేదు, ప్రజలలో మీ మీద సరైన అభిప్రాయం లేదు, మీకు టికెట్ లేదు, పార్టీ కోసం పని చెయ్యండి అని చెప్తే, ఇలాంటి వాళ్ళని తన పార్టీలో చేర్చుకున్న జగన్, ఎదో సాధించినట్టు చెప్తున్నాడు. అయితే జగన్ ని కలవక ముందు మాత్రం ఉన్న మాట చెప్పేసిన రవింద్ర బాబు, జగన్ ను కలిసి వచ్చిన తరువాత ట్యూన్ మార్చారు.
టీడీపీని వీడి వైసీపీలోకి చేరగానే చీరాల ఎమ్మెల్యే ఆమంచి, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీ అధినేత చంద్రబాబుపైన, ఆ పార్టీపైన తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు నేతలు వైసీపీలో చేరగానే టీడీపీలో కులాధిపత్యం పెరిగిపోయిందంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు అదే బాటలో అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా చంద్రబాబుపై, టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు.ఒక సామాజిక వర్గానికి మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం మేలు చేస్తోందని, చంద్రబాబు వద్ద ఒక్కో కులానికి ఒక్కో ఆర్మీ ఉంటుందని విమర్శించారు. జగన్ ని కలవక ముందు మాత్రం, నాకు సీటు రావటం లేదని చెప్పారు, అందుకే జగన్ దగ్గరకు వచ్చాను అని చెప్పి, లోటస్ పాండ్ నుంచి బయటకు వచ్చి, ఇలా నీతులు చెప్తున్నాడు.