ఏపీ పై మరోసారి కుట్ర జరుగుతోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నవారిని, ఎమ్మెల్యేలు, ఎంపీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇది దారుణమైన కుట్రని దీని వల్ల నష్టపోతామని చంద్రబాబు చెప్పారు. టీఆర్ఎస్‌తో అంటకాగే వైసీపీ వాళ్లు ఏపీలో గెలిస్తే నీళ్లు కూడా రావన్నారు. అరవై ఏళ్ల శ్రమను హైదరాబాద్‌లో వదిలేసి వచ్చామని, విభజన తర్వాత అండగా ఉంటామన్న కేంద్రం మాట తప్పిందని చంద్రబాబు ఆరోపించారు. ‘‘తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యేలను, ఎంపీలను పార్టీ మారాలని బెదిరిస్తున్నారు. లేకుంటే ఆస్తులు స్వాధీనం చేసుకుంటామంటున్నారు. మీ బెదిరింపులకు మేం బెదరం! ఒకవేళ ఎవరైనా వాళ్ల బెదిరింపులకు లొంగి రాష్ట్రంలో సమస్యలు సృష్టించాలని చూస్తే సహించేదిలేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.

cbn 21022019

నవ్యాంధ్రపై మరో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించినందుకు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు బుధవారం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, విపక్ష నేత జగన్‌ పేర్లను ప్రస్తావించకుండానే పరోక్ష విమర్శలు చేశారు. ‘‘తెలంగాణలో పది ఎకరాలున్న నాయకుడిని, కాలేజీలు ఉన్న మరో నాయకుడిని, ఫంక్షన్‌ హాలు ఉన్న నాయకుడిని బెదిరిస్తున్నారు. కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న వారిని, రాజకీయ నాయకుల్ని, పార్టీలు మారమని ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అవసరమైతే హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులను వదులుకుంటాం.. కానీ ఆత్మాభిమానం వదులుకోం’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

cbn 21022019

పోలవరంపై సుప్రీంకోర్టులో కేసులు వేసిన వారితో రాష్ట్రంలో ఉన్న కొన్ని పార్టీలు లాలూచీ పడుతున్నాయని పరోక్షంగా వైసీపీపై మండిపడ్డారు. ఇటువంటి వారిని గెలిపిస్తే నవ్యాంధ్రకు నీళ్లు కూడా రావని చంద్రబాబు అన్నారు. ‘‘మనలో మనకు విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు. పక్కనున్న తమిళనాడు, కర్ణాటకతో ఎటువంటి ఇబ్బంది లేదు. తెలంగాణ ప్రభుత్వంతోనే సమస్యలు వస్తున్నాయి’’ అని అన్నారు. కొండవీడులో రైతు ఆవేశంలో ఆత్మహత్య చేసుకుంటే, దానిని పోలీసులపై నెట్టేయాలని చూస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనతో తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీని అభివృద్ధి పర్చుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీతో స్నేహం చేశామని... ఆ పార్టీ నమ్మించి మోసం చేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలు అమలు చేయనందునే కేంద్రంతో విభేదించామని తెలిపారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ సస్పెన్షన్‌పై మార్చి 11లోపు వివరణ ఇవ్వాలని సీఈసీ ఆదేశించింది. కాగా దివంగత రాజశేఖర్ రెడ్డి అభిమాని శివకుమార్.. 2009లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైఎస్‌పై ఉన్న అభిమానంతో ఆ పార్టీని జగన్‌కు అప్పగించారు. అప్పటినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్, గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ కొనసాగుతున్నారు. శివకుమార్ మాత్రం వైసీపీలో క్రియా శీలక కార్యకర్తగా కొనసాగారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు మద్దతివ్వడాన్ని శివకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు.

notice 202022019

దీంతో వైఎస్ జగన్.. శివకుమార్‌ను వైసీపీ నుంచి బహిష్కరించారు. వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన శివకుమార్.. ఆ పార్టీ తనదని, తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని నేనే స్థాపించాను. నేను స్థాపించిన పార్టీలోనే నాకు అన్యాయం జరుగుతోంది. నాకు న్యాయం చేయండి’ అని శివకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఒక వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివ కుమార్‌ను వైసీపీ నుంచి బహిష్కరించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి టీఆర్‌స్ ను ఓడించాలని శివకుమార్‌ పిలుపునివ్వడం వైసీపీ అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడంతో పాటు ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించారు. దాని పై ఆయన ఒక వినతిపత్రాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అందచేశారు.

notice 202022019

నాకు వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నోటీస్‌ పంపలేదు. నా వివరణ కోరలేదు. అన్యాయంగా బయటకు పంపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిపై చర్య తీసుకొనే అధికారం న్యాయబద్ధంగా ఎవరికీ లేదు. అయినా తీసుకొన్నారు. దీనిపై విచారణ జరిపి వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిగా నా పదవిని పునరుద్ధరించాలి. తుది నిర్ణయం జరిగే వరకూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా హోదాను పునరుద్ధరించాలి. నాకు న్యాయం చేయాలి’ అని శివకుమార్‌ తన వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్, జగన్ మోహన్ రెడ్డికి నోటీసులు పంపించింది. మరి దీని పై జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి...

దేశమంతా తిరిగి కబురులు చెప్పే బీజేపీ ఆంధ్రప్రదేశ్‌పై మాత్రం పట్టు సాధించలేకపోతోంది. సరికదా.. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ముందుకు రావడమే కష్టంగా మారింది. అంతెందుకు ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలే ఇందుకు సుముఖంగా లేరు. ప్రత్యేక హోదా/ప్యాకేజీ ఇవ్వకపోవడం, విభజన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొనడమే దీనికి కారణం. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో 13 అసెంబ్లీ స్థానాల్లో, నాలుగు లోక్‌సభ సీట్లలో బీజేపీ పోటీచేసింది. కానీ నాలుగు అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. పదేళ్లు కాంగ్రెస్‌ ఎంపీగా ఉండి.. ఎనిమిదేళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి సైతం రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు. నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు, విశాఖ నుంచి కంభంపాటి హరిబాబు ఎంపీలుగా విజయం సాధించారు.

bjp 20022019

బీజేపీపై జనాగ్రహంతో పాటు రాష్ట్ర నాయకత్వం శ్రీకాకుళం జిల్లా నుంచి బస్సుయాత్ర చేపట్టి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను ఆహ్వానిస్తే కనీసం వంద మంది కూడా రాని దుస్థితి. ఈ పరిస్థితుల్ని అంచనా వేసిన ఎంపీలు హరిబాబు, గంగరాజు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేరని పార్టీలో ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తల్లి వైఎస్‌ విజయలక్ష్మిపై విశాఖపట్నంలో లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన హరిబాబు ఆ సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ రైల్వే జోన్‌. కేంద్రం ఆ ఊసే ఎత్తడంలేదు. దీనిపై సానుకూల స్పందన కూడా లేకపోవడంతో గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంలేదు. తప్పక పాల్గొన్నా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గంగరాజుకు నేరుగా అమిత్‌ షాతోనే సత్సంబంధాలున్నాయి. కానీ రాష్ట్ర నాయకత్వంతో సఖ్యత లేని కారణంగా.. ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

bjp 20022019

అంతేగాక.. తన కుమారుడిని వైసీపీలోకి పంపి.. నరసాపురం లోక్‌సభ టికెట్‌ ఖరారుచేయించుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పురందేశ్వరి ఈ సారి బీజేపీ తరపున ఎక్కడ పోటీ చేస్తారన్నది తెలియరాలేదు. కానీ ఆమె కుమారుడు హితేశ్‌, భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవలే వైసీపీలోకి వెళ్లారు. హితేశ్‌కు ప్రకాశం జిల్లా పరుచూరు అసెంబ్లీ సీటు ఖరారైందని కూడా తెలిసింది. దీనిపై పార్టీలోని ఒక వర్గం అభ్యంతరం చెబుతోంది. కుటుంబ సభ్యులతో కూడా ఓట్లు వేయించుకోలేని వ్యక్తి పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చని పార్టీలోకి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో రాజమహేంద్రవరం అర్బన్‌ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరిపోయారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌..ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోనని సభాముఖంగానే ప్రకటించారు. బీజేఎల్పీ నేతగా ఉన్న విష్ణుకుమార్‌రాజు.. వేరే పార్టీలో చేరి పోటీచేయనున్నట్లు గట్టి ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలింది తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావు మాత్రమే. పార్టీ ఆదేశిస్తే పోటీకి ఆయన సంసిద్ధంగానే ఉన్నారు.

 

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెదేపా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ మారుతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా..పార్టీ మారే అంశంపై త్రిమూర్తులు స్పష్టత ఇవ్వలేదు. కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తెదేపాను వీడి వైకాపాలో చేరే ముందు త్రిమూర్తులుతో భేటీ అయ్యారు. తాజాగా మంత్రి తలసానితో హైదరాబాద్‌లో త్రిమూర్తులు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

talasani 202022019

తలసాని మాట్లాడుతూ ‘‘ఏపీలో నా పర్యటన కొనసాగుతాయి. నేను పర్యటిస్తుంటే చంద్రబాబుకు భయమెందుకు. నాకు అక్కడ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు ఉన్నారు. నా నియోజకవర్గంలో ప్రచారం చేసి నన్ను ఓడించేందుకు కుట్రలు చేసిన చంద్రబాబుపై కచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నేతలను బెదిరించి వైసీపీలో చేర్పిస్తున్నారని టీడీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితం.’’ అని అన్నారు. మరో పక్క, ఒక హాట్ న్యూస్, హల్ చల్ చేస్తుంది. తెలంగాణ లో స్థిరపడ్డ ఆంధ్ర కి చెందిన పారిశ్రామిక వేత్తలను టార్గెట్ గా తెరాస పావులు కదుపుతుంది. అత్యధిక పారిశ్రామిక వేతలు తెలుగు దేశం సింపటైజర్స్ అవ్వగా వారి అందరిపై ఈడీ, ఇన్కమ్ టాక్స్ ఉపయోగించటానికి రంగం సిద్ధం చేసిన తెరాస అధినేత కెసిఆర్.

talasani 202022019

ఈ కోవ లో తెలుగు దేశం వైపు ఉన్న పారిశ్రామిక వేతలని భయభ్రఅంతులకి గురిచేసి వారిని వైస్సార్సీపీ కి సపోర్ట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గెలుపే ద్యేయంగా కుట్ర రాజకీయాలకి తేర తీస్తున్నారు. ఈ నెల 27,28 తారీకులలో భారీ ఎత్తున ఐటీశాఖ ఆంధ్ర పారిశ్రామిక వేతలపై దాడులు చేయబోతున్నట్టు సమాచారం. తెలుగు దేశం లో ఉన్న క్రియాశీలక నేతలని కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ ఆస్తుల మీద దాడి చేసి తద్వారా పార్టీ ని వీడేలా ప్రణాళికలు తెరాస అధినేత రూపొందిస్తున్నారు. హెరిటేజ్ సంస్థల కార్యకలాపాల్ని తెలంగాణ లో ఆపి వేయటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం.

Advertisements

Latest Articles

Most Read