చర్మకారులకు మెరుగైన జీవనోపాధి కలిపించే లక్ష్యంతో లిడ్ కాప్ మొబైల్ కార్గో వ్యాన్ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద శనివారం సాయంత్రం లిడ్‌క్యాప్ మొబైల్ కార్గో వాహనాలకు జెండా ఊపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన చర్మకారులకు మెరుగైన జీవనోపాధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ముగ్గురు లబ్ధిదారులు ఒక యూనిట్‌గా ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. యూనిట్ ధర రూ. 8.12 లక్షల్లో లబ్ధిదారుల వాటాగా 20 శాతం చెల్లించాలి, మిగిలిన 80 శాతం లిడ్ క్యాప్ నిబంధనలుకు లోబడి రుణాన్ని 9 శాతం వడ్డీతో అందజేస్తారు.

polit 17022019

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పరిధిలో 415 మొబైల్ కార్గో వాహనాలు అందజేస్తారు. ముగ్గురు లబ్ధిదారులు 21 సంవత్సరాల వయస్సు పైబడి, 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి. వారిలో ఒకరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. తొలిదశలో 100 వాహనాలు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. రోడ్డుపక్కన వృత్తి చేసుకునే వారి సౌలభ్యం కోసం దేశంలోనే తొలి సారిగా ఇటువంటి పథకాన్ని ముఖ్యమంత్రి రూపకల్పన చేశారు. ఈ వర్గాల వారిని పైకి తీసుకుని వచ్చేందుకు, సమాజంలో గౌరవాన్ని పెంచేలా వారికి వాహనం, మొబైల్ ఫోన్, వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా మొబైల్ యాప్ సేవలను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

polit 17022019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తోళ్ల పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే ఈ పథకానికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, చెన్నైలోని కేంద్ర తోళ్ల పరిశోధన సంస్థ సహకారంతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి నక్కా ఆనందబాబు, లిడ్ కాప్ వీసీ, ఎండీ ఎం సాధుసుందర్, చైర్మన్ చిత్రం.. గూడూరు ఎరిక్సన్‌బాబు, జీఎం మధుసూధనరావు, డైరెక్టర్ ఎస్ రవీంద్రవర్మలు పాల్గొన్నారు.

మారుతున్న కాలానుగుణంగా ప్రయణీకుల అవసరాలను గుర్తించిన ఏపీఎస్‌ఆర్‌టీసీ రూ.156 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 681 బస్సులను కొనుగోలు చేస్తోంది. మూడు, నాలుగు దశల్లో ఈ బస్సులన్నీ రోడ్డెక్కబోతున్నాయి. ఇప్పటికే 210 బస్సులు రాగా వీటి పనితీరును శుక్రవారం పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ ప్రాంగణంలో మీడియాకు ప్రదర్శించారు. ఇటీవలే ఏసీ బస్సుల కోవలో 84 స్లీపర్, సీటర్, స్లీపర్ కం సీటర్ బస్సులను రోడ్డెక్కించిన విషయం తెలిసిందే. ఇక కొత్తగా రూ.20 కోట్లతో 94 తెలుగు వెలుగు బస్సులు, 13 కోట్లతో 60 అల్ట్రా తెలుగు బస్సులు, రూ.14 కోట్లతో 75 సిటీ ఆర్డినరీ బస్సులు, రూ.52 కోట్లతో 57 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు, రూ.42 కోట్లతో 170 సూపర్ లగ్జరీ బస్సులు, రూ.33 కోట్లతో 136 అల్ట్రాడీలక్స్ బస్సులు, రూ.19 కోట్లతో 89 ఎక్స్‌ప్రెస్ బస్సులను కొనుగోలు చేస్తున్నారు.

polit 17022019

ఈ బస్సులన్నింటా అత్యాధునిక సౌకర్యలున్నాయి. ప్రధానంగా సామాన్యులు ప్రయాణించే తెలుగు వెలుగు బస్సులో న్యూమాటిక్ డోర్లు, విశాలమైన డిక్కీ సౌకర్యం, కండక్టర్ల సింగిల్ సీటు సౌకర్యం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కో డోర్‌కు రూ.25వేలు ఖర్చయింది. ఇక డ్రైవర్లు తాము కూర్చొన్న చోటు నుంచే డోర్లు వాటంతటవే మూసుకునేలా తెరచుకునేలా ఆపరేట్ చేస్తారు. తెలుగు వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో చివరి భాగంలో రెండు టైర్లు మధ్యలో విశాలంగా మూడు వైపులా ఖాళీ సౌకర్యం ఏర్పాటు చేశారు. దీనివల్ల చిరు వ్యాపారులు పెద్దమొత్తంలో కూడా కార్గో రవాణాను చేసుకోవచ్చు. దీనివల్ల మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు పొందవచ్చు.

విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా దాసరి జైరమేష్... ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కాని, అసలు ఎవరూ ఈ మనిషి అని విజయవాడ అంతా ఆలోచిస్తుంది. ఎప్పుడో ఎన్టీఆర్ టైంలో ఈయన పార్టీకి ఫండింగ్ చేసారు. అప్పటి నుంచి నాదెండ్ల, దగ్గుబాటి లాగా, తెలుగుదేశం పార్టీ పెట్టింది నేనే అని చెప్పుకుంటూ ఉంటారు. పార్టీకి ఫండింగ్ ఇచ్చింది వాస్తవమే కాని, ఈయన ఎప్పుడూ ఫీల్డ్ లో తిరిగింది లేదు. సొంత క్యాడర్ లేదు. దాసరి బలవర్ధాన్ రావు అన్నగానే ఎక్కువ తెలుసు. అయితే, ఈయన దగ్గుబాటి దగ్గర స్నేహితుడిగా, చంద్రబాబు పై ఎప్పుడూ అసంతృప్తి వాదిగానే ఉండేవారు. 2014లో వంశీకి సీట్ ఇచ్చిన సమయంలో, దాసరి బలవర్ధాన్ రావుతో జరిగిన ఒప్పందం ప్రకారం, దాసరి జై రమేష్ కు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచరం జరిగింది.

polit 17022019

అప్పటి నుంచి ఈయన అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ఇక తన ఫ్రెండ్ దగ్గుబాటి జగన్ పంచన చేరి, చంద్రబాబుని సాదించటంతో, తాను కూడా అక్కడకి వెళ్లి చంద్రబాబుని సాదిద్దాం అనుకున్నారు. అందుకే జగన్ పక్కన చేరారు. ఈయన చంద్రబాబు సామాజికవర్గం, డబ్బు బాగా ఉండటంతో, జగన ఆయన్ను విజయవాడ ఎంపీగా నిలబెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే మొన్న జగన్ ను కలిసినప్పుడే, ఆయనను చాలా మంది చూసారు. అంతకు ముందు వరకు జై రమేష్ అనే పేరు వినటమే కాని, ప్రజలు ఆయనను చూసింది లేదు. పెద్ద తరం వారికి ఆయన తెలిసి ఉండవచ్చు కాని, రెండో తరంలో కొంత మందికి, మూడో తరంలో చాలా మందికి ఈయన ఎవరో కూడా తెలియదు.

polit 17022019

అలాంటి ఈయన కేశినేని నాని పై పోటీ చేస్తారట..కేశినేని నాని పై, విజయవాడ ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది. దీంతో వైసీపీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఈ సారి కూడా మళ్ళీ కేశినేని నాని గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున కోనేరు రాజేంద్ర ప్రసాద్, టీడీపీ తరుపున కేశినేని నాని పోటీ చేశారు. అయితే కేశినేని విజయం సాధించారు. దీంతో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కోనేరు రాజేంద్రప్రసాద్ దాదాపు రాజకీయాల్లో నుంచి తప్పుకున్నట్లే. ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ గత ఎన్నికల్లో డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టారు. దాదాపు 80 నుంచి వంద కోట్ల వరకు ఖర్చు పెట్టారని ప్రచారం జరిగింది. ఇప్పుడు జై రమేష్ వంతు.. అప్పట్లోనే ప్రజలు కేశినేనిని నమ్మారు. ఇప్పుడు కేశినేనికి తాను చేసిన అభివృద్ధి కూడా తోడయ్యింది. ఇలాంటి ప్రత్యర్ధులతో ఇక కేశినేనికి ఎదురు లేనట్టే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఎపుడు ఎన్నికల ముందు వరకు అభ్యర్ధులను ప్రకటించిన చంద్రబాబు, ఇప్పుడు వంద రోజుల ముందే అభ్యర్ధులని ప్రకటించి షాక్ ఇవ్వనున్నారా ? అవును అనే అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. రానున్న లోక్‌సభ, శాసనసభ స్థానాలకు జరుగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు టీడీపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈనెల 22, 23 తేదీల నాటికి వంద నుంచి 110 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా ఎలాంటి వివాదం లేని స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఉంటారని ఆయన అన్నారు. సుమారు 20 లోక్‌సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం.

polit 17022019

మొదటి జాబితాలో దాదాపు అన్ని జిల్లాల నుంచి అభ్యర్థులు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరు, విశాఖపట్టణం వంటి జిల్లాల్లో అత్యధిక స్థానాలు ఉంటాయని అనుకుంటున్నారు. తొలి జాబితా ప్రకటించిన వెంటనే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఇటీవలి కాలంలో వలసలు పెరగడానికి కారణం అభ్యర్థుల జాబితా సిద్దం కావడమేనన్న చర్చ జరుగుతోంది. పార్టీలో పోటీచేసే అవకాశం లేదని నిర్థారణకు వచ్చిన వారు క్రమేణా, మరో పార్టీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

polit 17022019

సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 30 నుంచి 35 మందికి తొలి జాబితాలోనే స్థానం దక్కవచ్చని భావిస్తున్నారు. అలాగే వైసీపీ నుండి వచ్చిన 20 మందికి పైగా ఎమ్మెల్యేలలో దాదాపు 15 మంది మరోమారు టీడీపీ తరపున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. వివాదాలు, అభ్యర్థులు ఎక్కువగా ఆశిస్తున్న స్థానాలకు సంబంధించి 60-70 స్థానాలు ఉంటాయని, వాటికి సంబంధించి ఆయా స్థానాల నేతలు జిల్లా స్థాయి నేతలు, పొలిట్‌బ్యూరోలు ఒకటికి రెండుసార్లు చర్చించిన మీదటే అభ్యర్థులను ఖరారు చేయాలని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే మరోవారం రోజుల్లో టీడీపీ తొలి జాబితా విడుదల ఖాయమని భావిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read