తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెంట ఇద్దరు చోటా నేతలు మాత్రమే నడిచారు. వారిలో ఒకరు దేవరాపల్లి ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు కాగా మరొకరు అనకాపల్లి మాజీ కౌన్సిలర్‌ తాడి రామకృష్ణ. ఐదేళ్లపాటు ఎంపీగా పనిచేసిన వ్యక్తి పార్టీ మారితే, పట్టుమని పది మంది కూడా ఆయన వెంట నడవకపోడాన్నిబట్టి చూస్తే ముత్తంశెట్టికి ప్రజా బలం ఏ మాత్రం వుందో అర్థం చేసుకోవచ్చని నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు అంటున్నారు. ముత్తంశెట్టి వెళ్లిపోతే టీడీపీకి ఎటువంటి నష్టం లేదని, అంతిమంగా ఆయన నష్టపోయి పశ్చాతాపం చెందుతారని వ్యాఖ్యానిస్తున్నారు.

avanti 150022019

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు గతంలో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నప్పుడు అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన వేలాది మంది కార్యకర్తలు టీడీపీని వీడొద్దని ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ ఆయన పట్టించుకోకుండా వైసీపీలో చేరారు. తరువాత అక్కడ ఇమడలేక బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. కానీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలో చేరుతుంటే.... వద్దని ప్రాధేయపడేవారు ఒక్కరు కూడా కనిపించలేదు. అనకాపల్లి బైపాస్‌ రోడ్డులోని ఎంపీ కార్యాలయానికి గురువారం ఎవరూ రాలేదు.

avanti 150022019

దేవరాపల్లి ఎంపీపీ కిలపర్తి వైసీపీలో చేరిక... తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు గురువారం ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి వైసీపీలో చేరారు. ఆది నుంచీ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కిలపర్తి భాస్కరరావు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీ పూర్తిగా బలహీనపడడంతో రాజకీయ మనుగడ కోసం తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్ల ఎంపీటీసీ సభ్యునిగా గెలిచి, ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే కొద్ది రోజుల నుంచి టీడీపీకి దూరంగా వుంటున్నారు. ఇప్పుడు ఎంపీ ముత్తంశెట్టితో కలిసి వైసీపీలో చేరారు.

‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని నేనే స్థాపించాను. నేను స్థాపించిన పార్టీలోనే నాకు అన్యాయం జరుగుతోంది. నాకు న్యాయం చేయండి’ అని వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఒక వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివ కుమార్‌ను వైసీపీ నుంచి బహిష్కరించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి టీఆర్‌స్ ను ఓడించాలని శివకుమార్‌ పిలుపునివ్వడం వైసీపీ అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడంతో పాటు ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించారు. దాని పై ఆయన ఒక వినతిపత్రాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అందచేశారు.

jagna 15022019

‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలతో ప్రభావితమై ఆయన మరణం తర్వాత 2010లో యువజన శ్రామిక రైతు(వైఎ్‌సఆర్‌) కాంగ్రెస్‌ పార్టీని స్థాపించాను. ఎన్నికల కమిషన్‌ కూడా గుర్తింపు ఇచ్చింది. ఆ తర్వాత వైఎస్‌ తనయుడు జగన్‌ నాతో మాట్లాడారు. రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు ఈ పార్టీని వినియోగించుకొందామని ప్రతిపాదించారు. నేను అంగీకరించాను. ఆయనను పార్టీ అధ్యక్షునిగా చేశాను. పార్టీ ఆశయాల నుంచి దూరం జరగరాదని, పార్టీ ఉన్నంత కాలం నాకు తగిన గౌరవం ఇవ్వాలని కోరాను. దానికి ఆయన అంగీకరించారు. కానీ ఆకస్మికంగా గత ఏడాది డిసెంబర్‌ నాలుగో తేదీన నాపై చర్య తీసుకొంటున్నట్లు ఎవరి సంతకం లేకుండా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

jagna 15022019

నాకు వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నోటీస్‌ పంపలేదు. నా వివరణ కోరలేదు. అన్యాయంగా బయటకు పంపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిపై చర్య తీసుకొనే అధికారం న్యాయబద్ధంగా ఎవరికీ లేదు. అయినా తీసుకొన్నారు. దీనిపై విచారణ జరిపి వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిగా నా పదవిని పునరుద్ధరించాలి. తుది నిర్ణయం జరిగే వరకూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా హోదాను పునరుద్ధరించాలి. నాకు న్యాయం చేయాలి’ అని శివకుమార్‌ తన వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు.

 

 

ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు పోషకాహారలోపాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘గిరి ఆహార పోషణ’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా 6రకాల పోషకాలు ఉండే రూ.532 విలువైన ఆహారబుట్టను ఒక్కో గిరిజన కుటుంబానికి మార్చి 1వ తేదీ నుంచి ప్రతి నెలా ఉచితంగా ఇవ్వనుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబునాయుడు బుధవారం సచివాలయంలో ప్రారంభించారు. ప్రస్తుతం బాలింతలు, చిన్నారులకు గిరి గోరుముద్దలు, అన్న అమృతహస్తం వంటి పథకాలను అమలు చేస్తోంది. ఈ కొత్త పథకం మొత్తం ఐటీడీఏల పరిధిలోని గిరిజనుల కోసమని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు గంధం చంద్రుడు ‘ఈనాడు’కు తెలిపారు. ఆహారబుట్టల కొనుగోలు, పంపిణీ బాధ్యత పౌరసరఫరాల శాఖకు అప్పగించామని చెప్పారు.

food basket 15022019 2

ఒక్కో బుట్టకు అయ్యే వ్యయం: రూ.532 ఎవరికి ఇస్తారు: 7 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలోని గిరిజన కుటుంబాలకు, గిరిజన జనాభా 40శాతం కన్నా అధికంగా ఉన్న వివిధ జిల్లాల్లోని 41 మండలాల్లోని వారికి. అర్హత: కుటుంబాలకు తెల్లరేషన్‌కార్డుంటే చాలు. ఎన్ని ఇస్తారు: కుటుంబానికి 1 చొప్పున. ఆదిమ తెగలకు (పీవీటీజీ) నెలకు 2 చొప్పున. ఎక్కడ ఇస్తారు: ఐటీడీఏల పరిధిలోని రేషన్‌ దుకాణాలు, గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఆధీనంలోని డీఆర్‌ డిపోల ద్వారా అందిస్తారు. ఎంత మందికి: ప్రతి నెలా మొత్తం 2,00,668 కుటుంబాలకు లబ్ధి. ఎందుకోసమంటే: నిరక్షరాస్యత, పేదరికం, పోషకాహారంపై సరైన అవగాహన లేని కారణంగా ఐటీడీఏల పరిధిలోని గిరిజనులు త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు.

food basket 15022019 3

రక్తహీనత వంటి సమస్య ఎక్కువగా ఉంటోంది. జీవనకాలం కూడా తక్కువగా ఉంటోంది. వీరందరికీ సరైన సమయంలో పోషకాహారాన్ని అందిస్తే వారి జీవన ప్రమాణ స్థాయి పెంచవచ్చన్న ఉద్దేశంతో జాతీయ పోషకాహార సంస్థ సూచించిన ప్రకారం వీటిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎంత వ్యయం: పతి నెలా ఆహారబుట్టలు ఇవ్వడానికి రూ.10.67 కోట్ల వ్యయం అవుతోంది. 2018-19 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.120 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రావణ్‌ తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన పలువురు లబ్ధిదారులకు ఆహారబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెలా రేషన్‌ సరకులతో పాటే వీటిని అందిస్తామని వెల్లడించారు.

మోడీ, కేసీఆర్, జగన్ ల కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీ నేతలతో జరిగిన టెలికాన్పరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ… రాష్ట్రాభివృద్ది కోసం మనం కేంద్రంతో యుద్ధం చేస్తున్నామన్నారు. బంధుత్వాలు వేరు.. పార్టీ వేరు అనే స్ఫూర్తి అందరిలో రావాలన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కాకూడదనేదే ముగ్గిరి ఆలోచన అని, ముగ్గురి కుట్రలను ప్రజాక్షఏత్రంలో ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను మించి అమరావతి అభివృద్ధి చెందితే మనుగడ ఉండదనేది వారి భయమన్నారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం.. కేంద్రంతో చేసే యుద్ధంలో గెలుపే మన లక్ష్యం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

avanti 15022019

కేసీఆర్, మోదీ ఇద్దరినీ జగన్ కాదనలేరని, ఎందుకంటే ఇద్దరిలో ఎవరిని కాదన్నా జగన్ వెంటనే జైలుకు వెళ్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం.. కేంద్రంతో చేసే యుద్ధంలో గెలుపే మన లక్ష్యం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయని...అందుకే ఆయనను బెదిరించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మొన్న తనతో ఢిల్లీలో తిరిగి నిన్న వెళ్లారంటే ఏమనాలని ప్రశ్నించారు. స్థానిక పరిస్థితులు నేతలకు తెలుస్తుంటాయని, పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు ఎక్కడ జరుగుతున్నా చెప్పాలని తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టే పనులను ఆ వర్గం నేతలే ఖండించాలని ఆదేశించారు. తమ కుటుంబంలోనూ పురందేశ్వరి బీజేపీలో, దగ్గుపాటి వైసీపీలో ఉన్నారన్నారు. బంధుత్వాలు వేరు, పార్టీ వేరు అనే స్ఫూర్తి అందరిలో రావాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

avanti 15022019

ఎన్నికల ముందు కూటమి అసాధ్యం అన్నారని, తాము ముందస్తుగా కూటమి ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమితో బీజేపీ నేతలకు భయం పట్టుకుందని, అందుకే కుట్రలు, కుతంత్రాలు పెంచారని విమర్శించారు. ఏపీకి అన్యాయం జరిగిందని అన్ని కమిటీలు చెప్పాయని ఆయన తెలిపారు. అరకొర విపత్తు సాయాన్ని మొయిలీ కమిటీ నిలదీసిందని అన్నారు. తితలీ తుఫాను పరిహారం సగానికి తగ్గించడాన్ని ప్రశ్నించిందని చెప్పారు. విపత్తు సాయం ఏటా 15శాతం పెంచాలని మొయిలీ కమిటి చెప్పిందని పేర్కొన్నారు. హుద్‌హుద్‌ పరిహారం ఇంకా రూ.400 కోట్లు రావాలన్నారు. కేరళకు దుబాయ్‌ సాయం చేస్తానంటే కేంద్రం అడ్డుకుందని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వదని.. ఇతరులను సాయం చేయనివ్వదని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Advertisements

Latest Articles

Most Read