చీరాల నియోజకవర్గంలో పరిస్థితులకు అనుగుణంగా ఆగమేఘాలపై పోలీసు అధికారులను బదిలీ చేయటం విశేషం. పోలీసు యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని తప్పుడు కేసులతో తమను వేధించారని స్థానిక తెలుగుదేశం శ్రేణులు పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అక్కడి అధికారుల బదిలీకి శ్రీకారం పలికారు. బుధవారం రాత్రే ఇద్దరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేసి కొత్తవారిని నియమించారు. గురువారం ఉదయం తొలిగంటలోనే డీఎస్పీ బదిలీ జరిగింది. ఎమ్మెల్యే ఆమంచి సిఫార్సుతో సుమారు ఆరునెలల క్రితం శ్రీనివాసరావు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అతనిని మార్చి నాగరాజుని డీఎస్పీగా నియమించారు.

amanchi 152019

తొలిరోజుల్లో చీరాల ఎస్‌ఐగా కూడా పనిచేసి ఆ ప్రాంతంపై ప్రత్యేక అవగాహన ఉన్నందునే తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న నాగరాజుని చీరాలకు బదిలీ చేసినట్లు భావిస్తున్నారు. రెవెన్యూ శాఖలో కూడా కొన్ని బదిలీలకు శ్రీకారం పలికారు. మున్ముందు ఆమంచి యంత్రాంగం అండతో వ్యవహారాలు సాగించకుండా కట్టడి చేసే లక్ష్యంతోనే ఈ బదిలీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబుని కలిసిన సందర్భంలో కూడా తనపై ఉన్న ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులు సహా మొత్తం 20 కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రిని ఆమంచి కోరారని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో తనపై పెరిగిపోయిన వ్యతిరేకత మూలంగా ఓటమి ఎదురైతే అప్పుడు కేసులు ఇబ్బంది పెడతాయి కాబట్టి ఇప్పుడే వాటి ని ఎత్తేయించుకోవలని ఆమంచి ప్రయత్నించారు.

amanchi 152019

అయితే కేసులు ఎత్తేయడం కుదిరే పని కాదు కాబట్టి సీఎం సున్నితంగా ఆమంచి డిమాండు ను తోసి పుచ్చారని సమాచారం. పైగా ఇప్పటికైనా రౌడీయిజాన్నీ మానుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది. దాంతో నియోజకవర్గంలో తన విచ్చలవిడితనానికి తన రౌడీయిజానికి సహకరించట్లేదని తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరారు. తన అన్న కొడుకు మీద కేసు పెట్టించిన దగ్గుబాటి చేరిన గూటిలోనే ఆమంచి కూడా చేరారు. ఈ విషయంపై ఆయన కుటుంబంలో అభిప్రాయ భేదాలు వచ్చినట్టు తెలుస్తుంది. తన కుమారుడిపై కేసు పెట్టిన దగ్గుబాటి తో ఎలా కలిసి పనిచేస్తామని ఆమంచి కృష్ణమోహన్ అన్న స్వాములు ప్రశ్నించినట్టు సమాచారం. ఆమంచి ఎమ్మెల్యేగా ఉన్న పదేళ్ల కాలంలో పోలీసులను చేతిలో పెట్టుకొని అక్రమాలు చేసిన కృష్ణమోహన్ తెలుగుదేశం పాలనలో పోలీసుల తన మాట వినడం లేదని వైసీపీలోకి వెళ్లిపోయారు.

కర్నూలు జిల్లా రాజకీయం రోజురోజూకు వేడెక్కుతోంది. కోట్ల కుటుంబ తెదేపాలో చేరేందుకు సిద్ధమవ్వడంతో ఒక్కసారిగా సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెదేపా తరపున కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగడం దాదాపు ఖరారైంది. కందనవోలుపై పూర్తి ఆధిపత్యం కలిగిన కోట్ల కుటుంబం ఇక్కడి నుంచి తొమ్మిది సార్లు ఎన్నికల్లో విజయం సాధించింది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కడ డిపాజిట్లు దక్కకపోయినా సూర్య ప్రకాశ్‌రెడ్డి 1.16లక్షల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలవడం.. కోట్ల కుటుంబంపై ఇక్కడి ప్రజలకు ఉన్న మమకారానికి నిదర్శనం. జిల్లాలో కోట్ల కుటుంబానికి మంచి పేరు ఉండడంతోపాటు వారికంటూ సొంతవర్గం ఉంది. కోట్ల కుటుంబం ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ పార్టీలోకి వెళ్లినా వర్గమంతా ఆ కుటుంబం వెన్నంటి ఉంటారు. తెదేపా నుంచి ఆయన విజయం నల్లేరుపై నడకేనని అధికార పార్టీ ధీమా వ్యక్తంచేస్తోంది.

kurnool 15022019

మరోపక్క కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని ఎదుర్కొనే దీటైన వ్యక్తి కోసం వైకాపా అన్వేషిస్తోంది. మొన్నటి దాక కోట్ల వైసీపీలో చేరతారని జగన్ రెలాక్ష్ అయ్యారు. కాని కోట్ల జగన్ కు జర్క్ ఇచ్చి, తెలుగుదేశంలో చేరారు. ఈ అనూహ్య పరిణామంతో జగన్ దిక్కుతోచక కూర్చున్నారు.. దీంతో కర్నూలు ఎంపీ టికెట్‌ బీసీ అభ్యర్థికి ఇస్తామని జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. బీసీల్లో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న దానిపై తర్జనభర్జనలు నడుస్తున్నాయి. వాల్మీకి ఓట్లు ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాలో ఇదే సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తే ఎలా ఉంటుందనే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. వైకాపా నుంచి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బీవై రామయ్య టికెట్‌ ఆశిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసి వైకాపాలో చేరారు.

kurnool 15022019

గత ఎన్నికల్లో వైకాపా నుంచి విజయం సాధించిన బుట్టా రేణుక రాజకీయాలకు కొత్త అయినా.. కింది స్థాయి కార్యకర్తలు సమష్టిగా పనిచేసి ఆమె విజయానికి కారకులయ్యారు. ఈసారి అదే ఓటు బ్యాంకు తమను గెలిపిస్తుందని వైకాపా ధీమాగా ఉంది. జిల్లాలో రెండు వర్గాలు ఉన్నచోట్ల కేఈ కుటుంబాలు కలిసి పనిచేస్తే తెదేపా బలం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కర్నూలు సీటుపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిన జగన్‌ కోట్లను ఢీకొట్టే బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. కర్నూలులోని ఆయుష్మాన్‌ ఆసుపత్రి అధినేత సంజీవ్‌కుమార్‌ వైకాపా సీటు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంటు అభ్యర్థిని త్వరగా తేల్చేస్తే క్షేత్ర స్థాయిలో పనిచేసేందుకు సమయం దొరుకుతుందని వైకాపా నేతలు భావిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఈరోజు సాయంత్రమే అసెంబ్లీ కార్యదర్శికి సోమిరెడ్డి రాజీనామా పత్రం అందించనున్నారు. కాగా సోమిరెడ్డి వచ్చే ఎన్నికలలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుండి పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. గత ఎన్నికలలో సర్వేపల్లి నుండే పోటీచేసి వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డ్డి మీద ఐదువేల మెజార్టీతో ఓడిపోయారు. అయినా చంద్రబాబు సోమిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రిగా ఐదేళ్లు నియోజకవర్గంలో పట్టు సాధించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంతో ఈసారి గెలుపు తధ్యం అని పేర్కొన్నారు.

somireddy 15022019 2

సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పలువురు టీడీపీ, వైకాపా నేతలు తమతమ మాతృపార్టీలకు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్‌లు రాజీనామా చేయగా, వైకాపా నుంచి వంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు శుక్రవారం రాజీనామాలు చేశారు. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. అయితే ఈ సారి నెల్లూరు జిల్లాలో ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు... ఇందుకోసం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు.

somireddy 15022019 3

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికే అభ్యర్థులందరిని పేర్లను ఖరారు చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత... తాజాగా అన్నీ సెట్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఈ సారి నెల్లూరు రూరల్ స్థానం నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. ఆదాల అభ్యర్థన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనేతలకు కూడా చంద్రబాబు వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి నారాయణ... రాబోయే ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే కొన్నేళ్లుగా ఆయన నెల్లూరు సిటీపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మంత్రిగా రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులను కలుపుకుని ముందుకు సాగుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుల్లో నారాయణ ఒకరు కావడంతో... నెల్లూరు అర్బన్ సీటు ఈ సారి ఆయనకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

చదువులో మంచి ప్రతిభ చూపి ఉత్తీర్ణులై డాక్టర్లుగా జీవితంలో స్థిరపడాలని ఫాతిమా బాధిత విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఫాతిమా బాధిత విద్యార్థులకు రూ.13 కోట్ల మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫాతిమా వైద్య విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఉండవల్లిలోని నివాసంలో ఫాతిమా వైద్య విద్యార్థులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. మంత్రులు ఫరూఖ్, ఆదినారాయణరెడ్డి, కడప తెదేపా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డిల వెంట ఫాతిమా వైద్య విద్యార్థులు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు.

phatima 15022019

కడప ఫాతిమా వైద్య కళాశాల బాధిత విద్యార్థులకు ‘రీఎంబర్స్‌మెంట్‌’ కింద రూ.13 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులివ్వడంలో ఉదారత, మానవతాదృక్పథంతో వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫాతిమా వైద్య విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. 2015-16 సంవత్సరంలో చేరిన ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులను కొన్ని సాంకేతిక కారణాలతో సంబంధిత కాలేజీని అనర్హత కింద నిషేధించారు. అప్పటి నుంచి ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు పలు పోరాటాలు చేసినా ఫలితం లేకపోయింది. ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వచ్చారు.

phatima 15022019

ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల బంగారు భవిషత్తును తీర్చిదిద్దడానికి చొరవ తీసుకున్నారు. ఫలితంగా 2018 నీట్‌లో అర్హత సాధించి ‘బి’ కేటగిరిలో చేరినట్లయితే వారికి రెండేళ్ల పాటు ఈ రూ.13కోట్ల నుంచి ఫీజు చెల్లించడానికి నిర్ణయించారు. ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల అంశాన్ని ప్రత్యేక కేసు కింద ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిధుల ద్వారా ఈ చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. తదుపరి పరిణామంలో నీట్ లో ఉత్తీర్ణత సాధించిన 42 ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల రెండు సంవత్సరాల ఫీజు కింద రూ.13 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

Advertisements

Latest Articles

Most Read