ఏపీ సీఎం చంద్రబాబు గురువారం విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అదాని డేటా సెంట‌ర్ పార్క్‌కు భూమిపూజ చేయనున్నారు. ప్రపంచంలోనే తొలి ఎకోఫ్రెండ్లీ డేటాసెంట‌ర్ పార్క్ కావడం విశేషం. ఈ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుతో అదాని గ్రూప్‌ దాదాపు ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పించ‌నుంది. వివిధ ద‌శ‌ల్లో రూ.70 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టనుంది అదాని గ్రూప్‌. వివిధ ద‌శ‌ల్లో రూ.70 వేల కోట్ల పెట్టుబ‌డులు విశాఖ కేంద్రంగా మ‌రో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పించే అదాని డేటా సెంట‌ర్ పార్క్‌కు గురువారం కాపులుప్పాడ ఐటీ పార్క్ వ‌ద్ద భూమి పూజ నిర్వ‌హించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అదాని మ్యానేజింగ్ డైరెక్టర్ రాజేష్ అదానిలతోపాటు ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

data park 15022019 2

అదాని గ్రూప్‌తో ఒప్పందం జ‌రిగిన స‌రిగ్గా నెల‌రోజుల్లోనే డేటా సెంట‌ర్ పార్క్ ఏర్పాటుకు భూమి పూజ జ‌ర‌గ‌డం విశేషం. జ‌న‌వ‌రి 9న ఒప్పందం జ‌ర‌గ్గా..ఫిబ్ర‌వ‌రి14న కంపెనీ నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌డం ఒక రికార్డు. ఈ ఘ‌న‌త పంచాయ‌తీరాజ్‌, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ కృషి వ‌ల్ల మాత్ర‌మే సాధ్య‌మైంది. దేశానికే డేటా హబ్ గా మారనున్న ఏపీ మంత్రి లోకేష్ కృషితో వ‌చ్చిన అదాని డేటా సెంట‌ర్ పార్క్ ఏర్పాటుతో దేశానికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ డేటా హ‌బ్‌గా మార‌నుంది. ఇర‌వై ఏళ్ల‌లో ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పించే ఈ సెంట‌ర్ కోసం అదానీ గ్రూప్ 70 వేల కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డులు పెట్ట‌నుంది. విశాఖపట్నంలోని 500 ఎకరాల్లో మూడు ప్రాంతాల్లో 1 గిగా వాట్ డేటా సెంటర్ అదాని గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఇది ప్రపంచంలోనే మొట్ట‌మొదటి పర్యావరణహిత డేటా సెంటర్ పార్క్. ఇందులో భాగంగా 5 గిగా వాట్స్ సోలార్ పార్క్ ని కూడా నెల‌కొల్ప‌నున్నారు.

data park 15022019 3

ఈ డేటా సెంటర్ ని ఇంటర్నెట్ కేబుల్ లాండింగ్ స్టేషన్ తో అనుసంధానించ‌డం ద్వారా దేశవ్యాప్తంగా మెరుగైన ఇంట‌ర్నెట్ సేవ‌లు అందించే కీల‌క కేంద్రంగా ఏపీ మార‌నుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, హార్డ్ వేర్ సప్ల‌యర్స్,సాఫ్ట్ వేర్ ,స్టార్ట్ అప్, టెలికాం కంపెనీలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదాని గ్రూప్‌ని ఒప్పించిన లోకేశ్‌.. అదాని గ్రూప్ డేటా సెంట‌ర్ ఏర్పాటు ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని తెలుసుకున్న ఐటీ మంత్రి నారా లోకేశ్‌.. ఏపీలో అమ‌లు చేస్తున్న క్లౌడ్‌హ‌బ్ పాల‌సీని కంపెనీ ప్ర‌తినిధుల‌కు వివ‌రించారు. ద‌ఫ‌ద‌ఫాలుగా వారితో చ‌ర్చించారు. డేటా సెంటర్ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్ తక్కువ ధరకే ఏపీలో అందుబాటులో ఉండటం, ఇంటర్నెట్ లాండింగ్ కేబుల్, మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో పాటు భూములు కేటాయింపు..ఆగ‌మేఘాల‌పై అనుమ‌తులు మంజూరు వంటి అంశాల‌తో అదాని గ్రూప్‌...ఒప్పందం చేసుకున్న నెల‌రోజుల్లోనే డేటా పార్క్‌కు భూమిపూజ చేస్తోంది.

అందాల విశాఖ‌తీరం..ఐటీ మ‌ణిహారంగా భాసిల్లుతోంది. మిలీనియం ట‌వ‌ర్ ప్రారంభంతో ఐటీలో మ‌రోమైలురాయికి విశాఖ చేరుకోనుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ టెక్నాల‌జీ, క‌మ్యూనికేష‌న్ల శాఖ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మ‌ధుర‌వాడ హిల్ నెంబ‌ర్ 3లో నిర్మాణం పూర్తి చేసుకున్న మిలీనియం ట‌వ‌ర్ ని గురువారం ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ హాజ‌ర‌య్యారు. మిలీనియం ట‌వ‌ర్‌లో ఏర్పాటైన‌ కాడ్యుయెంట్ కంపెనీ త‌న కార్య‌క‌లాపాలను లాంఛ‌నంగా ప్రారంభించింది. కాడ్యుయెంట్‌లో 1600 మందికి ఉద్యోగాలు క‌ల్పించారు. ఏడాదిలోగా 4,500 మందికి ఉద్యోగాలు క‌ల్ప‌నే ల‌క్ష్యమ‌ని కంపెనీ ప్ర‌క‌టించింది.

millineum tower 15022019 2

నాలుగు ఎక‌రాల విస్తీర్ణంలో రూ.145 కోట్ల‌తో నిర్మించిన మిలీనియం ట‌వ‌ర్ ని ఏడంత‌స్తుల‌లో నిర్మించారు. విశాఖ అందాల‌కు ధీటుగా స‌ర్వాంగ‌సుంద‌రంగా నిర్మాణం పూర్తి చేసుకున్న మిలీనియం ట‌వ‌ర్ ..ఏపీలో ఐటీ రంగ అభివృద్ధికి ఐకాన్‌గా నిల‌వ‌నుంది. ఈ ట‌వ‌ర్‌లోనే కాడ్యుయెంట్ కంపెనీ కార్య‌క‌లాపాలు కూడా ఆరంభం కానున్నాయి. తొలి ద‌శ‌లో 1600 మందికి ఉద్యోగుల‌తో మొద‌లై...ఏడాదిలోగా 4,500 మందికి ఉద్యోగాలు క‌ల్ప‌న ల‌క్ష్యంగా కంపెనీ ప్ర‌క‌టించింది. నాలుగు ఎక‌రాల విస్తీర్ణంలో రూ.145 కోట్ల‌తో నిర్మించిన మిలీనియం ట‌వ‌ర్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఏడంత‌స్తులుగా నిర్మించారు.ఈ ట‌వ‌ర్‌లో కాడ్యుయెంట్ కంపెనీ కార్య‌క‌లాపాలు కొన‌సాగనున్నాయి.

millineum tower 15022019 3

2 ల‌క్ష‌ల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో అత్యంత సుంద‌రంగా రూపుదిద్దుకున్న ఈ ట‌వ‌ర్ ప్రారంభానికి ముస్తాబ‌య్యింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని తిరుగులేని శ‌క్తిగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషితో ఒక్కో కంపెనీ ఏపీ బాట ప‌డుతోంది. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీలు ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఏపీ ఐటీ రాజ‌ధానిగా పేరుప‌డిన విశాఖ‌లో ఒకే రోజు అదాని డేటా పార్క్‌కు భూమి పూజ‌, మిలీనియం ట‌వ‌ర్ ప్రారంభం, ఇందులోనే కాడ్యుయెంట్ కంపెనీ కార్య‌క‌లాపాల ఆరంభం కానుండ‌టంతో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు.. దేశంలోనే అత్యంత ఉన్నతంగా రూపు.. అందరి దృష్టి మన వైపు.. అదే భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఆశయం. సకల హంగులతో ప్రతిష్టాత్మకంగా నిర్మించదలచిన అంతర్జాతీయ విమానాశ్రయం మన రాష్ట్రంలో.. అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పించిన ఈ ప్రాజెక్టుకు తొలి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తికావచ్చింది. ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది... గురువారం దిబ్బపాలెంలో విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పునాదిరాయి పడింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు అనుకూలంగా భోగాపురం విమానాశ్రయాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన విజయనగరం జిల్లా భోగాపురం జిల్లా దిబ్బపాలెం వద్ద అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఏపీని పర్యాటరంగంగా అభివృద్ధిచేస్తామని అన్నారు.

భోగాపురం ప్రాంతంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటు వెనుక తెదేపా ప్రభుత్వం చొరవ ఎంతో ఉంది. అప్పటి కేంద్ర విమానయాన శాఖామాత్యులుగా, విజయనగరం ఎంపీ అశోక్‌ గజపతిరాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలా భూసేకరణ ప్రక్రియ ఊపందుకుంది. తొలుత 5300 ఎకరాల భూములు అవసరమని గుర్తించినా... పంటభూములు, నివాసాలు ఎక్కువగా పోతున్న నేపథ్యంలో 2.645 ఎకరాలకు పరిమితం చేశారు. ఇప్పటికే 2462 ఎకరాల భూములను సేకరించి, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు పూర్తిచేశారు. ఇంకా మిగిలిన దాదాపు 183 ఎకరాల భూసేకరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో విమానాశ్రయంతో పాటు ఎయిరో సిటీ, విమానాల విడిభాగాల తయారీ పరిశ్రమలు, అతిథి రంగం అభివృద్ధి ప్రభుత్వం సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌)ను సిద్దం చేస్తోంది. ఆర్థికంగా, పారిశ్రామికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రగతికి జీవగర్రగా నిలిచేలా... హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికంటే మిన్నగా దీన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సర్కారు ఉంది.

విమానాశ్రయానికి అడుగులు పడ్డంతో భోగాపురం పాంతంంలో అమాంతంగా భూమ్‌ ఏర్పడింది. గతంలో గజం రూ2వేల నుంచి రూ.3వేల వరకు పలికేది. ఎయిర్‌పోర్టు వస్తుందన్న ప్రకటన తర్వాత ఇక్కడి భూముల విలువ బాగా పెరిగింది. విశాఖ నగరానికి సమీపాన 45కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో పాటు గంట వ్యవధిలోనే చేరుకునేందుకు జాతీయ రహదారి అనుకూలంగా ఉంది. ఇక విమానాశ్రయానికి భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఎకరానికి రూ.28 నుంచి రూ.33లక్షల వరకు పరిహారం ప్రభుత్వం చెల్లించింది. అంతంత మాత్రం పంటలు పండే భూములకు భారీగా పరిహారం అందడడంతో పెద్దగా వ్యతిరేకత రాలేదు. ప్రభుత్వం అన్ని రకాల ప్యాకేజీలు ఇచ్చేందుకు ముందుకు రావడం నిర్వాసితులకు ఎంతో ఊరటనిస్తోంది.

ప్ర‌ముఖ న‌టుడు, తెలుగుదేశం పార్టీ శాస‌న స‌భ్యుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో బ‌స‌వ తారకం ఇండో అమెరిక‌న్ కేన్స‌ర్ ఆసుప‌త్రిని నిర్మిస్తామ‌ని ఇదివ‌ర‌కే హామీ ఇచ్చిన ఆయ‌న‌.. దాన్ని చేత‌ల్లో చేసి చూపారు. బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఈరోజు భూమిపూజ జరిగింది. బాలకృష్ణ దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సభాపతి కోడెల శివప్రసాదరావు, ప్రముఖ వైద్యుడు దత్తాత్రేయుడు నోరి, మంత్రులు నారా లోకేశ్, ప్రత్తిపాటి ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

basavatarakam 14022019 1

వైద్య శాఖ‌కు చెందిన ప‌లువురు ఉన్న‌తాధికారులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. శంకుస్థాప‌న సంద‌ర్భంగా యాగాన్ని నిర్వ‌హించారు. రెండేళ్ల‌లో ఈ ఆసుప‌త్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామ‌ని బాల‌కృష్ణ వెల్ల‌డించారు. క్యాన్స‌ర్ వ్యాధిగ్ర‌స్తుల‌కు నామ‌మాత్ర‌పు ఛార్జీల‌తో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో వైద్యాన్ని అందిస్తామ‌ని అన్నారు. తన త‌ల్లి పేరు మీద ఉన్న ఈ ఆసుప‌త్రి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన స‌హాయ‌, స‌హ‌కారాల‌ను అందించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని అన్నారు. అనంత‌రం మంత్రి లోకేష్ బాబు మాట్లాడుతూ, కేన్స‌ర్ చికిత్స కోసం వ్యాధిగ్ర‌స్తులు ఇక హైద‌రాబాద్ వ‌ర‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని అన్నారు.

basavatarakam 14022019 1

ఎన్టీఆర్ భార్య బసవ తారకం క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఆమె పడిన ఇబ్బందులు మరొకరు పడొద్దనే తపనతో హైదరాబాద్‌లో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు అంకురార్పణ చేశారు. 2000లో నాటి ప్రధాని వాజ్‌పేయి చేతుల మీదుగా హైదరాబాద్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి తక్కువ ఖర్చుతోనే ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య ఖర్చులు చెల్లించే స్థోమత లేని వారికి ఉచిత వైద్యంతో పాటు కార్పస్‌ ఫండ్‌ ద్వారా ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. గత ఏడాది జూలైలో విజయవాడలోని సూర్యరావు పేటలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. వారంలో రెండు రోజులపాటు డాక్టర్లు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read