5 కోట్ల ఆంధ్రులు, ఏపి విభజన చట్టంలో ఉన్న అంశాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అంటూ, మోడీ అని ఢిల్లీ అహంకారి పై, తిరగబడ్డారు. మా విభజన హామీలు సంగతి ఏంటో చెప్పండి, అప్పుడే గుంటూరులో అడుగు పెట్టండి అంటూ ఆందోళన చేసారు. 5 కోట్ల మంది ఆంధ్రులు, మా సమస్యల పై మాట్లాడండి అంటూ, ఒక దేశ ప్రధానిని అడిగితే, ఆయన గుంటూరు వచ్చి ఏమి చేసాడో తెలుసా ? డ్రామాలు ఆడాడు.. రాజకీయాలు ఆడాడు. విభజన సమస్యల పై ఒక్క ముక్క కూడా చెప్పలేదు. చీప్ గా, చిల్లరగా మాట్లాడి, ప్రధాని అనే హోదాకు కూడా తలవంపులు తెచ్చారు. ఏపి ప్రజల హక్కులు అడిగితే, చంద్రబాబు చంద్రబాబు, లోకేష్, లోకేష్ అంటూ భజన చేసారు. అసలు ఈయన ఒక ప్రధాని అని పిలవటానికి కూడా అర్హత లేదు అనే విధంగా మాట్లాడారు.
ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఎలా అయితే దిగజారి మాట్లాడుతారో, అంతకంటే ఘోరంగా మాట్లాడారు. చంద్రబాబు మామకి వెన్నుపోటు పొడిచారు అంటూ పాత రికార్డు మాట్లాడిన మోడీ, మామ ఇచ్చిన పిల్లని వదిలేస్తే మామకి వెన్నుపోటు పొడిచినట్టు కాదా అంటే, తలయకాయి ఎక్కడ పెట్టుకుంటాడు ? కట్టుకున్న పెళ్లానికే వెన్నుపోటు పొడిచాడు అని ఇటు వైపు నుంచి దిగజారి మాట్లాడితే, ఈ దేశం పరువు ఏమవుతుంది ? చంద్రబాబు అలా మాట్లాడరు అనే ధీమాతో, ఇలా ఎగిరి ఎగిరి వెళ్ళాడు. నేను పలనా పని చేసాను, ప్రధానిగా ఏపికి ఈ సహాయం చేసాను అని చెప్పుకోవాలి కాని, ఎంత సేపు చంద్రబాబు మీద, లోకేష్ మీద పడి ఏడిస్తే, ఏమి వస్తుంది ?
అసలు ఆంధ్రుడు అడిగింది, ఉద్యమం చేస్తుంది, ఈ సమస్యల పై, మరి మోడీ ఈ విషయం పై ఒక్క విషయం కూడా చెప్పలేదు అంటే, ఏమి చెప్పుకోవాలి ? మొత్తం 19 అంశాల పై, కేంద్రం మనకు అన్యాయం చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వనరుల ప్రాధాన్యత కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైల్, పేట్రో కెమికల్ కాంపెక్స్ ఏర్పాటు, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల ఏర్పాటు, నెల్లూరులో దుగ్గిరాజపట్నం పోర్టుతో పాటు, అమరావతికి ఆర్థిక సహాయం, పన్నుల సవరణ, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, అమరావతికి సమగ్ర రవాణా కనెక్టివిటీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, డిస్కంల ద్వారా విద్యుత్ బకాయిల చెల్లింపులు, 9వ షెడ్యూల్, 10వషెడ్యూల్ సంసలు, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి అంశాల గురించి, ఇప్పటికీ క్లారిటీ లేదు.